రైలు ఢీకొని ఇద్దరు మృతి..

రైలు ఢీకొని ఇద్దరు మృతి

 

అన్నమయ్య జిల్లా కలికిరి రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదం జరిగింది. రైలు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పట్టాలపై కూర్చొని మద్యం సేవిస్తుండగా.. రైలు ఢీ కొట్టింది.

జిల్లాలో ఘోరం జరిగింది. రైలు ఢీకొని(Train Accident) ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన కలికిరి రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. కలికిరి రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్‌పై ఇద్దరు వ్యక్తులు మద్యం సేవిస్తుండగా.. స్టేషన్ సిబ్బంది వారించారు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు కాసేపు స్టేషన్ సిబ్బందితో గొడవ పెట్టుకున్నారు. తర్వాత రైల్వే స్టేషన్ సమీపంలోనే పట్టాలపై కూర్చొని మద్యం సేవించారు. అదే సమయంలో ఎక్స్ ప్రెస్ రైలు(Express Train Hits Two,) వచ్చి.. వారిద్దరిని ఢీ కొట్టింది.

ఈ ప్రమాదం(Train Accident)లో మద్యం సేవిస్తున్న ఇద్దరూ మృతి చెందారు. మృతుల్లో ఒకరు చిత్తూరు జిల్లా సోమల మండలం ఇరికి పెంటకు చెందిన గంధం ముని కుమార్ గా గుర్తించారు. మరొకరు అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం లోని కలికిరి క్రాస్ రోడ్డుకు చెందిన జి వీరభద్రయ్య బాబుగా గుర్తించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు. ఈ ప్రమాదం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని ఆరుగురు మృతి…

ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని ఆరుగురు మృతి

 

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా నదీ స్నానానికి వెళ్లేందుకు రైలు దిగిన కొందరు భక్తులు.. స్టేషన్ నుంచి బయటకు వెళ్లేందుకు రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీ కొట్టింది.

ఉత్తరప్రదేశ్‌: మిర్జాపూర్ చునార్ జంక్షన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే పట్టాలు దాటుతున్న కొందరి ప్రయాణికులను వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. పలువురికి గాయాలయ్యాయి. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
మృతులు గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి చోపాన్ ప్రాంతం నుంచి వారణాసికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. వారు ప్యాసింజర్ రైలులో చునార్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకొని పట్టాలు దాటుతుండగా వారిని రైలు ఢీకొట్టినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికార యంత్రాంగాన్ని సీఎం యోగి ఆదేశించారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version