ప్రాథమిక ఆరోగ్య కేంద్రా న్ని ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ….

ప్రాథమిక ఆరోగ్య కేంద్రా న్ని ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ.

#ఆరోగ్య కేంద్ర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

#సిబ్బంది సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు.

#డిఎం హెచ్ ఓ సాంబశివ.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

మండలంలో ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ సాంబశివ బుధవారం ఆకస్మిక తనకి చేశారు. అనంతరం రికార్డులను, మందులను, దావకాన పరిసరాలను పరిశీలించి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని సిబ్బందిని ఆదేశించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దోమల ద్వారా విష జ్వరాలు వ్యాప్తి చెంది ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందని కావున వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించి ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉండి ప్రజలకు సరైన వైద్యం అందించాలని తెలిపారు. ప్రతి ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని మందులను అందివ్వాలి. ఆరోగ్య కేంద్ర వైద్యులు, సిబ్బంది ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు తప్పనిసరిగా ఆరోగ్య కేంద్రంలో నే అందుబాటులో ఉండాలని లేనియెడల చర్యలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆచార్య, నిఖిల, హెచ్ ఏ కృష్ణ, ఫార్మసిస్ట్ రంగారావు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బాలానగర్ పోలీస్ స్టేషన్ తనిఖీ…

బాలానగర్ పోలీస్ స్టేషన్ తనిఖీ

బాలానగర్ /నేటి ధాత్రి

 

 

బాలానగర్ మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ను జోగులాంబ గద్వాల జిల్లా జోన్ +7 రేంజ్ డీఐజీ ఎల్.ఎస్ చౌహన్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులు క్రమశిక్షణతో సమయపాలనతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్లు తమకు కేటాయించిన గ్రామాల్లో పర్యటిస్తూ.. ప్రజల సమస్యలు తెలుసుకొని పక్షమే స్పందించాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో రికార్డుల నిర్వహణ పరిశుభ్రత కేసుల దర్యాప్తు నాణ్యత పై సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణను పరిశీలించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సీఐ నాగార్జున గౌడ్, ఎస్సైలు లెనిన్, శివానందగౌడ్, శివ నాగేశ్వర్ నాయుడు, ఏఎస్ఐలు సుజ్ఞానం, గోపాల్ రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

రామాయంపేట తహసీల్దార్ కార్యాలయంలో ఆర్‌డీఓ తనిఖీ…

రామాయంపేట తహసీల్దార్ కార్యాలయంలో ఆర్‌డీఓ తనిఖీ

రామాయంపేట సెప్టెంబర్ 10 నేటి ధాత్రి (మెదక్)

 

 

మెదక్ జిల్లా రామాయంపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం ఆర్‌డీఓ గారు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిధిలో యూరియా పంపిణీ పరిస్థితులు, 22-ఎ సమాచారం, భూభారతి పనులు, రెవెన్యూ సభల్లో ఫైళ్ల పరిష్కారం, మీ సేవ డాష్‌బోర్డ్‌ వంటి అంశాలపై సమీక్ష చేపట్టారు. అదేవిధంగా కార్యాలయంలో నిర్వహిస్తున్న వివిధ రిజిస్టర్లను పరిశీలించారు.
తదుపరి సిబ్బందితో మాట్లాడిన ఆర్‌డీఓ గారు సమయపాలన కచ్చితంగా పాటించాలని, దరఖాస్తులు, అభ్యంతరాలపై ఆలస్యం లేకుండా వెంటనే పరిష్కారం చేయాలని సూచించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శులు, లైసెన్స్ సర్వేయర్లతో సమావేశమై రెవెన్యూ సంబంధిత పనులపై మార్గదర్శకాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ లు మహమ్మద్ గౌస్. గోపి. సిబ్బంది సుష్మ. సౌమ్య. రోజా. సునీత. తదితరులు పాల్గొన్నారు

 ఉదయాన్నే ఈ పనులు చేయకపోతే జీవితంలో సక్సెస్ కాలేరు..

 ఉదయాన్నే ఈ పనులు చేయకపోతే జీవితంలో సక్సెస్ కాలేరు..

జీవితంలో అందరూ విజయం సాధించాలని కోరుకుంటారు. కానీ చాలా మందికి విజయం సాధించడానికి, వారి లక్ష్యాలను చేరుకోవడానికి ఎలా ప్లాన్ చేయాలో తెలియదు. అలాంటి వారికోసమే ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో విజయం సాధించడానికి ఏమి చేయాలో స్పష్టంగా చెప్పాడు. మీరు కూడా విజేతలుగా నిలవాలంటే ఉదయం దినచర్యలో ఈ పనులను అలవాటు చేసుకోండి.

దినచర్య ప్రశాంతంగా ప్రారంభిస్తే మనం రోజంతా సానుకూలంగా ఉండగలం. అనుకున్న అన్ని పనులు పూర్తిచేయగలం. ఏ పనిలో అయినా వందశాతం విజయం సాధించాలనే కోరిక నెరవేరాలంటే రాత్రి త్వరగా పనులు ముగించుకుని నిద్రపోవాలని.. వేకువజామునే నిద్రమేల్కొవాలని పెద్దలు చెబుతార. ఎందుకంటే, ఆ కాస్త సమయం చాలా విలువైనది. దానిని వృథా చేయకూడదు. ముఖ్యంగా ఏ పనిలో అయినా విజయం సాధించాలనుకునేవారు. జీవితంలో తమకంటూ గుర్తింపు తెచ్చుకుని సమాజంలో గొప్పవారిగా స్థానం సంపాదించిన ప్రతి విజేత ఉదయపు దినచర్యలో ఈ కింది అలవాట్లు తప్పక ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని చాణక్యుడు ఏనాడో నీతిశాస్త్రంలో వివరించాడు. ఇంతకీ, ఆ అలవాట్లేంటో చూద్దాం.

విజేతల ఉదయపు అలవాట్లు ఇవే:

ఉదయం త్వరగా నిద్ర లేవడం: ఆలస్యంగా నిద్రపోవడం, ఆలస్యంగా నిద్ర లేవడం ఆరోగ్యానికి, కెరీర్‌కు హానికరం. త్వరగా నిద్రపోవడం, త్వరగా నిద్ర లేవడం విజయానికి మొదటి మెట్లు అని చాణక్యుడు చెప్పాడు. ఉదయం త్వరగా నిద్ర లేవడం వల్ల పని సమయానికి పూర్తి చేయడం సాధ్యమవుతుంది. త్వరగా నిద్ర లేవడం వల్ల జడత్వం అనే భావన కూడా తొలగిపోతుంది. మీరు రోజంతా ఉత్సాహంగా, సానుకూలంగా ఉండవచ్చు.ప్రణాళికలు రూపొందించడం: చాణక్యుడి ప్రకారం, ఉదయం నిద్రలేచిన తర్వాత మీరు మీ రోజును ప్లాన్ చేసుకోవాలి. తన రోజును ప్లాన్ చేసుకునే వ్యక్తి లక్ష్యాలను సాధించడంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోకపోవచ్చు. ప్రణాళికలు రూపొందించడం ద్వారా అతడు నిర్దేశించిన పనిని పూర్తి చేయడం సులభం అవుతుందని చాణక్యుడు చెప్పాడుసమయ నిర్వహణ: సమయం చాలా విలువైనది. కాబట్టి దానిని తెలివిగా ఉపయోగించుకోవాలని చాణక్యుడు చెబుతున్నాడు. ముందుగా సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారం మీరు అన్ని పనులను సమయానికి పూర్తి చేయాలి. ఏ పనిని రేపటికి వాయిదా వేయకూడదు. ఇలా చేయడం ద్వారా ఏ వ్యక్తీ విజయం సాధించలేడు.ఆరోగ్య సంరక్షణ: ఆరోగ్యం విషయంలో ఎప్పుడూ రాజీ పడవద్దని చాణక్యుడు చెబుతున్నాడు, ఎందుకంటే మనం మన ఆరోగ్యం గురించి నిర్లక్ష్యంగా ఉంటే వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి. మనం అనారోగ్యానికి గురైతే నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించలేము. శరీరంలో బలం, శక్తి ఉన్నప్పుడే విజయం సాధించగలరు. కాబట్టి యోగా చేయాలి, ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. ఈ ఆరోగ్యకరమైన అలవాట్లన్నీ కచ్చితంగా విజయం సాధించడంలో మీకు సహాయపడతాయి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version