రైతు పేరుతో రాజకీయం చేస్తే ఊరుకోము

రైతు పేరుతో రాజకీయం చేస్తే ఊరుకోము

– ప్రోటోకాల్ ఉల్లంఘించకుండా గౌరవంగా ఆహ్వానించాము
– వీలైతే రైతులను ఆదుకోవడానికి ప్రయత్నం చేయండి
– మీడియా సమావేశంలో ఖండించిన ఏఎంసీ చైర్మన్ స్వరూప, రైతులు, కాంగ్రెస్ నేతలు

సిరిసిల్ల ప్రతినిధి(నేటి ధాత్రి):

 

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవాలలో తాము ఎలాంటి ప్రోటోకాల్ ని ఉల్లంఘించలేదని, కావాలని బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ చైర్ పర్సన్ ను వెంట పెట్టుకుని వచ్చి దూర్భాషలాడుతూ, దౌర్జన్యాలకు దిగి, రచ్చ చేశారని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెల్ముల స్వరూప ఆరోపించారు. రైతులు డైరెక్టర్లతో కలిసి శుక్రవారం సిరిసిల్ల క్లబ్ లో వెల్ముల స్వరూప మీడియా సమావేశం నిర్వహించి మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, ఆమె భర్త జిందం చక్రపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, బీఆర్ఎస్ కౌన్సిలర్ల చర్యలను తీవ్రంగా ఖండించారు. పెద్దూరు, ముష్టి పెళ్లి, చంద్రంపేట, రగుడు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా నిర్ణీత సమయాన్ని కంటే గంటన్నర ఆలస్యంగా సుమారు 100 మంది మార్బలంతో మద్యం సేవించి వచ్చి ప్రోటోకాల్ ఉల్లంఘించారని తాము రానిదే ఎలా ప్రారంభిస్తారని దుర్భాషలాడుతూ హంగామా సృష్టించారని అన్నారు. వేసవి ఎండలో కొనుగోలు కేంద్రం వద్ద రైతులు, మహిళలు గంటల తరబడి వేచి ఉన్నారని అయినప్పటికీ మెప్మా అధికారులు మున్సిపల్ చైర్ పర్సన్ కోసం వేచి చూశారని, ఆలస్యంగా వచ్చిన మున్సిపల్ చైర్ పర్సన్ కు టెంకాయ ఇచ్చి కొట్టమని ప్రోటోకాల్ ప్రకారమే నడుచుకున్నారని తెలిపారు. అయినప్పటికీ చైర్పర్సన్ భర్త బీఆర్ఎస్ నాయకుడు విచక్షణ రహితంగా బూతులు మాట్లాడారని, తమ మాటలు వినిపించుకోకుండా వ్యవహరించారన్నారు. ఏఎంసీ చైర్మన్ ను కూడా టెంకాయ కొట్టనివ్వకుండా భయభ్రాంతులకు గురి చేశారన్నారు. ఈ కార్యక్రమాలలో చైర్మన్ భర్తకు ఏమి సంబంధం ఉందని, ఇలా రైతులు మహిళలు ఉండగా దౌర్జన్యానికి దిగారన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ కూడా రైతుపై దౌర్జన్యానికి దిగాడని, బూతు పురాణం ప్రారంభించాడని ఆరోపించారు. ఒకవైపు వర్షాలు పడి కల్లాల వద్ద ధాన్యం తడిసి రైతులు నష్టపోయి ఏడుస్తుంటే వారి పట్ల సహాయక చర్యలు చేపట్టకుండా రైతుల పేరుతో రాజకీయం చేస్తున్నారని అన్నారు. విలీన గ్రామాల ప్రజలు వీరి చర్యలను గమనించాలన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ తనకు తల్లి లాంటి స్థానంలో ఉన్నారని తాను ప్రోటోకాల్ ఉల్లంఘించకుండా గౌరవంగా ఆహ్వానించినప్పటికీ ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడ్డారని అన్నారు. తాము చదువుకున్న వారం కనుక విచక్షణతో వ్యవహరించామని, పార్టీ కౌన్సిలర్ పై చేయి కూడా ఎత్తారని ఇలాంటి చిల్లర పనులు మానుకోవాలన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను 10 సంవత్సరాల పాటు మద్యం తాగిస్తూ పోషించారని, కానీ తమకు కూడా కార్యకర్తలు ఉన్నారని, 10 మంది కార్యకర్తలు ఉన్నా వారు విచక్షన కార్యకర్తలని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేసిన తాము అడ్డుకోలేదని, రైతుల పేరుతో రాజకీయం చేస్తే ఊరుకోబమని, రైతుల జోలికి వస్తే బాగుండదని స్వరూప హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగం గౌడ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాముని వనిత, ఎలుక తిరుపతి, దుబాల వెంకటేశం, మార్గం లక్ష్మణ్, బూర దశరథం, పిస్క మదు, ఆడెపు జగన్, ఖాజా, కోడం అరుణ, మెరుగు శేఖర్, .స్వర్గం రాజు, కూరపాటి శ్రీశైలం, పరశురాములు, నక్క నరసయ్య, శైలజ, శ్రీనివాస్ రెడ్డి, భరత్ తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టుల మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

జర్నలిస్టుల మహాసభ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు

భూపాలపల్లి నేటిధాత్రి

హైదరాబాద్ వేదికగా జర్నలిస్టులు జాతీయస్థాయి సమావేశాలు నిర్వహించడం అభినందనీయమని
ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడలో బుధవారం
ఈ నెల 23,24 తేదీలలో నిర్వహించే నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్(ఇండియా) (ఎన్‌యూజే(ఐ)) జాతీయ సమావేశాల వాల్ పోస్టర్ ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఎన్‌యూజే(ఐ) అనుబంధ యూనియన్ అయిన తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్
(టిఎస్ జెయు) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల జర్నలిస్ట్ ప్రతినిధులు హాజరయ్యేలా,హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు జాతీయ స్థాయి సెమినార్ నిర్వహించడం అభినందనీయమన్నారు ఈ ప్రతిష్టాత్మక సమావేశాలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమని పేర్కొన్నారు.జర్నలిస్టుల సమస్యలపై చర్చించేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తూ,కార్యక్రమ నిర్వాహకులైన టీఎస్‌జేయూ రాష్ట్ర,జిల్లా కమిటీలకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీఎస్‌జేయూ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పావుశెట్టి శ్రీనివాస్,రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తడుక సుధాకర్,జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంతోష్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవీందర్,జిల్లా ఉపాధ్యక్షులు అరిగేల జనార్ధన్,గట్టు రవీందర్,ధన్వాడ సర్పంచ్ చీటూరి మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మున్సిపాలిటీ భాజపాకు ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం: సీతారాం నాయక్

ఎన్నికల్లో నర్సంపేట మున్సిపాలిటీ ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తాం.

రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం నర్సంపేటకు ఏమిచ్చింది.

మాజీ ఎంపీ,భాజపా రాష్ట్ర నేత,ప్రొఫెసర్ అజ్మీర సీతారాం నాయక్

కుంభకోణాల్లో కాంగ్రెస్,బిఆర్ఎస్ పార్టీలు

జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం

నర్సంపేట,నేటిధాత్రి:

రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి నిధులు కేంద్రం నుంచి వచ్చినవే.. ఇప్పటివరకు నర్సంపేటను పాలించిన బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఏమి అభివృద్ధి చేశాయి. త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వండి కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తాం అని మాజీ ఎంపీ,భాజపా రాష్ట్ర నేత,ప్రొఫెసర్ అజ్మీర సీతారాం నాయక్ అన్నారు.మున్సిపల్ ఎన్నికలకు ముందు భాజపా ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు,కార్యకర్తలతో ముందస్తు సన్నగ్ద సమావేశాలు నిర్వహించేందుకుగాను శనివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి, నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల కన్వీనర్ డాక్టర్ గోగుల రాణా ప్రతాపరెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీర సీతారాం నాయక్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏమి ఇచ్చిందో మరోసారి పట్టణ ప్రజలు తెలుసుకోవాలని కోరారు.నర్సంపేట పరిదిలో ముఖ్యమైన అభివృద్ధి పనులు చేసేవి చాలా ఉన్నాయి.మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిపించండి.. కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తెచ్చి అభివృద్ధి చేసే బాధ్యత మాది అని సీతారాం నాయక్ హామీ ఇచ్చారు.కాంగ్రెస్,భారాస పార్టీలు అభివృద్ధి చేస్తాయని ఇప్పటికీ నర్సంపేట మోసపోయింది.మరల మోసపోవద్దు అని పేర్కొన్నారు.ప్రస్తుతం నర్సంపేటలో జరిగిన అభివృద్ధి నేను చేసిందే.. కేంద్ర ప్రభుత్వ నిధులతో..చేసిన అభివృద్దే కనబడుతున్నది అని మాజీ ఎంపీ తెలిపారు.ప్రధాని మోడీ ప్రపంచ నాయకునిగా ఆచరిస్తున్నారు.అదే తరహాలో ఎన్నికల్లో మున్సిపాలిటీ ఇస్తే రాబోయే ఎమ్మెల్యే కూడా భాజపాదే అని భాజపా రాష్ట్ర నేత సీతారాం నాయక్ తెలిపారు.మాజీ ఎమ్మెల్యే,మాజీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు,మున్సిపల్ ఎన్నికల జిల్లా కన్వీనర్ కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ

2014 నుండి ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని దశ దిశలను మార్చారు.అదే తరహాలో మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను చైతన్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రజలకు అవగాహన కల్పించి ఎన్నికల్లో భాజపా అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు.జరుగబోయే మున్సిపల్ ఎన్నికలల్లో గెలుపు జెండాలను ఎగురవేయడానికి సన్నాహక సమావేశాలు నిర్వస్తున్నామని అన్నారు.ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం అన్ని డివిజన్ లలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి ఎంపికలు ఉంటాయన్నారు.
స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి కాంగ్రెస్ ఏమి అభివృద్ధి చేసినన్నారు.డెబ్బై ఏండ్ల కాంగ్రెస్,
పదేండ్ల బిఆర్ఎస్ పార్టీలు ఒకే కుటుంబ పార్టీలు..అవి నిత్యం కుంభకోణాలను నిలయంగా మారుతున్నాయని ఆరోపించారు.
గతంలో గిలిచిన 9 ఎంపిలు,9 ఎమ్మెల్యే స్థానాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగబోయే మున్సిపాలిటీలో ఎన్నికలో అధిక మున్సిపాలిటీలను గెలిపించుకోవడమే లక్ష్యం.దీంతో వచ్చే శాసన సభ ఎన్నికల్లో అధిక సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని జోష్యం చెప్పారు.కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ,ఎన్నికల జిల్లా కో కన్వీనర్ పుల్లారావు మాట్లాడుతూ నర్సంపేటలో చేసే ప్రతి అభివృద్ధి పథకం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులే అని పేర్కొన్నారు.
సొమ్మోకరిది సోకోకరిది అనే విధంగా కేంద్ర ప్రభుత్వం నిధులతో రాష్ట్ర ప్రభుత్వ నిధులంటూ కాంగ్రెస్ ప్రభుత్వం,కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.జిల్లా ప్రధాన కార్యదర్శి,నర్సంపేట ఎన్నికల కన్వీనర్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికలల్లో
30 డివిజన్లలో పోటీ చేస్తున్నాం.
ప్రజా బలం ఉన్న నాయకున్ని ఎన్నికల బరిలో దింపుతామని పేర్కొన్నారు.
బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రధాని మోడీ నర్సంపేట 3000 ఇండ్లు పంపితే ఒక్క డబుల్ బెడ్రూo కూడా ఇవ్వలేదన్నారు.ఆరు గ్యారెంటీలు,420 హామీలతో అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సిసి రోడ్ల పేరుతో కాంట్రాక్టర్ అవతారంలో ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు గమనించి భాజపా నాయకులను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిస్తే నర్సంపేటకు శ్రీరామ రక్షా అవుతుందని రాణా ప్రతాప్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గూడూరు సందీప్,రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహారాములు,జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్,నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్, రూరల్ అధ్యక్షులు తనుగుల అంబేద్కర్ సీనియర్ నాయకులు కూనమల్ల పృథ్వీరాజ్, బాల్నే జగన్, పంజాల శ్రీ రాం,కుంభం కోమల్ రెడ్డి, జూలూరు మనీష్ గౌడ్,గుడిపూడి రాధాకృష్ణ, కట్ల రామచందర్ రెడ్డి, బానోత్ వీరన్న, మల్యాల సాంబామూర్తి,పొనుగోటి రవీంద్రచారి నర్సంపేట పట్టణ ప్రధాన కార్యదర్శి సూత్రపు సరిత మహిళ నాయకురాలు మార్త సంధ్యారాణి,బీజేపీ పట్టణ నాయకులు ఠాకూర్ విజయ్ సింగ్, కాసుల నాగేంద్రబాబు,రాజ్ కుమార్, మస్ శివ,థౌటం నిశాంత్, చిలువేరు అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.

బిహార్ ఎన్నికల వేళ రాహుల్ గాంధీ మళ్లీ ఓట్ల చోరీ ఆరోపణలు

బిహార్ ఎన్నికల వేళ రాహుల్ గాంధీ మళ్లీ ఓట్ల చోరీ ఆరోపణలు! 25 లక్షల ఫేక్ ఓట్లంటూ..

 

రాహుల్ గాంధీ మరోసారి ఓట్ల చోరీ అంశాన్ని లేవనెత్తారు. గతేడాది హర్యానా ఎన్నికల సందర్భంగా వ్యవస్థాగత స్థాయిలో అవకతవకలు జరిగాయని అన్నారు. అక్కడ ప్రతి 8 ఓట్లలో ఒకటి ఫేక్ అని ఆరోపించారు.

ఇంటర్నెట్ డెస్క్: బిహార్ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి అధికార బీజేపీ, ఎలక్షన్ కమిషన్‌లపై విరుచుకుపడ్డారు. గతేడాది హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ స్థాయిలో ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. 100 శాతం పక్కా ఆధారాలతో ఈ ఆరోపణలు చేస్తున్నానని అన్నారు (Rahul Gandhi Vote Chori Allegations). కాంగ్రెస్ గెలుపును ఓటమిగా మార్చేందుకు వ్యవస్థాగత స్థాయిలో అవకతవకలు చోటుచేసుకున్నాయని అన్నారు.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఎలక్షన్ కమిషన్ వర్గాలు రాహుల్ గాంధీ ఆరోపణల్ని కొట్టిపారేశాయి. ఎన్నికల సమయంలో ఓటర్ జాబితాపై ఒక్క అప్పీల్ కూడా రాలేదని గుర్తు చేశాయి. హర్యానాలో 90 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అయితే, పంజాబ్ హర్యానా హైకోర్టులో మాత్రం కేవలం 22 ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అంటే, ఎన్నికల ఫలితాలకు న్యాయపరమైన సవాళ్లు పరిమితమనేందుకు ఇది సూచనని ఈసీ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version