సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌ ‘‘కేటీఆర్‌’’!

`జూబ్లీ హిల్స్‌ ఎన్నికల ప్రచారంలో కేటీఆరే కీలకం

`కాంగ్రెస్‌, బిజేపిలకు దక్కని క్రేజ్‌ కేటీఆర్‌ సొంతం

ktr jubliee hills election

`అన్ని రకాల ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న కేటీఆర్‌

`అటు మీడియా సమావేశాలు.ఇటు పార్టీలో చేరికలు

`హైదరాబాదులో ప్రభుత్వ బాదితులతో సమావేశాలు

`సమయం చూసి హైడ్రాను ఉతుకుడు ఉతుకుతున్నాడు

`విస్మరించిన ప్రభుత్వ హామీలను గుర్తు చేస్తున్నాడు

`బాకీ కార్డులిచ్చి జనాన్ని చైతన్య పరుస్తున్నాడు

`అండగా వుంటామని వారికి భరోసా కల్పిస్తున్నాడు

`ఎక్కడికక్కడ సభలు, సమావేశాలు

`అన్ని డిజిజన్లలో పెద్ద ఎత్తున రోడ్‌ షోలు

`గతం కన్నా వినూత్నమైన రీతిలో ప్రచారాలు

`సీఎం. ‘‘రేవంత్‌ రెడ్డి’’కి కూడా కనిపించని క్రేజ్‌ ‘‘కేటీఆర్‌’’ సొంతం చేసుకున్నాడు

`కాంగ్రెస్‌ సభలకు రెట్టింపు జనాలు కేటిఆర్‌ సభలకు హజరౌతున్నారు

`‘‘కేటీఆర్‌’’ రోడ్‌షోలకు ప్రభంజనంలా తరలివస్తున్న జనం

`2015 జిహెచ్‌ఎంసి ఎన్నికలకు మించి సక్సెస్‌ అవుతున్న రోడ్‌షోలు

`పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ప్రచారంలో దూసుకుపోతున్నాడు

`ఒంటి చేత్తో పార్టీ స్టీరింగ్‌ పట్డుకొని కారు జోరు పెంచుతున్నాడు

`సారే రావాలని జనం కోరుకునేలా ప్రసంగాలు కొనసాగిస్తున్నాడు

`క్షణం తీరిక లేకుండా ‘‘జూబ్లీ హిల్స్‌’’ ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నాడు

`ప్రభుత్వం మీద పదునైన విమర్శనాస్త్రాలు సందిస్తున్నాడు

`అధికార పార్టీ కాంగ్రెస్‌ను గుక్క తిప్పుకోకుండా చేస్తున్నాడు

`ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ చేతులెత్తేసేలా ఇరుకున పెడుతున్నాడు

`‘‘కేటీఆర్‌’’ సభలు, రోడ్‌ షోలు జనంతో కళకళలాడుతున్నాయి

`‘‘కేటీఆర్‌’’ జిందాబాద్‌ నినాదాలతో సభలు మారుమ్రోగిపోతున్నాయి

`పిల్లలు సైతం ‘‘దేక్‌లేంగే’’ అని పాటలు పాడుతున్నారు

`’’కేటీఆర్‌’’ అంకుల్‌ నమస్తే అంటూ స్వాగతిస్తున్నారు

హైదరాబాద్‌, నేటిధాత్రి:
తులం బంగారం ఇయ్యరు. వృద్దులకు ఇస్తామని చెప్పిన నాలుగు వేల పించన్లు ఇయ్యరు. మహిళలకు ఇస్తామన్న రెండు వేల ఐదు వందలు ఇయ్యరు. విద్యార్దినులకు ఇస్తామన్న స్కూటీల జాడ లేదు. రైతులకు ఇచ్చే రైతు బంధుకు రాం..రాం..అంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు కేటిఆర్‌ పంచ్‌ డైలాగులు కొడుతుంటే జూబ్లీహిల్స్‌ జనం కేరింతలు కొడుతున్నారు. కేటిఆర్‌ చెబుతున్నప్పుడు వంత పాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నారు. అలవి కాని హమీలన్నీ ఇచ్చి ఇప్పుడు మాట మారుస్తున్న కాంగ్రెస్‌ పార్టీని జూబ్లీహిల్స్‌ ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిరచాలంటూ చేస్తున్న వ్యాఖ్యలకు ప్రజలు చప్పట్లు కొడుతున్నారు. కారు గుర్తుకే మన ఓటు అంటూ కేటిఆర్‌ అంటుంటే రోడ్‌షోలకు హజరైన జనం మన ఓటు అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అంటున్నారు. ఇదీ కేటిఆర్‌ క్రేజ్‌ అంటూ బి ఆర్‌ఎస్‌ శ్రేణులు సంబరపడుతున్నాయి. చాలా కాలం తర్వాత ప్రజలు బిఆర్‌ఎస్‌ పార్టీ ప్రచారంలో, స్ట్రీట్‌ కార్నర్‌ సభల్లో, కేటిఆర్‌ రోడ్‌షోలకు విపరీతంగా హజరౌతున్నారు. స్వచ్చంధంగా వచ్చి కేటిఆర్‌ చెప్పే మాటలు వింటున్నారు. కేటిఆర్‌ వేస్తున్న పంచ్‌ డైలాగులకు జనం ఊడిపోతున్నారు. ఇంతటి క్రేజ్‌ ఈ మధ్య మరే నాయకుడికి లేదు. సహజంగా బిఆర్‌ఎస్‌ అధినేత కేసిఆర్‌ను చూసేందుకు జనం ఇలా ఎగబడుతుంటారు. సభలకు హజరౌతుంటారు. ఆయన మాటలు వినడానికి లైవ్‌ కార్యక్రమాలు చూస్తుంటారు. ఇప్పుడు సరిగ్గా ఆ క్రెడిట్‌ను కేటిఆర్‌ సొంతం చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికల ప్రచారంలో బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు కేటిఆర్‌ సెంటఆర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. కేటిఆర్‌ సభలకు విచ్చినంత జనం ఇతర పార్టీలకు రావడం లేదు. కాంగ్రెస్‌ పార్టీ తరుపున అసలైన స్టార్‌ క్యాంపెయిన్‌ అయిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి సైతం ఇంత మంది రావడం లేదు. ఆయన సభలు చాలా సప్పగా సాగుతున్నాయి. గత వారం రోజుల నుంచి సిఎం. రేవంత్‌ రెడ్డి ఎంతో కష్టపడుతున్నారు. ప్రచారంలో విసృతంగా పాల్గొంటున్నాడు. అటు మంత్రులు, ఇటు కాంగ్రెస్‌ అభ్యర్ధిని వెంట పెట్టుకొని సిఎం. రేవంత్‌ రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. దానికి తోడు రహమత్‌ నగర్‌లో సిఎం. రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో ఆగ్రహాన్ని తెప్పించాయి. జూబ్లీహిల్స్‌ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ గెలిస్తే ఇటీవల ఇచ్చిన 25వేల రేషన్‌కార్డులు కట్‌ అవుతాయని హెచ్చరించారు. ఉచిత కరంట్‌ బంద్‌ అవుతుందన్నారు. సన్న బియ్యం ఆపేస్తామన్నారు. సబ్సిడీ సిలిండర్‌ ఇవ్వమన్నారు. ఇదిలా వుంటే తాజాగా కొత్తగా నియామకమైన మరో మంత్రి అజహరుద్దీన్‌ కాంగ్రెస్‌ను గెలిపించకపోతే జూబ్లీహిల్స్‌ రాను అంటూ వ్యాఖ్యానించారు. ఇది కేటిఆర్‌కు ఆయుధాలుగా మారాయి. మామూలుగానే కేటిఆర్‌ లాంటి వాగ్ధాటి వున్న నాయకులకు చిన్న అవకాశం దొరికినా రచ్చ రచ్చ చేస్తారు. అలాంటిది సాక్ష్యాత్తు సిఎం. రేవంత్‌రెడ్డి బియ్యం ఆపేస్తాం. రేషన్‌ కార్డులు కట్‌ చేస్తామంటూ ప్రజలను బెదిరించేలా వ్యాఖ్యలు చేస్తే ఊరుకుంటారా? వీటిపై కేటిఆర్‌ ప్రభుత్వాన్ని తూర్పారపడుతున్నారు. దుమ్ము దుమారం రేపుతున్నారు. ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ప్రజలను బెదిరిస్తే ఓట్లు పడతాయని రేవంత్‌ అనుకుంటున్నారు. అలాంటి నియంతకు తగిన బుద్దిచెప్పాలంటూ కేటిఆర్‌ ప్రజలకు సూచిస్తుంటే జనం చప్పట్లు కొడుతున్నారు. సహజంగా రోడ్‌ షోలలో కార్నర్‌ మీటింగ్‌లు పది నిమిషాలు, పావు గంట సాగితేనే ఎక్కువ. కాని కేటిఆర్‌ కార్నర్‌ సభలు గంటకు పైగా సాగుతున్నాయి. జోరు వానలో కేటిఆర్‌ మాట్లాడుతుంటే జనం కదలడం లేదు. పైగా వానలో కూడా డ్యాన్సులు చేస్తూ కేటిఆర్‌కే ఉత్సాహాన్ని నింపుతున్నారు. దాంతో కాంగ్రెస్‌, బిజేపి నాయకులకు దక్కని క్రేజ్‌ కేటిఆర్‌కు సొంతమౌతోంది. ఇక బిజేపి నుంచి స్టార్‌ క్యాంపెయినర్లు ఎంత మంది వున్నా, రోడ్‌షోలకు, సభలకు, ప్రచారానికి పెద్దగా స్పందన లేదు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో ఆది నుంచి అన్ని రకాల బాధ్యతలు కేటిఆర్‌ నిర్వహిస్తూ వస్తున్నారు. అన్ని రకాల ప్రచార బాద్యతలు ఆయన భుజాన వేసుకున్నారు. మాగంటి గోపీనాధ్‌ చనిపోయిన నుంచి జూబ్లీహిల్స్‌లో అనేక రకాల పార్టీ సభలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఎన్నికల సమయంలో పార్టీ నాయకులకు అప్పగించే బాధ్యతలు అప్పగించినా, అందిరికన్నా ఎక్కువ కష్టపడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ మీద కౌంటర్ల కోసం ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని, కాంగ్రెస్‌ పార్టీని తూర్పారపడుతున్నారు. పైగా ఓట్‌ చోరి అంశంలో జూబ్లీహిల్స్‌లో దొంగ ఓట్ల నమోదుపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్నికల కమీషన్‌ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఉప ఎన్నికల వేళ పార్టీలోకి పెద్దఎత్తున చేరికలు జరుగుతున్నాయి. అటు కాంగ్రెస్‌, ఇటు ఎంఐఎం, బిజేపిలనుంచి బిఆర్‌ఎస్‌లోకి డివిజన్ల వారిగా చేరికలు జరుగుతూనే వున్నాయి. వాటన్నింటికీ హజరౌతూ, వారితో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ గెలుపుకోసం కృషి చేస్తున్నారు. పార్టీలోకి చేరుతున్న వారికి స్వయంగా కేటిఆర్‌ కండువాలు కప్పి ఆహ్వానిస్తున్నారు. వారిలో ఉత్సాహం నింపుతున్నారు. ఇక ఇటీవల ప్రభుత్వం వల్ల నష్టపోయిన హైడ్రా బాదితులు, మూసీ బాధితులను స్వయంగా కలుస్తున్నారు. వారు తెలంగాణ భవన్‌కు వస్తామంటే రమ్మంటున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఆ కుటుంబాలు పడిన భాధనలు, వేధనలు వింటున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా హైడ్రా బాదితులతో ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశం చూసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వణికిపోయిందనే చెప్పాలి. అందుకే వెంటనే స్పందించిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు జగ్గారెడ్డి హైడ్రా వల్ల తమ పార్టీకి నష్టం జరుగుతోందని అన్నారు. అంటేనే హైడ్రా పేదల జీవితాలను ఎలా తలకిందులు చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణ భవన్‌కు వచ్చిన చిన్న పిల్లలు తమ అనుభవాలను చెబుతూ కన్నీటి పర్యంతమౌతుంటే కేటిఆర్‌ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రజలను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇలా అన్ని వర్గాల ప్రజలనుంచి కేటిఆర్‌ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక ఎన్నికల ముందు కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన హమీలు, ప్రజలకు ప్రభుత్వం వున్న బాకీలను గుర్తు చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు. బాకీ కార్డులను ప్రజలకు అందజేస్తూ, ప్రచారానికి వస్తున్న కాంగ్రెస్‌ నాయకులను నిలదీయాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం వల్ల నష్టపోయిన వారికి హైడ్రా బాధితులకు తప్పకుండా పార్టీ అండగా వుంటుందని భరోసా కల్పిస్తున్నారు. పొరపాటున జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను నమ్మితే, ఇక్కడికి కూడా బుల్డోజర్‌ వస్తుందని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇలా ఎక్కడిక్కడ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ క్షణం తీరుకలేకుండా ప్రచారంలో పాల్గొంటున్నారు. బిఆర్‌ఎస్‌ అభ్యర్ది సునీతను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. గతం కన్నా వినూత్నమైన రీతిలో కేటిఆర్‌ ప్రచారం సాగిస్తున్నారు. ఎల్‌ఈడీ స్క్రీన్‌లలో ప్రభుత్వం ఇచ్చిన హమీలు, చేసిన మోసాలు చూపిస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. దాంతో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం చేసిన మోసాలను గుర్తు చేస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నారు. సిఎం. రేవంత్‌రెడ్డి సభలకు, రోడ్‌షోలకు వస్తున్న జనాలకంటే రెట్టింపు జనాలు కేటిఆర్‌ సభలకు ప్రజలు హజరౌతున్నారు. కేటిఆర్‌ రోడ్‌షోలకు జనం ప్రభంజనంలా వస్తున్నారు. 2015 జిహెచ్‌ఎంసి ఎన్నికల సమయంలో కేటిఆర్‌ రోడ్‌షోలకు జనం తండోపతండాలుగా వచ్చే వారు. కేటిఆర్‌ ఎక్కడికెళ్లినా జనం పెద్దఎత్తున సమూహమయ్యేవారు. ఇక రోడ్‌షోలలో కేటిఆర్‌ వెహికిల్‌ కదిలేది కాదు. అంత జనం వచ్చే వారు. ఇప్పుడు సరిగ్గా జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారంలోనూ కేటిఆర్‌ సభలకు ప్రజలు వస్తున్నారు. కేటిఆర్‌కు హైదరాబాద్‌ ప్రజల్లో ఎంత ఆదరణ వుందో, క్రేజ్‌ వుందో ఈ రోడ్‌షోల ద్వారా మరోసారి రుజవౌతోంది. తెలంగాణ ప్యూచర్‌ లీడర్‌ కేటిఆరే అనేది తేలిపోతోంది. అందుకే కేటిఆర్‌ను చూస్తూ జనం కేరింతలు కొడుతున్నారు. ఈలలు, చప్పట్లతో ఆయన మాటలకు ఫిదా అవుతున్నారు.

పంట పొలాల్లోనే నేలకొరిగిన వరి…

పంట పొలాల్లోనే నేలకొరిగిన వరి

పొలంలో… రైతుల్లో… కన్నీళ్లు

నష్టాన్ని అంచనా వేయని అధికారులు

మాజీ స్పీకర్ మధుసూదనాచారి

శాయంపేట నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో అకాల వర్షంతో నీళ్లలోనే పొలాలు రైతుల కంట కన్నీళ్లు. అన్నదాత పరిస్థితి దయనీయంగా మారింది ఇటీవల కురిచిన భారీ వర్షాలతో చేతికి వచ్చే దశలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది కోతకు వచ్చిన పంట పొలాల్లో నీరు చేరి గొలుసులు మొలకెత్తుతున్న పట్టించుకోని అధికారులు. కండ్ల ముందే దెబ్బతిన్న పంటలను చూసి అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు ప్రతికూల పరిస్థితుల్లో రెక్కలు కండ్ల ముందే దెబ్బతిన్న పంటలను చూసి అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు. ప్రతికూల పరిస్థితిలో రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంట చేతికి రాక గుండెలు బాదుకుంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని కోరడమైనది

అప్పుల ఊబిలో అన్నదా తలు

సాగు చేసిన మొదలు విత్త నాలు ఎరువులు, మందులు కోతల ఖర్చులు రూపంలో రూపాయల లక్షలు అప్పు చేసి పంట పండించిన రైతులు తుఫాను తీవ్రతకు చేతికి వచ్చిన వరి పంట నేల వాలి మొలకెత్తుతున్న దృశ్యాన్ని చూసి కన్నీరు మున్నీరు పెడుతున్నారు.కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ప్రభుత్వంలో చలనం లేదు

మాజీ స్పీకర్ మధుసూదనాచారి

ఆరు గాలం శ్రమించి పండించిన పంట నేల వారిన పంట మొలకెత్తుతుంటే చేనులో నీళ్లు రైతుకు కన్నీళ్లు మిగిల్చాయి. మాజీ స్పీకర్ చారి మాట్లాడుతూ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది భారీ తుఫానుకు పంట పొలాలు తీవ్ర నష్టం వాటిల్లాయి. బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతే రాజును చేసిన ఘనత. అదేవిధంగా మండల, గ్రామాల అభివృద్ధి, రైతులకు అందుబా టులోకి సౌకర్యాలు చేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వా న్నిది. మాజీ స్పీకర్ గా ఉన్నప్పుడు రైతులకు అందు బాటులోకి రోడ్డు మార్గం అభివృద్ధి చేసి, రైతులకు న్యాయం చేయడం జరిగింది. ఇప్పటి ప్రభుత్వం యూరియా కొరత రైతులను ఇబ్బంది పెట్టడం, తుఫాను ప్రభావంతో అధికారుల నిర్లక్ష్యం వల్ల పంటలు అంచనా వెయ్యక పోవడం నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్న ప్రభుత్వం. రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

కార్తీక పౌర్ణమి సందర్భంగా ఘనంగా సన్మానం…

కార్తీక పౌర్ణమి సందర్భంగా ఘనంగా సన్మానం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ కేతకి సంగమేశ్వర స్వామివారి దేవస్థానము లో పార్వతి పరమేశ్వరుల కళ్యాణోత్సవ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పెద్దలు గ్రామ ప్రజలు భక్తులు మరియు తోటి మిత్రులతో దైవదర్శనం చేసుకొని స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఈ సందర్భంగా డైరెక్టర్ మల్లికార్జున్ ఘనంగా సన్మానించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది,

బుగులోని వేంకటేశ్వర స్వామి ని దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎస్సార్…

బుగులోని వేంకటేశ్వర స్వామి ని దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివారులోని శ్రీ బుగులోని వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జాతరకు వచ్చిన ఎమ్మెల్యేకు ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నేతలు శాలువాలు కప్పి స్వాగతం పలికారు. మెట్ల మార్గం ద్వారా ఎమ్మెల్యే వెళ్తూ, భక్తులతో మాట్లాడారు. పలువురు భక్తులు ఎమ్మెల్యే తో సెల్ఫీలు దిగారు. మొక్కులు చెల్లించుకున్న అనంతరం ఎమ్మెల్యే గుట్ట కింద ఏర్పాటు చేసిన వేదికపై ఎమ్మెల్యే భక్తులనుద్దేశించి మీడియాతో మాట్లాడారు. శ్రీ బుగులోని వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ప్రజలందరికీ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం జాతరకు రూ.7 కోట్లు నిధులు కేటాయించిందని, ఆ నిధులతో వివిధ అభివృద్ధి పనులను పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

జగ్గయ్యపేటలో ఏనుగు రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..
కొత్తపల్లిగోరి మండలం జగ్గయ్యపేట గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ ఒడ్డాల తిరుపతికి చెందిన ఏనుగు రథం వద్ద ఎమ్మెల్యే టెంకాయ కొట్టి రథాన్ని జాతరకు ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు చేసి టెంకాయ కొట్టారు. ఈ కార్యక్రమంలో భూమిలోని జాతర చైర్మన్

విద్యారంగాన్ని అభివృద్ధి పరచుకోవాలి…

విద్యారంగాన్ని అభివృద్ధి పరచుకోవాలి
*డిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.
లింగారెడ్డి*

నర్సంపేట,నేటిధాత్రి:

 

విద్యారంగాన్ని అభివృద్ధి పరచుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని, దానికి ప్రభుత్వం చొరవచూపి ఎక్కువ నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి అన్నారు. నర్సంపేట పట్టణంలోని బాలాజీ మహిళా పీజీ, డిగ్రీ కళాశాలలో బుధవారం ఏర్పాటుచేసిన జిల్లా సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ విద్యారంగం పేదలకు అందని విధంగా తయారు కావడం జరిగిందన్నారు. పాలకులు కేటాయించవలసిన నిధుల కేటాయింపులో పక్షపాతం చూపడం తో విద్యారంగం ముందుకు పోవడం లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని మానవనరుల అభివృద్ధిలో భాగంగా కాకుండా లాభనష్టాల కోణంలో చూపడంతో నేడు విద్యారంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్నారు అందరికీ విద్య అందాలనే కొఠారి కమిషన్ ను అమలు పరచకుండా వ్యాపారంగా చూడడంతో నేడు విద్యారంగం వెనుకబడిపోయిందన్నారు. గ్రామీణ ప్రాంతా బడుగు బలహీన వర్గాల చదువు కోసం ప్రభుత్వాలు శ్రద్ధ చూపకపోవడమే దీనికి ప్రధానమైన కారణం అన్నారు. విద్యారంగాన్ని కాపాడుకోవడానికి ఐక్యంగా ఉండి పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. డెమొక్ర టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు రఘు శంకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యారంగాన్ని కాపాడడం కోసం అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోయి ఉద్యమించవలసిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాలు మారినప్పటికీ విద్యారంగంలో మార్పు లేదన్నారు. డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన కాగిత యాకయ్య పదవీ విరమణ సందర్భంగా ఆయనను డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అభినందించారు.ఈ జిల్లా సదస్సులో అధ్యాపక జ్వాలా సంపాదకుడు డాక్టర్ గంగాధర్, డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఏ. శ్రీనివాస్ రెడ్డి, బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ ఏ. రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ రామ్ రాజ్,జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల గోవిందరావు.జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల గోవిందరావు, నర్సంపేట ఎంఈఓ కొర్ర సారయ్య, ఉమ్మడి జిల్లా పూర్వ అధ్యక్షులు గుంటి రామచందర్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు జి. ఉప్పలయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మబూబాబాద్ జిల్లా అధ్యక్షులు నెల్లుట్ల భాస్కర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి తంగెళ్ల సుదర్శన్, జిల్లా ఉపాధ్యక్షులు దార్ల రవీందర్ రాష్ట్ర కౌన్సిలర్ కొమ్మాలు జిల్లా ఉమా శంకర్ ఉపాధ్యక్షురాలు సుధారాణి, వివిధ మండలాల బాధ్యులు ఎస్కే సర్దార్ కొర్ర రమేష్ మాలోతు జగన్ ఈదుల వెంకటేశ్వర్లు రావుల దేవేందర్ శ్యాంప్రసాద్, ఉమా శంకర్ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా…

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా

రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలి

పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి..

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్

 

భూపాలపల్లి నేటిధాత్రి

 

రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం విఫలమైందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోతుకు ప్రవీణ్ కుమార్ అన్నారు. బుధవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూరు నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐ ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్ల కార్డులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జోసఫ్ లు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతుందని, ఇప్పటివరకు విద్య రంగ సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారయింద ఆరోపించారు. ఇప్పటివరకు ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించలేదని, ముఖ్యంగా రాష్ట్రంలో 9000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని, పెండింగ్ బకాయలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం దుర్మార్గమని అది సరి కాదన్నారు. ప్రభుత్వం వెంటనే విద్యా శాఖ మంత్రిని ఏర్పాటు చేసి విద్య రంగానికి అధిక నిధులు కేటాయించాలని కోరారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విద్య రంగ సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని కళాశాల హాస్టల్ భవనానికి సొంత భవనం ఏర్పాటు చేయాలని, ఎస్సీ ఎస్టీ కళాశాలల బాయ్స్ హాస్టల్ కు సొంత భవనం లు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని,వెంటనే సొంత ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి విద్య రంగాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. లేనియెడల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలను ఉదృతం చేస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ ధర్నాకు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వేముల శ్రీకాంత్ తన సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రేణుకుంట్ల ప్రవీణ్, పోతుల పవన్, రమాకాంత్, పవన్, శ్రీనివాస్, అజయ్, సురేష్, వంశీ, కృష్ణ , నవీన్ తదితరులు పాల్గొన్నారు.

పురాతన శివాలయంలో ప్రత్యేక పూజలు…

పురాతన శివాలయంలో ప్రత్యేక పూజలు

పరకాల,నేటిధాత్రి

 

పట్టణంలోని ప్రముఖ పురాతన శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బ్రహ్మశ్రీ జె వెంకటేశ్వర శర్మ,మణిదీప్ శర్మ ల ఆధ్వర్యంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఉదయం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు వైభవంగా నిర్వహించారు.అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,భక్తులు పాల్గొన్నారు.

మాజీ మంత్రిని పరామర్శించిన వ్యవస్థాపక టీం హరీష్ వర్మ..

మాజీ మంత్రిని పరామర్శించిన వ్యవస్థాపక టీం హరీష్ వర్మ

వీణవంక,( కరీంనగర్ జిల్లా):

నేటి ధాత్రి:మంత్రివర్యులు

 

ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారి తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు అకాల మరణాన్ని చింతిస్తూ హైదరాబాదులోని వారి నివాసంలో సత్యనారాయణ రావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి వారి ఆత్మ శాంతి చేకూరాలని కోరిన తన్నీరు హరీష్ రావు టీం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు హరీష్ వర్మ అప్పని మరియు టీం సభ్యులు కాట్రేవుల అజయ్, శివ నాగరాజు ,సుమన్ కౌశిక్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదెక్కడి పిచ్చి సామీ.. రీల్స్ కోసం ఇంత రిస్క్ ఎవరైనా తీసుకుంటారా..

ఇదెక్కడి పిచ్చి సామీ.. రీల్స్ కోసం ఇంత రిస్క్ ఎవరైనా తీసుకుంటారా..

ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది జీవితాలను సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు.

ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది జీవితాలను సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. మరికొందరు విచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు (viral stunt).

హర్మన్ చేతిపై స్పెషల్ టాటూ…

హర్మన్ చేతిపై స్పెషల్ టాటూ!

 

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 గెలుపు సందర్భంగా టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ప్రత్యేక టాటూను వేయించుకుంది. సౌతాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించిన జ్ఞాపకంగా ఈ టాటూను తన చేతిపై వేయించుకున్న హర్మన్, అది తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపింది.

ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025.. ఐకానిక్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. 47 ఏళ్ల నిరీక్షణకు తెరదింపుతూ ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడింది. ఈ నేపథ్యంలో హర్మన్ ఓ ప్రత్యేకమైన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
ఎప్పటికీ గుర్తుండిపోతుంది..

టీమిండియా(Team India) ఫైనల్‌లో సౌతాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్(Harmanpreet Kaur) తన చేతిపై ప్రపంచ కప్ టాటూనే వేయించుకుంది. ట్రోఫీతో పాటు గెలిచిన సంవత్సరం (2025), పరుగుల వ్యత్యాసం (52) కూడా వేయించుకుంది. ‘నా చర్మంతోపాటు నా హృదయంలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తొలి రోజు నుంచి దీనికోసం ఎదురు చూశా. ఇక నుంచి ప్రతిరోజు ఉదయం దీన్ని చూసుకుంటా. ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటా’ అంటూ హర్మన్ క్యాప్షన్ ఇస్తూ సోషల్ మీడియా(Social Media)లో ఫొటోలను షేర్ చేసింది.

నా కల నెరవేరింది..

‘చిన్నప్పటి నుంచి నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. మా నాన్న హర్మందర్ కూడా మాజీ క్రీడాకారుడే. ఆయన కిట్‌లోంచి బ్యాట్ తీసుకుని ఆడుకునే దాన్ని. అది చాలా పెద్దగా ఉండటంతో మా నాన్న బ్యాట్‌ను చిన్నగా చెక్కి ఇచ్చాడు. దాంతోనే నేను ఆడుకునే దాన్ని. వరల్డ్ కప్‌లో మన మ్యాచులు చూసినప్పుడల్లా నాకూ ఇలాంటి అవకాశం వస్తే బాగుండనని అనుకునేదానిని. నాకు ఆ సమయంలో మహిళల క్రికెట్ గురించి తెలియదు. ఎప్పటికైనా ప్రపంచ కప్ ఆడి గెలవాలనేదే నా డ్రీమ్. ఇప్పుడు ఆ కల నెరవేరింది. నాకు జట్టును నడిపించే అవకాశం వస్తే అస్సలు వదులుకోకూడదని అనుకున్నా. ఆ దేవుడు ఒక్కోదాన్ని నెరవేరుస్తూ వెళ్లాడు. ఇదంతా నాకు మ్యాజిక్‌లా అనిపిస్తుంది. జట్టులో ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు’ అని హర్మన్ వెల్లడించింది.

సాయుధ పోరాట యోధుల చరిత్రను విస్మరించడం తగదు…

సాయుధ పోరాట యోధుల చరిత్రను విస్మరించడం తగదు

ఎస్సారెస్పీ రెండవ దశకు బిఎన్ రెడ్డి పేరు పెట్టాలి

ఈనెల 19న ఇందిరా పార్క్ వద్ద ధర్నా

ప్రచార కరపత్రాలను ఆవిష్కరించిన రైతు వ్యవసాయ కార్మిక సంఘం నేతలు

హైదారాబాద్,నేటిధాత్రి:*

 

తెలంగాణ ప్రజల విముక్తి కోసం రైతాంగ సాయుధ పోరాటానికి నడుం బిగించి సర్వం త్యాగంచేసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం యోధుల చరిత్రను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం సరైందికాదని ధ్వజమెత్తారు.తక్షణమే ఎస్సారెస్పీ రెండవ దశ కాలువకు కామ్రేడ్ బి.ఎన్.రెడ్డి పేరు పెట్టాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు శ్రీకారం చుడతామని అఖిల భారత రైతు సమాఖ్య (ఏఐకేఎఫ్) జాతీయ ఉపాధ్యక్షులు వల్లెపు ఉపేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్, అఖిల భారత వ్యవసాయ కార్మిక సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి గోనె కుమారస్వామి హెచ్చరించారు. ఏఐకేఎఫ్, ఏఐఏడబ్ల్యూఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరును శ్రీరామ్ సాగర్ రెండవ దశకు నామకరణం చేయాలని, సూర్యాపేట జిల్లా బి.యన్.రెడ్డి జిల్లాగా మార్చాలని, ట్యాంక్ బండ్ పై బి.యన్.రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.అందుకుగాను ఈనెల 19న ఇందిరాపార్క్ వద్ద తలపెట్టిన ధర్నా ప్రచార కరపత్రాలను హైదరాబాదులోని ఓంకార్ భవన్ లో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడు నైజాం రజాకార్ల చేతిలో బందిఐనా తెలంగాణ ప్రాంతాన్ని విముక్తిచేసి భూమి బుక్తికై సాయుధ పోరాటానికి నాంది పలికి నాయకత్వం వహించారని పేర్కొన్నారు.పోరాటయోధుల చరిత్రను స్ఫూర్తి కలిగే విధంగా చరిత్ర పుటల్లో లిఖించి వారి ఆదర్శాలను త్యాగాలను పోరాట గాధలను గుర్తించుకునే విధంగా చేయాల్సిన పాలకులు చరిత్రను వక్రీకరించే చర్యలకు పూనుకోవడం దారుణం అన్నారు. అమరజీవి కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆది నుంచి అంతం వరకు ముందుండి నడిపించిన గొప్ప యోధుడు అని ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రజలకు సాగు త్రాగు నీటి కోసం ఎస్సారెస్పీ జలాల సాధన కోసం ఎంతో పరితపించి అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి సాధించాడని అలాంటి వీరుల త్యాగాలు ఆదర్శాలు నేటి సమాజానికి ఎంతో అవసరమైనప్పటికీ ప్రభుత్వాలు గుర్తించకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికైనా వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరులకు యోధులకు చరిత్రలో ప్రత్యేక గుర్తింపు కలిగించే విధంగా భవిష్యత్తు తరాలకు చరిత్రను అందించే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. అందులో భాగంగా కామ్రేడ్ బి ఎన్ రెడ్డి పేరును ఎస్సారెస్పీ రెండవ దశకు నామకరణం చేయాలని సూర్యాపేట జిల్లాకు బి.ఎన్ రెడ్డి జిల్లాగా మార్చాలని ట్యాంక్ బండ్ పై కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 19న ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టినట్లు అందుకు వామపక్ష ప్రజాసంఘాల రాష్ట్ర నేతలు, ప్రజల జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అమరజీవి భీమిరెడ్డి నరసింహారెడ్డి కుమారుడు ప్రభాకర్ రెడ్డి, అల్లుడు మల్లు కపోతం రెడ్డి, ఏఐకేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వస్కుల మట్టయ్య రాష్ట్ర నాయకులు కుసుంబ బాబురావు, వస్కుల సైదమ్మ, పోతుకంటి కాశి తదితరులు పాల్గొన్నారు.

 తొమ్మిది రోజుల తర్వాత పరామర్శలా…

 తొమ్మిది రోజుల తర్వాత పరామర్శలా… జగన్‌పై కొల్లు రవీంద్ర సీరియస్

 

జగన్ మాట్లాడిన మాటల్లో ఒక్క నిజం కూడా లేదని… కేవలం ప్రభుత్వం మీద బురదజల్లేందుకే జగన్ ప్రయత్నించారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. జగన్ దిగిన పొలాల్లో ఎక్కడా కూడా వర్షపు నీరు నిలిచిలేదని అన్నారు.

కృష్ణా జిల్లా, నవంబర్ 5: మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) కృష్ణా జిల్లా పర్యటన అట్టర్ ఫ్లాప్ అయిందని మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పర్యటనలో ఎక్కడా కూడా రైతులు కనిపించలేదన్నారు. తాను పర్యటిస్తున్న ప్రాంతాల్లో రైతులు లేక పక్క గ్రామాల నుంచి రైతులను తెప్పించుకుని జగన్ పబ్లిసిటీ స్టంట్లు చేశారని విమర్శించారు. పొలం గట్ల మీద నడిచి ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారని కామెంట్స్ చేశారు. తుఫాను తీరం దాటిన తొమ్మిది రోజుల తర్వాత పరామర్శ పేరుతో జగన్‌ రాజకీయ డ్రామా సృష్టించారని వ్యాఖ్యలు చేశారు. జగన్ పర్యటన ఆద్యంతం పచ్చి అబద్ధాలతో సాగిందని ఆరోపించారు.

 నేలపై కూర్చుని విద్యార్థులతో ముచ్చటించిన రామ్మోహన్ నాయుడు..

 నేలపై కూర్చుని విద్యార్థులతో ముచ్చటించిన రామ్మోహన్ నాయుడు

 

రూ. 99 లక్షలతో 5 అదనపు తరగతి గదులు నిర్మించామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. పిల్లల మైండ్ అభివృద్ధి చెందాలంటే అందరూ ఆటలు ఆడాలని కేంద్రమంత్రి అన్నారు.

శ్రీకాకుళం, నవంబర్ 5: జిల్లాలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు (Union Minister Rammohan Naidu) పర్యటన కొనసాగుతోంది. ఈరోజు (బుధవారం) శ్రీకాకుళం పట్టణంలో ఉమెన్స్ కళాశాలలో అదనపు భవనాల ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా కళాశాలలో తన తల్లి కూడా చదివారని తెలిపారు. స్టేట్‌‌లో అధికంగా ఈ మహిళా కళాశాలలో విద్యార్థులు చదువుతున్నారని అన్నారు. రూ. 99 లక్షలతో 5 అదనపు తరగతి గదులు నిర్మించామని తెలిపారు. పిల్లల మైండ్ అభివృద్ధి చెందాలంటే అందరూ ఆటలు ఆడాలని కేంద్రమంత్రి అన్నారు.
కళాశాల అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. పిల్లల నుంచి కోరుకునేది ఒక్కటే అని.. యూత్ అంతా రాణించాలని ఆకాంక్షించారు. పిల్లలంతా పెద్ద పెద్ద లక్ష్యంతో ముందుకు వెళ్లాలని అన్నారు. పిల్లలంతా చదువు సమయంలో చదువు పైనే దృష్టి పెట్టాలని సూచించారు. వేదిక ఎదురుగా విద్యార్థులతో కలిసి నేలపైన కూర్చుని మరీ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ముచ్చటించారు. అనంతరం కల్లేపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కేంద్రమంత్రి ప్రారంభించారు. కోతకు గురైన పెద్ద గనగళ్లవానిపేట వద్ద సముద్ర తీరాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు.

ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థినికి ఘన సన్మానం.

ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థినికి ఘన సన్మానం.

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మండలంలోని గురిజాల గ్రామానికి చెందిన ఆముదాల భాగ్యలక్ష్మి – లక్ష్మీనారాయణ దంపతుల కూతురు ప్రహర్ష కు ఎంబిబిఎస్ సీటు వచ్చినందున గాను బిఆర్ఎస్ గ్రామపార్టీ అధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు చిన్నపెళ్లి నర్షింగం మాట్లాడుతూ మంచిగా చదివి గొప్ప డాక్టర్ అయి పేదలకు వైద్య సేవలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు గడ్డం కొమురయ్య,బండారి శ్రీలత – రమేష్,న్యాయవాది,పార్టి క్లస్టర్ ఇన్చార్జి మోటురీ రవి,రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ అన్న రాజమల్లు,మండల పార్టీ ఉపాధ్యక్షుడు అల్లి రవి,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పత్రీ కుమారస్వామి,గౌడ సంఘం గౌరవ అధ్యక్షుడు మంచిక దేవేందర్,మాజీ వార్డు సభ్యులు కొక్కు రాంరాజు,మాజీ ఎస్ఎంసి ఛైర్మన్ కొమ్మ రవి,మాజీ గ్రామ పార్టి అధ్యక్షుడు దుడేల ప్రకాశ్,మాజీ నీటి సంఘం అధ్యక్షుడు మాటురీ రవీంద్రచారి,యూత్ మండల సహయ కార్యదర్శి బుస శ్రీశైలం,సీనియర్ నాయకులు పర్స కోటిలింగం,మర్ద నవీన్,సామల సతీష్,యశోద నరసింగం,బండారి మధుకర్,కునమల్ల కిరణ్ తదితులున్నారు.

నీట మునిగిన మిరప తోటల పరిశీలించిన సునీల్…

నీట మునిగిన మిరప తోటల పరిశీలించిన సునీల్

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండలము లోని ఎర్రగుంట తాడిచర్ల శివారులోని అధిక వర్షాల కారణంగా నీట మునిగిన మిరప తోటలను జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీల్ కుమార్ పరిశీలించారు
ఈ సందర్శన సందర్భంగా ఆయన రైతులతో చర్చించి, పంటను రక్షించడానికి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
తక్షణ చర్యలు
తోటల్లో నిల్వ నీటిని వెంటనే బయటకు వెళ్లేలా గుంటలు, కాలువలు త్రవ్వి డ్రైనేజీ సదుపాయాలు ఏర్పాటు చేయాలి. తోట చుట్టూ నీటి ప్రవాహం సులభంగా ఉండేలా కాల్వలు, నాళాలు శుభ్రం చేయాలి. అన్నారు

వేరుల కుళ్ళు వ్యాధి నివారణ

అధిక తేమ కారణంగా వేరుల కుళ్ళు వ్యాధి వచ్చే అవకాశముందని దీని నివారణ కొరకు నీరు తగ్గిన వెంటనే ట్రైకోడెర్మా విరైడే లేదా ప్సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ కలిగిన జైవ నాశనకారిని వేర్ల చుట్టూ పిచికారీ చేయాలి.
1 కిలో ట్రైకోడెర్మా + 100 కిలోల పూడి ఆవు పేడ లేదా ఎరువులో కలిపి తోటలో చల్లడం ద్వారా వేరుల వ్యాధులను నియంత్రించవచ్చని తెలిపారు.
జీవ సంబంధిత పద్ధతులతో పాటు అవసరమైతే రసాయనిక ఫంగిసైడ్‌లను కూడా వాడవచ్చని సూచించారు.
రసాయనిక నియంత్రణ చర్యలలో భాగంగా,
వేరుల కుళ్ళు నివారణకు
కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి లేదా మెటాలాక్సిల్ + మాంకోజెబ్ 2.5 గ్రా/లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేయాలి.
మిరప మొక్కల పునరుద్ధరణ చర్యలు
నీరు తగ్గిన తర్వాత, మొక్కలు తిరిగి పుంజుకునేందుకు హ్యూమిక్ యాసిడ్ లేదా అమినో యాసిడ్ 3 మి.లీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
అలాగే మైక్రోన్యూట్రియెంట్స్ కలిపి పిచికారీ చేయడం ద్వారా మొక్కలు పునరుద్ధరించుకుని ఆకులు తిరిగి పచ్చగా మారుతాయని తెలిపారు.

సోమనపల్లికి తాగునీరు రాక ఇబ్బంది పడుతున్న ప్రజలు..

సోమనపల్లికి తాగునీరు రాక ఇబ్బంది పడుతున్న ప్రజలు

పట్టించుకోని స్పెషల్ ఆఫీసర్…

సిపిఐ ఎం ఎల్.. జయశంకర్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ …

భూపాలపల్లి నేటిధాత్రి

 

టేకుమట్ల మండలంలోని సోమనపల్లి గ్రామపంచాయతీ దళిత కాలనీకి పది రోజులుగా మంచినీళ్లు రాక బోరు నీళ్లు తాగుతున్నారు జ్వరాలు జలుబు దగ్గు వస్తున్నాయి గ్రామపంచాయతీకి సంబంధించినటువంటి పంచాయితీ కార్యదర్శి కానీ స్పెషల్ ఆఫీసర్ గాని పట్టించుకున్న పాపాన పోవడం లేదు . తక్షణమే వారిపై చర్య తీసుకొని మంచినీళ్లు అందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం దళిత కాలనీలో ఎలాంటి సమస్య ఉన్న అధికారులు కాలయాపన చేస్తూ ఉన్నారు పట్టించుకోవడం లేదు తక్షణమే సమస్యను పరిష్కరించాలని లేకపోతే ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాను మారపల్లి కొండయ్య జీడి సమ్మయ్య అంబాల సమ్మయ్య జీడి సృజన రామ్ యాకూబ్ జీడి రాజు అందాల రమ పాల్గొన్నారు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కారు గుర్తుకే ఓటేద్దాం…

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కారు గుర్తుకే ఓటేద్దాం!

◆:- మాగంటి సునీత గోపినాథ్ గారిని గెలిపిద్దాం!

◆:- రహ్మత్ నగర్ డివిజన్ శ్రీ రామ్ నాగర్ లో ఇంటింటి ప్రచారం చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో నియోజకవర్గంలో రహమత్ నగర్ డివిజన్ 190,191 బూత్ లలో గడప గడప తిరుగుతూ బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు,మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,ఎస్సీ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్, మాజీ పట్ అధ్యక్షులు యాకూబ్, మొహియుద్దీన్ ,మాజి సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రవికిరణ్ నాయకులు ముర్తుజా చంద్రన పటేల్ బాబర్ నియోజకవర్గ సీనియర్ నాయకులు బూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

బిహార్ ఎన్నికల వేళ రాహుల్ గాంధీ మళ్లీ ఓట్ల చోరీ ఆరోపణలు

బిహార్ ఎన్నికల వేళ రాహుల్ గాంధీ మళ్లీ ఓట్ల చోరీ ఆరోపణలు! 25 లక్షల ఫేక్ ఓట్లంటూ..

 

రాహుల్ గాంధీ మరోసారి ఓట్ల చోరీ అంశాన్ని లేవనెత్తారు. గతేడాది హర్యానా ఎన్నికల సందర్భంగా వ్యవస్థాగత స్థాయిలో అవకతవకలు జరిగాయని అన్నారు. అక్కడ ప్రతి 8 ఓట్లలో ఒకటి ఫేక్ అని ఆరోపించారు.

ఇంటర్నెట్ డెస్క్: బిహార్ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి అధికార బీజేపీ, ఎలక్షన్ కమిషన్‌లపై విరుచుకుపడ్డారు. గతేడాది హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. 100 శాతం పక్కా ఆధారాలతో ఈ ఆరోపణలు చేస్తున్నానని అన్నారు (Rahul Gandhi Vote Chori Allegations). కాంగ్రెస్ గెలుపును ఓటమిగా మార్చేందుకు వ్యవస్థాగత స్థాయిలో అవకతవకలు చోటుచేసుకున్నాయని అన్నారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఎలక్షన్ కమిషన్ వర్గాలు రాహుల్ గాంధీ ఆరోపణల్ని కొట్టిపారేశాయి. ఎన్నికల సమయంలో ఓటర్ జాబితాపై ఒక్క అప్పీల్ కూడా రాలేదని గుర్తు చేశాయి. హర్యానాలో 90 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అయితే, పంజాబ్ హర్యానా హైకోర్టులో మాత్రం కేవలం 22 ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అంటే, ఎన్నికల ఫలితాలకు న్యాయపరమైన సవాళ్లు పరిమితమనేందుకు ఇది సూచనని ఈసీ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి.

కూతురి కిడ్నాప్‌కు యత్నం.. తల్లిదండ్రులపై కేసు…

కూతురి కిడ్నాప్‌కు యత్నం.. తల్లిదండ్రులపై కేసు

 

తల్లిదండ్రులపై ఓ కూతురు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

జగిత్యాల: ఎండపల్లి మండలం రాజారాంపల్లెలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. కన్న కూతురిని కిడ్నాప్ చేయడానికి తల్లిదండ్రులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వెల్గటూర్ పోలీస్ స్టేషన్లో కన్న తల్లిదండ్రులపై కూతురు ఫిర్యాదు చేసింది. వివరాళ్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్ పాలకుర్తి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి ప్రియాంక, వెల్గటూర్ మండలం రాజక్కపల్లె గ్రామానికి చెందిన మర్రి రాకేష్‌ల మధ్య 6 సంవత్సరాలుగా ప్రేమాయణం నడుస్తోంది.

అయితే.. రాకేష్ దళితుడు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు వీరిద్దరి ప్రేమను ఒప్పుకోలేదు. దీంతో జులై 2న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో.. తనను తల్లిదండ్రులు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ప్రియాంక ఆరోపిస్తుంది. అలాగే.. వారి నుంచి తనకు, తన భర్త రాకేష్‌కు ప్రాణహాని ఉందని తెలిపింది. ఈ మేరకు వెల్గటూర్ పోలీస్ స్టేషన్‌లో ప్రియాంక ఫిర్యాదు చేసింది. ప్రియాంక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 అలా వెళ్లిన ఏకైక నాయకుడు జగన్.. బుద్దా వెంకన్న ఫైర్..

 అలా వెళ్లిన ఏకైక నాయకుడు జగన్.. బుద్దా వెంకన్న ఫైర్

 

జగన్.. రైతుల మీదకు దండయాత్రకు వెళ్లారని బుద్దా వెంకన్న అన్నారు. ఓడించారనే అక్కసుతో హేళనగా చూసేందుకు వెళ్లారంటూ మండిపడ్డారు. తుఫాను సమయంలో అసలు జగన్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.

విజయవాడ, నవంబర్ 5: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై (Former CM YS Jagan) టీడీపీ నేత బుద్దా వెంకన్న(TDP Leader Budda Venkanna) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రైతుల పరామర్శ పేరుతో వారిపైనే జగన్ దండయాత్రలాగా వెళ్లారంటూ మండిపడ్డారు. రైతులపై ప్రేమ ఉంటే కట్ట మీద పొలాలు ఉన్న ప్రాంతంలో జగన్ పర్యటించాలని డిమాండ్ చేశారు. రైతులు ఓట్లు వేయలేదనే అక్కసుతోనే ప్రధాన మార్గంలో వెళ్లారని ఆరోపించారు. రైతుల‌ కోసం వెళ్లిన జగన్‌కు మందీ మార్బలం ఎందుకు అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చే అర్హత, స్థాయి జగన్‌కు ఉందా అని మండిపడ్డారు.

రైతులపై కక్ష…

‘అసలు వ్యవసాయం గురించి నీకేం తెలుసు. నీ తాతది గ్రానైట్, నీ తండ్రి ఫ్యాక్షన్, వ్యాపారం, నీది దగా వ్యాపారం. అసలు జగన్‌కు స్క్రిప్ట్ ఇచ్చేది ఎవరో. చదివి చెప్పడం కూడా జగన్‌కు చేత కావడం‌లేదు. ఫసల్ బీమా కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చెల్లిస్తున్నాయి. అసలు నువ్వు ముఖ్యమంత్రిగా ఏమీ తెలియకుండా ఐదేళ్లు ఉన్నావా. నీకు ఓట్లు వేయకపోతే రైతుల మీద కక్ష కడతావా’ అంటూ ఫైర్ అయ్యారు.

ఆనందంతోనే వెళ్లారు..

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు రైతుల వద్దకు వెళ్లి పరామర్శ చేశారని చెప్పిన బుద్దా వెంకన్న.. జగన్ రైతుల వద్దకు పరామర్శకు వెళ్లి పూలు వేయించుకుంటారా అంటూ మండిపడ్డారు. ఎవరైనా చనిపోయిన వారి దగ్గరకు వెళ్లి కూడా ఇలాగే పూలు విసిరేయించుకుంటారంటూ విరుచుకుపడ్డారు. జగన్ పర్యటన ఆనందంతో వెళ్లినట్లుగా ఉంది కానీ.. పరామర్శకు వెళ్లినట్లు లేదంటూ వ్యాఖ్యలు చేశారు. వంద కార్లు, బైక్‌లు, జెండాలు, పెయిడ్ ఆర్టిస్ట్‌లతో పరామర్శకు వెళ్లిక ఏకైక‌ నాయుడు జగన్ అంటూ ఎద్దేవా చేశారు.

ఆ మాత్రం తెలీదా…

జగన్.. రైతుల మీదకు దండయాత్రకు వెళ్లారని అన్నారు. ఓడించారనే అక్కసుతో హేళనగా చూసేందుకు వెళ్లారంటూ మండిపడ్డారు. తుఫాను సమయంలో అసలు జగన్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్, లోకేష్ రాత్రింబవళ్లు ప్రజల కోసం పని చేశారని తెలిపారు. ప్రకృతి విపత్తులను ఆపగలమా… ‌నష్టం తగ్గిస్తామా అని ప్రశ్నించారు. ఆ మాత్రం జగన్‌ తెలియదా అని ఫైర్ అయ్యారు. వరదల సమయంలో కోటి ఇస్తా అన్నారని…. ఎవరికి ఇచ్చారంటూ జగన్‌ను నిలదీశారు. దేశంలో అత్యధిక సంపన్నుడినని స్వయంగా జగనే అఫిడవిట్‌లో చెప్పారన్నారు. జగన్‌కు పేదలు అన్నా, రైతులు అన్నా చులకన భావమని అన్నారు. రైతులకు మేలు చేయాలని‌ జగన్‌కు నిజంగా ఉంటే తుఫాను తగ్గిన సమయంలో ‌వెళ్లేవారన్నారు. చంద్రబాబు తుఫాను హెచ్చరికల నుంచే అందరినీ అప్రమత్తం చేశారని.. నేతలను, అధికారులను క్షేత్ర స్థాయిలో పరుగెత్తించారని తెలిపారు. జగన్ విధ్వంసకర పాలన అందించారు కాబట్టే ప్రజలు ఇంట్లో‌కూర్చో పెట్టారని దుయ్యబట్టారు. చంద్రబాబు పడి లేచిన కెరటమని.. అలాంటి ఆయనకు జగన్ వార్నింగ్ ఇస్తారా అంటూ టీడీపీ నేత మండిపడ్డారు.

కేవలం ఫోటోల కోసమే..

11 సీట్లు వచ్చినా జగన్‌కు సిగ్గు శరం లేదంటూ బుద్దా వెంకన్న వ్యాఖ్యలు చేశారు. అందుకే రూ.42 వేల‌కోట్లు దోచుకుని జగన్ జైళ్లకు వెళ్లారన్నారు. ప్రజలు ఎవ్వరూ జగన్ కోసం రోడ్డు మీదకు రాలేదని గుర్తు చేశారు. కానీ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేస్తే ప్రజలు స్వచ్ఛంధంగా రోడ్ల‌పైకి వచ్చారని తెలిపారు. జగన్ తండ్రి ఎన్నో ఎంక్వయిరీలు వేసినా చంద్రబాబును దోషిగా చూపలేక పోయారని అన్నారు. చంద్రబాబు రైతు బిడ్డ.. అందుకే రైతల బాధలు ఆయనకు తెలుసన్నారు. జగన్.. ఫ్యాక్షనిస్టు బిడ్ట అని.. అందుకే విధ్వంసం చేశారని విరుచుకుపడ్డారు. సీఎంగా పొలంలో ‌కూడా దిగని జగన్.. నిన్న మాత్రం ఫొటోల కోసం పొలంలో అడుగు పెట్టారని అన్నారు. బురద లేని చోట మట్టి అంటకుండా పొలంలో పర్యటన బాగా చేశారంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. జగన్ ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మరని అన్నారు. చంద్రబాబును ఊర కుక్కలతో తిట్టిస్తే… ఆయన ఛరిష్మా తగ్గదని స్పష్టం చేశారు. జగన్ దండయాత్రలు మానుకుని ప్రజల కోసం పని చేయాలని హితవుపలికారు. తుఫాను సమయంలో ప్రభుత్వం చర్యలను చూసి ప్రజలంతా హర్షించారని తెలిపారు. జగన్‌కు ఇలాంటి మంచి‌ కనిపించదని… అబద్ధాలు, అసత్యాలతో మోసాలు చేయడమే వైసీపీ అధినేతకు తెలిసిన విద్య అంటూ బుద్దా వెంకన్న వ్యాఖ్యలు చేశారు.

error: Content is protected !!
Exit mobile version