పదవ తరగతి ప్రశ్నాపత్రాల భద్రతలో అధికారుల నిర్లక్ష్యం…

పదవ తరగతి ప్రశ్నాపత్రాల భద్రతలో అధికారుల నిర్లక్ష్యం
సీలింగ్ చేసిన ఘటనలో బాధ్యులైన ఆఫీసర్లపై చర్య తీసుకోవాలి- మచ్చ రమేష్
  
కరీంనగర్, నేటిధాత్రి:
https://youtu.be/DuesHkaoMCM?si=82oykQbivkOKbBGV
కరీంనగర్ జిల్లాలో త్వరలో జరిగే పదవ తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు ఇటీవల జిల్లా కలెక్టరేట్ కారిడార్ లో సీలింగ్ చేసి బాధ్యతరహిత్యం వ్యవహరించి నిర్లక్ష్యం వహించిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ డిమాండ్ చేశారు. పదవ తరగతి వార్షిక పరీక్షల ప్రశ్నాపత్రాల సీలింగ్ లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ కి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈసందర్భంగా మచ్చ రమేష్ మాట్లాడుతూ అత్యంత పకడ్బందీగా, భద్రత మధ్య ఇతర వ్యక్తుల రాకపోకలకు అవకాశం లేకుండ ఏదైనా భవనంలో నాలుగు గోడల మధ్య నిర్వహించాల్సిన సీలింగ్ ప్రక్రియను ఫిబ్రవరి 28న కలెక్టరేట్ కారిడార్ లో నిర్వహించడం అంటే అధికారుల నిరక్ష్యానికి నిదర్శనమని, ఈకారిడార్ ద్వారానే ఇతర శాఖల సిబ్బంది, వివిధ పనులపై కలెక్టరేట్ కు వచ్చే ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఇలాంటి స్థలంలో సీలింగ్ ప్రక్రియ చేపట్టడం సంబంధిత ఆఫీసర్ల బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం. అటుగా వచ్చేవారు ప్రశ్నా పత్రాలను దృష్టి మరల్చి తీసుకెళ్లి పేపర్ లీకేజీకి పాల్పడే ప్రమాదముందనే విషయాన్ని మరిచి ఆఫీసర్లు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు. 
ఈఘటనపై వెలుగు దినపత్రికలో మెయిన్ పేజీలో మార్చి 1న ఫొటో వార్త పబ్లిష్ అయింది. ఈవార్తకు స్పందనగా ‘స్థలాభావం కారణంగానే కారిడార్ లోకి ప్రశ్నాపత్రాలను సీలింగ్ చేశాం’ అని డీఈఓ ప్రకటించగా  ప్రశ్నాపత్రాల ట్రంక్ బాక్సులను డీటీఓ కార్యాలయం లోపలే సీలింగ్ ప్రక్రియ నిర్వహించినట్లు గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్ ప్రకటించారు. కారిడార్ లోనే ప్రశ్నాపత్రాలు సీలింగ్ చేసినట్లు ఫొటోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన ఆఫీసర్లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, టెన్త్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రమేష్ డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు బోయినీ విష్ణు, నాయకులు సాయి, తదితరులు పాల్గొన్నారు.

శాంతినికేతన్ హై స్కూల్ ముందు ధర్నా నిర్వహించిన ఏఐఎస్ఎఫ్…

శాంతినికేతన్ హై స్కూల్ ముందు ధర్నా నిర్వహించిన ఏఐఎస్ఎఫ్

బిట్స్ పాఠశాల యాజమాన్యం పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి.

భూపాలపల్లి నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ నాయకులు శాంతినికేతన్ హైస్కూల్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోతుకు.ప్రవీణ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్ లు మాట్లాడుతూ భూపాలపల్లి బిట్స్ బిట్స్ పాఠశాల యాజమాన్యం శాంతినికేతన్ హైస్కూల్ పేరు మీద అనుమతులు తీసుకొని ఆ పాఠశాల పేరు వాడకుండా బిట్స్ స్కూల్ అని జిల్లా ప్రజలను,విద్యార్థుల తల్లిదండ్రులను నమ్మించి విద్యార్థులను అడ్మిషన్ తీసుకొని మోసం చేశారని అన్నారు.
విద్యార్థుల రిజిస్టర్, టీ సీ రికార్డ్ షీట్, విద్యార్థుల ఐడి కార్డ్, ఫీజు రసీదుల మీద శాంతినికేతన్ హైస్కూల్ అని ఉండాలి. కానీ బిట్స్ పాఠశాల పేరు పేరుమీద అక్రమంగా బిట్స్ పాఠశాలను నడిపించడం జరుగుతుంది అని అన్నారు. ఇంత పెద్ద మోసానికి పాల్పడుతున్న బిట్స్ యాజమాన్యంపై విద్యాశాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని అధికారులను సూటిగా ప్రశ్నించారు. బిట్స్ యాజమాన్యం పై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని క్రిమినల్ కేసులను నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పది సంవత్సరాల నుండి శాంతినికేతన్ హైస్కూల్ మూసి వేసినప్పటికీ పాఠశాల నడుస్తుందని తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సృష్టించి శాంతినికేతన్ హైస్కూల్ పేరు మీద అనుమతులు తీసుకున్నారని అన్నారు.
జీవో నెంబర్ 1ఒకటి ప్రకారం ఏ ప్రైవేట్ పాఠశాల అయినా ఐదు సంవత్సరాలు పాఠశాల నడిపించకపోతే పూర్తిస్థాయిలో ఆ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని నిబంధన ఉన్నప్పటికీ జిల్లా విద్యాశాఖ అధికారులు శాంతినికేతన్ పాఠశాలకు ఏ విధంగా షిఫ్టింగ్ పర్మిషన్ ఇచ్చారని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడిన జిల్లా విద్యాశాఖ అధికారుల పైన, శాంతినికేతన్ హైస్కూల్ అయితే కరుణాకర్ రెడ్డి, బిట్స్ యాజమాన్యం రాజేంద్రప్రసాద్ పైన చర్యలు తీసుకునేంతవరకు ఆందోళన పోరాటాలు చేస్తామని ప్రవీణ్ జోసఫ్ లు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు ఒంటేరు రాజేష్, జంపాల పవన్,అజయ్, సాయి కృష్ణ, రజనీకాంత్, సాదన్, అంజాద్, ఉమేష్, రామ్ చరణ్,నజీర్,శ్రీరామ్
.తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా…

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా

రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలి

పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి..

ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్

 

భూపాలపల్లి నేటిధాత్రి

 

రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం విఫలమైందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోతుకు ప్రవీణ్ కుమార్ అన్నారు. బుధవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూరు నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐ ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్ల కార్డులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జోసఫ్ లు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతుందని, ఇప్పటివరకు విద్య రంగ సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారయింద ఆరోపించారు. ఇప్పటివరకు ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించలేదని, ముఖ్యంగా రాష్ట్రంలో 9000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని, పెండింగ్ బకాయలను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం దుర్మార్గమని అది సరి కాదన్నారు. ప్రభుత్వం వెంటనే విద్యా శాఖ మంత్రిని ఏర్పాటు చేసి విద్య రంగానికి అధిక నిధులు కేటాయించాలని కోరారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విద్య రంగ సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని కళాశాల హాస్టల్ భవనానికి సొంత భవనం ఏర్పాటు చేయాలని, ఎస్సీ ఎస్టీ కళాశాలల బాయ్స్ హాస్టల్ కు సొంత భవనం లు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని,వెంటనే సొంత ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసి విద్య రంగాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. లేనియెడల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలను ఉదృతం చేస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ ధర్నాకు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వేముల శ్రీకాంత్ తన సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రేణుకుంట్ల ప్రవీణ్, పోతుల పవన్, రమాకాంత్, పవన్, శ్రీనివాస్, అజయ్, సురేష్, వంశీ, కృష్ణ , నవీన్ తదితరులు పాల్గొన్నారు.

కోరికిశాల కస్తూర్బా పాఠశాలను సందర్శించిన…

కోరికిశాల కస్తూర్బా పాఠశాలను సందర్శించిన ఏఐఎస్ఎఫ్ బృందం

ఎస్ఓ ను తక్షణమే సస్పెండ్ చేయాలి
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోత్కు ప్రవీణ్ కుమార్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మొగులపల్లి మండల కేంద్రంలోని కొరికిశాల కస్తూర్బా పాఠశాలను ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్తుకు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఎస్ఓ, వర్కర్ల నిర్లక్ష్యం వల్లనే విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థకు గురై ఆసుపత్రి పాలయ్యారని తెలిపారు.
గతంలో విద్యార్థులు పలుసార్లు భోజనం బాగాలేదని, అన్నంలో పురుగులు వస్తున్నాయని ఎస్ఓ దృష్టికి తీసుకువచ్చిన ఏం మాత్రం పట్టించుకోకపోవడం వల్లనే ఈ ఘటన జరిగిందని తెలిపారు మరలా ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు తక్షణమే బాధ్యత వహించి అన్ని కస్తూర్బా పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టలను ఎమ్మెల్యే, కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులు పర్యటించాలని కోరారు.
కస్తూర్బా పాఠశాల విద్యార్థులను అడిగి వారి సమస్యలు తెలుసుకోవడం జరిగింది అని అన్నారు. వారి సమస్యలపై పోరాటాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్, జిల్లా అధ్యక్షులు రేణికుంట్ల ప్రవీణ్ దొంతర బోయిన అజయ్ రాజేష్ పవన్ రత్న రమాకాంత్ కన్నురి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version