విహారయాత్రలో విషాదం.. కృష్ణా నదిలో కూకట్‌పల్లి యువకుడి గల్లంతు…

విహారయాత్రలో విషాదం.. కృష్ణా నదిలో కూకట్‌పల్లి యువకుడి గల్లంతు

విహారయాత్రకు వెళ్లిన యువకుడు కృష్ణా నదిలో ఈతకు దిగి గల్లంతయ్యాడు. మంగళవారం మధ్యాహ్నం నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్‌ పైలాన్‌ కాలనీ కొత్త వంతెన దిగువన ఉన్న ఆంజనేయస్వామి పుష్కర ఘాట్‌ వద్ద ఈ ఘటన జరిగింది.

 విహారయాత్రకు వెళ్లిన యువకుడు కృష్ణా నదిలో ఈతకు దిగి గల్లంతయ్యాడు. మంగళవారం మధ్యాహ్నం నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్‌(Nagarjuna Sagar) పైలాన్‌ కాలనీ కొత్త వంతెన దిగువన ఉన్న ఆంజనేయస్వామి పుష్కర ఘాట్‌ వద్ద ఈ ఘటన జరిగింది. సాగర్‌ సీఐ శ్రీనునాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి(Kukatpally)కి చెందిన జ్ఞానేందర్‌, సుమన్‌, మణికంఠ, వెంకటేష్‌, హర్షవర్ధన్‌, చాణుక్య ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. సాగర్‌ సందర్శన నిమిత్తం మంగళవారం రెండు ద్విచక్రవాహనాలపై సాగర్‌కు చేరుకున్నారు. ప్రధాన డ్యామ్‌కు దిగువన ఉన్న పుష్కర ఘాట్‌ వద్ద ఈత కొట్టేందుకు నీటిలోకి దిగారు.

రామకృష్ణ గౌడ్ ను పరామర్శించిన ప్రజా సంఘాల నాయకులు….

రామకృష్ణ గౌడ్ ను పరామర్శించిన ప్రజా సంఘాల నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

టేకుమట్ల మండల బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం మండల అధ్యక్షులు నేరెళ్ల రామకృష్ణ దంపతులు ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంపై నుండి కిందపడి గాయాలు కాగా వారిని ఎమ్మార్పీఎస్ టిఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ, సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్, అంబేద్కర్ యువజన సంఘం నియోజకవర్గ కన్వినర్ అరకొండ రాజయ్యలు పరామర్శించి వారికి మనోదైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంబాల రమేష్, మాజీ సర్పంచ్ నేరెళ్ల చేరాలు తదితరులు పాల్గొన్నారు..

మద్యం మత్తులో నీటిలో మునిగి వ్యక్తి మృతి..

మద్యం మత్తులో నీటిలో మునిగి వ్యక్తి మృతి..

ఓదెల (పెద్దపెల్లి జిల్లా)నేటిధాత్రి:

 

 

ఓదెల మండలం గుంపుల మానేరు వాగులో మద్యం మత్తులో మునిగి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన ఎస్సై దీకొండ రమేష్ ఎస్సై చెప్పిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం రాచపల్లి గ్రామానికి చెందిన ఆరెళ్ళి రవీందర్ (51) హమాలీ వృత్తి చేస్తున్న రవీందర్ తరచుగా మద్యం సేవించి కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడని పోలీసులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం కూడా మద్యం సేవించి ఇంటికి రావడంతో భార్య, కుమారుడు మందలించగా గుంపులలో గల రామభద్ర ఆలయ సమీపానికి వెళ్లాడు. అనంతరం తన కుమారుడికి ఫోన్ చేసి అక్కడ ఉన్నానని తెలిపాడు. కుమారుడు దిలీప్, బంధువు రాజు అక్కడికి చేరుకోగా ఒడ్డున బట్టలు ఉండగా, రవీందర్ నీటిలో కనిపించాడు. బయటకు రావాలని కుమారుడు పిలవగా ప్రమాదవశాత్తు లోతైన నీటిలో కొట్టుకుపోయాడు. వెంటనే కుమారుడు బయటకు తీసుకురాగా అప్పటికే స్పృహ తప్పి ఉండడంతో 108 అంబులెన్స్ ద్వారా జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు మృతి చెందాడని ధృవీకరించారు. ఈ ఘటనపై దిలీప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ తెలిపారు.

గౌడ వృత్తి దిన దిన గండం ఆగని చావులు…

గౌడ వృత్తి దిన దిన గండం ఆగని చావులు
తాండూరు( మంచిర్యాల) నేటి ధాత్రి :

 

 

గౌడ కులస్తుల జీవనం రోజు రోజుకు మరి అధ్వనంగా మారుతుంది.ప్రభుత్వం గీతా కార్మికులకు ఇస్తామన్న కాటమయ్య కిట్లు అందక పోవడం వల్ల తరచూ గీత కార్మికులు ప్రమాదల బారిన పడుతున్నమన్నారు.శనివారం ఉదయం బెల్లంపల్లి మండలం లోని మాలా గురుజాల లో పోతుగంటి శంకర్ గౌడ్ అనే గీతా కార్మికుడు ఉదయం చెట్టు ఎక్కి కళ్ళు కిందకి దింపే క్రమంలో కాలుజారి బురదలో పడి మృతి చెందినట్లు తోటి గీతా కార్మికులు తెలిపారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హులైన గీత కార్మికులకు వెంటనే కాటమయ్య కిట్లు పంపిణీ చేయాలని,చనిపోయిన శంకర్ గౌడ్ కుటుంబానికి 10లక్షల రూపాయల ఎక్స్ క్రేషియా ఇవ్వాలని మోకు దెబ్బ రాష్ట్ర అధికార ప్రతినిధి భూసరపు మొండిగౌడ్ డిమాండ్ చేస్తున్నారు.ఈకార్యక్రమంలోమోకు దెబ్బ రాష్ట్ర అధికార ప్రతినిధి భూసారపు మొండి గౌడ్,రాష్ట్ర నాయకులు తాళ్లపల్లి శంకర్ గౌడ్,జిల్లా అధికార ప్రతినిధి పెరు మండ్ల భాస్కర్ గౌడ్,జిల్లా కార్యదర్శి గాజుల రమేష్ గౌడ్,యువ నాయకులు తాళ్లపల్లి సృజన్ గౌడ్ పాల్గొన్నారు.

దున్నపోతు హింస.. తక్షణ శాస్తి అనుభవించిన యువకులు…

మూగజీవి కదా అని హింసిస్తే ఇలాగే అవుతుంది.. ఈ దున్నపోతు ఏం చేసిందంటే..

కొందరు ఎద్దుల బండికి దున్నపోతులు కట్టి పందేలు పెట్టారు. ఓ బండిలో ఐదుగురు యువకులు కూర్చుని.. వేగంగా వెళ్లాలనే ఉద్దేశంతో దున్నపోతును పదే పదే ముళ్లు కర్రతో పొడుస్తున్నారు. ఇలా వెళ్తున్న క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..

మూగ జీవాలను హింసించడం పాపం, నేరం అని తెలిసినా కొందరు కావాలనే పదే పదే వాటిని టార్చర్ చేస్తుంటారు. ఇంకొందరు అవి బాధపడుతుంటే చూసి శునకానందం పొందుతుంటారు. అయితే చేసిన కర్మ వెనువెంటనే వెంటాడుతుందనే విషయం వారికి ఆ సమయంలో తెలీదు. తీరా తగిన శాస్తి జరిగాక కానీ అసలు విషయం అర్థం కాదు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. దున్నపోతును హింసించిన యువకులకు చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు ఎద్దుల బండికి దున్నపోతులు కట్టి పోటీలు పెట్టారు. ఓ బండిలో ఐదుగురు యువకులు కూర్చుని.. వేగంగా వెళ్లాలనే ఉద్దేశంతో దున్నపోతును (Buffalo) పదే పదే ముళ్లు కర్రతో పొడుస్తున్నారు. ఇలా బండిలో ముందు వైపు కూర్చున్న ఇద్దరు వ్యక్తులు.. చేతిలో కర్రలు పట్టుకుని దున్నపోతను కొడుతూనే ఉన్నారు.

ఇలా కొంత దూరం వెళ్లాక.. ఉన్నట్టుండి (Youths tortured buffalo with stick) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నేరుగా వెళ్లాల్సిన ఎద్దు కాస్తా.. రోడ్డుకు అవతలి వైపునకు తిరుగుతుంది. ఈ క్రమంలో టైరు డివైడర్ ఎక్కడంతో బండి బోల్తా కొడుతుంది. దీంతో బండిపై కూర్చొన్న వారంతా ఎగిరి దూరంగా పడిపోతారు. కట్లు తెగిపోవడంతో దున్నపోతు అక్కడి నుంచి పారిపోతుంది. కింద పడ్డ యువకులు.. వామ్మో.. వాయ్యో.. అనుకుంటూ మూలుగుతుంటారు.

ఇలా దున్నపోతును హింసించబోయి.. చివరకు ఈ విధంగా శిక్ష అనుభవించిన వీరిని చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘మూగజీవాలను ఇబ్బంది పెడితే ఇలాగే అవుతుంది’.. అంటూ కొందరు, ‘తగిన శాస్తి జరిగింది.. ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు చేయరు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1300కి పైగా లైక్‌లు, 57 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

వినాయక నిమజ్జన విధుల్లో అపశృతి.. ఏం జరిగిందంటే..

వినాయక నిమజ్జన విధుల్లో అపశృతి.. ఏం జరిగిందంటే..

 

 

 

వినాయక నిమజ్జన విధుల్లో అపశృతి చోటుచేసుకుంది. టస్కర్ వాహనం కిందపడి జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందారు. గత 15 ఏళ్లుగా జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా గుడిమల్కాపూర్‌కు చెందిన రేణుక పని చేస్తున్నారు.

వినాయక నిమజ్జన విధుల్లో (Ganesh immersion Duties) అపశృతి చోటుచేసుకుంది. టస్కర్ వాహనం కిందపడి జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందారు. గత 15 ఏళ్లుగా జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్నారు గుడిమల్కాపూర్‌కు చెందిన రేణుక. ఇవాళ(ఆదివారం) ఉదయం బషీర్ బాగ్ నుంచి లిబర్టీ వెళ్లే మార్గంలో విధులు నిర్వహిస్తున్నారు రేణుక.

ఈ క్రమంలో రోడ్డును దాటేందుకు యత్నించారు మృతురాలు. అదే సమయంలో రేణుకను బలంగా ఢీ కొట్టింది బషీర్ బాగ్ నుంచి వస్తున్న వినాయకుడు ఉన్న టస్కర్ వాహనం. దీంతో ఆమె తలకు బలమైన గాయం కావడంతో హుటాహుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రేణుక మృతి చెందినట్లు తెలిపారు వైద్యులు.

టస్కర్ వాహనం డ్రైవర్ గజానంద్‌ను సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ గజానంద్‌‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. రేణుక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రేణుక మృతి పట్ల జీహెచ్ఎంసీ అధికారులు, కార్మికులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని కార్మికులు కోరారు.

వినాయక నిమజ్జన విధుల్లో అపశృతి.. ఏం జరిగిందంటే..

వినాయక నిమజ్జన విధుల్లో అపశృతి.. ఏం జరిగిందంటే..

 

 

 

వినాయక నిమజ్జన విధుల్లో అపశృతి చోటుచేసుకుంది. టస్కర్ వాహనం కిందపడి పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందారు. గత 15 ఏళ్లుగా జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా గుడిమల్కాపూర్‌కు చెందిన రేణుక పని చేస్తున్నారు.

వినాయక నిమజ్జన విధుల్లో (Ganesh immersion Duties) అపశృతి చోటుచేసుకుంది. టస్కర్ వాహనం కిందపడి పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందారు. గత 15 ఏళ్లుగా జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్నారు గుడిమల్కాపూర్‌కు చెందిన రేణుక. ఇవాళ(ఆదివారం) ఉదయం బషీర్ బాగ్ నుంచి లిబర్టీ వెళ్లే మార్గంలో విధులు నిర్వహిస్తున్నారు రేణుక.

ఈ క్రమంలో రోడ్డును దాటేందుకు యత్నించారు మృతురాలు. అదే సమయంలో రేణుకను బలంగా ఢీ కొట్టింది బషీర్ బాగ్ నుంచి వస్తున్న వినాయకుడు ఉన్న టస్కర్ వాహనం. దీంతో ఆమె తలకు బలమైన గాయం కావడంతో హుటాహుటిన ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు వైద్యులు. టస్కర్ వాహనం డ్రైవర్ గజానంద్‌ను అదుపులోకి తీసుకున్నారు సైఫాబాద్ పోలీసులు. పోలీసులు కేసు నమోదు చేసి మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. రేణుక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

 

గుంతల వలన ఇబ్బంది పడుతున్న వాహనదారులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-20T142533.852.wav?_=1

 

గుంతల వలన ఇబ్బంది పడుతున్న వాహనదారులు

. రోడ్డుపై గుంతల వలన మండలంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువతి..

కొడిమ్యాల (నేటి ధాత్రి ):

 

 

కొడిమ్యాల నుండి జగిత్యాలకు వెళ్లే దారిలో నాచుపల్లి గ్రామంలో ప్రభుత్వ హైస్కూల్ సమీపంలో రోడ్డు పొడవునా గుంత పడడం వలన వాహన దారులు పడి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. ఇటీవల ఈ మండలంలో బైక్ పై వెళ్తున్న క్రమంలో రోడ్డుపై గుంతల వలన బైక్ స్కిడ్ డై వెనకాల కూర్చున్న యువతి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. ఈ గుంతను పూడ్చాలని మండల కేంద్రంలోని అధికారులను, వాహనదారులు, ప్రజలు, కోరుకుంటున్నారు.

ఎస్ బి ఐ నుండి రెండు లక్షల ప్రమాద బీమా చెక్కు అందజేత..

ఎస్ బి ఐ నుండి రెండు లక్షల ప్రమాద బీమా చెక్కు అందజేత

#నెక్కొండ, నేటి ధాత్రి:

నెక్కొండ మండలంలోని వాగ్య నాయక్ తండ కు చెందిన స్వామి కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందగా నెక్కొండ ఎస్బిఐ బ్రాంచ్ మేనేజర్ ఐలేష్ మృతుడి భార్య సునీతకు రెండు లక్షల ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ ఐలేష్ మాట్లాడుతూ ఎస్బిఐ బ్యాంకులో స్వామి 436 రూపాయల ఇన్సూరెన్స్ ను చేయడంతో రెండు లక్షల బీమా చెక్కును మృతుడి భార్య సునీతకు అందజేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు ఎస్బిఐ ఇన్సూరెన్స్ ను తప్పక కట్టుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ ఎస్బిఐ బ్యాంకు సిబ్బంది, నెక్కొండ మాజీ జెడ్పిటిసి సరోజ హరి కిషన్ పాల్గొన్నారు.

గని ప్రమాదంలో మరణించిన కార్మికుడి కుటుంబానికి అండగా ఉంటాం…

గని ప్రమాదంలో మరణించిన కార్మికుడి కుటుంబానికి అండగా ఉంటాం…

కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

సింగరేణికి అవ్వా, అయ్యా లేకుండా అనాధగా మారింది…

చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

సింగరేణి గని ప్రమాదంలో మరణించిన కార్మికుడు శ్రావణ్ కుమార్ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం,కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇప్పిస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.మందమర్రి డివిజన్ లోని కేకే 5 గనిలో అండర్ గ్రౌండ్ లో ఎస్ డి ఎల్ యాక్టింగ్ గా పనిచేస్తున్న జనరల్ మజ్దూర్ కార్మికుడు రాచపల్లి శ్రావణ్ కుమార్ ప్రమాదంలో మృతి చెందాడు.శనివారం రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో శ్రావణ్ కుమార్ మృతదేహాన్ని సందర్శించి, మృతదేహానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి నివాళులు అర్పించి,మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు.అనంతరం మంత్రి మాట్లాడారు.

శ్రావణ్ కుమార్ కుటుంబానికి అండగా ఉంటామని, ఈ ప్రమాదానికి కారణమైన అధికారుల పై చర్యలు తీసుకునే విధంగా చేస్తామన్నారు.గని ప్రమాదంలో మరణించిన కార్మికుడు శ్రావణ్ కుమార్ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం,కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.మంత్రి వెంట ఏఐటియుసి జనరల్ సెక్రటరీ వాసిరెడ్డి సీతారామయ్య మృత దేహాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునేలా చొరవ తీసుకుంటామని అన్నారు. సింగరేణి యాజమాన్యానికి లాభాలపై ఉన్న శ్రద్ధ కార్మికుల రక్షణ పై లేకుండా ఉందని, కార్మికుల రక్షణ కు ప్రత్యేక శ్రద్ధ చూపించేల యాజమాన్యం చొరవ తీసుకోవాలని సిఐటియు నాయకులు రాజీ రెడ్డి,సాంబారి వెంకటస్వామి లు డిమాండ్ చేశారు. పలువురు యూనియన్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, పిసిసి సభ్యులు రఘునాథ్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్,నాయకులు పాల్గొన్నారు.

సింగరేణికి అవ్వా, అయ్యా లేకుండా అనాధగా మారింది…

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

సింగరేణికి అయ్యా అవ్వ లేకుండా అనాథగా మారిందని, సీఎండి , సంబంధిత మంత్రి , ఎవరు పట్టించుకోకుండా పోవడం వల్లే ప్రమాదాలు జరిగి కార్మికుల ప్రాణాలు పోతున్నాయని మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్, మంచిర్యాల బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు, మందమర్రి గని ప్రమాదం లో మృతి చెందిన కార్మికుడు శ్రవణ్ మృతదేహానికి ఆర్కేపి ఏరియా ఆసుపత్రి లో నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు, కార్మికుల రక్షణ మీద శ్రద్ధ పెట్టక అవినీతి అక్రమాలు చేస్తున్నారని మండి పడ్డారు, మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ రాజా రమేష్ బాబు, రామిడి కుమార్,టీబీజీకేఎస్ నాయకులు మేడిపల్లి సంపత్, మాజీ కౌన్సిలర్లు రెవెల్లి ఓదెలు, అనిల్ రావు, పోగుల మల్లయ్య, మహేష్ నాయకులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో గుండెలవిసేలా రోదిస్తున్న ప్రమాద బాధితులు.

సంగారెడ్డి కలెక్టరేట్‌లో గుండెలవిసేలా రోదిస్తున్న ప్రమాద బాధితులు

◆:- సంగారెడ్డి కలెక్టరేట్‌లో గుండెలవిసేలా రోదిస్తున్న ప్రమాద బాధితులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

పాశమైలారం సిగాచి పరిశ్రమ ప్రమాద బాధితులతో ,సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ,జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు,నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మ రెడ్డి ,ఉమ్మడి మెదక్ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ , ఆందోల్ మాజి ఎమ్మెల్యే గార్లతో కలిసి సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్లిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డవారికి సీఎం పది లక్షలు ఇస్తామని చెబితే, 50వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు ఇచ్చి, నెల నెలా వేతనం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు.

ఓదెల లో లారీ బైక్ డీ ఒకరు మృతి..

ఓదెల లో లారీ బైక్ డీ ఒకరు మృతి..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండల కేంద్రం లోని మల్లికార్జున స్వామి దేవస్థానం వద్ద ఓదెల నుండి పెగడపల్లి కి బైక్ పై వెళ్తున్న వ్యక్తిని సిమెంట్ లారీ బైక్ వెనక భాగం లో బలంగా ఢీ కొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.పోత్క పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెలితే బాధితులు,పోలీసుల కథనం మేరకు ఓదెల మండలం రూపునారాయణపేట గ్రామానికి చెందిన రాపర్తి రాజు యాదవ్ సుమారు 38 సం. కావేరి సీడ్స్ అగ్రి ఎంప్లాయ్ గా పని చేస్తున్నాడు.ఉద్యోగ రీత్య ఓదెల నుండి పెగడపల్లి కి వెళ్లే క్రమంలో ఉదయం 10:30 సుమారు లో ఓదెల మల్లికార్జున స్వామి టెంపుల్ సమీపంలో బైక్ పై వెళ్తుండగా సిమెంట్ లారీ వెనుక నుండి ఢీ కొట్టింది. దీంతో తలకు బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.మృతునికి భార్య శిరీష, ఇద్దరు కుమారులు రిషి కుమార్,లడ్డు ఉన్నారు. పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వహాస్పత్రి కి తరలించారు.

విద్యుత్ ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు.

విద్యుత్ ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు,
. ప్రమాదమా..? వివాదమా..?
విచారణ చేపట్టిన విద్యుత్ అధికారులు.
– వరంగల్ హాస్పటల్లో చికిత్స పొందుతున్న బాధితుడు,
నేటి ధాత్రి, మొగుళ్ళపల్లి:

 

 

 

 

మొగుళ్ళపల్లి మండలం మొట్లపల్లి గ్రామంలో గురువారం విద్యుత్తు స్తంభం పై నుండి కాంట్రాక్టు లేబర్గా పనిచేస్తున్న జనే అనిల్ అలియాస్ అంజి (35) 33 లెవెన్ కె.వి వైర్లు తగిలి పై నుండి కింద పడి తీవ్ర గాయాల పాలు అయ్యాడు స్థానికులు అంబులెన్స్ ద్వారా మెరుగైన వైద్యం కోసం వరంగల్ ప్రైవేటు దావఖానా కు తరలించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మొట్లపల్లి గ్రామానికి చెందిన జెన్నే అనిల్ అలియాస్ అంజి గత కొన్ని సంవత్సరాలుగా మొట్లపల్లి సబ్ స్టేషన్లో కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నాడు ఈ క్రమంలో గ్రామంలోని లెవెన్ కె.వి విద్యుత్తు వైర్లు మరమ్మత్తులు చేస్తుండగా పైన ఉన్న 33 కెవి వైర్లు తగిలి తగలడంతో విద్యుత్ ప్రమాదానికి గురై పైనుండి కింద పడ్డాడు. అయితే 11 కెవికి ఎల్సి తీసుకొని మరమ్మతులు చేస్తున్న అనిల్ ను ప్రమాదానికి కావాలనే గురిచేయాలని కొంతమంది 33 కెవి లైన్ 11 కేవీ లైన్ పైన పచ్చికొమ్మలను వేసి ప్రమాదానికి గురి చేశారని గ్రామంలో ప్రచారం జరుగుతోంది ఇట్టి విషయంపై విద్యుత్తు ఉన్నతాధికారులు గ్రామంలో ఆరా తీస్తున్నట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది,

ఇంటి పైకప్పు సరి చేస్తుండగా ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

ఇంటి పైకప్పు సరి చేస్తుండగా ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి.

బెల్లంపల్లి నేటిధాత్రి :

 

 

 

మంచిర్యాల జిల్లా
బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీలో ఓ ఇంటి పైకప్పు సరి చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడి కందుకూరి తిరుపతి అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి, తన కుటుంబ సభ్యుల అంగీకారంతో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తన నేత్రాలు దానం చేసిన కందుకూరి తిరుపతి.

కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంపై సమగ్ర న్యాయవిచరణ జరిపించాలి.

కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంపై సమగ్ర న్యాయవిచరణ జరిపించాలి

ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి వై గీత

వికారాబాద్/ హైదారాబాద్ నేటిధాత్రి:

సంగారెడ్డి జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని పాశం మైలారంలోని సిగా చి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో పదుల సంఖ్యలో కార్మికులు మరణించడం అనేకమంది తీవ్ర క్షతగాత్రులైన సంఘటనపై సమగ్ర న్యాయచారణ జరిపించాలని ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి వై గీత డిమాండ్ చేశారు.ఈ సంఘటనకు యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని తేల్చి చెప్పారు.ఈ దుర్ఘటనకు ఫ్యాక్టరీలో తగిన రక్షణ చర్యలు చేపట్టకపోవడం, లేబర్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ల ఇన్స్పెక్షన్ లేకపోవడం వలన జరిగిందని ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ అభిప్రాయపడిందన్నారు. మరణించిన క్షతగాత్రులైన కార్మిక కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధిత ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని తక్షణమే ప్రాసిక్యూట్ చేసి, సెక్షన్ 304 కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, మరణించిన కార్మికులకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లిస్తూ కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని ఇవ్వాలని, తీవ్రంగా క్షతగాత్రులైన కార్మికులకు ఒకరికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని వివరించారు. కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని ప్రభుత్వ పరివేక్షణలో యాజమాన్యం,ప్రభుత్వం పూర్తిస్థాయిలో వారు( కార్మికులు) సంపూర్ణంగా కోరుకునే వరకు అందించాలని వై గీత డిమాండ్ చేశారు.

సిగాసి ఫ్యాక్టరీ ప్రమాదంపై సమగ్ర న్యాయవిచరణ జరిపించాలి.

సిగాసి ఫ్యాక్టరీ ప్రమాదంపై సమగ్ర న్యాయవిచరణ జరిపించాలి.

ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని పాశం మైలారంలోని సిగాసి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో పదుల సంఖ్యలో కార్మికులు మరణించడం అనేకమంది తీవ్ర క్షతగాత్రులైన సంఘటనపై సమగ్ర న్యాయచారణ జరిపించాలని ఐఎఫ్ టియు తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.

ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 150 మంది కార్మికులు పనిలో ఉన్నారని వారి రక్షణకై యుద్ధప్రాతిపదికపై మరింతగా అన్నిరకాల సహాయక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈ సంఘటనకు యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని,

ఈ దుర్ఘటనలో లేబర్ అధికారుల,ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ల వైఫల్యం మరోసారి బహిర్గతమైందని పేర్కొన్నారు.

ఈ దుర్ఘటనకు ఫ్యాక్టరీలో తగిన రక్షణ చర్యలు చేపట్టకపోవడం, లేబర్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ల ఇన్స్పెక్షన్ లేకపోవడం వలన జరిగిందని ఐఎఫ్టియు అభిప్రాయపడుతుందని తెలిపారు.

 

General Secretary M Srinivas

 

మరణించిన క్షతగాత్రులైన కార్మిక కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకోవాలని కూడా డిమాండ్ చేశారు.

సంబంధిత ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని తక్షణమే ప్రాసిక్యూట్ చేసి,బిఎన్ఎస్ఎస్
సెక్షన్ 106 లేదా సెక్షన్ 107 కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని .

మరణించిన కార్మికులకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లిస్తూ కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని ఇవ్వాలని, తీవ్రంగా క్షతగాత్రులైన కార్మికులకు ఒకరికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కార్పొరేట్ స్థాయి లో వైద్యాన్ని ప్రభుత్వ పరివేక్షణలో యాజమాన్యం మరియు ప్రభుత్వం పూర్తిస్థాయిలో వారు( కార్మికులు) సంపూర్ణంగా కోరుకునే వరకు అందించాలని రాష్ట్ర కమిటీ తరుపున కోరారు.

ఈ సంఘటనపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కార్మిక వర్గానికి తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తున్నట్లు ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ ప్రకటించారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన టిఎస్ఎస్.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చెర్మెన్ వై.నరోత్తం..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండలంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోహిర్ మండలం పీచర్యాగడ్ గ్రామానికి చెందిన జి.శ్రీకాంత్,డి.సాయి హేమంత్ లను ఈ రోజు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన టిఎస్ఎస్ సిసిడిసి (ఎస్సి కార్పొరేషన్) మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు,పరామర్శించిన వారిలో చల్లా శ్రీనివాస్ రెడ్డి,శికారి గోపాల్,గాళ్ రెడ్డి,సి.యం.అశోక్ రెడ్డి,చిన్నా,దిలీప్, తదితరులు ఉన్నారు.

ప్రమాద వసాత్తు మరణించిన ప్రతి నిరుపేద యాదవ.

ప్రమాద వసాత్తు మరణించిన ప్రతి నిరుపేద యాదవ

మల్లాపూర్ జూన్ 19 నేటి దాత్రి

 

 

 

ప్రమాద వసాత్తు మరణించిన ప్రతి నిరుపేద యాదవ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి అండగా ఉంటాం
యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాలజిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్
:బాధిత కుటుంబానికి 53116/- రూపాయల ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచిన యాదవ సంఘనాయకులు
జగిత్యాల జిల్లాలో ప్రమాద వసాత్తు మరణించిన ప్రతి నిరుపేద యాదవ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి యాదవులందరం అండగా ఉంటామని యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాల జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ అన్నారు..
మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామానికి చెందిన మాధం నాగరాజు యాదవ్ ఇటీవల ప్రమాద వసాత్తు కరెంట్ షాక్ తో మరణించగా గొర్రెపల్లిలో వారి నివాసానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులకు యాదవ సంఘం అడహాక్ కమిటీ సభ్యులు (53116/-) యాభై మూడు వేల ఒక్క వంద పదహారు రూపాయల (నగదు) ఆర్థిక సహాయం అందించారు..
మల్లేష్ యాదవ్ మరియు యాదవ సంఘ సభ్యులు మాట్లాడుతూ
వారి కూతురిని 1వ తరగతి నుండి పదవ తరగతి వరకు కరీంనగర్ లోని ప్రైవేట్ పాఠశాల (ప్రైవేట్ హాస్టల్ వసతితో సహా)లో ఉచితంగా చదివించడానికి సహకరిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో..
యాదవ సంఘ నాయకులు
తొట్ల చిన్నయ్య, తిప్పనవేని రవి, చెరుకు సుభాష్, గుడిసె జితేందర్, మ్యాదరవేని రామాంజనేయులు, ముక్కెర లింబాద్రి, అంకం శంకర్, గుండెల నాగేష్, యాదవనేని రాజలింగం అలిశెట్టి భుచ్చి రాములు, పన్నాల హరీష్,కొత్తూరి సురేష్,గంగుల శ్రీనివాస్, అరికంటి సాగర్, చెండి గంగారాం, పంతంగి వెంకటేష్,అల్లే చంద్రయ్య,కలసాని లక్ష్మణ్, బాస రంజిత్,దండికే శంకర్, గెల్లె అంజయ్య, రాజం, రాకేష్,మల్లయ్య, గంగాధర్, మల్లేష్,

బైక్ యాక్సిడెంట్ బాధితులకు ఆర్థిక సహాయం.

బైక్ యాక్సిడెంట్ బాధితులకు ఆర్థిక సహాయం

ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండలం మైలారం గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన దసరాపు భద్రయ్య కు ముత్యాల సంపత్ కు ఇటీవల బైక్ ఆక్సిడెంట్ కావడం జరిగింది దీనితో వారికి తలకు బాడీకి తీవ్రమైన దెబ్బలు తగలడంతో హైదరాబాదులోని హాస్పిటల్ తీసుకువెళ్లడం జరిగింది వారిది నిరుపేద కుటుంబం కావడంతో వారి కుటుంబం దాతల సహకారం కోరగా విషయం తెలుసుకున్న ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్నికి మనోధైర్యం కల్పించి వారి వైద్యానికి 5,000 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది అలాగే వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటారని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఇంచార్జ్ ఆకుల ప్రతాప్,మొర్రి గణేష్, తది ఇతర సభ్యులు పాల్గొన్నారు

జహీరాబాద్ బ్రిడ్జి పైన ఆక్సిడెంట్ కి గురైన ఖాజా కుటుంబానికి సహాయం.

జహీరాబాద్ బ్రిడ్జి పైన ఆక్సిడెంట్ కి గురైన ఖాజా కుటుంబానికి సహాయం చేసిన – జేపీ చారిటబుల్ అండ్ వెల్ఫేర్ ట్రస్ట్ ఫౌండర్ జ్యోతి పండాల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కొన్ని రోజుల క్రితం కొత్తగా నిర్మించిన జహీరాబాద్ బ్రిడ్జి పైన ఆక్సిడెంట్ కి గురైన ఖాజా గారి కుటుంబానికి సహాయం చేయగలరని జ్యోతి పండాల్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే, ఖాజా గారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో యాక్సిడెంట్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

అలాగే వారి కుటుంబం అంతా కూడా ఖాజా గారి సంపాదన పైన ఆధారపడి ఉన్నారు కాబట్టి వారికి ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు ఉండటం వల్ల రేషన్ కి కూడా చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని తెలిసి కాజా గారి ఇంటికి వెళ్లి బియ్యము, బ్లాంకెట్స్ మరియు పిల్లలకి బట్టలు అందజేయడం జరిగింది. అలాగే వారికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా తనకు కాల్ చేయమని జ్యోతి పండాల్ వారికి తెలియజేయడం జరిగింది.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version