ప్రాథమిక ఆరోగ్య కేంద్రా న్ని ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ.
#ఆరోగ్య కేంద్ర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
#సిబ్బంది సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు.
#డిఎం హెచ్ ఓ సాంబశివ.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
మండలంలో ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ సాంబశివ బుధవారం ఆకస్మిక తనకి చేశారు. అనంతరం రికార్డులను, మందులను, దావకాన పరిసరాలను పరిశీలించి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని సిబ్బందిని ఆదేశించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దోమల ద్వారా విష జ్వరాలు వ్యాప్తి చెంది ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందని కావున వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించి ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉండి ప్రజలకు సరైన వైద్యం అందించాలని తెలిపారు. ప్రతి ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని మందులను అందివ్వాలి. ఆరోగ్య కేంద్ర వైద్యులు, సిబ్బంది ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు తప్పనిసరిగా ఆరోగ్య కేంద్రంలో నే అందుబాటులో ఉండాలని లేనియెడల చర్యలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆచార్య, నిఖిల, హెచ్ ఏ కృష్ణ, ఫార్మసిస్ట్ రంగారావు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
