గురిజాలలో మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి…

గురిజాలలో మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మండలం గురిజాల గ్రామ బిఆర్ఎస్ కమిటీ ఆధ్వర్యంలో మక్కలు ఆరబోసిన రైతుల కల్లాలను పరిశీలించారు.క్లస్టర్ ఇన్చార్జి మోటూరి రవి మాట్లాడుతూ గురిజాలలో గతంలో పి.ఎ.సి.ఎస్ ఆధ్వర్యంలో కే.సీ.ఆర్ ప్రభుత్వంలో మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి గురిజాలతో పాటు సొసైటీలు పరిధిలో ఉన్న అన్ని గ్రామాల రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్ళు చేపట్టాలని డిమాండ్ చేశారు.మొక్కజొన్న రైతులను గత కేసీఆర్ ప్రభుత్వం ఆదుకున్నదని అన్నారు. ఇప్పుడు గురిజాల సొసైటీ పరిధిలోని గ్రామాలలో రైతులు చాలామంది మక్కలు సాగు చేశారని కొనుగోలు కేంద్రం లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి గురజాల సొసైటీ పరిధిలో మక్కలు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు చిన్నపెళ్లి నరసింగం,మాజీ ఎం.పీ.టీ.సీలు గడ్డం కొమురయ్య,బండారి రమేష్,మండల నాయకులు బండారి చిన్న వెంకటేశ్వర్లు,రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ అన్న రాజమల్లు,మండల నాయకులు సంగం మహేందర్,మండల పార్టీ ఉపాధ్యక్షుడు అల్లి రవి,గౌడ సంఘం గౌరవ అధ్యక్షుడు మంచిక దేవేందర్,మండల యూత్ ప్రధాన కార్యదర్శి సంఘం శ్రీకాంత్,మాజీ వార్డు సభ్యులు పత్రి కుమారస్వామి,కొమ్మ రవి,కొక్కు రామరాజు,పత్రి అశోక్,పి.ఎ.సి.ఎస్ డైరెక్టర్ నామాల సోమయ్య,కురుమ సంఘం మాజీ అధ్యక్షుడు డ్యాక శ్రీనివాస్,సీనియర్ నాయకులు ఎడ రమేష్,యశోద నర్సింగం,ఆకుల అశోక్,పోశాల బిక్షపతి,యశోద హరీష్,గర్నెపెల్లి వెంకటేశ్వర్లు,మర్ద కుమారస్వామి,పెద్దారపు కుమారస్వామి,పెద్దారపు వీరస్వామి,కుమ్మరికుంట్ల చంద్రమౌళి,ఆరేపల్లి రాజు,సిరపురపు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థినికి ఘన సన్మానం.

ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థినికి ఘన సన్మానం.

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మండలంలోని గురిజాల గ్రామానికి చెందిన ఆముదాల భాగ్యలక్ష్మి – లక్ష్మీనారాయణ దంపతుల కూతురు ప్రహర్ష కు ఎంబిబిఎస్ సీటు వచ్చినందున గాను బిఆర్ఎస్ గ్రామపార్టీ అధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు చిన్నపెళ్లి నర్షింగం మాట్లాడుతూ మంచిగా చదివి గొప్ప డాక్టర్ అయి పేదలకు వైద్య సేవలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు గడ్డం కొమురయ్య,బండారి శ్రీలత – రమేష్,న్యాయవాది,పార్టి క్లస్టర్ ఇన్చార్జి మోటురీ రవి,రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ అన్న రాజమల్లు,మండల పార్టీ ఉపాధ్యక్షుడు అల్లి రవి,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు పత్రీ కుమారస్వామి,గౌడ సంఘం గౌరవ అధ్యక్షుడు మంచిక దేవేందర్,మాజీ వార్డు సభ్యులు కొక్కు రాంరాజు,మాజీ ఎస్ఎంసి ఛైర్మన్ కొమ్మ రవి,మాజీ గ్రామ పార్టి అధ్యక్షుడు దుడేల ప్రకాశ్,మాజీ నీటి సంఘం అధ్యక్షుడు మాటురీ రవీంద్రచారి,యూత్ మండల సహయ కార్యదర్శి బుస శ్రీశైలం,సీనియర్ నాయకులు పర్స కోటిలింగం,మర్ద నవీన్,సామల సతీష్,యశోద నరసింగం,బండారి మధుకర్,కునమల్ల కిరణ్ తదితులున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version