భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అంగన్వాడి సూపర్వైజర్ అరుణ రజిత కిషోర్ బాల సురక్షన్ వారి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు రక్తహీనత టెస్టులు చేయించడం జరిగింది ఈ కార్యక్రమానికి డాక్టర్ రవి మెడికల్ ఆఫీసర్ రోజా హాజరైనారు అనంతరం విద్యార్థులకు బ్లడ్ టెస్ట్ చేసి రక్తహీనత ఉన్న విద్యార్థులకు వెంటనే మందులను ఇవ్వడం జరిగింది. బ్లడ్ తక్కువ ఉన్న విద్యార్థులకు తగిన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ పాఠశాల టీచర్స్ ఆశా వర్కర్స్ విద్యార్థులు పాల్గొన్నారు
2025 – 26 ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణి సంస్థ భూపాలపల్లి ఏరియా సేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న వృత్తి విద్యా కోర్సులైన
కంప్యూటర్ (డిటిపి), మగ్గం వర్క్, స్పోకెన్ ఇంగ్లిష్, బ్యూటీషియన్,ఫ్యాషన్ డిజైనింగ్ , మల్టీ మీడియా , జ్యూట్ బ్యాగ్,(ఓసి ప్రభావిత గ్రామాల మహిళలకు టైలరింగ్) వంటి కోర్సులను నేర్పించుటకు ఫాకల్టీ గా పని చేయుటకు ఆసక్తి,అర్హతఅనుభవం గలవారి నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుందని ఏరియా పర్సనల్ మేనేజర్ కే. మారుతి తెలియ జేసారు.అర్హత ఆసక్తి కలిగిన ఫ్యాకల్టీ సభ్యులు 25-10-2025- రోజున ధరఖాస్తులు చివరి తేదిగా నిర్ణయించారు. తమ యొక్క దరఖాస్తులను తగిన అర్హత,అనుభవాల,దృవపత్రలను,జతపరిచి పర్సనల్ విభాగం నందు అందజేయగలరని వారు తెలిపారు .
తెలంగాణ తొలి శాసన సభాపతి, శాసన మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉద్యమకారులు, సిరికొండ అభిమానులు బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు అనంతరం కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంచినారు అనంతరం మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిప ల్ మాజీ చైర్మన్ బండారి సంపూర్ణ రవి మాట్లాడుతూ సిరికొండ మధుసూదనాచారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం భూపాలపల్లి జిల్లా ఏర్పాటు కావడానికి సిరికొండ మధుసూదన్చారి అనేక కృషి చేశారు నియోజకవర్గాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేసిన సిరికొండ పేరు స్థిర స్థాయిగా ఉంటుంది ప్రొఫెసర్ జయశంకర్ పేరు మీద భూపాలపల్లి జిల్లాను ఆనాడు కెసిఆర్ నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది నియోజకవర్గం రోడ్లు అనేక అభివృద్ధి పనులను చేసిన నాయకుడు సిరికొండ చెంచు కాలనీ వాసులకు ఇండ్లు కట్టించినారు వారిని అసెంబ్లీకి ప్రత్యేక బస్సులు పెట్టి తీసుకపోవడం జరిగింది అలాంటి నాయకుడిని ఎవరు మర్చిపోలేరు కావున వారి చేసిన అభివృద్ధి పనిని గుర్తు చేసుకుంటూ ఈరోజు వారి జన్మదిన వేడుకలను నిర్వహించుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బండారి సంపూర్ణ రవి, శశి కాంత్, ఖలీద్, అగుర్ల శ్రీనివాస్, సూర రాజేష్, సదానందం, మాకోటి ఓదెలు, కిరణ్, తాళ్ళ శ్రీనివాస్, సుధాకర్, అనిల్, రంజిత్, పూర్ణ యాదవ్, మహిళ నాయకురాలు మేకల రజిత, ఓరుగంటి లక్ష్మీ,జెరుపుల గంగ, మియాపురం స్వప్న తదితరులు పాల్గొన్నారు.
శాయంపేట మండల కేంద్రంలో గల గ్రామపంచాయతీ ఆవర ణంలో ఐదుసంవత్సరాల లోపు చిన్నారు లందరికీ తప్పకుండా పోలియో చుక్కలు వేయించుకోవాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి నియోజక వర్గం గ్రామపంచాయతీ కార్యాల యంలో నిర్వహించిన పోలి యో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేస్తూ, చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రతి తల్లిదం డ్రులు తమ పిల్లలకు రెండు పోలియో చుక్కలు వేయాలని పిలుపు నిచ్చారు ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలియో రహిత సమాజం నిర్మాణం మన అందరి బాధ్యత
ఈ మహత్తర లక్ష్యం సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, ఆశా కార్యకర్తలు,స్థానిక ప్రజలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ అండగా ఉంటుంది
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.హెచ్.రమేష్ బాబు
భూపాలపల్లి నేటిధాత్రి
శరీర అంగాలు అన్ని సరిగా ఉంటేనే సరిపోదని, మానసిక ఆరోగ్యం బావున్నప్పుడే ఆరోగ్యం జీవితం బాగుంటాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్పర్సన్ సి.హెచ్.రమేష్ బాబు తెలిపారు. న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని హెచ్.ఎం.ఆర్.డి.ఎస్. ఆధ్వర్యంలో నడుస్తున్న దివ్యాంగ బాలల పాఠశాలలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రధాన న్యాయమూర్తి హాజరై ప్రసంగించారు.
గంజాయి, డ్రగ్స్ కు అలవాటు పడినవారు, వ్యసనాలకు అలవాటు పడినవారు నేరాలకు పాల్పడేవారు చాలా మంది మానసిక ఆరోగ్యం సరిగాలేని కారణంగానే చెడిపోతారని అన్నారు. మానసిక అనారోగ్యంతో వుండేవారివల్లనే సమాజానికి చేటు అని పేర్కొన్నారు. శరీరం పై చూపే శ్రద్ధతో పాటుగా, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారు సూచించారు.
దివ్యాంగ పిల్లలకు పండ్లు, చాకోలెట్లు పంపిణి చేశారు. హియరింగ్ ఎయిడ్స్, హెల్త్ క్యాంపు మరియు ఇతర ఏ సహాయం కావాలన్నా న్యాయసేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు.
అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి. శ్రీనివాస చారి గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల బిక్షపతి లు ప్రధాన న్యాయమూర్తి చేతులమీదుగా పదివేల రూపాయల ఆర్థిక సహాయం హోమ్ నిర్వాహకులకు అందించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఏ. నాగరాజ్ ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.ఆర్. దిలీప్ కుమార్ నాయక్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి. అఖిల డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కే.అక్షయ హెచ్.ఎం.ఆర్.డి.ఎస్ సంస్థ నిర్వాహకులు రజిత రాజయ్య న్యాయవాది మొయినుద్దీన్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు, దివ్యంగా విద్యార్థులు, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన మేము ఎప్పుడు అండగా ఉంటాం… బి ఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మొగుళ్ళపల్లి
నేటి ధాత్రి భూపాలపల్లి జిల్లా
Vaibhavalaxmi Shopping Mall
మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పర్యటించిన జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి గ్రామంలో కార్యకర్తలతో కలిసి ఇంటింటికి బాకీ కార్డు అందజేసిన టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి * మాజీ జెడ్పిటిసి జోరుక సదయ్య*
ప్రజలతో మాట్లాడుతూ…. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుంది అంటూ 22 నెలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కవ్యక్తికీ పడ్డ బాకీని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేయండి అంటూ వచ్చే కాంగ్రెస్ నాయకుల నుండి వసూల్ చేయాలంటూ కాంగ్రెస్ బాకీ కార్డు* ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించాలని సూచించారు, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి కేసీఆర్ పరిపాలన కంటే మేము అద్భుతంగా చేస్తామని మాకు అవకాశం ఇవ్వండి అంటూ ప్రజలల్లోకి వెళ్ళి ఆరు గ్యారెంటీలు 420 హామీల కార్డు ఇచ్చి ప్రజలను అత్యాశకు గురి చేసి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం జరిగింది.
100 రోజులో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి 22 నెలలు గడుస్తున్నా గ్యారెంటీలు అమలు చేయలేదు.
రైతులకి ఇస్తామని చెప్పిన రైతుబంధు ఇవ్వలేదు, రైతు ఋణమాఫీ చేయలేదు పైగా రైతు రాజు చేస్తామని చెప్పి రైతులను రోడ్డు మీద నిలబెట్టారు.
మహిళలకు ఇస్తామన్నా రూ. 2500/- ఇవ్వలేదు, వృద్దులకు, వితంతువులకి, వికలాంగులకి పెన్షన్స్ పెంచనులేదు, కళ్యాణలక్ష్మీ లక్ష రూపాయలు కేసీఆర్ ఇస్తే తులం బంగారం ఇస్తామని ఆశ పెట్టిండు.
కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మాటలకు,ఆశపడ్డ మా మహిళా సోదరీమణులు బోల్తాపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలల్లో చేసిన అప్పుల లెక్కలు కనిపిస్తున్నాయి కానీ రాష్ట్రంలో మాత్రం అభివృద్ధి సున్నా.
ప్రజలు చైతన్యవంతులైన్నారు, అని గమనిస్తున్నారని అన్నారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేయ్యండి అంటూ వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇదిగో మా బాకీ కార్డు, మాకు రావాల్సిన బాకీ ఇవ్వండి అంటూ అడగాలని ఈ సందర్భంగా కోరారు.
ఈ కార్యక్రమంలో, మాజీ సర్పంచులు గ్రామ శాఖ అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మసమాజ్ పార్టీ- ధర్మ యుద్ధం.
చిట్యాల, నేటిధాత్రి :
తెలంగాణ రాష్ట్రంలో భారత రాజ్యాంగ స్ఫూర్తిని, మహనీయుల ఆశయాలను కొనసాగిస్తూ దశాబ్ద కాలం పైగా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలను సామాజికంగా మరియు రాజకీయంగా చైతన్య పరుస్తూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ధర్మ సమాజ్ పార్టీ అధినాయకులు డాక్టర్ విశారదన్ మహారాజ్ నాయకత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో ధర్మ సమాజ్ పార్టీ ధర్మ యుద్ధం చేయబోతుందని చిట్యాల మండల కేంద్రంలో భూపాలపల్లి జిల్లా కోశాధికారి శీలపాక నాగరాజ్ అన్నారు. రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకు సమానమైన రాజకీయ అవకాశాలు ధర్మసమాజ్ పార్టీ కల్పిస్తుందన్నారు. అగ్రవర్ణ నాయకత్వంలో నడుస్తున్న పార్టీలు మెజారిటీ ప్రజలైన బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్ని రంగాలలో అన్యాయం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్య ఉద్యోగ నామినేటెడ్ పదవులలో ముందుగా సమన్యాయం చేయాలన్నారు. తెలంగాణ బహుజన ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్న అగ్రవర్ణ పార్టీలకు అభిముఖంగా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల స్వధర్మంతో, స్వశక్తి ఉద్యమంతో నిర్మాణమైన ధర్మసమాజ్ పార్టీ మెజారిటీ ప్రజల స్వరాజ్యకాంక్షను నెరవేర్చడానికి మాన్యశ్రీ కాన్షిరాం యుద్ధనీతితో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మ యుద్ధం చేయబోతుందని శీలపాక నాగరాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మండల పార్టీ అధ్యక్షుడు పర్లపల్లి కుమార్, ఉపాధ్యక్షుడు పుల్ల అశోక్,ప్రధాన కార్యదర్శి నేరెళ్ల రమేష్, కార్యదర్శి మట్టేవాడ కుమార్ నవాబుపేట గ్రామ కమిటీ నాయకులు చిలుముల శశి కుమార్, చిలుముల కృష్ణ,పర్లపెల్లి వంశీ బొడ్డు పాల్ చరణ్ తదితరులు పాల్గొన్నారు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మసమాజ్ పార్టీ- ధర్మ యుద్ధం.
చిట్యాల, నేటిధాత్రి :
రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకు సమానమైన రాజకీయ అవకాశాలు ధర్మసమాజ్ పార్టీ కల్పిస్తుందన్నారు. అగ్రవర్ణ నాయకత్వంలో నడుస్తున్న పార్టీలు మెజారిటీ ప్రజలైన బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్ని రంగాలలో అన్యాయం చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్య ఉద్యోగ నామినేటెడ్ పదవులలో ముందుగా సమన్యాయం చేయాలన్నారు. తెలంగాణ బహుజన ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్న అగ్రవర్ణ పార్టీలకు అభిముఖంగా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల స్వధర్మంతో, స్వశక్తి ఉద్యమంతో నిర్మాణమైన ధర్మసమాజ్ పార్టీ మెజారిటీ ప్రజల స్వరాజ్యకాంక్షను నెరవేర్చడానికి మాన్యశ్రీ కాన్షిరాం యుద్ధనీతితో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ధర్మ యుద్ధం చేయబోతుందని శీలపాక నాగరాజ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో చిట్యాల మండల పార్టీ అధ్యక్షుడు పర్లపల్లి కుమార్, ఉపాధ్యక్షుడు పుల్ల అశోక్,ప్రధాన కార్యదర్శి నేరెళ్ల రమేష్, కార్యదర్శి మట్టేవాడ కుమార్ నవాబుపేట గ్రామ కమిటీ నాయకులు చిలుముల శశి కుమార్, చిలుముల కృష్ణ,పర్లపెల్లి వంశీ బొడ్డు పాల్ చరణ్ తదితరులు పాల్గొన్నారు
ఏఐఎఫ్ టీయు రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ చంద్రగిరి శంకర్
భూపాలపల్లి నేటిధాత్రి
కేంద్రంలో బిజెపి మోడీ ప్రభుత్వం కార్మికుల పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను మార్చి కార్పొరేట్లకు వారి ఆస్తులను పెంపొందించు కోవడానికి నల్ల చట్టాలను ఏర్పాటు చేశారని ఏఐఎఫ్ టీయు రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ చంద్రగిరి శంకర్ అన్నారు కేంద్ర ప్రభుత్వం రంగా సంస్థలైన విమానాయం నౌకాయానం రైల్వే బుకింగ్ ఎల్ఐసి డిఫెన్స్ బొగ్గు భూగర్భ ఖనిజ సంపద కార్పోరేట్లకు శక్తులకు దోచిపెట్టడాన్ని ఆవేదన వ్యక్తం చేశారు 8 గంటల పని దినం రద్దుచేసి 12 గంటల పని విధానం తెచ్చిపెట్టడాన్ని ఉత్పత్తిలో సర్వీసులో సేవరంగాల్లో మరో మనుషులను తెచ్చే విధానాన్ని రద్దు చేయాలని కార్మిక హక్కుల కోసం పోరాడాలని కోరుచున్నాను సింగరేణి కార్మిక వర్గానికి శ్రామిక వర్గానికి దసరా శుభాకాంక్షలు ఏఐఎఫ్ టీయు రాష్ట్ర నాయకులు కామ్రేడ్ చంద్రగిరి శంకర్
రేగొండలో బస్టాండ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రూ.370 లక్షలతో నూతనంగా నిర్మించనున్న బస్టాండు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ… రేగొండ మండల కేంద్రంలో నియోజకవర్గ ప్రజల రవాణా సౌకర్యార్థం నూతన బస్టాండ్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రేగొండ మండల కేంద్రం పరకాల, భూపాలపల్లి, ములుగు, చిట్యాల, టేకుమట్ల పట్టణాలకు కేంద్ర బిందువుగా ఉందన్నారు. రేగొండ నుండి వివిధ ప్రాంతాలకు నిత్యం ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారన్నారు. అదేవిధంగా, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అరగంటలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందన్నారు. ఇప్పటివరకు రూ.186 కోట్ల జీరో టికెట్లు జారీ చేయగా, ఆర్థిక శాఖ ఆర్టీసీకి రూ.6,210 కోట్లు చెల్లించిందన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ ఎన్ఎస్ఆర్ సంపత్ రావు ఇప్ప కాయల నరసయ్య పున్నం రవి ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి పవిత్రమైన హజ్ యాత్రకు వెళ్లేందుకు ఖదీర్ అహ్మద్ – గౌసియా బేగం హనీఫ్ – అమీన బేగం భూపాలపల్లి జిల్లా నుండి ఎంపికైనారు తెలంగాణ హజ్ కమిటీ వరంగల్ జిల్లా అధ్యక్షులు సర్వర్ మోహియోద్దీన్ మొహమ్మద్ మోహియుద్దిన్ సెలెక్ట్ పత్రాలను, మార్గదర్శక బుక్కును అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు మొహమ్మద్ ఇర్ఫాన్ జామ మస్జిద్ అబ్బాసియ మజీద్ కమిటీ ఉపాధ్యక్షులు అబ్దుల్ హఫీజ్ మజీద్ మాజీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహమ్మద్ సాబీర్ ఖాన్ సయ్యద్ నజీబ్ షాహిద్, నదీమ్ రహీం తదితరులు హజ్ యాత్రకు జిల్లా నుండి సెలెక్ట్ అయిన శుభ సందర్భంగా వారికి పుష్పమాలతో సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది హజ్ యాత్ర యొక్క మరగదర్శకను అందజేసి వారికి ముందస్తు అభినందనలు తెలిపినారు
కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పుట్టింది.
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పుట్టింది స్వాతంత్ర్య ఉద్యమం నుండి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు ఎన్నో ప్రజా పోరాటలలో పోరాడిన మన ప్రో. కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసంలో,అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క దీరత్వాన్ని తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ భావితరానికి గుర్తుండిపోయేలా ట్యాంక్ బండ్ మీద కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, వారి పేరు హార్టికల్చర్ యూనివర్సిటీకి పెట్టి గౌరవించడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, వారి పోరాట స్ఫూర్తిని భావితరాల యువత పునికి పుచ్చుకుని ఆదిశగా పని చేయాలని కోరిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి కి శాలువ కప్పి స్వాగతం పలికిన శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ కన్వీనర్ ఎలగొండ రాజేంద్రప్రసాద్,కో కన్వీనర్, అడ్డగట్ల శ్రీధర్,గొర్లవీడు గ్రామ సీనియర్ నాయకులు నరసయ్య పద్మశాలి కుల పెద్దలు. బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
దుర్గా మాత చల్లని దీవెనలు, ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. (శనివారం)భూపాలపల్లి పట్టణంలోని కేటీకే – 1 ఇంక్లైన్ కేటీకే OC- 2 ప్రాజెక్టు ఆలయాల్లో జరిగిన దుర్గా మాత పూజల్లో సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎం రాజేశ్వర్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, మహా అన్నదాన కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. దుర్గా మాత చల్లని దీవెనలు, ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలన్నారు. అమ్మవారి కృపతో ప్రజలంతా దినదినాభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే దుర్గా దేవీని వేడుకున్నారు. ఈ కార్యక్రమాలల్లో సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
జిల్లా కేంద్రంలో నిర్వహించిన రక్తదాన శిబిరం విశేషంగా స్పందన లభించింది ప్రజలు సేవాభావంతో ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 103 యూనిట్ల రక్తం సేకరించి ఎంజిఎమ్ ఆసుపత్రి, వరంగల్ వారికి అందజేయడం జరిగింది. 2011 నుండి ఇప్పటి వరకు 5500 యూనిట్లకు పైగా రక్తం సేకరించామని మిరాకిల్ వాలంటరీ ఆర్గనైజేషన్ & ఐటి మాస్టర్ డైరెక్టర్ వెముల శంకర్ తెలిపారు. ప్రతి శిబిరానికి భూపాలపల్లి ప్రజలు విశేషంగా స్పందించడం ఎంతో గర్వకారణమని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే భూపాలపల్లిలోనే అత్యధిక రక్తసేకరణ జరుగుతోందని ఎంజిఎమ్ ఆసుపత్రి వైద్యులు ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఇది భూపాలపల్లి ప్రజల సేవా మనసుకు నిదర్శనమని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐటి మాస్టర్ డైరెక్టర్ వేముల కుమార్, సంగి సురేందర్, సిబ్బంది శ్వేత, శివాజీ, కిరణ్, విద్యార్థులు, వాలంటీర్లు పాల్గొన్నారు.
క మనిషి ప్రాణం కాపాడండి
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా కేంద్రంలో నిర్వహించిన రక్తదాన శిబిరం విశేషంగా స్పందన లభించింది ప్రజలు సేవాభావంతో ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 103 యూనిట్ల రక్తం సేకరించి ఎంజిఎమ్ ఆసుపత్రి, వరంగల్ వారికి అందజేయడం జరిగింది. 2011 నుండి ఇప్పటి వరకు 5500 యూనిట్లకు పైగా రక్తం సేకరించామని మిరాకిల్ వాలంటరీ ఆర్గనైజేషన్ & ఐటి మాస్టర్ డైరెక్టర్ వెముల శంకర్ తెలిపారు. ప్రతి శిబిరానికి భూపాలపల్లి ప్రజలు విశేషంగా స్పందించడం ఎంతో గర్వకారణమని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే భూపాలపల్లిలోనే అత్యధిక రక్తసేకరణ జరుగుతోందని ఎంజిఎమ్ ఆసుపత్రి వైద్యులు ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఇది భూపాలపల్లి ప్రజల సేవా మనసుకు నిదర్శనమని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐటి మాస్టర్ డైరెక్టర్ వేముల కుమార్, సంగి సురేందర్, సిబ్బంది శ్వేత, శివాజీ, కిరణ్, విద్యార్థులు, వాలంటీర్లు పాల్గొన్నారు.
నేషనల్ టీచర్స్ ఎక్సలెన్స్ అవార్డు మహాదేవపూర్ సెప్టెంబర్ 26 నేటి ధాత్రి *
జయశంకర్ భూపాలపల్లి మహాదేవపూర్ మండల కేంద్రంలోని మహాదేవపూర్ బాలుర ఉన్నత పాఠశాలలో బయాలజీ టీచర్ బి ప్రభాకర్ రెడ్డి మరియు మహాదేవపూర్ బాలికల ఉన్నత పాఠశాలలో ఫిజిక్స్ టీచర్ మడక మధుఈ నేషనల్ టీచర్స్ ఎక్సలెన్స్ అవార్డులు తెలంగాణా ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం చేతుల మీదుగా అందుకున్నారు. విద్యార్థుల్లో ఇన్నోవేటివ్ అంశాలపట్ల ఆసక్తి పెంచుతూ, వినూత్న రీతిలో బోధనచేస్తున్న వీరి సేవలను గుర్తించి హైదరాబాద్ కు చెందిన శారద ఎడ్యుకేషనల్ సొసైటీ వీరిద్దరికి నేషనల్ టీచర్స్ ఎక్సలెన్స్ అవార్డు-2025 ప్రధానం చేశారు.ఈ అవార్డ్స్ ఈ కార్యక్రమంలో శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వాహకులు శ్రీ పట్నం కమల్ మనోహర్,జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు శ్రీమతి మారం పవిత్ర, శ్రీమతి అర్చనపాల్గొన్నారు.ఈ అవార్డు పొందడం ఆనందంగా ఉందని అన్నారు.వీరిరువురిని మండల విద్యాధికారి శ్రీ బాల్నే ప్రకాష్ బాబు,బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ అనిల్ కుమార్ మరియు బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి లు అభినందించారు.
భూపాలపల్లి, మంజూరు నగర్ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవిశరన్నవరాత్రి ఉత్సవాలలో బాగంగా దుర్గామాత అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే,ఆలయ ధర్మకర్త గండ్ర వెంకట రమణా రెడ్డి జ్యోతి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ నియోజకవర్గం ప్రజలు అందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది అని అన్నారు
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని పకీరు గడ్డ అంగన్వాడీ టీచర్ ప్రమీల ఆధ్వర్యంలో పోషణ మాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిగా సూపర్వైజర్ అరుణ హాజరైనారు అనంతరం మాట్లాడుతూ పోషణ మాస కార్యక్రమం అనేది ఈరోజు అంగన్వాడి సెంటర్లో నిర్వహించడం జరిగింది గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లల తల్లులు సరైన జాగ్రత్తలు తీసుకొని పిల్లలకు ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి అంగన్వాడి నుండి ఇచ్చే బొడ్డును పిల్లలకు అరువుగా అందివ్వాలి. దాని ద్వారా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అంగన్వాడి నుండి వచ్చే పోషణ మాస వస్తువులను ప్రతి ఒక్కటి తీసుకుంటే తల్లి తింటేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అని తెలిపారు అలాగే అంగన్వాడి కేంద్రమును ఉపయోగించుకొని మంచి ఆరోగ్యవంతమైన సమాజం కొరకు అందరూ అవసరమైన సేవలు వినియోగించుకోవాలి డెలివరీ అయిన తర్వాత తల్లిపాలు పిల్లలకు గంటలోపు మూర్రిపాలు పట్టించాలి ఏడవ నెల నుంచి అనుబంధ ఆహారము, తల్లిపాలతో పాటుగా ఇవ్వాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో శోభారాణి ఘటన గర్భిణీలు పిల్ల తల్లులు పాల్గొన్నారు
దుర్గామాతను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర దంపతులు.
శ్రీ అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన దుర్గామాత.
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జవహర్నగర్ కాలనీ లోని మైన్స్ రెస్క్యూ స్టేషన్ నందు శ్రీ దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి దుర్గామాతను దర్శించుకున్నారు ఈ సందర్భంగా సింగరేణి రిటైర్డ్ ఉగ్యోగి వెలంగదుల శంకరయ్య సుజాత దుర్గామాత కి చేయించిన మకర తోరణంను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి జ్యోతి దంపతుల చేతుల మీదుగా ఆలయ ప్రధాన అర్చకుల వారికి అందచేయడం జరిగింది. భూపాలపల్లి మంజూరునగర్లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న దేవిశరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని అమ్మవారికి అభిషేకం, అర్చన చండీ పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
దసరా ఉత్సవాల ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే జిఎస్ఆర్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో దసరా ఉత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయాలని, ఈ ఉత్సవాలకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సింగరేణి, మునిసిపల్, పోలీసు అధికారులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. బుధవారం వివిధ శాఖల అధికారులతో కలిసి క్రిష్ణకాలనీ అంబేద్కర్ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. దసరా ఉత్సవాల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. విద్యుత్, నీటి సరఫరా, పారిశుధ్యం, భద్రత, ఆరోగ్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ సరిగా ఉండేలా చూసుకోవాలన్నారు. అంబేద్కర్ స్టేడియంలో గతేడాది జరిగిన దసరా ఉత్సవాల్లో కొంతమంది అల్లరి మూకలు గొడవ చేశారని, ఈసారి అలాంటి గొడవలు జరగకుండా పోలీసు అధికారులు తగిన భద్రత ఏర్పాటు చేసుకోవాలని పోలీసులకి సూచించారు. ఉత్సవాలు ప్రజాస్వామ్య పండుగలా అందరికీ ఆనందాన్ని పంచేలా విజయవంతంగా నిర్వహించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి సింగరేణి జిఎం రాజేశ్వర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ డిఎస్పి సంపత్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు చల్లూరి మధు అప్పం కిషన్ ముంజల రవీందర్ తదితరులు పాల్గొన్నారు
జాతీయ మానవ హక్కుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాజయ్య
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి పట్టణంలోనీ పారిశుద్ధ్యం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉన్నాయి.పలు కాలనీలలో సమస్యలు కంపు కొడుతున్న మున్సిపల్ అధికారులు దృష్టి సారించడం లేదని జాతీయ మాన హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాజయ్య పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జాతీయ మానవ హక్కుల సంఘం జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు తాటికంటి రవికుమార్ ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాజయ్య హాజరై మాట్లాడడం జరిగింది. భూపాలపల్లి పట్టణంలోని విలీన గ్రామాలైనటువంటి జంగేడు,కాసింపల్లి, వేషాలపల్లి ,పుల్లూరి రామయ్యపల్లి ,కుందూరు పల్లి పెద్దకుంటపల్లి, గ్రామాలలో పారిశుధ్య పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నా చందాగా ఉన్నాయని అన్నారు . కాలనిలలో పిచ్చి మొక్కలు, చెత్త చెదారంతో నిండిపోయిన అధికారులు మొద్దు నిద్ర పోవడం సరైనటువంటి పద్ధతి కాదన్నారు. మున్సిపల్ కార్యాలయంలో సరైనటువంటి సిబ్బంది లేక సమస్యలు తీవ్ర స్థాయికి చేరాయని అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో చెత్తను తీసుకుపోయేటువంటి చెత్త బండ్లు, ట్రాక్టర్లు చిన్నచిన్న రిపేర్లు ఉంటే వాటిని రిపేర్లు చేయించకుండా పక్కన పెట్టడం ఇది సరైనటువంటి పద్ధతి కాదని పేర్కొన్నారు. వాహనాలను పక్కన పెట్టడం ద్వారా తుప్పు పట్టి నష్టం జరిగే ప్రమాదం ఉన్నదని వెంటనే రిపేర్ లో ఉన్నటువంటి వాహనాలను తొందరగా రిపేర్ చేయించి వాడుకలోకి తీసుకురావాలి అని కోరారు. గ్రామాలలో మహిళలు ఎంతో ఘనంగా జరుపుకునేటువంటి సద్దుల బతుకమ్మ కార్యక్రమాల ప్రాంగణాలను ముందస్తుగానే ఏర్పాటు చేయాలని కోరారు. అంతేకాకుండా 30 వార్డులకు సరిపోయేంత పారిశుద్ధ్య కార్మికులు లేరని కొత్తవారిని నియమించి ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పారిశుద్ధ్యం లోపించడం వలన , కాల్వలలో బ్లీచింగ్ చల్లకపోవడం ,దోమల మందు ఫ్యాగింగ్ చేయకపోవడం వలన,కాలనీలలో కాలనీవాసులు తీవ్ర అనారోగ్యాలకు బలవుతున్నారని వారు పేర్కొన్నారు. వెంటనే కాలనీ సమస్యలను పరిష్కరించాలని దీనిపైన జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంత్రి రాకేష్ ,సోషల్ మీడియా కన్వీనర్ అమృత అశోక్, జిల్లా ఉపాధ్యక్షులు సంగం రాజేందర్,జిల్లా అధికార ప్రతినిధి జోగుల రాజు, జిల్లా సంయుక్త కార్యదర్శి శీలపాక నరేష్ తదితరులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.