ఎస్వీయూ పీఎస్‌ వద్ద హైటెన్షన్.. భారీగా చేరుకుంటున్న విద్యార్థులు…

ఎస్వీయూ పీఎస్‌ వద్ద హైటెన్షన్.. భారీగా చేరుకుంటున్న విద్యార్థులు

 

ర్యాగింగ్‌పై ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన విద్యార్థులు, విద్యార్థి సంఘ నేతలపై యూనివర్సిటీ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ర్యాగింగ్‌పై యూనివర్సిటీ అధికారులు ఓ కమిటీని వేసి చేతులు దులుపుకున్నారు.

తిరుపతి, నవంబర్ 6: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వద్దకు విద్యార్థులు భారీగా చేరుకుంటున్నారు. దీంతో పీఎస్‌ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. యూనివర్సిటీ అధికారులపై విద్యార్థులు, విద్యార్థి సంఘం నేతలు ఫిర్యాదు చేయనున్నారు. కాగా.. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో (SV University) ర్యాగింగ్ కలకలం రేపుతోంది. యూనివర్సిటీలో విద్యార్థులను ప్రొఫెసర్‌ విశ్వనాథ్ రెడ్డి ర్యాగింగ్‌కు ప్రోత్సహించారంటూ బాధిత విద్యార్థులు ఆరోపించారు. ఈ క్రమంలో ప్రొఫెసర్‌పై ఫిర్యాదు ఇవ్వడానికి యూనివర్సిటీ అధికారులను మూడు రోజులు ముందు విద్యార్థి సంఘాలు కలిశాయి. అయితే ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన విద్యార్థులు, విద్యార్థి సంఘం నేతలపై యూనివర్సిటీ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ర్యాగింగ్‌పై యూనివర్సిటీ అధికారులు ఓ కమిటీని వేసి చేతులు దులుపుకున్నారు.
అయితే.. ఇప్పటి వరకు ర్యాగింగ్‌పై ఎలాంటి చర్యలు లేకపోగా.. తిరిగి తమపైనే కేసులు నమోదు చేయటాన్ని నిరసిస్తూ ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వద్దకు విద్యార్థులు, బాధిత విద్యార్థినిలు చేరుకున్నారు. యూనివర్సిటీ అధికారులపై విద్యార్థినిలు, విద్యార్థి సంఘ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. దీంతో ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వద్ద ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా…

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా

రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలి

పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి..

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్

 

భూపాలపల్లి నేటిధాత్రి

 

రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం విఫలమైందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోతుకు ప్రవీణ్ కుమార్ అన్నారు. బుధవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూరు నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐ ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్ల కార్డులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జోసఫ్ లు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతుందని, ఇప్పటివరకు విద్య రంగ సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారయింద ఆరోపించారు. ఇప్పటివరకు ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించలేదని, ముఖ్యంగా రాష్ట్రంలో 9000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని, పెండింగ్ బకాయలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం దుర్మార్గమని అది సరి కాదన్నారు. ప్రభుత్వం వెంటనే విద్యా శాఖ మంత్రిని ఏర్పాటు చేసి విద్య రంగానికి అధిక నిధులు కేటాయించాలని కోరారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విద్య రంగ సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని కళాశాల హాస్టల్ భవనానికి సొంత భవనం ఏర్పాటు చేయాలని, ఎస్సీ ఎస్టీ కళాశాలల బాయ్స్ హాస్టల్ కు సొంత భవనం లు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని,వెంటనే సొంత ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి విద్య రంగాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. లేనియెడల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలను ఉదృతం చేస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ ధర్నాకు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వేముల శ్రీకాంత్ తన సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రేణుకుంట్ల ప్రవీణ్, పోతుల పవన్, రమాకాంత్, పవన్, శ్రీనివాస్, అజయ్, సురేష్, వంశీ, కృష్ణ , నవీన్ తదితరులు పాల్గొన్నారు.

చిట్యాల లో ఏబీవీపీ వినూత్న నిరసన…

చిట్యాల లో ఏబీవీపీ వినూత్న నిరసన.

చిట్యాల నేటిదాత్రి :

చిట్యాల మండలం కేంద్రంలో ఏబీవిపి ఆధ్వర్యంలో ఉన్న పెండింగ్ స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ కొరకు
విద్యార్థులు ఛాయ,కూరగాయలు,జీప్ నడుపుతూ,మెకానిక్ పని చేస్తూ నిరసన తెలిపారు ఈ సందర్భంగా
ఏబీవీపీ తెలంగానా ప్రాంత హాస్టల్స్ కన్వీనర్ వేల్పుల రాజు కుమార్ గ మాట్లాడుతూ
విద్యార్థులు స్కాలర్షిప్ లు రాక ఫీజు కట్టలేక యామాన్యాల ఒత్తిడి తో ఆత్మహత్య లు కు పాల్పడుతూ ఉంటే ప్రభుత్వం విద్య వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని వెంటనే పెండింగ్ లో ఉన్న 8300 కోట్ల బకాయిలు విడుదల చేయాలని అన్నారు లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ ఆందోళన ఉదృతం చేస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో. నగర కార్యదర్శి అజయ్,కృష్ణ,శశి వర్ధన్,అనూప్,జిశ్వంత్,అజయ్,రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version