దక్షిణాఫ్రికాలో కూలిన హిందూ దేవాలయం..

దక్షిణాఫ్రికాలో కూలిన హిందూ దేవాలయం.. భారత సంతతి వ్యక్తి మృతి

 

దక్షిణాఫ్రికాలోని న్యూ అహోబిలం దేవాలయం కూలిన ఘటనలో నలుగురు కన్నుమూశారు. మృతుల్లో భారత సంతతికి చెందిన వ్యక్తి కూడా ఉన్నారు. శుక్రవారం ఈ దుర్ఘటన జరిగింది.

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాలోని న్యూ అహోబిలం దేవాలయం కూలడంతో నలుగురు మృతి చెందారు. మృతుల్లో భారత సంతతి వ్యక్తి కూడా ఉన్నారు. క్వాజూలు-నటాల్ ప్రాంతంలో శుక్రవారం ఈ ప్రమాదం సంభవించింది. నాలుగు అంతస్తుల మేర ఉన్న దేవాలయంలో విస్తరణ పనులు జరుగుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. శిథిలాల కింద చిక్కుకుని పలువురు మరణించారు. మృతుల్లో ఇద్దరు కార్మికులు, దేవాలయానికి వచ్చిన ఓ భక్తుడు ఉన్నట్టు సహాయక బృందాలు తెలిపాయి (South Africa Temple Collapse).
శనివారం మరొక మృత దేహాన్ని గుర్తించడంతో మృతుల సంఖ్య 4కు చేరింది. ఈ దుర్ఘటనలో టెంపుల్ ట్రస్టు ఎగ్జిక్యూటివ్ సభ్యుడు, నిర్మాణ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న విక్కీ జయరాజ్ పాండే మరణించినట్టు అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రెండేళ్ల క్రితం దేవాలయం ఏర్పాటు అయిన నాటి నుంచీ పాండే అభివృద్ధి కార్యకలాపాల్లో విస్తృతంగా పాలుపంచుకుంటున్నారు. ఇక శనివారం కూడా సహాయక సిబ్బంది శిథిలాల నుంచి ఒక మృత దేహాన్ని వెలికి తీశారు. ఆ తరువాత, వాతావరణం అనుకూలించకపోవడంతో సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే, శిథిలాల కింద ఇంకా ఎందరు చిక్కుకున్నారనే విషయంపై స్పష్టత లేదు. ఇక స్థానిక మంత్రి ఒకరు ఘటనా స్థలాన్ని సందర్శించారు. అవసరమైనంత కాలం సహాయక చర్యలు కొనసాగుతాయని తెలిపారు. ఈ దిశగా సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు.

 సంజూ నాకు పెద్దన్నలాంటోడు.. జితేశ్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు..

 సంజూ నాకు పెద్దన్నలాంటోడు.. జితేశ్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

 

టీ20 ప్రపంచ కప్ 2026 దగ్గర పడుతున్న సమయంలో టీమిండియా సన్నాహక పోరు ప్రారంభించింది. తుది జట్టులో వికెట్ కీపింగ్ స్థానం కోసం సంజూ శాంసన్, జితేశ్ శర్మ పోటీ పడుతున్నారు. సౌతాఫ్రికాతో తొలి టీ20 గెలిచిన తర్వాత సంజూపై జితేశ్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించి ఇప్పటికే సన్నాహక మ్యాచులు ప్రారంభమయ్యాయి. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే జట్టులో వికెట్ కీపర్ స్థానం కోసం సంజూ శాంసన్, జితేశ్ శర్మ మధ్య తీవ్రమైన పోటీ నడుస్తుంది. ఈ క్రమంలో తొలి టీ20లో సెలక్టర్లు జితేశ్ వైపే మొగ్గు చూపడంతో.. సంజూ తుది జట్టులో స్థానం పొందలేకపోయాడు. ఈ మ్యాచులో జితేశ్ శర్మ(Jitesh Sharma) అద్భుతమైన కీపింగ్ చేశాడు. ఏకంగా నాలుగు క్యాచులు అందుకుని జట్టులో విజయంలో కీలక పాత్ర పోషించాడు. అటు బ్యాట్‌తోనూ 10 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఈ మ్యాచ్ అనంతరం జితేశ్ శర్మ.. తనకు, సంజూ శాంసన్‌కు మధ్య ఉన్న అనుబంధాన్ని గురించి మాట్లాడాడు. ‘అతడు జట్టులో ఉన్నందుకు ఆనందంగా ఉంది. నిజం చెప్పాలంటే సంజూ నాకు పెద్దన్న లాంటోడు. మా మధ్య పోటీ ఉన్న మాట వాస్తవం.. కానీ అప్పుడే మనలో దాగున్న ప్రతిభ బయటకు వస్తుంది. ఇది జట్టుకు కూడా ఎంతో మంచిది. సంజూ అద్భుతమైన ఆటగాడు. మేమిద్దరం టీమిండియా తరఫున ఆడుతున్నాం. మేం సోదరుల్లాంటివారం. అతడు నాకు చాలా సాయం చేశాడు’ అని జితేశ్ శర్మ అన్నాడు.

 అది సామ్రాజ్యవాద ధోరణి.. ట్రంప్‌పై దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఆగ్రహం..

 అది సామ్రాజ్యవాద ధోరణి.. ట్రంప్‌పై దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఆగ్రహం..

దక్షిణాఫ్రికాలో నిర్వహించనున్న జీ20 సదస్సును బహిష్కరిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రకటించడం సంచలనంగా మారింది. అమెరికా తరఫున ఒక్క అధికారి కూడా జీ20 సదస్సుకు హాజరు కాబోరని ట్రంప్ ప్రకటించడంపై దక్షిణాఫ్రికా ప్రభుత్వం మండిపడింది.

దక్షిణాఫ్రికాలో నిర్వహించనున్న జీ20 సదస్సును బహిష్కరిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రకటించడం సంచలనంగా మారింది. అమెరికా తరఫున ఒక్క అధికారి కూడా జీ20 సదస్సుకు హాజరు కాబోరని ట్రంప్ ప్రకటించడంపై దక్షిణాఫ్రికా ప్రభుత్వం మండిపడింది. ట్రంప్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో చేసిన విమర్శలపై దక్షిణాఫ్రికా ప్రభుత్వం, పాలక పార్టీ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ANC) ఆగ్రహం వ్యక్తం చేశాయి ( South Africa vs Trump).

హర్మన్ చేతిపై స్పెషల్ టాటూ…

హర్మన్ చేతిపై స్పెషల్ టాటూ!

 

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 గెలుపు సందర్భంగా టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ప్రత్యేక టాటూను వేయించుకుంది. సౌతాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించిన జ్ఞాపకంగా ఈ టాటూను తన చేతిపై వేయించుకున్న హర్మన్, అది తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపింది.

ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025.. ఐకానిక్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. 47 ఏళ్ల నిరీక్షణకు తెరదింపుతూ ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడింది. ఈ నేపథ్యంలో హర్మన్ ఓ ప్రత్యేకమైన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
ఎప్పటికీ గుర్తుండిపోతుంది..

టీమిండియా(Team India) ఫైనల్‌లో సౌతాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్(Harmanpreet Kaur) తన చేతిపై ప్రపంచ కప్ టాటూనే వేయించుకుంది. ట్రోఫీతో పాటు గెలిచిన సంవత్సరం (2025), పరుగుల వ్యత్యాసం (52) కూడా వేయించుకుంది. ‘నా చర్మంతోపాటు నా హృదయంలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తొలి రోజు నుంచి దీనికోసం ఎదురు చూశా. ఇక నుంచి ప్రతిరోజు ఉదయం దీన్ని చూసుకుంటా. ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటా’ అంటూ హర్మన్ క్యాప్షన్ ఇస్తూ సోషల్ మీడియా(Social Media)లో ఫొటోలను షేర్ చేసింది.

నా కల నెరవేరింది..

‘చిన్నప్పటి నుంచి నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. మా నాన్న హర్మందర్ కూడా మాజీ క్రీడాకారుడే. ఆయన కిట్‌లోంచి బ్యాట్ తీసుకుని ఆడుకునే దాన్ని. అది చాలా పెద్దగా ఉండటంతో మా నాన్న బ్యాట్‌ను చిన్నగా చెక్కి ఇచ్చాడు. దాంతోనే నేను ఆడుకునే దాన్ని. వరల్డ్ కప్‌లో మన మ్యాచులు చూసినప్పుడల్లా నాకూ ఇలాంటి అవకాశం వస్తే బాగుండనని అనుకునేదానిని. నాకు ఆ సమయంలో మహిళల క్రికెట్ గురించి తెలియదు. ఎప్పటికైనా ప్రపంచ కప్ ఆడి గెలవాలనేదే నా డ్రీమ్. ఇప్పుడు ఆ కల నెరవేరింది. నాకు జట్టును నడిపించే అవకాశం వస్తే అస్సలు వదులుకోకూడదని అనుకున్నా. ఆ దేవుడు ఒక్కోదాన్ని నెరవేరుస్తూ వెళ్లాడు. ఇదంతా నాకు మ్యాజిక్‌లా అనిపిస్తుంది. జట్టులో ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు’ అని హర్మన్ వెల్లడించింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version