కార్పోరేట్ విష వలయంలో విద్యా వైద్య రంగాలు.

కార్పోరేట్ విష వలయంలో విద్యా వైద్య రంగాలు…

విశ్వ జంపాల,న్యాయవాది మరియు
విశ్వ సమాజం వ్యవస్థాపకులు…

మహబూబాబాద్ గార్ల నేటి ధాత్రి:

కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పలు రకాల విద్యా-వైద్య సంస్థలను నిర్వహిస్తూన్నాయి. వాటి నిర్వాహాణకు సరిపడా నిధులు మాత్రం కెటాయించడం లేదు. అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తూన్నాయి.భారతదేశంలో పథకాలకు కొదువ లేదు, పైసలకు కొరత లేదు.

ప్రభుత్వాలు మారినప్పుడల్లా పథకాల పేర్లు మారుస్తూన్నారు. ప్రధాన మంత్రులు, ముఖ్య మంత్రులు మారుతున్నారు, కాని ప్రజల జీవితాలు మాత్రం మారడం లేదు.

స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినప్పటికి సగటు భారతీయుని ప్రాథమిక హక్కులైన కూడు-గూడు-గుడ్డ తో పాటు విద్యా- వైద్యం-ఆరోగ్యం సమకూర్చడంలో కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశ పూరిత నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తూన్నాయి.

సమగ్ర విద్యా- వైద్య- ఆరోగ్య విధానాన్ని రూపొందించడంలోను, అమలు చేయడంలోను పూర్తిగా విఫలం చెందాయి. పూర్తి నిర్లక్ష్య దోరణి ప్రదర్శిస్తున్నాయి. ఓట్లు దండుకోవడంలో, సీట్లు దక్కించుకోవడంలో కనబరిచిన శ్రద్ధాశక్తులలో పది శాతం కల్గి వున్న “అక్షర భారత్ – ఆరోగ్య భారత్” నిర్మాణం జరిగి ఉండేది.

దీని పర్యావసానమే విద్యా -వైద్య రంగాలలో ప్రైవేటీకరణ- కార్పోరేటికరణ ప్రభలంగా పెరిగి పోయింది. విద్యా – వైద్య రంగంలో కార్పోరేట్ విష పోకడలు మొత్తం మానవాళి మనుగడకే ప్రమాదకరంగా పరిణమించాయి.

సమస్యల సాలెగూళ్ళలో చిక్కి ప్రభుత్వ విద్యా- వైద్య సంస్థలు ప్రజాదరణ కోల్పోతున్నాయి.

కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెపుతున్న ప్రభుత్వాలు విద్యా- వైద్య సంస్థల్లో నేటికి కనీస మౌళిక వసతులు కూడా కల్పించలేదు.

కమిటీలు, కమీషన్లు వేస్తూ, కడుపు నింపని సంక్షేమ పథకాలతో కాలయాపన చేస్తూ మీన వేశాలు లెక్కపెడుతున్నాయి. చిత్తశుద్ధి లోపించిన ప్రభుత్వాల పనితీరు ప్రజల పాలిటి శాపంగా మారింది.

లక్షలాది మంది విద్యార్థినీ విద్యార్థులు పోషక ఆహార లోపం, రక్తహీనత, కంటి, దంత, మూత్ర సంబంధిత వ్యాధులతో బాదపడుతున్నారు.సమాజ మనుగడకు విద్యా-వైద్యం-ఆరోగ్యం అతి ప్రధాన మైనవి. ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చడం ప్రజాస్వామిక ప్రభుత్వాల ప్రధాన లక్షణం.

అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా గొప్పలు చెప్పుకుంటున్న భారత పాలక వర్గాలు ఆచరణలో దానికి భిన్నమైన వైఖరిని కల్గి వున్నాయి.

భారత దేశంలో భూస్వాములు- పెట్టుబడిదారులు ప్రైవేట్- కార్పోరెట్ శక్తులుగా ఎదిగి పాలక వర్గాలుగా అవతరించాయి. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పాలక వర్గ ప్రయోజనాలే ప్రథమ కర్తవ్యంగా అంతర్గత ఎజెండాను అమలు చేస్తూన్నాయి.

ప్రభుత్వ అనుమతితోనే విద్యా-వైద్య రంగాల్లో కార్పోరేటీకరణ విష ఫలాలనందించే వట వృక్షంగా పెరిగిపోయింది.

కార్పోరేట్ యాజమాన్యాలు ప్రభుత్వ పాలక వర్గంలో కీలక భాగమై కూర్చున్నాయి.

విధానాల రూపకల్పనలో, అమలులో చక్రం తిప్పుతున్నాయి.

ఈ వర్గాలే సేవా రంగాలైన విద్యా-వైద్య రంగాలను అత్యంత లాభ సాటి వ్యాపారంగా మార్చాయి. ఈ వర్గాలే ప్రజలను కార్పొరేట్ రాజకీయాల వైపు మళ్లిస్తూ ఎన్నికల ప్రక్రియను, ప్రభుత్వాలను శాసిస్తున్నాయి.

కార్పోరేట్ యాజమాన్యాలు విద్యార్థులను, ఉపాధ్యాయులను, డాక్టర్లను కీలు బొమ్మల్లాగా మార్చుకున్నాయి.

ప్రైవేట్, కార్పోరేట్ విద్యా-వైద్య సంస్థల మధ్య నెలకొన్న తీవ్రమైన అనారోగ్యకరమైన పోటీ కారణంగా స్వార్ధం, అవినీతి అక్రమాలతో కూడిన తప్పుడు విధానాలకు పూనుకుంటున్నారు.పారి శుద్యం, త్రాగు నీరు, మల మూత్ర శాలలు, భోజన శాలలు, వంట శాలలు, పడకలు, పక్కా భవనాలు, ప్రహారి నిర్మాణాలు, మురుగు కాల్వలు, ఈగలు, దోమలు, శిధిలావస్థలో వున్న భవనాలు, విద్యుత్, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఫర్నీచర్, వైద్య పరికరాలు, మందులు తదితర మౌళిక వసతులు, సదుపాయాలు లేక ప్రభుత్వ విద్యా-వైద్య సంస్థలు ఆదరణ కోల్పోతున్నాయి.

వీటికి తోడు అరకొర నిధుల కెటాయింపు, సిబ్బంది కొరత, పర్యవేక్షణ లోపం, అవినీతి, నిర్లక్ష్యం తదితర ప్రధాన సమస్యలు ప్రభుత్వ విద్యా-వైద్య సంస్థలను నిత్యం పట్టి పీడిస్తున్నాయి.

సమస్యల వలయంలో చిక్కిన ప్రభుత్వ విద్యా-వైద్య సంస్థలు ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని కోల్పోయాయి.

ఒకప్పుడు విదేశీయులు, దోపిడి దొంగల భీభత్సంతో ప్రజలు అభద్రత భావంతో బ్రతికేవారు.

నేడు విద్యా-వైద్యం అందక జీవితంపై భయంతో, బెంగతో, అభద్రతా భావంతో జీవనం సాగిస్తున్నారు.

స్వాతంత్ర్యం వచ్చిన 78 ఏండ్లుగా పాలక వర్గాల మోసపూరిత, కుట్ర బుధ్ధితో విద్యా-వైద్య-ఆరోగ్య, ఉపాధి అవకాశాలు సామాన్య ప్రజలకు అందకుండా పోయాయి. వలసలు, అప్పులు, ఆకలి చావులు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి.

ఆకలి చావులైనా, ఆత్మ హత్యలైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాలి.

నేడు దేశంలో జరుగుతున్న రైతు ఆత్మ హత్యలు, కుల వృత్తి దారుల ఆత్మ హత్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తూన్న ప్రజా వ్యతిరేక విధానాల మూలంగానే ఈ ఆత్మ హత్యలు జరుగుతున్నాయి.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్వార్థ పూరిత అనాలోచిత నిర్ణయాలు-నిర్లక్ష్యాల మూలాలే నేటి ఆత్మ హత్యలకు కారణాలు.ప్రజా ద్రోహులు, పెట్టుబడిదారులు, కార్పోరేట్ శక్తులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మమేకమవుతున్నాయి

ఇది చాలా ప్రమాదకరం. ప్రజలకు ఉపకరించే ప్రభుత్వ పథకాలను, లక్ష్యాలను నిర్వీర్యం చేస్తూ తమ వర్గ ప్రయోజనాలు కాపాడుకునే ప్రయత్నంలో భాగమే ఈ శక్తుల కలయిక.

భారత దేశ ప్రజలు విజయానికి, విజయం తాలూకు ఫలాలను ఆస్వాదించడానికి మధ్య ఉన్న సంధికాలంలో ఉన్నారు. ప్రజల నోటి కాడి ముద్దను దళారులు గుంజుకునేందుకు ప్రభుత్వ విధానాలే దోహదం చేస్తూన్నాయి.

ప్రజా ద్రోహులు-రాజకీయ దళారులు ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేస్తూన్నారు.

విద్యా-వైద్యం-ఉపాధి మొదలైన మౌళిక రంగాలలో విధానాలు రూపొందించడం- అమలుపర్చడంలో ప్రజలు మరింత చైతన్యవంతమైన పోరాట స్పూర్తిని కలిగియుండాలి.

విద్య-వైద్య రంగాలలో కార్పోరేటీకరణ మానవజాతి మనుగడకే సమస్యగా తయారై ప్రజా జీవనానికి పెను సవాలుగా మారింది. ప్రజలందరికీ సమానమైన, నాణ్యమైన విద్య వైద్యం అందాలంటే విద్యా – వైద్యం జాతీయీకరణ చేయడమే ఏకైక పరిష్కారం.

విద్యా-వైద్యం జాతీయీకరణ జరిగేంత వరకు దోపిడి పీడన ఆగేంత వరకు అలుపెరగని పోరాటం చేయడమే ప్రజల ముందున్న తక్షణ కర్తవ్యం.

కార్పొరేట్ బడులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.

కార్పొరేట్ బడులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. (అధిక ఫీజులను వసూలు చేస్తున్న ప్రయివేటు యాజమాన్యాలు)…

◆ టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చేర్మెన్ వై.నరోత్తం

*జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

రాష్ర్టంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ బడులను బలోపేతం చేయకుండా ఈ నెల 12 నుండి బడి బాట కార్యక్రమం చేపట్టడంలో అర్థమేం ఉన్నది ప్రయివేటు పాఠశాలల్లో నర్సరీ,ఎల్.కే.జి, యూ.కె.జి,3 సంవత్సరాలు చదివిన పిల్లలు ప్రభుత్వ బడుల్లో ఎలా చేరతారు, గతంలో మన ఊరు మన బడి పేరుతో ప్రతి పాఠశాలలో సౌకర్యాలు పెంచాలని కార్యక్రమం చేపట్టడం జరిగింది కానీ అది పూర్తి కాకుండానే అసంపూర్తిగానే మిగిలింది,ఇప్పటికే ప్రభుత్వం విద్యను పేదలకు దూరం చేస్తు ప్రయివేటు పాఠశాలల అభివృద్ధికి పరోక్షంగా కృషి చేస్తున్నట్లు అందరికి కనబడుతున్నది,ప్రభుత్వ బడుల్లో నైపుణ్యం గల టీచర్లు ఉన్నారు,ప్రయివేటు బడుల్లో నైపుణ్యం లేని టీచర్లతో బోధన చేస్తున్న ప్రయివేటు బడులపై ఎందుకు మొగ్గు చూపుతున్నారు.

ప్రయివేటు యాజమాన్యం టీచర్లకు తక్కువ జీతాలు చెల్లించి వారితో వెట్టి చేయిస్తారు వారికి విద్యార్థులను కొత్తగా చేర్పించాలని టార్గెట్ లు పెట్టి వేదిస్తారు లేనిచో విధుల నుండి తొలగిస్తామని బెదిరిస్తారు,విద్యార్థుల ఫీజులను కూడా ఒక్కో పాఠశాలలో ఒక్కోరకంగా వారి ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు విద్యార్థుల దశల వారిగా చెల్లించాల్సిన ఫీజులు సమయానికి చెల్లించనిచో వారిని మానసికంగా వేధిస్తూ పై తరగతుల విద్యార్థులను నర్సరీ,ఎల్.కె.జి,యూ.కె.జి,తరగతులలో కూర్చోబెట్టి వారిని మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.

ఈ విదంగా ప్రయివేటు పాఠశాలల యాజమాన్యం బరితెగించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను అధిక ఫీజులతో అవస్థలకు గురిచేస్తున్న దీనిపై ప్రభుత్వం కాని అధికారులు కాని ఎందుకు చర్యలు చేపట్టడం లేదు ప్రభుత్వం ప్రయివేటు పాఠశాలలను నియంత్రిచి ప్రభుత్వ అజమాషీలో నడిచే విదంగా చర్యలు చేపట్టాలి ప్రతి తరగతికి ఒక నిర్ణిత ఫీజును ప్రభుత్వంమే నిర్ణయించాలి,అన్ని ఫీజులను ఒకే అకౌంట్లో జమ చేసే విదంగా మరియు అన్ని ఫిజులను ఒకే రశీదుపై ఇచ్చే విదంగా మరియు టీచర్ల విధ్యార్హతలు వారికి ఇచ్చే జీతాలను ప్రభుత్వం నమోదు చేసుకోవాలి బహిరంగ పరిచి ప్రయివేటు పాఠశాలలను కట్టడి చేయాలని డిమాండ్

విద్యార్థుల కోసం కార్పొరేట్ వేట.

విద్యార్థుల కోసం కార్పొరేట్ వేట

#అధిక ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీ యాజమాన్యాలు.

#మధ్యవర్తులను నమ్మి మోసపోతున్న తల్లిదండ్రులు.

# కాలేజీ చైర్మన్ నీ కలిసిన తరువాతనే అడ్మిషన్ తీసుకోవాలి.

మంద సురేష్ బహుజన స్టూడెంట్స్ యూనియన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు

హన్మకొండ,నేటిధాత్రి:

 

 

గ్రామలలో ఇంటింటి ప్రచారం ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల యంత్రం ఉపాధ్యాయులకు లక్ష్యంగా నిర్దేశం కరపత్రాలు బ్రోచర్ల పంపిణీ నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాలలు పెంపు లక్ష్యంగా ఉపాధ్యాయులకు టార్గెట్ నిర్దేశిస్తున్నాయి ఆ లక్ష్యం వాళ్లను సాధించేవరకు మండుటెండల్లో ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులను కలుస్తున్నారు తమ పాఠశాల ప్రత్యేకతలు విశిష్టతను వివరిస్తూ ఆకాశాన్నియమైన బ్రోచర్లు కరపత్రాలను పంచుతున్నారు పిల్లలను తమ పాఠశాలలో చేర్పించాలని కోరుతున్నారు ఒకరకంగా చెప్పాలంటే ఈ వ్యాపారం వెనుక ప్రచారాల తలపిస్తుంది ప్రతి ఒక్కరూ 10 నుండి 20 మందిని పాఠశాలలో చేర్పించాలంటూ ప్రవేట్ కార్పొరేట్ పాఠశాలల యజమాన్యాలు టార్గెట్ విధించారు దీంతో వారు ఉదయం ఏడు గంటల నుండి ప్రచారాన్ని మొదలు పెడుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ ప్రదక్షణం కొరబడినందున ఆరోపణలు ఉన్నాయని ఫీజులు నియంత్రణ కోసం ప్రభుత్వం జారీచేసిన జీవోలను అమలు చేయడంలో లేదు అలాగే కొన్ని పాఠశాలలో సరైన విద్యా అర్హత లేని వారితో బోధనలు చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి అని మంద సురేష్ ఇప్పటికైనా అధికారులు ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థల పైన చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తామని అధికారులపై మండిపడ్డారు.

జి.ఎం (హెచ్.ఆర్.డి) కార్పొరేట్ జి.రఘుపతి.

మందమర్రి ఏరియాను సందర్శించిన జి.ఎం (హెచ్.ఆర్.డి) కార్పొరేట్ జి.రఘుపతి.

మందమర్రి నేటి దాత్రి

 

 

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జి.ఎం (హెచ్.ఆర్.డి) కార్పొరేట్ జి.రఘుపతి మందమర్రి ఏరియాను సందర్శించిన సందర్భంగా జనరల్ మేనేజర్ కార్యాలయంలో మందమర్రి ఏరియా జి.ఎం జి.దేవేందర్ మరియు ఏరియా సీనియర్ అధికారులు శాలువాతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మందమర్రి ఏరియా యొక్క స్థితిగతులను వారికి వివరించారు.

ఈ కార్యక్రమంలో ఏరియా సేఫ్టీ ఆఫీసర్ రవీందర్, ఏరియా ఇంజనీర్ డీ.జీ.ఎం (ఈ&ఎం), వెంకటరమణ, డీ.జీ.ఎం ఐ.ఈ.డి రాజన్న, డీ.జీ.ఎం (ఎఫ్ & ఏ) ఆర్.వి.ఎస్ ఆర్.కే ప్రసాద్, డివై, పి.ఎం మైత్రేయ బందు, ఐ.టీ సీనియర్ ప్రోగ్రామర్ రవి పాల్గొన్నారు.

కార్మికుల హక్కులను కొల్లగొడుతున్న కార్పోరేట్ శక్తులు.

కార్మికుల హక్కులను కొల్లగొడుతున్న కార్పోరేట్ శక్తులు

మే 20న దేశవ్యాప్త సమ్మెకు కార్మిక వర్గం సిద్ధం కావాలి

ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజు

శ్రీరాంపూర్,(మంచిర్యాల(నేటి ధాత్రి:

 

దేశ వ్యాప్తంగా కార్మిక వర్గానికి హక్కులను లేకుండా కార్పొరేట్ శక్తులు కొల్లగొడుతున్నాయని,కార్మిక చట్టాల సవరణలో భాగంగా బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ వారికి వత్తాసు పలుకుతూ కార్మిక లోకానికి తీరని అన్యాయం చేస్తున్నారని ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాలరాజు అన్నారు.గురువారం శ్రీరాంపూర్ లో ఏర్పాటు చేసిన మంచిర్యాల జిల్లా సివిల్ సప్లై, హమాలి యూనియన్ల సమావేశం లో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు.దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం 44 కార్మిక చట్టాలను 4 కోడ్ లుగా విభజించడానికి వ్యతిరేకిస్తున్నామన్నారు. ఏప్రిల్ 1 నుండి వాటి అమలును నిరసిస్తూ వెంటనే ఆపాలని కేంద్ర కార్మిక సంఘాల నాయకత్వంలో మే 20న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు,ఉపాధ్యక్షులు మిట్టపల్లి పౌలు,సివిల్ సప్లై హమాలీ కార్మికులు పానుగంటి సత్యనారాయణ,తిప్పని సత్తయ్య,పోరాండ్ల సంపత్,నరేష్,రాజన్న, మామిడి చంద్రయ్య  పాల్గొన్నారు.

అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి, సహకరిస్తే..!

ముందస్తు అడ్మిషన్ల కోసం కార్పొరేట్ కళాశాలకు ప్రైవేటు పాఠశాలలు సహకరిస్తే ఊరుకునేది లేదు-మచ్చ రమేష్

కరీంనగర్, నేటిధాత్రి:

రాష్ట్ర వ్యాప్తంగా శ్రీచైతన్య, నారాయణ కళాశాలల ముందస్తు అడ్మిషన్లకు ప్రారంభం చేసిందని, విద్యా సంవత్సరం పూర్తి కాకముందే జిల్లాల్లో పిఅర్ఓలను పెట్టుకుని ప్రచారం నిర్వహిస్తూ తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి అడ్మిషన్లు తీసుకుంటున్నారని, అధికారులు, ప్రభుత్వం కార్పొరేట్ కళశాలల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ ప్రభుత్వాన్ని కోరారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో జరిగిన ఏఐఎస్ఎఫ్ నాయకుల సమావేశంలో మచ్చ రమేష్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలు తమ కళాశాలలో ప్రవేశం పొందాలని గ్రామాల్లో తిరుగుతున్నారని దీనిపై విద్యాశాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. ఆకళాశాలల్లో విద్యార్థులు మానసిక, శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని
విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం అవుతున్న శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలను రాష్ట్రవ్యాప్తంగా సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ముందస్తు అడ్మిషన్ల కోసం తిరుగుతున్న కార్పొరేట్ కళాశాలకు జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు సహకరిస్తే ఊరుకునేది లేదని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష దాడులకు సిద్ధం అవుతామని హెచ్చరించారు. విద్యా హక్కు చట్టాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం అమలు చేయాలని, ప్రైవేటు విద్యా సంస్థలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని, ఫీజుల నియంత్రణ చట్టం కోసం త్వరలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని రమేష్ తెలిపారు. ఈకార్యక్రమంలో అధ్యక్షులు రామారావు వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు కనకం సాగర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ మామిడిపల్లి హేమంత్, ఏఐఎస్ఎఫ్ నాయకులు కనకం రాహుల్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version