ఘనంగా మాయావతి 70వ జన్మదినోత్సవం…

ఘనంగా మాయావతి 70వ జన్మదినోత్సవం

పరకాల,నేటిధాత్రి

 

పట్టణకేంద్రంలో కేంద్రంలో నియోజకవర్గ ఇన్చార్జి కర్రె రమేష్ ఆధ్వర్యంలో బిఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి 70వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి శనిగరపు రాజు హాజరై మాట్లాడుతూ ఈరోజు దేశం మొత్తం బహుజనులైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు రాజ్యాధికార రుచి చూపించి గర్వించదగ్గ రోజు అని మనువాద రాజకీయ పార్టీల గుండెల్లో వణుకు పుట్టించిన నాయకురాలు మాయావతి అని అన్నారు.మాయావతిని దేశ బహుజన కులాలన్నీ కలిసి ప్రధానమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాకి శరత్ చంద్ర,జిల్లా నాయకులు పసుల వినయ్ అంబేడ్కర్,మేకల విష్ణు నియోజకవర్గ ఉపాధ్యక్షులు పసుల బిక్షపతి,పట్టణ అధ్యక్షురాలు మడికొండ రవళి,పార్టీ వార్డు మెంబర్లు శనిగరపు రాహుల్,శనిగరపు రజినీకాంత్,గూడెల్లి శంకర్, బొట్ల భాస్కర్,క్రాంతి కుమార్, మనోజ్ కుమార్,హరీష్,సతీష్,అనిల్, మహేష్,రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

తీవ్రంగా ఖండించిన ఎంఐఎం పార్టీ….!

తీవ్రంగా ఖండించిన ఎంఐఎం పార్టీ….!

◆-: ఝరాసంగం మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తాజాగా మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పాట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగా నియమితులైన ఆయుష్ డాక్టర్లకు నియామక పత్రాలు అందిస్తున్న సందర్భంగా, ఒక మైనారిటీ మహిళా డాక్టర్ హిజాబ్‌ను నితీష్ కుమార్ లాగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ కార్యక్రమంలో నియామక పత్రం అందుకోవడానికి ముందుకు వచ్చిన పర్వీన్ అనే మహిళా ఆయుష్ డాక్టర్ ముఖంపై ఉన్న హిజాబ్‌ను చూసిన సీఎం నితిష్, దానిపై ప్రశ్నిస్తూ తొలగించాలని సూచించినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఆ సమయంలో అక్కడ ఉన్నవారిలో కొందరు నవ్విన దృశ్యాలు కూడా వీడియోలో ఉన్నాయి. ఈ ఘటనతో ఆ మహిళ కొద్దిసేపు అసౌకర్యానికి గురైనట్లు వీడియోలో కన్పించింది.
ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ
మాట్లాడుతూ నితీష్ జీకి ఏమైంది? ఆయన మానసిక పరిస్థితి పూర్తిగా క్షీణించిందా? లేక ఇప్పుడు ఆయన పూర్తిగా ‘సంఘీ’గా మారిపోయారా? అంటూ మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ విమర్శించింది.రాష్ట్రంలో అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి ప్రజల ముందే ఇలా అవమానకరంగా ప్రవర్తిస్తే,రాష్ట్రంలో మహిళల భద్రత ఎలా ఉంటుందో ఊహించవచ్చని తెలిపిపరు.ఈ అనుచిత ప్రవర్తనకు నితీష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని ఎంఐఎం ఝరాసంగం మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ
డిమాండ్ చేశారు.ఈ దుర్మార్గం క్షమించరానిదని ఆగ్రహం వ్యక్తం చేశారు,

ఏళ్ల వయసులో ప్రభుత్వ కొలువు పొందినట్టు ఫీలయ్యా: కమల్ హాసన్…

ఏళ్ల వయసులో ప్రభుత్వ కొలువు పొందినట్టు ఫీలయ్యా: కమల్ హాసన్

 

ఎంఎన్ఎం పార్టీ అధినేత, నటుడు కమల్‌హాసన్ రాజ్యసభకు ఎంపికవడం పట్ల స్పందిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగం సాధించినంత గర్వంగా ఉందన్నారు. ఆ క్షణంలో తన తల్లిదండ్రులు గుర్తుకువచ్చారని, వెంటనే సమాచారం ఇవ్వాలనుకున్నట్టు తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇంకా ఏమన్నారంటే..మక్కల్‌ నీది మయ్యం(MNM) పార్టీ అధినేత, నటుడు కమల్‌హాసన్(Kamal Haasan) ఇటీవల రాజ్యసభ(Rajya Sabha) సభ్యుడిగా ఎంపికయ్యారు. ఇలా పెద్దలసభలో ఎంపీగా ఎన్నికైనప్పుడు తన అనుభూతి ఏమిటని కేరళ(Kerala)లో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ వ్యక్తి ప్రశ్నించారు. బదులుగా.. ఏడు పదుల వయసులో ప్రభుత్వ కొలువు పొందినట్టుగా ఉందని సమాధానమిచ్చారు కమల్. ఆ సమయంలో తన తల్లిదండ్రులు గుర్తుకువచ్చారని చెప్పిన ఆయన.. వెంటనే వాళ్లకు ఫోన్ చేసి చెప్పాలనుకున్నట్టు వివరించారు.

‘ఆ క్షణంలో నా తల్లిదండ్రులు డి.శ్రీనివాసన్ అయ్యంగార్(D Srinivasan Iyengar), రాజ్యలక్ష్మి(Rajalakshmi)లను తలచుకున్నాను. నేను రాజ్యసభకు వెళ్లి సంతకం చేసినప్పుడు వారే గుర్తుకొచ్చారు. నేను స్కూల్లో ఓ డ్రాపౌట్ స్టూడెంట్‌ను. కనీసం ఎస్ఎస్ఎల్సీ(SSLC) పాసైనా.. నాకు రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం(Govt Job) వచ్చేదని మా అమ్మ ఎప్పుడూ అంటుండేవారు. అలాంటిది 71 ఏళ్ల వయసులో సాధించినట్టుంది. ఆ సమయంలో నా తల్లికి ఫోన్ చేసి.. ప్రభుత్వ కొలువులో పనిచేస్తున్నానని చెప్పాలనిపించేంత గర్వంగా అనిపించింది.’ అని కమల్ హాసన్ తన రాజ్యసభ ఎంపీ అనుభవాన్ని పంచుకున్నారు.ఇక, కమల్ తన రాజకీయ అనుభవం గురించి మాట్లాడుతూ.. తనను తాను మధ్యేవాదిగా చెప్పుకుంటానని పేర్కొన్నారు. తన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్(Raj Kamal Films International) కూడా తాను సైద్ధాంతికంగా నమ్మే అంశాలకు మద్దతిస్తోందని ఆయన స్పష్టం చేశారు. కమల్ చివరిసారిగా.. మణిరత్నం(Director Maniratnam) దర్శకత్వం వహించిన ‘థగ్ లైఫ్(Thug Life)’ మూవీలో నటించారు. అయితే.. ఆ సినిమాకు అనుకున్నంత స్పందన రాలేదు.

పేదరికాన్ని నిర్మూలించిన మహిళా ప్రధాని ఇందిరమ్మ…

పేదరికాన్ని నిర్మూలించిన మహిళా ప్రధాని ఇందిరమ్మ

నర్సంపేట,నేటిధాత్రి:

 

గరీబీ హఠావో నినాదంతో పేదరికారాన్ని నిర్మూలించిన ఉక్కుమహిళా మొదటి భారత మహిళా ప్రధాని భారతరత్న ఇందిరా గాంధీ అని నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని రాజేందర్ అన్నారు.ఇందిరా గాంధీ 108వ జయంతిని పురస్కరించుకొని బుదవారం నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న రాజేందర్ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం దేశ అభివృద్ధి కోసం, ఇందిరమ్మ చేసిన త్యాగాలు రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. కష్టకాలాల్లో వారు చూపిన ధైర్యం సంకల్పం రాబోయే తరాలకు కూడా నిలుస్తాయని తెలిపారు.ఇందిరమ్మ ఆశయాల సాధన కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పని చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఓబీసీ అధ్యక్షులు ఓర్సు తిరుపతి, వరంగల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ, నర్సంపేట మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పంబి వంశీకృష్ణ, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బైరి మురళీ, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దేవండ్ల రాంబాబు, నర్సంపేట పట్టణ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు ముత్తినేని వెంకన్న, నర్సంపేట పట్టణ మహిళా అధ్యక్షురాలు ధోని కీర్తన, నర్సంపేట మార్కెట్ డైరెక్టర్ కొల్లూరి మధుకర్, జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు మసూద్ భాయ్, జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఇస్లావత్ పద్మా బాయ్, జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి నూనె పద్మ, నర్సంపేట పట్టణ ఓబీసీ ఉపాధ్యక్షులు ఓర్సు సాంబయ్య, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ కార్యదర్శిలు చిప్ప నాగ, గిరగాని రమేష్, పిన్నింటి కిరణ్ కుమార్ రెడ్డి, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంత రంజిత్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి బిట్ల మనోహర్, నర్సంపేట పట్టణ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హసిన, నర్సంపేట పట్టణ మహిళా కాంగ్రెస్ సహాయ కార్యదర్శి దేశి లక్ష్మీ, మాజీ వార్డు సభ్యులు గాజుల రమేష్, నాడెం నాగేశ్వర్లు, పేరం బాబు రావు, గండి గిరి, రామగోని సుధాకర్, 1వ వార్డు అధ్యక్షులు లాక్కార్స్ రమేష్, 20వ వార్డు అధ్యక్షులు రామగోని శ్రీనివాస్, గోపు మహేందర్ రెడ్డి, కిసరి వెంకటేశ్వర్లు, నాగేల్లి సారంగం, వేల్పుల కృష్ణ, మేరుగు కిరణ్, కొర్ర రాహుల్, దేశి సాయిపటేల్, భూక్యా గణేష్, వాజిత్, తదితరులు పాల్గొన్నారు.

బిహార్ ఎన్నికల వేళ రాహుల్ గాంధీ మళ్లీ ఓట్ల చోరీ ఆరోపణలు

బిహార్ ఎన్నికల వేళ రాహుల్ గాంధీ మళ్లీ ఓట్ల చోరీ ఆరోపణలు! 25 లక్షల ఫేక్ ఓట్లంటూ..

 

రాహుల్ గాంధీ మరోసారి ఓట్ల చోరీ అంశాన్ని లేవనెత్తారు. గతేడాది హర్యానా ఎన్నికల సందర్భంగా వ్యవస్థాగత స్థాయిలో అవకతవకలు జరిగాయని అన్నారు. అక్కడ ప్రతి 8 ఓట్లలో ఒకటి ఫేక్ అని ఆరోపించారు.

ఇంటర్నెట్ డెస్క్: బిహార్ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి అధికార బీజేపీ, ఎలక్షన్ కమిషన్‌లపై విరుచుకుపడ్డారు. గతేడాది హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. 100 శాతం పక్కా ఆధారాలతో ఈ ఆరోపణలు చేస్తున్నానని అన్నారు (Rahul Gandhi Vote Chori Allegations). కాంగ్రెస్ గెలుపును ఓటమిగా మార్చేందుకు వ్యవస్థాగత స్థాయిలో అవకతవకలు చోటుచేసుకున్నాయని అన్నారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఎలక్షన్ కమిషన్ వర్గాలు రాహుల్ గాంధీ ఆరోపణల్ని కొట్టిపారేశాయి. ఎన్నికల సమయంలో ఓటర్ జాబితాపై ఒక్క అప్పీల్ కూడా రాలేదని గుర్తు చేశాయి. హర్యానాలో 90 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అయితే, పంజాబ్ హర్యానా హైకోర్టులో మాత్రం కేవలం 22 ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అంటే, ఎన్నికల ఫలితాలకు న్యాయపరమైన సవాళ్లు పరిమితమనేందుకు ఇది సూచనని ఈసీ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి.

సంక్షోభాలను సవాళ్లను ఎదుర్కొని గెలిచిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ- వెలిచాల రాజేందర్ రావు…

సంక్షోభాలను సవాళ్లను ఎదుర్కొని గెలిచిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ- వెలిచాల రాజేందర్ రావు

కరీంనగర్, నేటిధాత్రి:

 

స్వాతంత్య్ర పోరాటయోధురాలు, దేశ మహిళా శక్తికి ప్రతీక నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయురాలు మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ ఇందిరా గాంధీ అని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. శుక్రవారం ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డిసిసి కార్యాలయంలో ఆమహానీయురాలు చిత్రపటానికి వెలిచాల రాజేందర్ రావు కాంగ్రెస్ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ పేదల పక్షపాతి, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి ఇందిరా గాంధీ అని, సంక్షోభాలను సవాళ్లను ఎదుర్కొని గెలిచిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ అని గుర్తు చేశారు. ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా వారి దివ్య స్మృతికి నివాళులు అర్పించామని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆర్ష మల్లేశం, అనంతుల రమేష్, పలువురు కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version