మూగజీవి కదా అని హింసిస్తే ఇలాగే అవుతుంది.. ఈ దున్నపోతు ఏం చేసిందంటే..
కొందరు ఎద్దుల బండికి దున్నపోతులు కట్టి పందేలు పెట్టారు. ఓ బండిలో ఐదుగురు యువకులు కూర్చుని.. వేగంగా వెళ్లాలనే ఉద్దేశంతో దున్నపోతును పదే పదే ముళ్లు కర్రతో పొడుస్తున్నారు. ఇలా వెళ్తున్న క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
మూగ జీవాలను హింసించడం పాపం, నేరం అని తెలిసినా కొందరు కావాలనే పదే పదే వాటిని టార్చర్ చేస్తుంటారు. ఇంకొందరు అవి బాధపడుతుంటే చూసి శునకానందం పొందుతుంటారు. అయితే చేసిన కర్మ వెనువెంటనే వెంటాడుతుందనే విషయం వారికి ఆ సమయంలో తెలీదు. తీరా తగిన శాస్తి జరిగాక కానీ అసలు విషయం అర్థం కాదు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. దున్నపోతును హింసించిన యువకులకు చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు ఎద్దుల బండికి దున్నపోతులు కట్టి పోటీలు పెట్టారు. ఓ బండిలో ఐదుగురు యువకులు కూర్చుని.. వేగంగా వెళ్లాలనే ఉద్దేశంతో దున్నపోతును (Buffalo) పదే పదే ముళ్లు కర్రతో పొడుస్తున్నారు. ఇలా బండిలో ముందు వైపు కూర్చున్న ఇద్దరు వ్యక్తులు.. చేతిలో కర్రలు పట్టుకుని దున్నపోతను కొడుతూనే ఉన్నారు.
ఇలా కొంత దూరం వెళ్లాక.. ఉన్నట్టుండి (Youths tortured buffalo with stick) షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నేరుగా వెళ్లాల్సిన ఎద్దు కాస్తా.. రోడ్డుకు అవతలి వైపునకు తిరుగుతుంది. ఈ క్రమంలో టైరు డివైడర్ ఎక్కడంతో బండి బోల్తా కొడుతుంది. దీంతో బండిపై కూర్చొన్న వారంతా ఎగిరి దూరంగా పడిపోతారు. కట్లు తెగిపోవడంతో దున్నపోతు అక్కడి నుంచి పారిపోతుంది. కింద పడ్డ యువకులు.. వామ్మో.. వాయ్యో.. అనుకుంటూ మూలుగుతుంటారు.
ఇలా దున్నపోతును హింసించబోయి.. చివరకు ఈ విధంగా శిక్ష అనుభవించిన వీరిని చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘మూగజీవాలను ఇబ్బంది పెడితే ఇలాగే అవుతుంది’.. అంటూ కొందరు, ‘తగిన శాస్తి జరిగింది.. ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు చేయరు’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1300కి పైగా లైక్‌లు, 57 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.