కవిన్ సరసన ప్రియాంక…

కవిన్ సరసన ప్రియాంక…

అందాల భామ ప్రియాంక అరుల్ మోహన్ కిట్ లో మరో అవకాశం వచ్చి పడింది. ప్రముఖ తమిళ నటుడు కవిన్ సరసన ఆమె ఓ రొమాంటిక్ కామెడీ మూవీ చేయబోతోంది.

మూడు పదుల వెన్నెల సోన ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Arul Mohan) కు ఇంకా గ్రాండ్ విక్టరీ దొరకలేదు. అయితే… తమిళంలో ఆమె నటించిన ‘డాక్టర్ (Doctor), డాన్ (Don)’ చిత్రాలు కొంతలో కొంత ఊరటను కలిగించాయి. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సరసన ‘ఓజీ’ (OG) లో నటిస్తోంది ప్రియాంక అరుల్ మోహన్. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ‘ఓజీ’ పై అమ్మడు భారీ ఆశలే పెట్టుకుంది.

తెలుగులోనూ ఇప్పటికే నటిగా తన సత్తా చాటడానికి శతవిధాలా ప్రయత్నించింది. నానిస్ ‘గ్యాంగ్ లీడర్’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక… ఆ తర్వాత శర్వానంద్ సరసన ‘శ్రీకారం’లో నటించింది. ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే ‘గ్యాంగ్ లీడర్’లో ఆమె చేసిన పాత్ర మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. అందుకే మరోసారి నాని సరసన ‘సరిపోదా శనివారం’ (Saripoda Sanivaaram) లో ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ బరిలో మిస్ ఫైర్ అయింది.

ఇదిలా ఉంటే… ప్రియాంక అరుల్ మోహన్ కు ఇప్పుడో కొత్త ప్రాజెక్ట్ లభించింది. హీరో కవిన్ (Kavin) తొమ్మిదో చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటించబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. కెన్ రాయ్ సన్ దర్శకత్వం వహించే ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతోంది. థింక్ స్టూడియోస్ సంస్థ ఈ రొమాంటిక్ కామెడీ మూవీని ప్రొడ్యూస్ చేబోతోంది. ‘కొత్త ప్రయాణం… కొత్త సినిమా’ అంటూ వీరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కవిన్ సరసన ప్రియాంక తొలిసారి నటిస్తోంది. మరి సెప్టెంబర్ 25న రాబోతున్న ‘ఓజీ’తో ప్రియాంక స్టార్ హీరోయిన్ కేటగిరిలోకి చేరిపోతుందేమో చూడాలి.

ప్రియాంకను అనుకున్నారు రకుల్‌ను తీసుకున్నారు.

ప్రియాంకను అనుకున్నారు.. రకుల్‌ను తీసుకున్నారు

 

భారతీయ చిత్ర పరిశ్రమ ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘రామాయణ’. రణబీర్‌ కపూర్‌ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు నితిశ్‌ తివారి భక్తిశ్రద్ధలతో రూపొందిస్తున్నారు.

 

భారతీయ చిత్ర పరిశ్రమ ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘రామాయణ’. రణబీర్‌ కపూర్‌ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు నితిశ్‌ తివారి భక్తిశ్రద్ధలతో రూపొందిస్తున్నారు. వివాదాలకు తావు లేకుండా, విజువల్‌ వండర్‌గా ‘రామాయణ’ చిత్రాన్ని రూపొందించడానికి కృషి చేస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ చాలా కాలం క్రితమే మొదలైనా గత ఏడాది నవంబర్‌ నెలలో అధికారికంగా వివరాలు వెల్లడించారు. సాయిపల్లవి సీతగా, రావణుడిగా కన్నడ హీరో యశ్‌, సన్నీ డియోల్‌ హనుమంతుడిగా, రవి దూబే లక్ష్మణునిగా, కాజల్‌ అగర్వాల్‌ మండోదరిగా, లారా దత్తా కైకేయిగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంతో జరుగుతోంది. ఇక ఈ సినిమాలో మరో కీలకమైన పాత్ర శూర్పణఖ. రామ, రావణ యుద్ధం జరగడానికి కారణమైన ఈ పాత్రను రకుల్‌ ప్రీత్‌సింగ్‌ పోషించనున్నారు. ఆమె కంటే ముందు ఆ పాత్ర కోసం ఎవరిని సంప్రదించారో తెలుసా? పలు భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న ప్రియాంక చోప్రాను. ఆమె శూర్పణఖ పాత్ర పోషిస్తే అంతర్జాతీయ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ‘రామాయణ’ చిత్రానికి అదనపు ఆకర్షణ అవుతుందని దర్శకనిర్మాతలు భావించారు. అయితే తనకున్న ఇతర కమిట్‌మెంట్స్‌ వల్ల ఆ పాత్ర చేయలేనని ప్రియాంక చెప్పడంతో అప్పుడు రకుల్‌ను ఈ అవకాశం వరించింది. ప్రియాంక చోప్రా ఇప్పుడు మహేశ్‌, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా రామాయణగాథ స్ఫూర్తితో రూపొందుతుండడం విశేషంగా పేర్కొనాలి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version