విద్యాశాఖ డైరెక్టర్తో వినయ్ పవర్ భేటీ, పాఠశాలల్లో సౌకర్యాలపై చర్చ
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ నవీన్ నికోలాస్, ఐ.ఏ.ఎస్. గారిని ఏఐటిఎఫ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎన్ హెచ్ ఆర్ సి సంగారెడ్డి జిల్లా చైర్మన్ వినయ్ పవర్ హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సమస్యలు, మరుగుదొడ్ల లేమి వంటి మౌలిక సదుపాయాల కొరతపై వారు చర్చించారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించాలని, క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని వినయ్ పవర్ కోరారు. దీనిపై స్పందించిన విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలాస్, నవంబర్ మొదటి వారంలో జహీరాబాద్ను సందర్శించి, పాఠశాలల్లో సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
