స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం…

స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం

భూపాలపల్లి నేటిధాత్రి

పైలెట్ కాలనీ లో గల సింగరేణి కమ్యూనిటి హాల్ లో
స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ఏరియా సివిల్( ఏజిన‌ఎం ) రవికూమర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వయంగా కమ్యూనిటి హాల్ ముందు వైపు, వెనుక వైపు ఉన్న పిచ్చి మొక్కలను చెత,చెదారాలను, అధికారులు సివిల్ సిబ్బంది తో కలిసి శుభ్రం చేశారు.
ఈ సందర్భంగా ఏజిన‌ఎం మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి, ప్రతి పౌరుడిలో స్వచ్ఛ భారత్ ఆలోచన పదిలంగా ఉండాలని ఆయన కోరారు. పరిశుభ్రత ఒక్క వ్యక్తిగత పరిశుభ్రతకే పరిమితం కాకుండా, సమాజ సంక్షేమానికి మూలస్తంభంగా నిలుస్తుందన్నారు . సింగరేణి సంస్థలో పని చేస్తున్న ప్రతి ఉద్యోగి వారి పని ప్రదేశాలలో, నివాస ప్రాంతాలలో శుభ్రత పాటిస్తూ మిగతా సమాజానికి ఆదర్శంగా నిలవాలన్నారు. స్వచ్ఛతా నినాదాన్ని ప్రతిసారీ మన జీవితాల్లో భాగం చేసుకోవాలని కోరారు. అందరి కృషితోనే పరిశుభ్రత సాధ్యమౌతుంది” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏరియా సర్వే అధికారి శైలేంద్ర కుమార్, ఎన్విరాన్మెంట్ అధికారి పోశమల్లు, సివిల్ (ఎస్. ఇ) బాలరాజు, అశోక్ రెడ్డి,ఇతర అధికారులు,ఉద్యోగులు ,సివిల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పోలీసులను అభినందించిన బెల్లంపల్లి ఏసిపి రవికుమార్.!

జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు…

బెల్లంపల్లి ఏసిపి రవికుమార్

గంటల వ్యవధిలో దొంగను చేదించిన పోలీసులు…

పోలీసులను అభినందించిన బెల్లంపల్లి ఏసిపి రవికుమార్..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు దొంగతనాలకు పాల్పడుతున్నారని బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ అన్నారు.
సాంకేతిక పరిజ్ఞానం తో 10 గంటల్లో దొంగతనం కేసు చెందించి దొంగను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు బెల్లంపల్లి ఏసిపి రవి కుమార్ తెలిపారు. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గోదావరి ఖని కి చెందిన ఇమాన్యూల్ అనే యువకుడు జల్సా లకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. రామకృష్ణపూర్ పట్టణం లోని హనుమాన్ నగర్ లో ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో కిటికీ ప్రక్కన నిద్రిస్తున్న మహిళ మేడలో నుండి మూడున్నర తులాల బంగారు పుస్తెల తాడు, ఎదురు ఇంటిలో కిటికీ ప్రక్కన పెట్టిన మొబైల్ ఫోన్ లను ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. బాధితులు పిర్యాదు చేయగా సి.సి కెమెరాలను పరిశీలించి ఇమాన్యూల్ నేరాలకు పాల్పడ్డాడని నిర్ధారిరించుకొని పొలుసులు మూడు బృందాలుగా ఏర్పాటు చేసి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ సమావేశం లో మందమర్రి సి.ఐ శశిధర్ రెడ్డి,పట్టణ ఎస్.ఐ రాజ శేఖర్, కాసిపేట ఎస్. ఐ ప్రవీణ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. క్రైమ్ టీమ్ సిబ్బంది జంగు, రాకేష్, మహేష్ ,వెంకటేష్, సిసిఎస్ సిబ్బంది సతీష్ శ్రీనివాస్ లను ఏసిపి అభినందించి రివార్డులను అందజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version