జహీరాబాద్లో అద్భుత దృశ్యం…

జహీరాబాద్లో అద్భుత దృశ్యం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

నవంబర్ 5వ తేదీ బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో చంద్రుడు భూమికి అత్యంత సమీపంగా సూపర్ మూన్ తరహాలో కనిపించాడు. సాయంత్రం 7 గంటలకు ఈ అద్భుత దృశ్యాన్ని జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎలాంటి పరికరాలు లేకుండానే స్పష్టంగా వీక్షించి, స్వయంగా అనుభూతి చెందారు.

 రోజుకు రూ.6తో SBI నుంచి రూ. 40 లక్షల లబ్ధి పొందవచ్చని మీకు తెలుసా..

 రోజుకు రూ.6తో SBI నుంచి రూ. 40 లక్షల లబ్ధి పొందవచ్చని మీకు తెలుసా?

 

రోజుకు కేవలం ఆరు రూపాయల కంటే తక్కువ ఖర్చు చేస్తే, అదే మీకు ఆపదలో ఎంతో అండగా నిలుస్తుంది. మీ ఎస్బీఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ద్వారానే రోజుకు ఈ మొత్తాన్ని చెల్లించి రూ.40 లక్షల బెనిఫిట్ పొందవచ్చని మీకు తెలుసా..

BanSBI Account: రోజుకు కేవలం ఆరు రూపాయల కంటే తక్కువ.. రూ.5.48 ఖర్చుపెట్టండి. అదే మీకు ఆపదలో ఎంతోడగా నిలుస్తుంది. మీ ఎస్బీఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ద్వారానే రోజుకు ఈ మొత్తాన్ని చెల్లించి రూ.40 లక్షల బెనిఫిట్ పొందవచ్చు. ఈ పాలసీ పొందడానికి ఖాతాదారుడు ఏడాదికి రూ.2000 ప్రీమియం చెల్లించాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు ఈ సౌకర్యాన్ని అందిస్తోంది.
మీరు ఏడాదికి రెండు వేలు చెల్లిస్తే, రూ. 40 లక్షలు, ఏడాదికి వెయ్యి చెల్లిస్తే రూ. 20 లక్షలు, లేదూ.. ఏడాదికి వంద రూపాయలు మాత్రమే చెల్లిస్తే, రూ.2 లక్షల ప్రమాద బీమా సౌకర్యం లభిస్తుంది.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ అనుబంధ సంస్థ అయిన, ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో తమ ఖాతాదారులకు సమగ్రమైన, చౌకైన ఈ వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీని అందిస్తోంది. ఇది అనుకోని ప్రమాదాల బారిన పడ్డప్పుడు ఎంతో ఊరటనిస్తుంది.

రోడ్డు, విద్యుత్తు ప్రమాదాలు, వరదలు, భూకంపాల వంటి ప్రకృతి విపత్తులు.. యాక్సిడెంట్స్, పాముకాటు వంటి కారణాలతో మరణించినా బాధితుడు సూచించిన నామినీకి రూ.40 లక్షలు, ఎస్‌బీఐ అందిస్తుంది. నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. 18 ఏళ్ల వయసు నుంచి 65 ఏళ్ల వయసు లోపు వారికి అర్హత ఉంటుంది. ఈ తరహా స్కీమ్స్ ఇతర బ్యాంకులు కూడా తమ ఖాతాదారులకు అందిస్తున్నాయి. హెల్త్ పరంగానే కాదు, ఇతర రంగాలకు కూడా తక్కువ ప్రీమియంతో ఎస్బీఐ ఇన్స్యూరెన్స్ సదుపాయం కల్పిస్తోంది.

వేంకటేశ్వర స్వామి ఆలయంలో అర్ధరాత్రి చోరీ కలకలం…

వేంకటేశ్వర స్వామి ఆలయంలో అర్ధరాత్రి చోరీ కలకలం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని మహీంద్రా. కాలనీలో గల వేంకటేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ 7వ తేదీ బుధవారం కార్తీక్ పౌర్ణమి రోజున అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారని, గురువారం ఉదయం ఆలయ చైర్మన్ నర్సింహా రెడ్డి విలేకరులకు తెలిపారు. ఈ ఘటనతో పట్టణంలో కలకలం రేగింది. దొంగలు ఆలయంలోకి ప్రవేశించి విలువైన వస్తువులను అపహరించుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కార్తీక దీపాల వెలుగులతో కళకళలాడిన కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానం..

కార్తీక దీపాల వెలుగులతో కళకళలాడిన కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయాలన్నీ దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో కార్తిక పౌర్ణమి సందర్భంగా భక్తులు పోటెత్తారు. స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించి… భక్తులు కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో జ్యోతులు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.స్వామి వారి దేవస్థానం కార్తీక దీపాల వెలుగులతో కళకళలాడింది. కార్తీకమాసం ఆఖరికి రోజైన అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు. కార్తీక దీపాలు వెలిగించి,స్వామి,అమ్మవార్లను దర్శించుకున్నారు. పలువురు భక్తులు కోనేటిలో దీపాలు వదిలారు స్వామి అమ్మవార్లను దర్శించుకుని విశేష పూజలు చేశారు.

కార్తీక పౌర్ణమి సందర్భంగా ఘనంగా సన్మానం…

కార్తీక పౌర్ణమి సందర్భంగా ఘనంగా సన్మానం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ కేతకి సంగమేశ్వర స్వామివారి దేవస్థానము లో పార్వతి పరమేశ్వరుల కళ్యాణోత్సవ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పెద్దలు గ్రామ ప్రజలు భక్తులు మరియు తోటి మిత్రులతో దైవదర్శనం చేసుకొని స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఈ సందర్భంగా డైరెక్టర్ మల్లికార్జున్ ఘనంగా సన్మానించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేయడం జరిగింది,

పురాతన శివాలయంలో ప్రత్యేక పూజలు…

పురాతన శివాలయంలో ప్రత్యేక పూజలు

పరకాల,నేటిధాత్రి

 

పట్టణంలోని ప్రముఖ పురాతన శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బ్రహ్మశ్రీ జె వెంకటేశ్వర శర్మ,మణిదీప్ శర్మ ల ఆధ్వర్యంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఉదయం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు వైభవంగా నిర్వహించారు.అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,భక్తులు పాల్గొన్నారు.

శ్రీ కనకదుర్గ అంబా భవాని దేవస్థానంలో శివుని విగ్రహ భూమి పూజ…

శ్రీ కనకదుర్గ అంబా భవాని దేవస్థానంలో శివుని విగ్రహ భూమి పూజ

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ కనకదుర్గ అంబా భవాని దేవస్థానం నెహ్రునగర్ లో శివుని విగ్రహ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో భాగంగా ధర్మకర్త,చైర్మన్ చిలుక నారాయణ మాట్లాడుతూ.. సిరిసిల్ల పట్టణ కేంద్రంలో నెహ్రు నగర్ లో ఉన్న శ్రీ కనకదుర్గ అంబా భవాని దేవస్థానం పరిధిలో భక్తులకు అందుబాటులో ఉండే విధంగా అమ్మవారి కృపతో శివుని విగ్రహా నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం దాత దూడం శంకర్ భక్తుడు విరాళంతో మరియు భక్తుల భాగస్వామ్యంతో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగినది. అని తెలిపారు.

అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగా చైర్మన్ ధర్మకర్త చిలుక నారాయణ, దూడం శంకర్,గుండ్లపల్లి రామానుజం,తాటి వెంకన్న, గాజుల భాస్కర్, బూర బాబి, వెల్ది చక్రపాణి, దూడం శ్రీనివాస్, చీమ్ని ప్రకాష్ మరియు భక్తులు పాల్గొన్నారు.

కంది కొండ జాతర పనులు పరిశీలన

కంది కొండ జాతర పనులు పరిశీలన

డోర్నకల్ ఆర్సి నేటిధాత్రి

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ కేంద్రం ఐన కురవి మండలంలోని కందికొండ గ్రామ శివారులో ఉన్న కందగిరి గుట్టపై కొలువు ఐన శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి మహా జాతర సందర్భంగా ఈనెల 5వతేదీన కార్తీకపౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని నిర్వహించనున్న మహ జాతర నేపథ్యంలో జాతరకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టిన పనులు పురోగతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసిన మాజీ జెడ్పీటిసి, కురవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి వీరభద్రంగౌడ్, ఈ కార్యక్రమంలో మరిపెడ సిఐ రాజ్ కుమార్ గౌడ్, సిరొలు ఎస్సై సంతోష్, విద్యుత్ శాఖ అధికారులు, రెవిన్యూ శాఖ అధికారులు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

పెరుగుతున్న అయ్యప్పస్వామి మలాదారులు

పెరుగుతున్న అయ్యప్పస్వామి మలాదారులు

ఒక్కరోజే 86 మంది అయ్యప్పస్వామి దీక్షా

ఈ నెల 5 న కార్తీక పౌర్ణమి వేడుకలు,పడిపూజ,సామూహిక సత్యనారాయణ వ్రతం

నర్సంపేట,నేటిధాత్రి:

 

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి దేవాలయంలో అయ్యప్పస్వామి దీక్షా చెప్పట్టే మాలాదారులు రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నది.కార్తీక సోమవారం ఒక్కరోజే 86 మంది స్వాములు అయ్యప్పదీక్షా చేపట్టారు.ఐతే అయ్యప్పస్వామి సేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సింగిరికొండ మాధవశంకర్ గుప్తా,అధ్యక్షుడు సైపా సురేష్ ఆధ్వర్యంలో దేవాలయ సిల్వర్ జూబ్లీ మహోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు.మాలధారణ చేపట్టిన స్వాములకు దీక్షా నియమాలను దేవాలయ ప్రధాన అర్చకులు దేవేష్ మిశ్రా వివరించారు.

ఈ నెల 5 న కార్తీక పౌర్ణమి వేడుకలు,పడిపూజ,సామూహిక సత్యనారాయణ వ్రతం

శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి దేవాలయంలో 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ మండల పూజల మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అయ్యప్పస్వామి దేవాలయ సేవా చారిటబుల్ ట్రస్టు చైర్మన్ సింగిరికొండ మాధవశంకర్ గుప్తా తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల 5 కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.ఈ సందర్భంగా దేవాలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతం చేపడుతున్నామని పేర్కొన్నారు.అదే రోజు కార్తీక దీపోత్సవం,అయ్యప్పస్వామి మహాదివ్య పడిపూజ కార్యక్రమం చేపడుతున్నట్లు ట్రస్టు అధ్యక్షుడు సైపా సురేష్ తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version