కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పుట్టింది.
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పుట్టింది స్వాతంత్ర్య ఉద్యమం నుండి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు ఎన్నో ప్రజా పోరాటలలో పోరాడిన మన ప్రో. కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసంలో,అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క దీరత్వాన్ని తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ భావితరానికి గుర్తుండిపోయేలా ట్యాంక్ బండ్ మీద కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, వారి పేరు హార్టికల్చర్ యూనివర్సిటీకి పెట్టి గౌరవించడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, వారి పోరాట స్ఫూర్తిని భావితరాల యువత పునికి పుచ్చుకుని ఆదిశగా పని చేయాలని కోరిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి కి శాలువ కప్పి స్వాగతం పలికిన శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ కన్వీనర్ ఎలగొండ రాజేంద్రప్రసాద్,కో కన్వీనర్, అడ్డగట్ల శ్రీధర్,గొర్లవీడు గ్రామ సీనియర్ నాయకులు నరసయ్య పద్మశాలి కుల పెద్దలు.
బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.