రేగొండలో బస్టాండ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్..

రేగొండలో బస్టాండ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు రూ.370 లక్షలతో నూతనంగా నిర్మించనున్న బస్టాండు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ… రేగొండ మండల కేంద్రంలో నియోజకవర్గ ప్రజల రవాణా సౌకర్యార్థం నూతన బస్టాండ్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రేగొండ మండల కేంద్రం పరకాల, భూపాలపల్లి, ములుగు, చిట్యాల, టేకుమట్ల పట్టణాలకు కేంద్ర బిందువుగా ఉందన్నారు. రేగొండ నుండి వివిధ ప్రాంతాలకు నిత్యం ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారన్నారు. అదేవిధంగా, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అరగంటలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందన్నారు. ఇప్పటివరకు రూ.186 కోట్ల జీరో టికెట్లు జారీ చేయగా, ఆర్థిక శాఖ ఆర్టీసీకి రూ.6,210 కోట్లు చెల్లించిందన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ ఎన్ఎస్ఆర్ సంపత్ రావు ఇప్ప కాయల నరసయ్య పున్నం రవి ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ…

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ…

తంగళ్ళపల్లి నేటి దాత్రి…

తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీ గ్రామానికి చెందిన వారికి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. సందర్భంగా. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ షోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్. మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుల.ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఇందిరమ్మ కాలనీ గ్రామానికి చెందిన గాలి పెళ్లి బాలకృష్ణ కి..(40000). వేల రూపాయల సీఎంఆర్ఎఫ్. చెక్కుని లబ్ధిదారులకు స్థానిక. కాంగ్రెస్ పార్టీ నాయకుల. ఆధ్వర్యంలో అందజేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇందుకు సహకరించిన. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. శ్రీ ఏ నుముల. రేవంత్ రెడ్డికి. రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కి. ప్రభుత్వ . వీప్ . వేములవాడ శాసనసభ్యులు. రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు. శ్రీ ఆది శ్రీనివాస్ కి. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డికి. కాంగ్రెస్ పార్టీ తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ కి. ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంపెల్లి శ్యామ్. బల్ల లక్ష్మీపతి. కంది గట్ల సదానందం. బై రీ. వేణు. జంగంపల్లి భాగ్యలక్ష్మి. ముందటి శారద. కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version