అధిక ధరలకు ఎరువులు అమ్మిన దుకాణం సీజ్ చేసిన..

అధిక ధరలకు ఎరువులు అమ్మిన దుకాణం సీజ్ చేసిన పి.కలెక్టర్ ప్రావిణ్య

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి కొహీర్ మండల పోతిరెడ్డిపల్లి గ్ గ్రామంలో డిసిఎంఎస్ ఎరువుల షాపును బుధవారం జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆకస్మిక తనిఖీ చేసారు.ఈపాస్ మిషన్ ద్వారానే రైతులకు ఎరువులు అమ్మాలన్నారు.అనంతరం ఒక  రైతుతో కలెక్టర్ ఫోన్లో మాట్లాడారు.రైతులకు ఎరువులను అధిగ ధరకు ఎమ్మార్పీ రేటు కన్నా ఎక్కువ రేటుకు అమ్మారని తెలియజేయడంతో జిల్లా కలెక్టర్ యూరియాను రైతులకు అధిక ధరకు విక్రయించినందుకు షాపును సీజ్ చేయమని డిఏఓ కు కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశాలు జారీ చేశారు.

25లక్షల గంజాయి పట్టివేత..

25లక్షల గంజాయి పట్టివేత..

ఇద్దరు యువకుల అరెస్టు

నేటిధాత్రి, వరంగల్.

వరంగల్ లోని నార్కోటిక్ పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ సైదులు ఆధ్వర్యంలో ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. వరంగల్ నర్సంపేట రోడ్డులో పోలీసులు తనిఖీలు చేయగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒకరు మైనర్ గా గుర్తించారు. ఒడిశాకు చెందిన పండు అనే వ్యక్తి సుపారీతో గంజాయి రవాణా చేస్తున్నట్లు తెలిపారు. నిందితుల వద్ద 51.081కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోగా. దీని విలువ 25,54,050 గా అంచనా వేస్తున్నారు.

బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ చేతుల మీదుగా గంజాయి.

బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ చేతుల మీదుగా గంజాయి అవగాహనపై వాల్ పోస్టర్ విడుదల

బెల్లంపల్లి జులై 01 నేటి దాత్రి

 

 

 

నేషనల్ ఉమెన్ రైట్స్ జస్టిస్ మూమెంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగుంట ప్రవీణ్ కుమార్ సారాద్యంలో
బెల్లంపల్లి ఏసీపి కార్యాలయంలో
ఏ సి పి రవికుమార్ ని కలిసి వారి చేతులమీదుగా ప్రస్తుతం యువత రోజురోజుకు గంజాయి మత్తులో మునిగిపోతున్నారనే సంకల్పంతో నేషనల్ హ్యూమన్ రైట్స్ &జస్టిస్ మూమెంట్ సభ్యుల ఆధ్వర్యంలో జూలై 5వ తేదీ నుండి జూలై 30 వరకు గంజాయి పై అవగాహన సదస్సులకు సంబంధించి వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మందమరి పట్టణ ఎస్సై రాజశేఖర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ మూమెంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగుంట ప్రవీణ్ కుమార్, జనరల్ సెక్రెటరీ, బత్తిని కృష్ణ, లీగల్ సెల్ అధ్యక్షులు పెసర శ్రీకాంత్, పాల్గొనడం జరిగింది.

నకిలీ పత్తి విత్తనాలను స్వాధీన పరుచుకున్న.

నకిలీ పత్తి విత్తనాలను స్వాధీన పరుచుకున్న కోటపల్లి పోలీసులు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

 

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం లో నకిలీ పత్తి విత్తనాలు స్వాధీన పరుచుకున్నట్లు జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు తెలిపారు.నకిలీ పత్తి విత్తనాలు చేరవేస్తున్నట్లు నమ్మదగిన సమాచారం రావడంతో కోటపల్లి పోలీసులు,వ్యవసాయ శాఖ అధికారితో కలిసి అంతరాష్ట్ర బ్రిడ్జి రాపనపల్లి వద్దకు వెళ్లి తనిఖీలు చేపట్టగా టాటా టియాగో కారులో తరలిస్తున్న1,45,800 రూపాయల విలువ గల 46.6 కిలోల నకిలీ పత్తి విత్తనాలను రవాణా చేస్తున్న నిందితులను పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.నకిలీ పత్తి విత్తనాలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కోటపల్లి ఎస్సై రాజేందర్,పోలీస్ సిబ్బంది పిల్లి శ్రీనివాస్,శ్యాంసుందర్, హోంగార్డ్స్ శ్యామ్,తిరుపతి రెడ్డిలను జైపూర్ ఎసిపి ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో ఏసిపి వెంకటేశ్వర్లు,చెన్నూరు సిఐ దేవేందర్రావు,శ్రీరాంపూర్ సిఐ వేణు చందర్,కోటపల్లి ఎస్సై రాజేందర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఫిట్నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సులను సీజ్ చేయాలి.

ఫిట్నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సులను సీజ్ చేయాలి

ఆర్ టి ఓ కు ఫిర్యాదు

వనపర్తి నేటిధాత్రి :

 

 

 

విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఫిట్నెస్ లేని ప్రైవేటు స్కూలు బస్ లను సిజ్ చేయాలని విద్యార్థుల యువజన సంఘాల అధ్యర్య ములో ఆర్ టి ఓ కు ఫిర్యాదు చేశారు
ఈ సందర్భంగా విద్యార్థుల సంఘాల నాయకులు రాఘవేంద్ర వెంకటే ష్ కుతుబ్ లు మాట్లాడుతూ
వనపర్తి పట్టణ ము జిల్లాలోని వివిధ మండల కేంద్రంలో ప్రైవేటు స్కూలలో పిట్నెస్ లేని బస్సులను లైసెన్స్ లేని డైవర్స్ ను తొలగించాలని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశామని చెప్పారు
పిల్లలు భవిష్యత్ లో బాగా చదవాలని తమ విద్యార్థులను ప్రైవేటు స్కూల్ లో వేలకు వేలు డబ్బులు డొనేషన్ చేసి చదివిస్తూ ఉంటే అక్కడ ఉన్న స్కూల్ యాజమాన్యం వాళ్ళు లైసెన్స్ డ్రైవర్స్ కొనసాగిస్తూ వచ్చేరాని డ్రైవింగ్ చేస్తూ విద్యార్థుల మరణ ము కు కారణం అవుతున్నారని తెలిపారు

జహీరాబాద్: 80 కిలోల నిషేధిత ఎండు గంజాయి స్వాధీనం.

జహీరాబాద్: 80 కిలోల నిషేధిత ఎండు గంజాయి స్వాధీనం.

జహీరాబాద్ నేటి ధాత్రి

 

 

జహీరాబాద్ సమీపంలోని మాటికి జాతీయ రహదారిపై 20 లక్షల విలువైన 80 కిలోల నిషేధిత ఎండు గంజాయిని చిరాగ్ పల్లి ఎస్సై రాజేందర్ రెడ్డి బుధవారం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ కారు డిక్కీలో గోధుమ రంగు కవర్లో చుట్టిన 42 గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. జహీరాబాద్ మండలం గోవిందా పూర్ కు చెందిన తిరుమలేష్ ను అదుపులోకి తీసుకున్నారు.

రూ. 45లక్షల విలువ గల ఎర్రచందనం స్వాధీనం.

*రూ. 45లక్షల విలువ గల ఎర్రచందనం స్వాధీనం..

*కారులో అక్రమ రవాణా చేస్తుండగా 112 ఎర్రచందనం దుంగలు పట్టుకున్న టాస్క్ ఫోర్స్…

*ఇద్దరు స్మగ్లర్లు అరెస్టు..

*కారును స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు..

తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 13:

తిరుపతి జిల్లా పుత్తూరు అటవీ ప్రాంతంలో అక్రమ రవాణా చేస్తున్న 112 ఎర్రచందనం దుంగలతో పాటు, రవాణాకు ఉపయోగించిన కారును తిరుపతి ఎర్రచందనం టాస్క్ ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకుని, దీనికి సంబంధించి ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్ సుబ్బారాయుడు ప్రత్యేక కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ అదేశాల మేరకు డీఎస్పీ (ఆపరేషన్స్)
జి. బాలిరెడ్డి మార్గనిర్దేశకత్వంలో ఆర్ఐ సాయి గిరిధర్ కు చెందిన ఆర్ఎస్ఐ కేఎస్ కే లింగాధర్ టీమ్ స్థానిక అటవీ అధికారులు వడమాలపేట, నారాయణవనం ఎఫ్బీఓలు కుమారస్వామి, నూర్ అబ్జలాల్ ల సహకారంతో పుత్తూరు మీదుగా నారాయణవనం వరకు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లను తనిఖీ చేసుకుంటూ వెళ్లారు. బుధవారం తిరుమలకుప్పం మెయిన్ రోడ్డులోని రామసముద్రం గ్రామం వద్ద వాహనాలను తనిఖీ చేపట్టారు. వాహనాల తనిఖీలను గమనించిన ఇద్దరు వ్యక్తులు వారి వాహనం దిగి పారిపోడానికి ప్రయత్నించారు. టాస్క్ ఫోర్సు పోలీసులు వెంటనే స్పందించి, వారిని వెంబడించి పట్టుకున్నారు. వాహనం తనిఖీ చేయగా అందులో 112ఎర్రచందనం దుంగలు లభించాయి. వీటి విలువ సుమారు రూ. 45లక్షలు ఉంటుందని అంచనా వేశారు. దుంగలతో పాటు స్మగ్లర్లను తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ కు తరలించగా, ఎస్ఐ రఫీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..

పరకాల ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వాహనాల వేలం

పరకాల ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వాహనాల వేలం

 

పరకాల నేటిధాత్రి :

ఎక్సైజ్ స్టేషన్ పరకాల పరిధిలో వివిధ కేసులలో సీజ్ చేయబడిన టువంటి వాహనం లకు బుధవారం రోజున ఉదయం 11 గంటలకు డిస్టిక్ ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ వరంగల్ రూరల్ ఆధ్వర్యంలో పరకాల ఎక్సైజ్ స్టేషన్ నందు వేలం నిర్వహించబడునని ఆసక్తి కలవారు వాహనంలో వేలంలో పాల్గొనవలెనని పరకాల ఎక్సైజ్ సీఐ పి.తాతజీ తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version