దుర్గామాతను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర దంపతులు.
శ్రీ అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన దుర్గామాత.
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జవహర్నగర్ కాలనీ లోని మైన్స్ రెస్క్యూ స్టేషన్ నందు శ్రీ దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి
దుర్గామాతను దర్శించుకున్నారు
ఈ సందర్భంగా సింగరేణి రిటైర్డ్ ఉగ్యోగి వెలంగదుల శంకరయ్య సుజాత దుర్గామాత కి చేయించిన మకర తోరణంను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి జ్యోతి దంపతుల చేతుల మీదుగా ఆలయ ప్రధాన అర్చకుల వారికి అందచేయడం జరిగింది.
భూపాలపల్లి మంజూరునగర్లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న దేవిశరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని అమ్మవారికి అభిషేకం, అర్చన చండీ పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు