హుజురాబాద్ లో మెగా జాబ్ మేళా విజయవంతం
హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో
జమ్మికుంట (నేటిధాత్రి)
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని సిటీ సెంట్రల్ హాల్లో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది నియోజకవర్గం నలుమూలల నుండి యువత పాల్గొన్నారు ప్రతి గ్రామంలో తెలిసే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు 85 మల్టీ నేషనల్ కంపెనీలు పాల్గొన్నాయి దాదాపు 5000 మంది నిరుద్యోగులు టెన్త్ ఇంటర్ బిటెక్ ఎంటెక్ పీజీ విద్యార్థులు హాజరయ్యారు ఇందులో భాగంగా 3000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు జాబ్ మేళాకు వచ్చిన నిరుద్యోగ అభ్యర్థులకు భోజన వసతిని ఏర్పాటు చేశామని తెలిపారు