సన్ వాలి హై స్కూల్ అంతర్జాతీయ గుర్తింపు…

సన్ వాలి హై స్కూల్ అంతర్జాతీయ గుర్తింపు

కరస్పాండెంట్ వేముల శంకర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భారతదేశం తరఫున సన్ వాలి హై స్కూల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కరస్పాండెంట్ వేముల శంకర్ హాజరైనారు అనంతరం స్వయంగా విద్యార్థులకు రూ. 1001/- నగదు బహుమతి, ప్రశంసా పత్రాలు వ షీల్డ్‌లు అందజేశారు. ఈ సందర్భంగా వేముల కరస్పాండెంట్ శంకర్ మాట్లాడుతూ
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సన్ వాలి హై స్కూల్ కు రెండవ అంతర్జాతీయ గౌరవ అవార్డు రావడం చాలా సంతోషం గతంలో ఈ పాఠశాల ఆస్ట్రియా దేశం నుండి ఐఎస్ఓ సర్టిఫికేట్ పొందింది. ఇప్పుడు మరోసారి విద్యార్థుల ప్రతిభతో అంతర్జాతీయ గుర్తింపు రావడం పాఠశాల ప్రతిష్టను మరింతగా పెంచింది.అని వారు అన్నారు మా విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపడం పాఠశాల విద్యా ప్రమాణాలకు ప్రతీక.
ఈ విజయం పాఠశాల ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల, మరియు తల్లిదండ్రుల సహకారం ఫలితంగా సాధ్యమైంది,
సన్ వాలి హై స్కూల్ ఎల్లప్పుడూ విద్యలో నాణ్యత, క్రమశిక్షణ విలువలతో ముందంజలో ఉంటుంది అని అన్నారు.
ఈ అంతర్జాతీయ విజయాన్ని పురస్కరించుకుని పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

వరల్డ్ కరాటే రికార్డు పోటీలో యాసీన్ ప్రతిభ…

వరల్డ్ కరాటే రికార్డు పోటీలో యాసీన్ ప్రతిభ

నేటిధాత్రి, వరంగల్.

 

తమిళనాడు లోని తాంబరం సివెట్ కళాశాల మైదానంలో ఆదివారం వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, బాలమురుగన్ నిర్వహించిన ప్రపంచ రికార్డు ప్రయత్న కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న ఫునాకోషి షోటోకాన్ కరాటే-డో ఇండియా అసోసియేషన్‌కు చెందిన బ్లాక్ బెల్ట్ 4వ డాన్ షేక్ యాసీన్ పాల్గొని తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రపంచ రికార్డు సృష్టి కార్యక్రమంలో విశేష ప్రతిభ కనబరిచిన యాసీన్‌కు వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ తరఫున పతకం, సర్టిఫికేట్‌ లను లండన్‌కు చెందిన గిన్నిస్ వరల్డ్ రికార్డు ఇన్‌చార్జ్ రిషినాథ్ అందజేశారు.

ఈ విజయంపై ఇండియా చీఫ్ ఇన్స్పెక్టర్ అండ్ ఎగ్జామినర్ రాచా శ్రీనుబాబు (బ్లాక్ బెల్ట్ 7వ డాన్) యాసీన్‌ను అభినందిస్తూ, ఆయన కృషి మరియు ప్రతిభ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందడం వరంగల్ కరాటే అభిమానులకు గర్వకారణమని పేర్కొన్నారు.

జాతీయ స్థాయి కరాటే పోటీలలో నితన్య సిరి ప్రతిభ..

జాతీయ స్థాయి కరాటే పోటీలలో నితన్య సిరి ప్రతిభ..

అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్..

రామాయంపేట ఆగస్టు 30 నేటి ధాత్రి (మెదక్)

 

మెదక్ పోలీస్ విభాగానికి చెందిన హోం గార్డ్ నామ కృష్ణ కుమార్తె నితన్య సిరి జాతీయ స్థాయి కరాటే పోటీలలో అద్భుత విజయాలు సాధించి రాష్ట్రానికి, జిల్లాకు గర్వకారణంగా నిలిచింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ గారు శనివారం తన ఛాంబరులో నితన్య సిరిని సర్టిఫికెట్, మెమెంటో మరియు ఛాంపియన్షిప్ ట్రోఫీతో ఘనంగా సత్కరించారు.

హైదరాబాద్ బోడుప్పల్‌లో ఇటీవల నిర్వహించిన ఆర్ఎస్ఎస్ కాయ్ జాతీయ స్థాయి కరాటే పోటీలలో నితన్య సిరి సీనియర్ బ్లాక్ బెల్ట్‌గా గర్ల్స్ విభాగంలో కటా, వెపన్స్ విభాగాల్లో గోల్డ్ మెడల్స్ సాధించింది. అదేవిధంగా గ్రాండ్ ఛాంపియన్షిప్ ట్రోఫీని కైవసం చేసుకోవడంతో పాటు ఉత్తమ రెఫరీగా సేవలందించడం విశేషం అని ఎస్పీ గారు అభినందించారు.

 

 

ఇప్పటి వరకు నితన్య సిరి 11 బంగారు పతకాలు, రెండు అంతర్జాతీయ స్థాయి బంగారు పతకాలు, రెండు ఛాంపియన్షిప్ టైటిల్స్ సాధించడం ద్వారా తన క్రీడా ప్రతిభను నిరూపించిందని ఎస్పీ గారు తెలిపారు. చిన్న వయస్సులోనే క్రీడా రంగంలో ఇంతటి విజయాలు సాధించడం ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని ఆయన అన్నారు.

జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ – నితన్య సిరి విజయాలు కుటుంబానికే కాకుండా మొత్తం మెదక్ పోలీస్ విభాగానికీ గర్వకారణం అని,ఇలాంటి ప్రతిభావంతులైన ఆడపిల్లలు సమాజానికి ఆదర్శం. భవిష్యత్తులో కూడా పోలీస్ శాఖ తరపున అవసరమైన సహాయం అందిస్తాం అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎస్. మహేందర్ గారు, ఆర్‌ఐ శైలేందర్ గారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు, ఎస్ఐ నరేష్ గారు, మాస్టర్ రవీంద్ర కుమార్, స్థానిక కరాటే మాస్టర్ నగేష్ మల్లూరి, తల్లిదండ్రులు నామ కృష్ణ–కీర్తినేత తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version