సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ పై దాడికి నిరసనగా న్యాయవాదుల విధుల భహిష్కరణ.
హన్మకొండ/వరంగల్, నేటిధాత్రి (లీగల్)
హన్మకొండ మరియు వరంగల్ కోర్టు న్యాయవాదులు, గౌరవ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ B.R. గవాయ్ పైన సోమవారం నాడు జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ,మంగళవారం నాడు కోర్టు గేట్లకు తాళాలు వేసి గేట్ల ముందు కూర్చొని తమ నిరసనను తెలియజేస్తూ తమ విధులను భహిష్కరించారు.
హన్మకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పులి సత్యనారాయణ మాట్లాడుతూ దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయి పై జరిగిన దాడి, న్యాయ దేవతపై జరిగిన దాడిగా అభివర్ణించారు.
ఈ సందర్భంగా వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలుస సుధీర్ ప్రసంగిస్తూ. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులు B.R. గవాయ్ పై జరిగిన అవమానకర దాడి పట్ల వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ చర్యను ఖండిస్తున్నాం అని తెలిపారు.
ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద బౌతిక దాడికి ప్రయత్నం అనేది ఉన్మాద చర్య, ఇది కేవలం వ్యక్తిపై దాడి కాదు — దేశ న్యాయ వ్యవస్థ గౌరవం పై జరిగిన దాడిగా చూడాలి అన్నారు. న్యాయమూర్తుల పై గానీ, న్యాయవాదులపై గానీ భౌతికంగా జరిగే దాడులను ప్రతి న్యాయవాది, ప్రతి న్యాయమూర్తి న్యాయ వ్యవస్థ రక్షణ కోసం డిమాండ్ చేస్తూ, ఇటువంటి చర్యలను ముక్త కంఠంతో ఖండించాలని అన్నారు. ప్రస్తుతం న్యాయవాదుల రక్షణ చట్టం (Advocates Protection Act) బిల్లును వెంటనే తీసుకురావాలని అదే పరిధిలో న్యాయమూర్తుల రక్షణను కూడా చేర్చడం అత్యవసరం అని భావిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ వైస్ ప్రెసిడెంట్ ఎం.జైపాల్ ఇరు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిలు, డి.రమాకాంత్, రవి, కోశాధికారి సిరుమళ్ల అరుణ, గ్రంథాలయ కార్యదర్శి గుండ కిషోర్,సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఇజ్జిగిరి సురేష్ ,ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మాచర్ల మేఘనాథ్ , మడిపెల్లి మహేందర్ , బార్ కౌన్సిల్ మెంబర్ భైరపాక జయకర్ , సీనియర్ న్యాయవాదులు కె అంబరీష్ రావు,జీవన్ గౌడ్, వద్దిరాజు గణేష్, వి.వెంకట రత్నం, అబ్దుల్ నబి తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.