కలెక్టర్ పాఠశాల అభివృద్ధి పరిశీలన, వ్యవసాయ పరికరాలు పంపిణీ

అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

బెల్లంపల్లి,నేటి ధాత్రి:

 

ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.మంగళవారం జిల్లాలోని బెల్లంపల్లి మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో కొనసాగుతున్న అదనపు గదుల నిర్మాణ పనులను ఆకస్మికంగా సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన త్రాగునీరు,విద్యుత్,విద్యార్థినీ, విద్యార్థులకు వేరువేరుగా మూత్రశాలలు,ప్రహరీ గోడ ఇతర సదుపాయాలతో పాటు మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందిస్తూ విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం,నిష్ణాతులైన ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని తెలిపారు.ఈ క్రమంలో పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.అనంతరం బెల్లంపల్లి పట్టణంలో గల శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు గడ్డం వినోద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ లతో కలిసి అర్హులైన లబ్ధిదారులకు వ్యవసాయ పనిముట్లు/పరికరాలను అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని వినూత్న సంస్కరణలతో అభివృద్ధి చేసేందుకు పంట సాగుకు అవసరమైన వ్యవసాయ అధునాతన పరికరాలను అర్హులైన రైతులకు అందించి పంట దిగుబడి పెంచేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.ఈ క్రమంలో వ్యవసాయ యాంత్రీకరణ కార్యక్రమం ఎస్.ఎం.ఎ.ఎం. 2025-26 లో భాగంగా అర్హులైన రైతులకు యాంత్రికరణ పరికరాలను అందించడం జరిగిందని తెలిపారు.బెల్లంపల్లి శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయ సాగు విస్తీర్ణాన్ని పెంపొందించి రైతులు అధిక దిగుబడి సాధించి ఆర్థికంగా లబ్ధి పొందేలా ప్రోత్సహిస్తుందని తెలిపారు.పంట ఉత్పత్తులను మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.వ్యవసాయ యాంత్రీకరణ కార్యక్రమంలో ప్రభుత్వం అందిస్తున్న ఆధునిక పరికరాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అదనపు గదుల నిర్మాణం కొరకు వినతి పత్రం ..

అదనపు గదుల నిర్మాణం కొరకు వినతి పత్రం ..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం రాళ్ల పేట గ్రామంలో. అదనపు గదులు కావాలని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిపాలన అధికారికి వినతి పత్రం.సమర్పించిన గ్రామస్తులు నాయకులు ఉపాధ్యాయులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. తంగళ్ళపల్లి మండలం.లో. పలు కార్యక్రమంలో మరియు ప్రారంభోత్సవాల్లో.పాల్గొన్న పరిపాలన రాళ్ల పేట గ్రామస్తులు నాయకులు ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించడం జరిగిందని ఇందులో భాగంగా. తంగళ్ళపల్లి మండలం రాళ్లపేట. గ్రామంలో. ఎంపీపీ ఎస్. పాఠశాలలో 30 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని. బోధన ధ్యాసనకై. కేవలం ఒకే గది ఉందని. ఒకటి నుండి ఐదు తరగతి వరకు. విద్యార్థులు చదువుకుంటున్నారని వారికి. చదువుకోడానికి. ఇబ్బందికరంగా ఉందని. దయచేసి వెంటనే. విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని వారికి తగిన తరగతి గదులు మంజూరు చేయవలసిందిగా. గ్రామస్తులు తరఫున విద్యార్థుల తరఫున ఉపాధ్యాయుల తరఫున జిల్లా పరిపాలన అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని. విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వారు విద్యార్థుల పిల్లల ను సౌకర్యాల నిమిత్తం.మంజూరు చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు

 నేలపై కూర్చుని విద్యార్థులతో ముచ్చటించిన రామ్మోహన్ నాయుడు..

 నేలపై కూర్చుని విద్యార్థులతో ముచ్చటించిన రామ్మోహన్ నాయుడు

 

రూ. 99 లక్షలతో 5 అదనపు తరగతి గదులు నిర్మించామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. పిల్లల మైండ్ అభివృద్ధి చెందాలంటే అందరూ ఆటలు ఆడాలని కేంద్రమంత్రి అన్నారు.

శ్రీకాకుళం, నవంబర్ 5: జిల్లాలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు (Union Minister Rammohan Naidu) పర్యటన కొనసాగుతోంది. ఈరోజు (బుధవారం) శ్రీకాకుళం పట్టణంలో ఉమెన్స్ కళాశాలలో అదనపు భవనాల ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా కళాశాలలో తన తల్లి కూడా చదివారని తెలిపారు. స్టేట్‌‌లో అధికంగా ఈ మహిళా కళాశాలలో విద్యార్థులు చదువుతున్నారని అన్నారు. రూ. 99 లక్షలతో 5 అదనపు తరగతి గదులు నిర్మించామని తెలిపారు. పిల్లల మైండ్ అభివృద్ధి చెందాలంటే అందరూ ఆటలు ఆడాలని కేంద్రమంత్రి అన్నారు.
కళాశాల అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. పిల్లల నుంచి కోరుకునేది ఒక్కటే అని.. యూత్ అంతా రాణించాలని ఆకాంక్షించారు. పిల్లలంతా పెద్ద పెద్ద లక్ష్యంతో ముందుకు వెళ్లాలని అన్నారు. పిల్లలంతా చదువు సమయంలో చదువు పైనే దృష్టి పెట్టాలని సూచించారు. వేదిక ఎదురుగా విద్యార్థులతో కలిసి నేలపైన కూర్చుని మరీ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ముచ్చటించారు. అనంతరం కల్లేపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కేంద్రమంత్రి ప్రారంభించారు. కోతకు గురైన పెద్ద గనగళ్లవానిపేట వద్ద సముద్ర తీరాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version