మైసమ్మ చెరువు జీవదారులు బంద్..! చెరువు నిండేది ఎలా..?
◆:- ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ కంపెనీలు కాల్వలను కబ్జా చేయడం.
◆:- అక్రమ మళ్లింపుపై విచారణ జరపాలని డిమాండ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలంలోని పైడిగుమ్మాల్ పరిధిలో గల మైసమ్మ చెరువు భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ చెరువుల నీరు పూర్తిగా నిండకపోవడం వల్ల స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. వర్షాలు చక్కగా పడుతున్నా చెరువుల నీరు నిలవకపోవడం పలు అనుమా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ కంపెనీల వల్ల చెరువులోనికి నీరు రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేయడం వల్ల చెరువు నిండ లేక పోతుంది. చెరువు యొక్క జీవదారులు అడ్డుకట్ట వేయడానికి బలమైన నేతల హస్తం ఉండవచ్చని భావిస్తున్నారు.
గ్రామస్తుల అభిప్రాయం ప్రకారం, చెరువులో నిల్వ కావలసిన నీరు ఎక్కడికో మాయమవుతోంది. దీని వల్ల భవిష్యత్‌లో త్రాగునీరు, సాగునీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
ఈ ఘటనపై తెలంగాణ గ్రాడ్యుయేషన్ ఫోరం సంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి చెల్మెడ అనిల్ కుమార్ మాట్లాడుతూ..ప్రజల ఆస్తిని దుర్వినియోగం చేయడాన్ని సహించేది లేదని వెంటనే విచారణ జరిపించి బాధ్యుల పై చర్యలు తీసుకోవాలి,అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.