జహీరాబాద్ వెంకటేశ్వర ఆలయంలో చోరీ..

జహీరాబాద్ వెంకటేశ్వర ఆలయంలో చోరీ

◆:- క్లూస్ టీమ్ రంగప్రవేశం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని మహీంద్రా కాలనిలో గల శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో చోరీ జరిగింది. అర్థరాత్రి దుండగులు ఆలయంలో ప్రవేశించి బంగారం, వెండితో పాటు హుండీలలో భక్తు సమర్పించిన నగదును దొంగలించారు. అక్కడి ను పరారు కావాలనుకున్న దుండగులు బీట్ నిర్వహిస్తు పోలీసులను గమనించి నగదు, నగలు వది పారిపోయారు. గురువారం పోలీసులు ఆలయా సందర్శించారు. క్లూస్ టీమ్ రంగప్రవేశం చేసి ఆలయ అధ్యక్షులు నర్సింహా రెడ్డి మాట్లాడుక దుండగులు దోచుకున్న నగదు, సొమ్మును పోలీసులు చూసి వదిలి పారిపోయారని, ఎలాంటి న జరగలేదని చెప్పారు. ఇక ముందు ఇలా జరగకుం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు జహీరాబ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

33 వ వార్డు లో కరెంటుకోతలపై పర్యటించిన విద్యుత్ అధికారులు మాజీ కౌన్సిలర్ తిరుమల్…

33 వ వార్డు లో కరెంటుకోతలపై పర్యటించిన విద్యుత్ అధికారులు మాజీ కౌన్సిలర్ తిరుమల్

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లా కేంద్రంలో 33 వ వార్డు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ డాక్టర్ చిన్నారెడ్డి ఇంటి ఏరియా దివంగత మాజీ ఎమ్మెల్యే జయరాములు ఇంటి దగ్గర కరెంటు కోతలపై వార్డును పర్యటిoచి ప్రజల నుండీ కరెంటు కోత సమస్యలు తెలుసుకున్నామని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ తిరుమల్ ఒక ప్రకటన లో తెలిపారు కరెంటు కొత్త
సమస్యలపై ఫోన్ ద్వారా విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చామని చెప్పారు వార్డులో లో వోల్టేజీ సమస్య మురుగు కాలువలో ఇనుప స్తంభాలు తొలగించి సిమెంట్ స్తంభాలు ఏర్పా టు చేయాలని కోరారు శ్రీ వెంకటేశ్వర దేవాలయం ముందు రోడ్డు ఇరువైపులా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి సమస్యలు లేకుండా చూడాలని కోరారు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదాలకు గురి కాకుండా సేఫ్ జోన్ లో ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులకు 33 వార్డును కరెంటు సమస్యల పై చూపించామని చెప్పారు వార్డు పర్యటన లో
విద్యుత్ ఎస్సి డి ఇ ఏ ఇ లైన్ మెన్ లు పాల్గొన్నారని తిరుమల్ తెలిపారు

 రోజుకు రూ.6తో SBI నుంచి రూ. 40 లక్షల లబ్ధి పొందవచ్చని మీకు తెలుసా..

 రోజుకు రూ.6తో SBI నుంచి రూ. 40 లక్షల లబ్ధి పొందవచ్చని మీకు తెలుసా?

 

రోజుకు కేవలం ఆరు రూపాయల కంటే తక్కువ ఖర్చు చేస్తే, అదే మీకు ఆపదలో ఎంతో అండగా నిలుస్తుంది. మీ ఎస్బీఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ద్వారానే రోజుకు ఈ మొత్తాన్ని చెల్లించి రూ.40 లక్షల బెనిఫిట్ పొందవచ్చని మీకు తెలుసా..

BanSBI Account: రోజుకు కేవలం ఆరు రూపాయల కంటే తక్కువ.. రూ.5.48 ఖర్చుపెట్టండి. అదే మీకు ఆపదలో ఎంతోడగా నిలుస్తుంది. మీ ఎస్బీఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ద్వారానే రోజుకు ఈ మొత్తాన్ని చెల్లించి రూ.40 లక్షల బెనిఫిట్ పొందవచ్చు. ఈ పాలసీ పొందడానికి ఖాతాదారుడు ఏడాదికి రూ.2000 ప్రీమియం చెల్లించాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు ఈ సౌకర్యాన్ని అందిస్తోంది.
మీరు ఏడాదికి రెండు వేలు చెల్లిస్తే, రూ. 40 లక్షలు, ఏడాదికి వెయ్యి చెల్లిస్తే రూ. 20 లక్షలు, లేదూ.. ఏడాదికి వంద రూపాయలు మాత్రమే చెల్లిస్తే, రూ.2 లక్షల ప్రమాద బీమా సౌకర్యం లభిస్తుంది.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ అనుబంధ సంస్థ అయిన, ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో తమ ఖాతాదారులకు సమగ్రమైన, చౌకైన ఈ వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీని అందిస్తోంది. ఇది అనుకోని ప్రమాదాల బారిన పడ్డప్పుడు ఎంతో ఊరటనిస్తుంది.

రోడ్డు, విద్యుత్తు ప్రమాదాలు, వరదలు, భూకంపాల వంటి ప్రకృతి విపత్తులు.. యాక్సిడెంట్స్, పాముకాటు వంటి కారణాలతో మరణించినా బాధితుడు సూచించిన నామినీకి రూ.40 లక్షలు, ఎస్‌బీఐ అందిస్తుంది. నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. 18 ఏళ్ల వయసు నుంచి 65 ఏళ్ల వయసు లోపు వారికి అర్హత ఉంటుంది. ఈ తరహా స్కీమ్స్ ఇతర బ్యాంకులు కూడా తమ ఖాతాదారులకు అందిస్తున్నాయి. హెల్త్ పరంగానే కాదు, ఇతర రంగాలకు కూడా తక్కువ ప్రీమియంతో ఎస్బీఐ ఇన్స్యూరెన్స్ సదుపాయం కల్పిస్తోంది.

వేంకటేశ్వర స్వామి ఆలయంలో అర్ధరాత్రి చోరీ కలకలం…

వేంకటేశ్వర స్వామి ఆలయంలో అర్ధరాత్రి చోరీ కలకలం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని మహీంద్రా. కాలనీలో గల వేంకటేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ 7వ తేదీ బుధవారం కార్తీక్ పౌర్ణమి రోజున అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారని, గురువారం ఉదయం ఆలయ చైర్మన్ నర్సింహా రెడ్డి విలేకరులకు తెలిపారు. ఈ ఘటనతో పట్టణంలో కలకలం రేగింది. దొంగలు ఆలయంలోకి ప్రవేశించి విలువైన వస్తువులను అపహరించుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

దుర్గామాతను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర దంపతులు…

దుర్గామాతను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర దంపతులు.

శ్రీ అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన దుర్గామాత.

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి జవహర్నగర్ కాలనీ లోని మైన్స్ రెస్క్యూ స్టేషన్ నందు శ్రీ దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి
దుర్గామాతను దర్శించుకున్నారు
ఈ సందర్భంగా సింగరేణి రిటైర్డ్ ఉగ్యోగి వెలంగదుల శంకరయ్య సుజాత దుర్గామాత కి చేయించిన మకర తోరణంను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి జ్యోతి దంపతుల చేతుల మీదుగా ఆలయ ప్రధాన అర్చకుల వారికి అందచేయడం జరిగింది.
భూపాలపల్లి మంజూరునగర్లోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న దేవిశరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని అమ్మవారికి అభిషేకం, అర్చన చండీ పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version