హర్మన్ ప్రీత్ ప్రపంచ రికార్డు.. అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా..!
టీమిండియా మహిళల జట్టు శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్ ఆడుతుంది. ఇందులో భాగంగా మూడు మ్యాచులు గెలిచిన భారత్.. 3-0తో సిరీస్‌ను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఓ ప్రపంచ రికార్డును నెలకొల్పింది.
టీమిండియా మహిళా జట్టు శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు మ్యాచులు ఆడిన భారత్.. ఇంకా రెండు మ్యాచులు ఉండగానే సిరీస్‌ను దక్కించుకుంది. తిరువనంతపురం వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచులో శ్రీలంకపై టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌ(Harmanpreet Kaur)ర్ ఓ ప్రపంచ రికార్డను నెలకొల్పింది.
