మెగా విస్తరణ.. ఎన్టీఆర్, కృష్ణా వారధిగా విస్తరణాభివృద్ధి…

 మెగా విస్తరణ.. ఎన్టీఆర్, కృష్ణా వారధిగా విస్తరణాభివృద్ధి.!

 

గ్రేటర్ విజయవాడ విలీన ప్రతిపాదిత జాబితాలోని ప్రాంతాలు కృష్ణాజిల్లాలో ఉన్న ప్పటికీ భౌగోళికంగా విజయవాడకు దగ్గరగా ఉన్నవే. జనసాంద్రతతో కిక్కిరిసిన విజయవాడ విస్తరణకు అవకాశం లేకపోవడంతో సమీప రూరల్ గ్రామాలు విజయవాడతో సమానంగా అభివృద్ధి చెందుతూ విస్తరిస్తున్నాయి. నిడమానూరు, పోరంకి.. ప్రస్తుతం కలిసిపోయేలా విస్తరణాభివృద్ధి జరుగుతోంది. గ్రేటర్ విలీన ప్రతిపాదిత జాబితాలోని నిడమానూరు, పోరంకి ప్రాంతాల విస్తరణాభివృద్ధిపై ఆంధ్రజ్యోతి కథనం.

 విజయవాడ సిటీకి ఆనుకుని ఉన్న ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. నిజానికివి సిటీ కన్నా ప్రశాంతం, ఆహ్లాదంగా ఉంటాయి. బందరు రోడ్డు నుంచి నిడమానూరు జాతీయ రహదారి వరకు 4 కిలోమీటర్ల దూరమున్న ఈ ప్రాంతం అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. ఒకప్పుడు పచ్చని పొలాలున్న ఈ ప్రాంతంలో ఇప్పుడు పెద్ద పెద్ద భవంతులు, అపార్ట్‌మెంట్ల నిర్మాణం జరుగుతున్నాయి. ఉద్యోగస్థులు, వ్యాపారులు ఇక్కడ నివాసముంటున్నారు. దీంతో ఈప్రాంతం గేటెడ్ కమ్యూనిటీలా తయారైంది. ఈ ప్రాంతంలో భూముల ధరలు నాలుగైదేళ్ల క్రితం కంటే ఇప్పుడు రెట్టింపయ్యాయి. విజయవాడ – గన్నవరం రహదారి రద్దీగా ఉన్నప్పుడు 100, 50 అడుగుల రోడ్లలోనే వాహనాలు పరుగులు పెడతాయి.
జిల్లాల పునర్విభజన సమయంలో రెండు జిల్లాల మధ్య ఉండిపోవడంతో అభివృద్ధి నిలిచిపోతుందేమోనని బందరు రోడ్డు(పోరంకి) – నిడమానూరు మధ్య ప్రాంత ప్రజలు కాస్త ఆందోళనకు గురయ్యారు. పోరంకి, నిడమానూరు ప్రాంతంలో సగభాగం ఎన్టీఆర్ జిల్లాలో ఉంటే మిగిలిన అర్ధభాగం కృష్ణా జిల్లాలో ఉంది. ఈ రెండు నియోజకవర్గాలు రెండు జిల్లాలను కలప డంతో పాటు రెండింటికీ వారధిగా ఉండడంతో అభివృద్ధిలో దూసుకుపోతోంది. విద్యాసంస్థలు, ఆసుపత్రుల నిర్మాణాలతో ఉద్యోగులు, వ్యాపారస్థులు ఇక్కడ నివసించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. పైగా నగరానికి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ ప్రశాంతంగా ఉంటుంది. దీంతో సంపన్నులు, ఉద్యోగులు.. స్థలాలు, ప్లాట్ల ధరలు ఎక్కువున్నా కొనేందుకు వెనుకడుగు వేయటం లేదు.

గ్రేటర్ సాకారమైతే మరింత అభివృద్ధి..

బందరు రోడ్డు నుంచి నిడమానూరు వరకు రహదారిని ఆనుకుని 4 కిలోమీటర్లలో ఈ ప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో బందరు. రోడ్డు నుంచి 2 కిలోమీటర్ల వరకు తాడిగడప మున్సిపాలిటీలో ఉండి పెనమలూరు నియోజకవర్గానికి చెందుతుంది. సుమారు రెండున్నర కిలోమీటర్ల ప్రాంతం గన్నవరం నియోజకవర్గం పరిధిలో ఉంది. ఈ ప్రాంతం మొత్తాన్ని గ్రేటర్ విజయవాడ పరిధిలోకి తీసుకువస్తే వేగంగా అభివృద్ధి చెందుతుందని స్థానికులు చెబుతున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి ఊపందుకుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో కలిపితే రానున్న రోజుల్లో గ్రేటర్లోకి వెళ్లే అవకాశం.. మరిన్ని సౌకర్యాలు పొందవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 తొమ్మిది రోజుల తర్వాత పరామర్శలా…

 తొమ్మిది రోజుల తర్వాత పరామర్శలా… జగన్‌పై కొల్లు రవీంద్ర సీరియస్

 

జగన్ మాట్లాడిన మాటల్లో ఒక్క నిజం కూడా లేదని… కేవలం ప్రభుత్వం మీద బురదజల్లేందుకే జగన్ ప్రయత్నించారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. జగన్ దిగిన పొలాల్లో ఎక్కడా కూడా వర్షపు నీరు నిలిచిలేదని అన్నారు.

కృష్ణా జిల్లా, నవంబర్ 5: మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) కృష్ణా జిల్లా పర్యటన అట్టర్ ఫ్లాప్ అయిందని మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పర్యటనలో ఎక్కడా కూడా రైతులు కనిపించలేదన్నారు. తాను పర్యటిస్తున్న ప్రాంతాల్లో రైతులు లేక పక్క గ్రామాల నుంచి రైతులను తెప్పించుకుని జగన్ పబ్లిసిటీ స్టంట్లు చేశారని విమర్శించారు. పొలం గట్ల మీద నడిచి ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారని కామెంట్స్ చేశారు. తుఫాను తీరం దాటిన తొమ్మిది రోజుల తర్వాత పరామర్శ పేరుతో జగన్‌ రాజకీయ డ్రామా సృష్టించారని వ్యాఖ్యలు చేశారు. జగన్ పర్యటన ఆద్యంతం పచ్చి అబద్ధాలతో సాగిందని ఆరోపించారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version