పాంగోలిన్ స్కేల్స్ అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టురట్టు
హనుమకొండ (Hanumakonda)లో హైదరాబాద్ యూనిట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ఇవాళ(ఆదివారం) సోదాలు నిర్వహించారు. అక్రమంగా అలుగు పొలుసులని (పాంగోలిన్ స్కేల్స్) (Pangolin Scales) రవాణా చేస్తున్న నలుగురు నిందితులని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మొత్తం 6.53 కిలోల అలుగు పాంగోలిన్ స్కేల్స్ని సీజ్ చేశారు పోలీసులు.
అలుగులని వేటాడి వాటి చర్మంపై ఉండే పొలుసులని వేరు చేస్తున్నారు నిందితులు. వీటికి భారీ డిమాండ్ ఉండటంతో ఆగ్నేయాసియా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు నిందితులు. ఔషధాల తయారీలో ఈ అలుగు పొలుసులని వినియోగిస్తున్నారు. వైల్డ్ లైఫ్ చట్టం ప్రకారం అలుగులని వేటాడటం నేరమని పోలీసులు హెచ్చరించారు. డీఆర్ఐ అధికారులు నలుగురు నిందితులని అదుపులోకి తీసుకొని హనుమకొండ అటవీ అధికారులకు అప్పగించారు.