మానసిక ఆరోగ్యం సరిగా లేనివారే నేరాలకు పాల్పడుతారు
దివ్యాంగులకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ అండగా ఉంటుంది
ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.హెచ్.రమేష్ బాబు
భూపాలపల్లి నేటిధాత్రి
శరీర అంగాలు అన్ని సరిగా ఉంటేనే సరిపోదని, మానసిక ఆరోగ్యం బావున్నప్పుడే ఆరోగ్యం జీవితం బాగుంటాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్పర్సన్ సి.హెచ్.రమేష్ బాబు తెలిపారు.
న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని హెచ్.ఎం.ఆర్.డి.ఎస్. ఆధ్వర్యంలో నడుస్తున్న దివ్యాంగ బాలల పాఠశాలలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రధాన న్యాయమూర్తి హాజరై ప్రసంగించారు.
గంజాయి, డ్రగ్స్ కు అలవాటు పడినవారు, వ్యసనాలకు అలవాటు పడినవారు నేరాలకు పాల్పడేవారు చాలా మంది మానసిక ఆరోగ్యం సరిగాలేని కారణంగానే చెడిపోతారని అన్నారు. మానసిక అనారోగ్యంతో వుండేవారివల్లనే సమాజానికి చేటు అని పేర్కొన్నారు. శరీరం పై చూపే శ్రద్ధతో పాటుగా, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారు సూచించారు.
దివ్యాంగ పిల్లలకు పండ్లు, చాకోలెట్లు పంపిణి చేశారు. హియరింగ్ ఎయిడ్స్, హెల్త్ క్యాంపు మరియు ఇతర ఏ సహాయం కావాలన్నా న్యాయసేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు.
అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి. శ్రీనివాస చారి గవర్నమెంట్ ప్లీడర్
బోట్ల బిక్షపతి లు ప్రధాన న్యాయమూర్తి చేతులమీదుగా పదివేల రూపాయల ఆర్థిక సహాయం హోమ్ నిర్వాహకులకు అందించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఏ. నాగరాజ్ ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.ఆర్. దిలీప్ కుమార్ నాయక్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి. అఖిల డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కే.అక్షయ హెచ్.ఎం.ఆర్.డి.ఎస్ సంస్థ నిర్వాహకులు రజిత రాజయ్య న్యాయవాది మొయినుద్దీన్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు, దివ్యంగా విద్యార్థులు, న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
