భారత మాజీ ప్రధాని ఇందిరా ప్రియదర్శిని గాంధీ వర్ధంతిని
జహీరాబాద్ నేటి ధాత్రి:
భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా ప్రియదర్శిని గాంధీ 41 వ వర్ధంతిని పురస్కరించుకొని జహీరాబాద్ లో గల స్వర్గీయ ఇందిరా ప్రియదర్శిని గాంధీ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించిన పి. రాములు నేత జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కార్యక్రమానికి ఉద్దేశించి పి. రాములు నేత మాట్లాడుతూ స్వర్గీయ ఇందిరా ప్రియదర్శిని గాంధీ భారతదేశ నిరుపేదలైన అట్టడుగు వర్గాల మనసును దోచిన మహనీయురాలు గరీబి హటావో నినాదంతో తను భారత ప్రధానిగా ఉన్న రోజుల్లో సీలింగ్ యాక్ట్ ను తీసుకువచ్చి భారతదేశంలో ఉన్న నిరుపేదలకు భూ పంపిణీ చేసిన ఘనత భారత మాజీ ప్రధానిస్వర్గీయ ఇందిరా ప్రియదర్శిని గాంధీ గారిదని దీని మూలంగా దేశంలో ఉన్న నిరుపేదలంతా కూడా స్వర్గీయ ఇందిరా ప్రియదర్శిని గాంధీ వెనకాల అనేక రోజులపాటు తను బతికున్నంత కాలం భారతదేశ పేద ప్రజలు తనకు పట్టం కడుతూ అఖండ విజయాన్ని చేకూర్చి భారతదేశ ప్రధానిగా అనేకసార్లు నిలబెట్టిన ఘనత భారతీయ నిరుపేదలదని అన్నారు ఆ మహనీయురాలికి నివాళులు అర్పించడం తమ భాగ్యమని తెలియజేశారు కార్యక్రమంలో జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కండెం నర్సింలు జహీరాబాద్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మొహమ్మద్ కాజ మియా జహీరాబాద్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు మోతిరాం రాథోడ్ రాజశేఖర్ కే.సుజాత మహమ్మద్ రాజశేఖర్జాంగిర్ మహమ్మద్ యూనుస్ మహమ్మద్ కాశీనాథ్ మోయిస్ మొహమ్మద్ అక్రమ్ మోసం గౌస్ కాశీనాథ్ పుణ్యమ్మ మహమ్మద్ ఈనాయత్ మహమ్మద్ జమీల్ ప్యార్ల నగేష్ మొహమ్మద్ అజీమ్ జగదీష్ గుప్తా జె. మాధవరెడ్డి హనుమంత్ రెడ్డి మహమ్మద్ అజీమ్ మహమ్మద్ ఉస్మాన్ మొహమ్మద్ నయీమ్ మహమ్మద్ ఇస్మాయిల్ మహమ్మద్ ఖాన్ తదితర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొని సభను విజయవంతం చేశారు,
