యూరియా అక్రమ రవాణా పై పటిష్ట నిఘా..

యూరియా అక్రమ రవాణా పై పటిష్ట నిఘా

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వ్యవసాయ అధికారులను ఆదేశించారు.

భూపాలపల్లి నేటిధాత్రి

 

బుధ వారం ఐడిఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో యూరియా సరఫరా, క్రాప్ బుకింగ్, ఉద్యాన పంటలు సాగు తదితర అంశాలపై వ్యవసాయ, ఉద్యాన వన శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
జిల్లాలో యూరియా సరఫరాపై టాస్క్ ఫోర్స్ టీములు పటిష్టమైన నిఘా పెంచాలని సూచించారు. మండలాల వారిగా యూరియా ఎక్కువగా విక్రయాలు జరుగుతున్న మండలాల నివేదిక అందించాలని ఆదేశించారు.
పి.ఏ.సి.ఎస్ కేంద్రాల వద్ద రైతులకు సరిపడేంత యూరియా నిల్వలు ఉంచాలని స్పష్టం చేశారు. యూరియా అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
జిల్లాలో టాస్క్ ఫోర్స్ టీం లను ఏర్పాటు చేయడం జరిగిందని
టాస్క్ ఫోర్స్ టీంలు ఆకస్మికంగా రిటైల్ షాపుల లో తనికీలు చేపట్టాలని,
ప్రైవేటు డీలర్లు కొన్ని చోట్ల బ్లాక్ చేసే అవకాశం ఉందని పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలని, అలాంటి వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
యూరియా కు కొరత లేదని, రాబోయే 15 రోజులు చాలా కీలకమని పర్యవేక్షణ పెంచాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యాన పంటలు క్రాప్ బుకింగ్ వేగవంతం చేయాలని ఆదేశించారు. మొగుళ్ళ పల్లి మండలంలోని కొన్ని గ్రామాలలో గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణానికి భూ సేకరణ చేయడం జరిగిందని భూసేకరణ చేపట్టిన భూమిలో పంటలు సాగు చేపట్టకుండా అలాగే సాగులో ఉన్న పంటలు త్వరితగతిన పూర్తి చేసేందుకు రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. యూరియా నిల్వలు, విక్రయాలపై నివేదికలు
ఏ రోజుకారోజు అందచేయాలని ఆదేశించారు. రైతు బీమా క్లెయిమ్స్ లో జాప్యం జరుగకుండా సత్వరమే విచారణ చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో అవసరమైన యూరియా కొరకు నివేదికలు అందజేయాలని ఆయన స్పష్టం చేశారు. అదనపు సేల్స్ పాయింట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, ఉద్యానవన అధికారి సునీల్ కుమార్, వ్యవసాయ శాఖ ఏడిఏలు, హార్టికల్చర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

భూపాలపల్లి రైతులకు తేనెటీగల పెంపకానికి సబ్సిడీలు…

తేనెటీగల పెంపకం చేపట్టే రైతులకు ఉద్యాన శాఖ సబ్సిడీఎడ్ల సునీల్ కుమార్
జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

ఉద్యాన శాఖ ద్వారా తేనెటీగల పెంపకం చేసే రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం కింద భూపాలపల్లి జిల్లాలో సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది అని జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఏ సునీల్ కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తేనెటీగ పెట్టెలు
కొత్తగా ప్రారంభించే రైతులకు తేనెటీగ పెట్టెలు, ఉపకరణాలపై సబ్సిడీ
40% నుండి 60% వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది.పరికరాలు
హనీ ఎక్స్ట్రాక్టర్, ప్రొటెక్షన్ డ్రస్, స్మోకర్, హైవ్ టూల్స్ మొదలైన వాటిపై సబ్సిడీ.
ప్రాసెసింగ్ యూనిట్లు:
హనీ ప్రాసెసింగ్, ప్యాకింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకునే వారికి కూడా సబ్సిడీ ఉంటుంది.
తేనెటీగల పెంపకం చేయాలనుకునే రైతు/రైతు సమూహాలు పట్టా భూమి కలిగి ఉండాలి లేదా ఇతర పంటలతో కలిపి తేనెటీగలు పెట్టుకోవాలి.
దరఖాస్తు విధానం
ఆధార్, భూ పత్రాలు, బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్‌బుక్ కాపీ సమర్పించాలి.
తేనెటీగల పెంపకం చేపట్టిన రైతులు కానీ, భవిష్యత్తులో చేపట్టబోయే రైతులవి కలెక్టరేట్ లోని జిల్లా ఉద్యాన శాఖ కార్యాలయంలో, దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని, అలాగే వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, మరిన్ని వివరాలకు
భూపాలపల్లి డివిజన్ (రేగొండ, చిట్యాల, మొగుళ్ళపల్లి, టేకుమట్ల, భూపాలపల్లి ఘనపూర్ మరియు గోరుకొత్తపల్లి) రైతులు 8977714064 కి, మహాదేవపూర్ డివిజన్ (మహదేవ్పూర్, మహ ముత్తారం, పలిమేల, కాటారం మల్హర్ రావు) రైతులు 8977714065 కి లేదా జిల్లా ఉద్యాన శాఖ కార్యాలయంలో సంప్రదించాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఏ సునీల్ కుమార్ (8977714063) పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version