భారత్‌లోకి మళ్లీ టిక్‌టాక్?.. లింక్డిన్‌లో ఉద్యోగావకాశాలకు సంబంధించి బైట్‌డ్యాన్స్ పోస్ట్..
గతంలో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన వేళ టిక్‌టాక్‌ను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిషేధించింది. అప్పట్నుంచి భారత్‌లో టిక్‌టాక్ కార్యకలాపాలకు ఫుల్‌స్టాప్ పడింది. అయితే ప్రస్తుతం భారత్, చైనాల మధ్య స్నేహం చిగురిస్తోంది.
గతంలో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన వేళ టిక్‌టాక్‌ను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిషేధించింది. అప్పట్నుంచి భారత్‌లో టిక్‌టాక్ కార్యకలాపాలకు ఫుల్‌స్టాప్ పడింది. అయితే ప్రస్తుతం భారత్, చైనాల మధ్య స్నేహం చిగురిస్తోంది. ఏడేళ్ల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు వెళ్లారు. ఇరు దేశాలు స్నేహపూర్వకంగా మెలగాలని ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నిర్ణయించుకున్నారు
ఇరు దేశాల మధ్య తిరిగి సామరస్యం నెలకొన్న వేళ టిక్‌టాక్ కార్యకలాపాలు తిరిగి భారత్‌లో ప్రారంభం అవుతాయని చాలా మంది భావిస్తున్నారు (TikTok comeback). అందుకు తగినట్టుగానే టిక్‌టాక్ మాతృ సంస్థ అయిన బైట్‌డ్యాన్స్ తాజాగా ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను లింక్డిన్‌లో పోస్ట్ చేసింది. గురుగ్రామ్‌లోని ఆఫీస్‌లో రెండు ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్టు తెలిపింది. దీంతో టిక్‌టాక్ సేవలు భారత్‌లో తిరిగి ప్రారంభం కాబోతున్నాయా? అని చాలా మంది చర్చించుకుంటున్నారు (TikTok job openings)
ఇటీవలి కాలంలో మనదేశంలో టిక్‌టాక్ వైబ్‌సైట్‌ను చాలా మంది యాక్సెస్ చేయగలుగుతున్నారు. లాగిన్ కావడం, వీడియోలు చూడడం మాత్రం కుదరడం లేదు. అయితే ఇంతకు ముందు ఇలా టిక్‌టాక్‌ను యాక్సెస్ చేయడం కూడా కుదిరేది కాదు (TikTok ban status). కేంద్ర ప్రభుత్వం మాత్రం టిక్‌టాక్‌పై నిషేధం ఇప్పటికీ కొనసాగుతోందని స్పష్టం చేసింది. టిక్‌టాక్ విషయంలో ఎలాంటి ఆదేశాలు రాలేదని అధికారులు తెలిపారు. అలాగే భారత ప్రభుత్వ ఆదేశాలను తాము పాటిస్తున్నామని, టిక్‌టాక్ సేవలను పునరుద్ధరించలేదని ఆ సంస్థ ప్రతినిధులు తెలియజేశారు.