దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్.. సిద్ధంగా ఉండాలని పోల్ అధికారులకు ఈసీ ఆదేశం…

దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్.. సిద్ధంగా ఉండాలని పోల్ అధికారులకు ఈసీ ఆదేశం

 

 

ఈసీ వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ అధికారులతో (CEOs) న్యూఢిల్లీలో ఈసీ ఇటీవల సమావేశం నిర్వహించింది. రాబోయే 10-15 రోజుల్లో ఎస్ఐఆర్ రోల్‌అవుట్‌కు సిద్ధంగా ఉండాలని ఈసీ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో ఆదేశాలిచ్చారు.

 బిహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తరహాలోనే దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ చేపట్టేందుకు ఎన్నికల కమిషన్ (Election Commission) సమాయత్తమవుతోంది. ఇందుకోసం సెప్టెంబర్ 30వ తేదీలోగా సన్నద్ధం కావాలని అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులకు ఈసీ ఆదేశాలిచ్చింది. ఓటర్ లిస్ట్ క్లీనప్ ఎక్సర్‌సైజ్‌ను అక్టోబర్-నవంబర్‌ నాటికి ప్రారంభించనున్నట్టు సంకేతాలిచ్చింది.

ఈసీ వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ అధికారులతో (CEOs) న్యూఢిల్లీలో ఈసీ ఇటీవల సమావేశం నిర్వహించింది. రాబోయే 10-15 రోజుల్లో ఎస్ఐఆర్ రోల్‌అవుట్‌కు సిద్ధంగా ఉండాలని ఈసీ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో ఆదేశాలిచ్చారు. లాంఛనంగా సెప్టెంబర్ 30వ తేదీని చివరితేదీగా నిర్ణయించారు. చివరిసారిగా నిర్వహించిన ఎస్ఐఆర్ ఓటర్ లిస్ట్‌ను సిద్ధంగా ఉంచాలని ఈసీ ఆదేశాలిచ్చింది. గత ఎస్ఐఆర్ తర్వాత ఓటర్ల జాబితాలను పలు రాష్ట్రాల సీఈఓలు ఇప్పటికే తమ వెబ్‌సైట్‌లో ఉంచారు. న్యూఢిల్లీలో చివరిసారిగా 2008లో ఎస్ఐఆర్ నిర్వహించారు. ఉత్తరాఖండ్‌లో 2006లో చివరిసారిగా ఎస్ఐఆర్ నిర్వహించారు. చాలా రాష్ట్రాల్లో చివరిసారి ఎస్ఐఆర్ 2002-2004 మధ్య జరిగింది.

సెప్టెంబర్ 23 లోపు ఎస్.ఐ.ఆర్ సన్నదత పనులు పకడ్బందీగా పూర్తి చేయాలి…

సెప్టెంబర్ 23 లోపు ఎస్.ఐ.ఆర్ సన్నదత పనులు పకడ్బందీగా పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

 

ఈరోజు సిరిసిల్ల జిల్లాలో సెప్టెంబర్ 23 లోపు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్ ) సన్నద్దత పనులు పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై శనివారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ..ఎస్.ఐ.ఆర్ నిర్వహణ కంటే ముందు ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో 2002 ఎస్.ఐ.ఆర్ డేటా ను 2025 ఎస్.ఎస్.ఆర్ డేటా తో కంపేర్ చేసుకోవాలని ఈ రెండు జాబితాలో కామన్ గా ఉన్న పేర్లు మినహాయించి 2002 తర్వాత ఓటరుగా నమోదైన వారి వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి ధృవీకరించాల్సి ఉంటుందని అన్నారు.
ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ప్రోఫార్మా ప్రకారం ఎస్.ఐ.ఆర్ సన్నద్దత రిపోర్టు తయారు చేయాలని, ఎస్.ఐ.ఆర్ సంబంధించి డెస్క్ వరకు సెప్టెంబర్ 23 నాటికి పూర్తి చేయాలని అన్నారు.
పోలింగ్ కేంద్రాల వారిగా ప్రస్తుత ఓటర్ జాబితా, 2002 ఎస్.ఐ.ఆర్ లో ఉన్న ఓటర్ల కామన్ డెటాతో కెటగిరి ఏ, 2002 ఎస్.ఐ.ఆర్ లో నమోదు కాకుండా 1987 కంటే ముందు జన్మించిన ఓటర్లతో కేటగిరి బి, పుట్టిన సంవత్సరం 1987 నుంచి 2004 మధ్యలో ఉంటే కేటగిరి సి,2004 తర్వాత ఉంటే కేటగిరి డీ కింద పరిగణించి బూత్ స్థాయి అధికారులు రిపోర్టును సెప్టెంబర్ 23 లోపు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో సిరిసిల్ల వేములవాడ రెవిన్యూ డివిజనల్ అధికారులు వెంకటేశ్వర్లు రాధాబాయి అన్ని మండలాల తాసిల్దారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

పూరి సేతుప‌తి సెట్‌లో.. స‌ర్ మేడ‌మ్‌సెల‌బ్రేష‌న్స్‌..

పూరి సేతుప‌తి సెట్‌లో.. స‌ర్ మేడ‌మ్‌సెల‌బ్రేష‌న్స్‌

విజ‌య్ సేతుప‌తి నూత‌న చిత్రం స‌ర్ మేడ‌మ్ సెల‌బ్రేష‌న్స్ పూరి జ‌గ‌న్నాథ్ కార్యాల‌యంలో నిర్వ‌హించారు.

నిత్యం వైవిధ్య‌భ‌రిత‌ సినిమాల‌తో అల‌రిస్తున్న త‌మిళ న‌టుడు విజ‌య్ సేతుప‌తి (Vijay Sethupathi). తాజాగా స‌ర్ మేడ‌మ్ అనే త‌మిళ అనువాద చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ప్ర‌స్తుతం ఆయ‌న తెలుగులో పూరి జ‌గ‌న్నాథ్ (Puri Jagannadh) తో క‌లిసి ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సంయుక్త మీన‌న్ (Samyuktha) క‌థానాయిక‌గా చేస్తోంది. ఇప్ప‌టికే షూటింగ్ స్టార్ట్ చేసి శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ చేస్తున్నారు.

అయితే విజ‌య్ సేతుప‌తి రీసెంట్ సినిమా త‌లైవ‌ర్ త‌లైవి (స‌ర్ మేడ‌మ్ Sir Madam) ఈ రోజు (శుక్రవారం) థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఇటు తెలుగు, అటు త‌మిళంలో మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటున్న నేపథ్యంలో చార్మీ (Charmme Kaur), పూరి (Puri Jagannadh) స‌మ‌క్షంలో హైద‌రాబాద్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ సెల‌బ్రేష‌న్స్ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో విజ‌య్ సేతుప‌తి (Vijay Sethupathi)తో పాటు పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మీ వారి సినిమా బృందం (#PuriSethupathi) పాల్గొంది. ఇదుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అవుతున్నాయి.

సార్ నా పోస్టుమార్టం ఆపండి పోలీసులకు షాక్ ఇచ్చిన యువకుడు.

సార్ నా పోస్టుమార్టం ఆపండి పోలీసులకు షాక్ ఇచ్చిన యువకుడు…

 

Youth Shocks Police: పోస్టుమార్టం జరగడానికి కొన్ని గంటల ముందు ఓ వ్యక్తి ఘాతమ్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు.

సార్ నా పేరు అజయ్ శంక్‌వర్ నేను బతికే ఉన్నాను.

దయచేసి నా పోస్టుమార్టం ఆపండి అని అన్నాడు.ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్ జిల్లా ఘాతమ్‌పూర్ టౌన్‌లో గురువారం ఓ శవం దొరికింది. ఆ శవం ఎవరిది అన్నది తెలియలేదు.

దీంతో పోలీసులు శవం ఫొటో తీసి, వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేశారు.ఆ శవం ఎవరిదో తెలిస్తేచెప్పమని కోరారు.

సుమన్ అనే మహిళ ఘాతమ్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది.

చనిపోయిన వ్యక్తి తన తమ్ముడు అజయ్ అని గుర్తుపట్టింది.

అతడు తరచుగా రెడ్ షర్ట్, బ్లాక్ కలర్ పాయింట్ వేసుకుంటాడని కూడా పోలీసులకు చెప్పింది.శవం ఎవరిదో తెలిసింది కాబట్టి.. పోలీసులు మిగిలిన ప్రొసిజర్స్ పూర్తి చేశారు.

శవాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. శుక్రవారం ఉదయం పోస్టుమార్టం జరగాల్సి ఉంది. పోస్టుమార్టం జరగడానికి కొన్ని గంటల ముందు ఓ వ్యక్తి ఘాతమ్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు.

‘సార్ నా పేరు అజయ్ శంక్‌వర్. నేను బతికే ఉన్నాను. దయచేసి నా పోస్టుమార్టం ఆపండి’ అని అన్నాడు. దీంతో పోలీసులు షాక్ అయ్యారు.

చనిపోయాడనుకున్న వ్యక్తి బతికి రావటంతో నోరెళ్ల బెట్టారు. అతడ్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు.

అజయ్ కుటుంబం ఆ శవం అజయ్‌దే అని గుర్తుపట్టింది. దీంతో పోస్టుమార్టం కోసం పంపాము. తర్వాత నిజమైన అజయ్ స్టేషన్‌కు వచ్చాడు. దీంతో పోస్టుమార్టం ఆపేశాము. శవం ఎవరిదో కనుక్కునే పనిలో పడ్డాము’ అని అన్నారు

చెత్తను తొలగించండి సారూ..!

చెత్తను తొలగించండి సారూ..!

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ మున్సిపల్ పరిధి రంజోల్ గ్రామంలోని 4 పోస్ట్ ఆఫీస్ ముందు రోడ్డు ఎంట్రన్స్ నుంచి నక్షత్ర వెంచర్ మధ్యలో ఉన్న మురికి రోడ్డుపైకి రావడంతో కాలనీ ప్రజలు తీవ్రఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి చెత్తను తీసివేయాలని కాలనీ ప్రజలు కోరుతున్నారు. మున్సిపల్ సిబ్బందికి పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి ఎస్సై ఆర్ అశోక్.

జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి ఎస్సై ఆర్ అశోక్

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈనెల 26న జరిగే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని గణపురం ఎస్సై ఆర్ అశోక్ తెలిపారు. శుక్రవారం మండలంలోని గాంధీనగర్,మైలారం గ్రామాలలోని నిరుద్యోగ యువతీ,యువకులకు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగ యువతీ యువకులు ఈ నెల 15 లోపు గూగుల్ ఫామ్,క్యూఆర్ కోడ్ ద్వారా పేరు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించారు. ఈ జాబ్ మేళాకు 18 నుండి 35 సంవత్సరాల వయసుగల చదువుకున్న చదువు లేని నిరుద్యోగ యువతీ యువకులు అర్హులని ఎస్సై ఆర్ అశోక్ తెలిపారు._

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version