థగ్‌లైఫ్‌ మూవీ బ్యాన్‌ కోర్టులో విచారణ.

 థగ్‌లైఫ్‌ మూవీ బ్యాన్‌ కోర్టులో విచారణ…

కర్ణాటకలో థగ్‌లైఫ్‌ సినిమా విడుదలకు సంబంధించి నమోదైన పిటిషన్‌లు సుప్రీంకోర్టు, కర్ణాటక హైకోర్టులో శుక్రవారం ఒకే రోజు విచారణకు వచ్చాయి.

థగ్‌లైఫ్‌ హీరో కమల్‌ హాసన్‌ బెంగళూరులో జరిగిన ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో.

కర్ణాటకలో థగ్‌లైఫ్‌ సినిమా విడుదలకు సంబంధించి నమోదైన పిటిషన్‌లు సుప్రీంకోర్టు, కర్ణాటక హైకోర్టులో శుక్రవారం ఒకే రోజు విచారణకు వచ్చాయి.
థగ్‌లైఫ్‌ హీరో కమల్‌ హాసన్‌ బెంగళూరులో జరిగిన ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే.
కమల్‌ క్షమాపణ చెప్పకపోతే థగ్‌లైఫ్‌ సినిమాను రాష్ట్రంలో విడుదల చేయనివ్వబోమని కన్నడ సంఘాలు హెచ్చరించాయి.
కర్ణాటక చలనచిత్ర వాణిజ్యమండలి కూడా ఈ మేరకు తీర్మానం చేసింది.
దీన్ని ప్రశ్నిస్తూ, సినిమా నిర్మాణ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ మన్మోహన్‌ ధర్మాసనం విచారించింది.
సినిమా విడుదలకు అభ్యంతరాలు తెలియజేయాలని కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.

బీటీ 111 పత్తి విత్తనాలు నిషేధం.

బీటీ 111 పత్తి విత్తనాలు నిషేధం.

అమ్మిన సాగుచేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు.

ఎస్సై జి శ్రవణ్ కుమార్.

చిట్యాల, నేటి ధాత్రి ;

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో మంగళవారం రోజున వ్యవసాయ శాఖ ఏడిఈ మరియు ఎస్ఐ జి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఫర్టిలైజర్ మరియు పెస్టిసైడ్స్ షాపులను తనిఖీ చేయడం తనిఖీ చేయడం జరిగింది, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీటీ త్రిబుల్ వన్ రకం పత్తి విత్తనాలను అమ్మిన సాగు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు,రైతులు కొనుగోలు చేసిన ఎరువులకు రశీదు షాప్ యజమానులు నుంచి తీసుకోవాలి అని అన్నారు,ఈ తనిఖీ లో ఏడి ఏ రమేష్.వ్యవసాయశాఖ అధికారులు పోలీసులు పాల్గొన్నారు.

గోవధ నిషేధం అమలు కఠినంగా అమలు చేయాలి.

గోవధ నిషేధం అమలు కఠినంగా అమలు చేయాలి – భజరంగ్ దళ్.

అచ్చంపేట/నేటి దాత్రి:

 

 

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శుక్రవారం డీఎస్పీని కలిసి, గోవధ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బజరంగ్ దళ్ అచ్చంపేట ప్రఖండా సంయోజక్ శివ చంద్ర మాట్లాడుతూ, గోవధ వల్ల సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని, హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని తెలిపారు. గోవులను రక్షించడం మనందరి బాధ్యత అని, దీనిని దృష్టిలో ఉంచుకొని అధికారులు తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. డీఎస్పీ గారు వినతి పత్రాన్ని స్వీకరించి, సమస్యను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈకార్యక్రమంలో భజరంగ్ దళ్ కమిటీ సభ్యులు శివాజీ నరేష్, చందులాల్ చౌహాన్, అమర్, అజయ్, చైతన్య చారి, బాలకోటి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version