నూతన వధూవరులను ఆశీర్వదించిన- జిల్లా గ్రంథాలయ చైర్మన్

నూతన వధూవరులను ఆశీర్వదించిన- జిల్లా గ్రంథాలయ చైర్మన్

మహదేవపూర్,  నేటిధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం మెట్ పల్లి గ్రామంలో వివాహానికి హాజరై నూతన వధూవరులను బుధవారం రోజున జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు ఆశీర్వదించారు. మండలంలోని మెట్ పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ ముల్కల శోభ రవీందర్ యొక్క అన్న కూతురు వివాహానికి హాజరై నూతన వధూ వరులైన ప్రవళిక రెడ్డి విష్ణువర్ధన్ దంపతులను ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కటకం అశోక్, మాజీ ఎంపిటిసి ఆకుతోట సుధాకర్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కోట సమ్మయ్య తోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రా న్ని ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ….

ప్రాథమిక ఆరోగ్య కేంద్రా న్ని ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ.

#ఆరోగ్య కేంద్ర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

#సిబ్బంది సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు.

#డిఎం హెచ్ ఓ సాంబశివ.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

మండలంలో ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ సాంబశివ బుధవారం ఆకస్మిక తనకి చేశారు. అనంతరం రికార్డులను, మందులను, దావకాన పరిసరాలను పరిశీలించి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని సిబ్బందిని ఆదేశించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దోమల ద్వారా విష జ్వరాలు వ్యాప్తి చెంది ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందని కావున వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించి ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉండి ప్రజలకు సరైన వైద్యం అందించాలని తెలిపారు. ప్రతి ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని మందులను అందివ్వాలి. ఆరోగ్య కేంద్ర వైద్యులు, సిబ్బంది ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు తప్పనిసరిగా ఆరోగ్య కేంద్రంలో నే అందుబాటులో ఉండాలని లేనియెడల చర్యలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆచార్య, నిఖిల, హెచ్ ఏ కృష్ణ, ఫార్మసిస్ట్ రంగారావు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తుఫాన్ ప్రభావంతో భారీ నష్టం…

తుఫాన్ ప్రభావంతో భారీ నష్టం

పొంగిపొర్లుతున్న వాగులు వంకలు

పలు గ్రామాలలోని కాలనీలలో చేరిన వరద నీరు

వేల ఎకరాలలో మునిగిన వరి పంట

#నెక్కొండ ,నేటి ధాత్రి:

 

తుఫాన్ ప్రభావంతో మండలంలోని పలు గ్రామాలలో భారీ ఎత్తున పంట నష్టం తో పాటు పలు కాలనీలలో వరద నీరు వచ్చి చేరడంతో అధికారులు, పాలకులు, అప్రమత్తమై పలు గ్రామాలను సందర్శించారు. తుఫాన్ ప్రభావంతో చేతికి వచ్చిన వరి పంట , పత్తి పంటలు తుఫాన్ దాటికి నేలకొరకగా, కొన్ని ప్రధాన రహదారులలో భారీ వృక్షాలు నేలమట్టం కావడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందికి గురిచేశాయి.

ముఖ్యంగా నెక్కొండ మండలం నుండి కేసముద్రం వెళ్లే ప్రధాన రహదారి వెంకటాపురం లో లెవెల్ కొట్టుకుపోవడంతో రాకపోకలను అధికారులు నిలిపివేశారు అదేవిధంగా నెక్కొండ నుండి గూడూరు వెళ్లే ప్రధాన రహదారిపై వట్టే వాగు ప్రభావంతో భారీగా నీరు చేరడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. తుఫాన్ ప్రభావంతో ఎస్సై మహేందర్ రెడ్డి, తాసిల్దార్ వేముల రాజకుమార్, ఎంపీడీవో లావణ్య వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పలు గ్రామాలలో వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

నాగారం గ్రామంలో నీట మునిగిన ఎస్సీ కాలనీ

నాగారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో తుఫాన్ దాటికి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో కాలనీవాసులను స్థానిక తహసిల్దార్ వేముల రాజకుమార్, నాగారం పలు పార్టీలకు చెందిన నాయకులు కాలనీవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆహారాన్ని అందించారు. అంతేకాక నాగారంలోని తుఫాన్ దాటికి ఓ భారీ వృక్షం కింద పెట్టిన పల్సర్ బైక్ పై వృక్షం కూలడంతో పల్సర్ బైక్ పూర్తిగా దగ్ధమైనట్టు తెలుస్తుంది.

ఎవరు కూడా బయటికి రావద్దు

భారీ తుఫాన్ ప్రభావంతో నెక్కొండం మండలంలోని ప్రజలు ఎవరు కూడా బయటకు రావద్దని రాబోయే 48 గంటల వరకు రెడ్ అలర్ట్ ఉన్నందున ప్రజలందరూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తంగా ఉండాలని ఎవరు కూడా బయటికి రావద్దని స్థానిక తాసిల్దార్ రాజకుమార్ ఎంపీడీవో లావణ్య, ఎస్సై మహేందర్ రెడ్డిలు తెలిపారు.

అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి..

అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి..

మిషన్ భగీరథ మంచినీటి పంపిణీ వ్యవస్థలో ఆటంకాలు తొలగించండి..

సింగూర్ డ్యాం మరమ్మత్తు సమయంలో ప్రతి గ్రామానికి మంచినీరు అందించేలా ప్రత్యేక ప్రణాళిక..

త్వరలో తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన..

పటాన్చెరు, గుమ్మడిదల మండలాల పరిధిలోని గ్రామపంచాయతీలలో నూతన అభివృద్ధి పనులకు ప్రణాళిక..

సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..

పఠాన్ చేరు, నేటి ధాత్రి :

పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని.. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు..బుధవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
పటాన్చెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువు, బండ్లగూడ పరిధిలోని దోషం చెరువులలోకి మురుగనీరు చేరకుండా చేపడుతున్న ప్రత్యేక పైప్ లైన్ పనుల పురోగతిపై చర్చించారు. క్షేత్రస్థాయిలో పైపులైన్ నిర్మాణ పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయని.. త్వరితగతిన పూర్తిచేసేలా సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆదేశించాలని జిహెచ్ఎంసి ఇరిగేషన్ విభాగం ఈఈ మల్లేష్ ను ఆదేశించారు. పటాన్చెరు సాకి చెరువు, రామచంద్రాపురం రాయసముద్రం చెరువుల సుందరీకరణ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. నిధుల అంశంలో ఇబ్బందులు తలెత్తితే తన దృష్టికి తీసుకొని రావాలని.. ఉన్నతాధికారులతో చర్చించి నిధులు మంజూరు చేయిస్తానని అధికారులకు సూచించారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని పోచారం రెవిన్యూ పరిధిలో పాలిటెక్నిక్ కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాలకు త్వరలోనే భూమి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయబోతుందని తెలిపారు. భవనాల నిర్మాణాలకు సైతం నిధులు కొరత లేకుండా చూస్తున్నామని తెలిపారు.
నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిలో మిషన్ భగీరథ ద్వారా అందిస్తున్న మంచినీటి పంపిణీ అంశంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని..ప్రజల నుండి ఫిర్యాదులు అందుతున్నాయని సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారి విభాగం అధికారులతో సమన్వయం చేసుకుంటూ మంచినీటి పంపిణీ అంశంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ ఎస్ ఈ రఘువీర్ ను ఆదేశించారు. పరిశ్రమలకు మంచినీరు అందించడం ఎంత ముఖ్యమో.. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా మంచినీటి అందించడం అంతకంటే ప్రాధాన్యత అంశమని తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఏర్పాటు అవుతున్న కాలనీలకు సైతం మంచినీటిని అందించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మంచినీటి పంపిణీ అంశంలో అలసత్వం వహిస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులను హెచ్చరించారు. వచ్చేనెల 10వ తేదీ లోపు పంపిణీ అంశంలో గల ఇబ్బందులు పూర్తిస్థాయిలో తొలగిస్తామని సంబంధిత అధికారులు ఎమ్మెల్యే జిఎంఆర్ కు తెలిపారు.

 

Mission Bhagiratha

డిసెంబర్ నెల నుండి సింగూర్ డ్యాం మరమ్మత్తులు చేపడుతున్న సందర్భంగా సంవత్సరం పాటు మంచినీటి పంపిణీ ఆపివేయడం జరుగుతుందని సంబంధిత అధికారులు ఎమ్మెల్యే జిఎంఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సింగూరు ద్వారా పంపిణీ జరుగుతున్న గ్రామాలు, పట్టణాలు, డివిజన్ల పరిధిలో మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే సంబంధిత ఉన్నత అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పటాన్చెరు మండల పరిధిలోని భానూరు, క్యాసారం, నందిగామ, గుమ్మడిదల మండల పరిధిలోని అనంతారం, కానుకుంట, కొత్తపల్లి, మంబాపూర్, నాగిరెడ్డిగూడెం, నల్లవల్లి, రామిరెడ్డి బావి, వీరారెడ్డిపల్లి, తదితర గ్రామాల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను సంబంధిత ఎంపీడీవోలు, కార్యదర్శులతో చర్చించారు. గ్రామ పంచాయతీల పరిధిలో నిధులు కొరత మూలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సంబంధిత కార్యదర్శులు ఎమ్మెల్యే జిఎంఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం అందించే నిధులతోపాటు సి ఎస్ ఆర్ నిధులను అభివృద్ధి పనులకు కేటాయించనున్నట్లు తెలిపారు. ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా మంజూరైన నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేయాలని కోరారు. గుమ్మడిదల నుండి కానుకుంట మీదుగా నూతనకల్ వరకు రహదారి నిర్మాణ పనులను అతి త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. నూతన అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తిస్థాయి నివేదికలు సిద్ధం చేయాలని.. ప్రభుత్వంతో చర్చించి నిధులు కేటాయిస్తానని తెలిపారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కర్దనూరు, ఘనాపూర్, వెలిమెల, కొల్లూరు, తెల్లాపూర్, ఉస్మాన్ నగర్ పరిధిలో 6 కోట్ల 80 లక్షల రూపాయలతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు వచ్చే వారంలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీల పరిధిలో విలీనమైన గ్రామాలలో ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.
అభివృద్ధి పనుల్లో లసత్వం వహించవద్దని.. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అమీన్పూర్ మాజీ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, పటాన్చెరు ఎమ్మార్వో రంగారావు, పటాన్చెరు ఎంపీడీవో యాదగిరి, గుమ్మడిదల ఎంపీడీవో ఉమాదేవి, తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ అజయ్ రెడ్డి, మిషన్ భగీరథ ఈఈ విజయ లక్ష్మి, డీఈలు హరీష్, శ్రీనివాస్, ఏఈ మౌనిక, గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

తుఫాన్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…..

తుఫాన్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

#అధికారులు,కాంగ్రెస్ నేతలు ప్రజలకు అండగా నిలవాలని ఎమ్మెల్యే నాయిని విజ్ఞప్తి..

#మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా హనుమకొండ నగరంలో వరద పరిస్థితి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

హన్మకొండ, నేటిధాత్రి:

 

నగరంలో చాలా చోట్ల వరద ప్రవాహం కన్పిస్తుంది..
టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేసి ఎప్పటికప్పుడూ సమాచారం ఇవ్వండి..
కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయక చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే నాయిని పిలుపు…
సహాయక చర్యల కోసం టోల్ ఫ్రీ నెంబర్స్ :
1800 4251115
18004251980

డిగ్రీ ఫీజుల తేదీ పొడిగించాలని పి డి ఎస్ యూ డిమాండ్…

డిగ్రీ ఫీజుల తేదీ పొడిగించాలని పి డి ఎస్ యూ డిమాండ్

జైపూర్,నేటి ధాత్రి:

 

మంచిర్యాల జిల్లా చెన్నూర్ డిగ్రీ కళాశాలలో పి డి ఎస్ యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థుల ఫీజుల తేదీలను పెంచాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా పి డి ఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షుడు సికిందర్ మాట్లాడుతూ…
కాకతీయ యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల ఫీజులు నేటితో ముగియడంతో మిగతా విద్యార్థులు ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఇబ్బందులు పడే పరిస్థితి ఉందన్నారు.బడుగు, బలహీన,వర్గాల విద్యార్థులు చదువుకు దూరం అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే డిగ్రీ విద్యార్థుల ఫీజుల తేదీలను పొడిగించి విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం గా డిమాండ్ చేస్తున్నమన్నారు.ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ జిల్లా నాయకులు జి.అంజి,అసిఫ్, విజయ్,జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.

పట్టణంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పురపాలక కమిషనర్ ఆదేశాలు.

పట్టణంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పురపాలక కమిషనర్ ఆదేశాలు.

కల్వకుర్తి, నేటిధాత్రి:

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణములోని పలు కాలనీలను సందర్శించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన పుర పాలక కమీషనర్ మహెముద్ షేక్ పట్టణంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తున్నందున పలు కాలనీలు వార్డులలో అనగా విద్యానగర్ కాలనీలో,గాంధీనగర్ కాలనీ లో, ఎల్లికల్ రోడ్డు నందు పర్యటించి సిబ్బందికి సూచనలు చేయడం జరిగింది. ఇట్టి విషయంలో పట్టణంలో భారీ వర్షం కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలను కోరడం జరిగింది. పట్టణ పరిధిలో తాత్కాలిక నిర్మాణాలు లేదా పాడుబడ్డ భవనాలకు,విద్యుత్ స్తంబాలకు,పరికరాలకు దూరంగా ఉండాలని, కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లలో ఉండకూడదని ప్రజలకు సూచించడం జరిగింది. ప్రజలకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే పురపాలక సంఘంఅత్యవసర టీంలకు ఫోన్ ద్వారా సంప్రదించాలని తెలియజేయడం జరిగింది.1. రంగన్న, సానిటరీ ఇన్స్పెక్టర్ 905954909,శివ, EE, 8184893646,3. యం. రాజు, జవాన్, 8341953311,4. B. శ్రీకాంత్, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ 9494271888,5. అందరూ పారిశుధ్య జవాన్లుఅదేవిదంగా భారీ వర్షం కురుస్తున్నందున పుర పాలక సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని సిబ్బందికి సూచించడం జరిగింది.

మనీషా ఇండియన్ ఆధ్వర్యంలో ఉచిత గ్యాస్ కనెక్షన్ ప్రారంభం…

మనీషా ఇండియన్ ఆధ్వర్యంలో ఉచిత గ్యాస్ కనెక్షన్ ప్రారంభం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలంలోని ఆయా గ్రామాల లోని గ్యాస్కనెక్షన్ లేని వినియెగదారులు ఉజ్వల పథకం కింద ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ప్రభుత్వం అందిస్తుంది అని అల్ ఇండియా అంబేద్కర్ యువజన సంగం సభ్యులు చెల్మెడ అనిల్ కుమార్ అని అన్నారు. అనిల్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటివరకు రేషన్ కార్డు పై గ్యాస్ కనెక్షన్ లేని వాళ్ళు అర్హులని మనీషా ఇండియన్ గ్యాస్ యాజమాన్యం తెలపడం జరిగిందన్నారు .ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అప్లికేషన్ చేసుకోవలసిన అర్హత వివరాలు రేషన్ కార్డు లో ఉన్న మహిళ అభ్యర్థుల పేరు పై అయినా అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నారు. కావలసిన పత్రాలు (డాక్యుమెంట్)వివరాలు ముందుగా రేషన్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు లో ఉన్న సభ్యుల అందరివి ఆధార్ కార్డ్ జీరాక్స్, బ్యాంకు అకౌంట్ జీరాక్స్, అప్లికేషన్ కలిగిన వారి ఒక ఫోటో ఇవ్వగలరని తెలియజేయడం జరిగింది.ఇంతకు ముందు రేషన్ కార్డు లో ఉన్న సభ్యుల ఏ ఒక్కరికి పై కూడా ఎక్కడ కూడా గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు అని అప్లికేషన్ ఫారం తో అన్ని పత్రాలు జత చేసి కోహీర్ మనీషా ఇండియన్ గ్యాస్ ఆఫీస్ లో ఇవ్వగలరు అని తెలిపారు.

ఆయిల్ ఫామ్ విత్తన సాగు…

ఆయిల్ ఫామ్ విత్తన సాగు
ప్రారంభించిన జిల్లా వ్యవసాయ అధికారులు..

నిజాంపేట, నేటిధాత్రి:

 

ఆయిల్ ఫామ్ రిసోర్సెస్, ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ విత్తన సాగు నర్సరీ ని ప్రారంభించడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో ఆయిల్ ఫామ్ విత్తన సాగును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్, జిల్లా ఉద్యానవన అధికారి ప్రతాప్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో రైతులు ఆయిల్ ఫామ్ పంటపై ఆసక్తి చూపడం ఆనందకరంగ ఉందన్నారు. రైతులు వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్ సాగు చేయడం ద్వారా అధిక ఆదాయన్నీ పొందవచ్చని సూచించారు. తక్కువ నీటి వినియోగంతో అధిక లాభాలను ఈ పంట ఇస్తుందన్నారు. జిల్లాలో పంట విస్తరణకు కావాల్సిన నాణ్యమైన మొక్కలను స్థానిక స్థాయిలో పెంచడమే ఈ నర్సరీ లక్ష్యమని పేర్కొన్నారు.జిల్లా ఉద్యాన అధికారి మాట్లాడుతూ.. చల్మెడ గ్రామంలో 45 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ నర్సరీ ద్వారా మెదక్ జిల్లాకు నాలుగు లక్షల నాణ్యమైన మొక్కలను అందించడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. మొదటి విడత లక్ష విత్తనాలు నాటుటకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. వచ్చే సంవత్సరం రైతుల పొలాల్లో నాటేందుకు సిద్ధమవుతాయన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు వినయ్ విన్సెంట్, రాజ్ నారాయణ, ఏఈఓ లు శ్రీలత, మౌనిక, రమ్య, రైతులు ఉన్నారు.

డైరీ వ్యర్థలతో కలుషితమైన చెరువులు..

డైరీ వ్యర్థలతో కలుషితమైన చెరువులు..

*రసాయనాల దెబ్బతో మృతి చెందిన చేపలు, పాములు..

*ఆందోళనలో పసుపత్తూరు పంచాయతీ వాసులు..

*తక్షణం స్పందించి చెరువులను పరిశీలించిన ఎమ్మెల్యే అమర్..

*వెంటనే సమస్య పరిష్కారం కావాడమే గాక బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు..

*పంచాయతీ ప్రజలు అప్రమత్తతో ఉండాలని విజ్ఞప్తి..

పలమనేరు(నేటిధాత్రి)అక్టోబర్ 29:

 

 

గంగవరం మండలంలోని ఒక ప్రైవేటు డైరీ కారణంగా పలు చెరువులు కలుషితంగా మారాయి.ఆ డైరీ నుంచి వెలువడే రసాయనలతో కూడిన కలుషిత నీరు చెరువులకు చేరడంతో చేపలు మరియు పాములు మృతి చెందాయి. దీంతో విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తక్షణమే స్పందించి బుధవారం గంగవరం మండలం పసుపత్తూరు పంచాయతీలోని చెరువులను మండల నాయకులు, అధికారులతో కలసి పరిశీలించారు. ఇక్కడ ఇండస్ట్రియల్ ప్రాంతంలోని ఫామ్ గెట్ డైరీ వ్యర్థాల కారణంగా వనపకుంట, తూము గుంట, కమ్మ వాళ్ళ కుంట చెరువులలో నీరు కలుషితమై చేపలు మృతి చెందినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీంతో అధికారుల అలసత్వంపై తీవ్ర అగ్రహానికి గురైన ఆయన వారిని అప్రమత్తం చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెరువులలో కలుషితమైన నీటిని ప్రజలు వినియోగించకుండా చూడాలని అదేవిధంగా పశువులు ఇతర జంతువులు నీటిని తాగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక అదే విధంగా చెరువులలో నీరు కలుషితం కావడానికి కారణమైన బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని పొల్యూషన్ కంట్రోల్, ఫిషరీస్ రెవిన్యూ మరియు ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు. మరోవైపు ఇప్పటిదాకా జరిగిన నష్టాన్ని అంచనా వేసి బాధ్యుల నుంచి రాబట్టాలని అధికారులకు తెలిపారు. భవిష్యత్తులో తిరిగి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మరో వైపు చెరువు కట్టలు, సప్లై ఛానల్ కు సంబంధించి వివరాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. సమస్యను అధికారులు త్వరగా పరిష్కరిస్తారని అంతవరకు పంచాయతీ వాసులు కలుషితమైన నీటిని వాడకుండా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన వారిని కోరారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న,
తహసిల్దార్ రేఖా రెడ్డి, ఇరిగేషన్ డిఈ చొక్లా నాయక్, ఏఈ లక్ష్మీనారాయణ, సర్వేయర్ రవి,అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీష్ పయనిలతో పాటు గంగవరం మండల నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, సోమశేఖర్ గౌడ్,ప్రతాప్ రెడ్డి,ప్రసాద్ నాయుడు, భాస్కర్ రెడ్డి,గిరిధర్ గోపాల్, సోము, శేఖర్,రెడ్డప్ప, శీన, హేమగిరి తదితరులున్నారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన నాగుర్ల.

నూతన వధూవరులను ఆశీర్వదించిన నాగుర్ల

నడికూడ,నేటిధాత్రి:

 

మండలంలోని నర్సక్కపల్లె గ్రామానికి చెందిన కేశిరెడ్డి సాంబరెడ్డి సరిత దంపతుల కుమార్తె నిధిరెడ్డి చిరంజీవి ఓం ప్రకాష్ రెడ్డి వారి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు వీరి వెంట ఈ కార్యక్రమంలో బీ ఆర్ఎస్ నాయకులు నాగుర్ల సంతోష్ రావు,బొంపల్లి నేతాజీ మోహన్ రావు, శివాజీ తదితరులు పాల్గొన్నారు.

పత్తి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి….

పత్తి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

అకాల వర్షాలకు చేతికి వచ్చిన పత్తి పంట తీవ్రంగా దెబ్బతిని రైతులకు విపరీత మైన నష్టం వాటిల్లిందని ఝరాసంగం మండల జిర్లపల్లి గ్రామ బి. ఆర్.. ఎస్. సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి అన్నారు ప్రభుత్వం వెంటనే ఎకరాకు ముప్పై వేల నష్ట పరిహారం అందించాలని అలాగే యాసంగి రైతు బంధు వెంటనే విడుదల చేయాలని ఋణ మాఫీ కాక మిగిలిన రైతులకు వెంటనే ఋణ మాఫీ చేయాలని కోరారు లేని పక్షంలో రైతుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదు అని హెచ్చరించారు,

గుర్తు తెలియని వ్యక్తి మృతి…

గుర్తు తెలియని వ్యక్తి మృతి

జమ్మికుంట, నేటి ధాత్రి:

ఉప్పల్ -జమ్మికుంట రైల్వే స్టేషన్ల మధ్య భీంపల్లి గ్రామ సమీపంలో రైలు పట్టాల ప్రక్కన సిమెంట్ కాలువలో గుర్తు తెలియని వ్యక్తి వయస్సు సుమారు 30-35 సంవత్సరాలు బహుశా ఎదో రైలు బండి నుండీ క్రింద పడగ చనిపోయి ఉంటాడు. మృతుడు నవీ బ్లూ ఫుల్ టీ షర్ట్, నవీ బ్లూ లోయర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు మృతుని వద్ద ఏపీఎస్ ఆర్టిసి బస్సు టికెట్ గుడివాడ నుండి విజయవాడ కలదు. అతని వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు గాని వస్తువులు గాని లేవు. శవాన్ని ప్రభుత్వ హాస్పిటల్ జమ్మికుంట మార్చరీ లో భద్రపర్చానైనది. ఇట్టి కేసును జి. తిరుపతి ప్రభుత్వ రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రామగుండం పరిశోదన చేయుచున్నాను ఏమైనా వివరాలు తెలిసినచో ఫోన్ నెంబర్ 9949304574, 8712658604 కి సమాచారం ఇవ్వగలరని కోరారు.

విద్యాశాఖ డైరెక్టర్తో వినయ్ పవర్ భేటీ, పాఠశాలల్లో సౌకర్యాలపై చర్చ…

విద్యాశాఖ డైరెక్టర్తో వినయ్ పవర్ భేటీ, పాఠశాలల్లో సౌకర్యాలపై చర్చ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ నవీన్ నికోలాస్, ఐ.ఏ.ఎస్. గారిని ఏఐటిఎఫ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎన్ హెచ్ ఆర్ సి సంగారెడ్డి జిల్లా చైర్మన్ వినయ్ పవర్ హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సమస్యలు, మరుగుదొడ్ల లేమి వంటి మౌలిక సదుపాయాల కొరతపై వారు చర్చించారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించాలని, క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని వినయ్ పవర్ కోరారు. దీనిపై స్పందించిన విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలాస్, నవంబర్ మొదటి వారంలో జహీరాబాద్ను సందర్శించి, పాఠశాలల్లో సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

మున్సిపాలిటీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

మున్సిపాలిటీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఆపదరాకుండా అందుబాటులో రెస్క్యు టీమ్ ఏర్పాటు

పరకాల మున్సిపాలిటీ కమిషనర్ కడారి.సుస్మ

పరకాల,నేటిధాత్రి:

మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా వాతావరణ శాఖ అందించిన సూచనల మేరకు మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పురపాలక కార్యాలయం నుండి రెస్క్యు టీమ్ ను ఏర్పాటు చేసినట్టు కమిషనర్ కడారి.సుష్మ తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ చెట్ల క్రింది,అలాగే పురాతన శిధిల గృహలలో నివసించే వారు తమ ఇరుగు పొరుగు వారి గృహాలలోకి గాని బంధు మిత్రుల గృహాలలోకి గాని వెళ్లి ఉండాలని సూచించారు.ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైనా 9676166101,7100537570,9177557767,955062997,7386881788 గల నెంబర్లకు సమాచారం అందించాలన్నారు.

మూలన పడిన కరోనా కాలపు యంత్రాలు…

మూలన పడిన కరోనా కాలపు యంత్రాలు

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

కరోనా మహమ్మారి రోజుల్లో ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, బ్యాంకులు, విద్యాసంస్థలు ఇలా ఎక్కడ చూసినా చేతులు శుభ్రం చేసుకునేలా ఏర్పాటు చేసిన సానిటైజర్ డిస్పెన్సర్ యంత్రాలు ఇప్పుడు మూలన మట్టి పేరుకుపోయేలా పడి ఉన్నాయి.
ఆ రోజుల్లో వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా ఉండేవారు. చేతులు శుభ్రం చేసుకోవడం అనేది రోజువారీ అలవాటుగా మారింది. కాలితో నొక్కితే ద్రవ సానిటైజర్ వచ్చే ఆ యంత్రాలు అప్పట్లో ఆరోగ్య భద్రతకు చిహ్నంగా నిలిచాయి.
కానీ ఇప్పుడు కరోనా మాయం కావడంతో, ఆ పరికరాలు ఎవరి దృష్టికీ చిక్కకుండా మూలల్లో మిగిలిపోయాయి. చాలా చోట్ల అవి తుప్పుపట్టిపోయి, విరిగి, పనికిరానివిగా మారాయి. కొంతమంది ప్రజలు ఇవి తిరిగి ఉపయోగపడేలా ప్రజా మరుగుదొడ్లు, పాఠశాలలు, ఆసుపత్రుల్లో ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.
పరిశుభ్రత అనే అలవాటు కేవలం మహమ్మారి సమయంలోనే కాదు, ప్రతి రోజూ ఉండాలనే ఆవశ్యకతను గుర్తు చేస్తూ ఈ యంత్రాలు మన సామాజిక నిర్లక్ష్యానికి నిదర్శనాలుగా మారాయి

ఎల్లమ్మ తల్లి ఆలయం ముఖద్వారం నిర్మాణానికి భూమిపూజ…

ఎల్లమ్మ తల్లి ఆలయం ముఖద్వారం నిర్మాణానికి భూమిపూజ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గంలోని ఎల్లమ్మ తల్లి
ఆలయంలో కొత్త ముఖద్వారం నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.గ్రామస్తులు ఆలయం అభివృద్ధి కోసం ముందుకు వచ్చి స్వచ్చందంగా విరాళాలు అందించారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ “ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామానికి శాంతి, సౌభాగ్యం కలగాలని కోరుకుంటున్నాం. ఈ ముఖద్వారం నిర్మాణం ద్వారా ఆలయానికి మరింత గౌరవం పెరుగుతుంది” అన్నారు. యువత కూడా ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని భక్తి భావంతో పూజలు నిర్వహించారు. గ్రామం మొత్తం పండుగ వాతావరణంలో మునిగిపోయింది.

జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం..

జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం 

మహాదేవపూర్, నేటిధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలకేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్.ఎస్.ఎస్.పిఓ డి.రమేష్ ఆధ్వర్యంలో 50 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ తోబేగ్లూర్ గ్రామంలో ఏడు రోజుల ప్రత్యేక శిబిరం ఎన్ఎస్ఎస్ ను ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ప్రముఖులందరూ విద్యార్థి దశలోనే సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మంచి పౌరులుగా మంచి విద్యా వేతలుగా తీర్చిదిద్దుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ఎస్ ఎస్ఎస్పీఓ ఏడు రోజులు ఈ గ్రామంలో హరితహారం మెడికల్ క్యాంపు స్వచ్ఛభారత్ పరిసరాల పరిశుభ్రత ఫ్రైడే సర్వే ఓటర్స్ డే ర్యాలీ పలు రకాలైనటువంటి సేవ కార్యక్రమాలను నిర్వహిస్తారని ఈ ఏడు రోజుల శిబిరంనీ ఉద్దేశిస్తూ వాలంటరీస్ కి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మొదటిరోజులో భాగంగా మొక్కలు నాటడం జరిగింది . ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నరసయ్య కోపరేటివ్ చైర్మన్ చల్లా తిరుపతిరెడ్డి మాజీ ఎంపీపీ రాణి బాయి మహాదేవపూర్ ఎంఈఓ ప్రకాష్ కాంప్లెక్స్ హెచ్ఎం పురుషోత్తం రెడ్డి మాజీ ఎంపిటిసి పద్మ ఓదెలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కళాశాల అధ్యాపకులు సమ్మయ్య కర్ణ ప్రకాష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కటకం అశోక్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది

ఫీజు రియంబర్మెంట్ వెంటనే విడుదల చేయాలి

ఫీజు రియంబర్మెంట్ వెంటనే విడుదల చేయాలి

బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టర్ ముట్టడి.

జమ్మికుంట,( కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి:

 

జమ్మికుంట నుండి వంద మంది విద్యార్థులు హలో విద్యార్థి చలో కలెక్టరేట్ విద్యార్థులు ఫీజు రీయంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని జిల్లా వ్యాప్తంగా 800 మంది విద్యార్థులతో కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగినది ముట్టడిలో భాగంగా పోలీసులకు విద్యార్థి నాయకులకు విద్యార్థులతో తోపులాట జరిగినది కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం జరిగినది సిటీ పోలీస్ స్టేషన్ ట్రైనింగ్ సెంటర్ కి తరలించడం జరిగినది మీరు ఎన్ని అక్రమ అరెస్టులు కేసులు చేసిన విద్యార్థులకు ఇచ్చిన హామీలు మరియు ఫీజు రీయంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి లేనియెడల మరో ధర్నాలు రాస్తారోకోలు చేయడనికైనా సిద్ధం హెచ్చరించడం జరిగినది ఈ కార్యక్రమంలో జమ్మికుంట బిఆర్ఎస్వి పట్టణ అధ్యక్షులు కొమ్ము నరేష్ ,ఆవుల తిరుపతి, జవాజీ అనిల్, వొల్లాల శ్రీకాంత్ , నల్లగాశ హరీష్ యాదవ్,చింతల కౌశిక్, వెనిశెట్టి నాగరాజు, నరిండ్ల శివ భాస్కర్

తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండండి…

తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండండి…

– ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రణవ్ సూచన

– ఐకెపి,ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు..

హుజురాబాద్, నేటి ధాత్రి:

రాష్ట్రానికి మొంథా తుఫాను ప్రభావం మరో రెండు రోజులు ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో,చలి గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని దీని దృష్ట్యా హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని,ముఖ్యంగా ఇది వరి కోతల సమయం కాబట్టి పత్తి,వరి రైతులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెప్పే సూచనలను పాటించి జాగ్రత్తలు తీసుకోవాలని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ బాబు ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ మేరకు ధాన్యం కొనుగోలు విషయంలో త్వరితగతిన పూర్తి చేయాలని రైతులకు ఇబ్బంది కలగకుండా టార్ఫలిన్ కవర్లు అందించాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version