దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్.. సిద్ధంగా ఉండాలని పోల్ అధికారులకు ఈసీ ఆదేశం…

దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్.. సిద్ధంగా ఉండాలని పోల్ అధికారులకు ఈసీ ఆదేశం

 

 

ఈసీ వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ అధికారులతో (CEOs) న్యూఢిల్లీలో ఈసీ ఇటీవల సమావేశం నిర్వహించింది. రాబోయే 10-15 రోజుల్లో ఎస్ఐఆర్ రోల్‌అవుట్‌కు సిద్ధంగా ఉండాలని ఈసీ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో ఆదేశాలిచ్చారు.

 బిహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తరహాలోనే దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ చేపట్టేందుకు ఎన్నికల కమిషన్ (Election Commission) సమాయత్తమవుతోంది. ఇందుకోసం సెప్టెంబర్ 30వ తేదీలోగా సన్నద్ధం కావాలని అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులకు ఈసీ ఆదేశాలిచ్చింది. ఓటర్ లిస్ట్ క్లీనప్ ఎక్సర్‌సైజ్‌ను అక్టోబర్-నవంబర్‌ నాటికి ప్రారంభించనున్నట్టు సంకేతాలిచ్చింది.

ఈసీ వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్రాల చీఫ్ ఎలక్టోరల్ అధికారులతో (CEOs) న్యూఢిల్లీలో ఈసీ ఇటీవల సమావేశం నిర్వహించింది. రాబోయే 10-15 రోజుల్లో ఎస్ఐఆర్ రోల్‌అవుట్‌కు సిద్ధంగా ఉండాలని ఈసీ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో ఆదేశాలిచ్చారు. లాంఛనంగా సెప్టెంబర్ 30వ తేదీని చివరితేదీగా నిర్ణయించారు. చివరిసారిగా నిర్వహించిన ఎస్ఐఆర్ ఓటర్ లిస్ట్‌ను సిద్ధంగా ఉంచాలని ఈసీ ఆదేశాలిచ్చింది. గత ఎస్ఐఆర్ తర్వాత ఓటర్ల జాబితాలను పలు రాష్ట్రాల సీఈఓలు ఇప్పటికే తమ వెబ్‌సైట్‌లో ఉంచారు. న్యూఢిల్లీలో చివరిసారిగా 2008లో ఎస్ఐఆర్ నిర్వహించారు. ఉత్తరాఖండ్‌లో 2006లో చివరిసారిగా ఎస్ఐఆర్ నిర్వహించారు. చాలా రాష్ట్రాల్లో చివరిసారి ఎస్ఐఆర్ 2002-2004 మధ్య జరిగింది.

సెప్టెంబర్ 23 లోపు ఎస్.ఐ.ఆర్ సన్నదత పనులు పకడ్బందీగా పూర్తి చేయాలి…

సెప్టెంబర్ 23 లోపు ఎస్.ఐ.ఆర్ సన్నదత పనులు పకడ్బందీగా పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

 

ఈరోజు సిరిసిల్ల జిల్లాలో సెప్టెంబర్ 23 లోపు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్ ) సన్నద్దత పనులు పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై శనివారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ..ఎస్.ఐ.ఆర్ నిర్వహణ కంటే ముందు ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో 2002 ఎస్.ఐ.ఆర్ డేటా ను 2025 ఎస్.ఎస్.ఆర్ డేటా తో కంపేర్ చేసుకోవాలని ఈ రెండు జాబితాలో కామన్ గా ఉన్న పేర్లు మినహాయించి 2002 తర్వాత ఓటరుగా నమోదైన వారి వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి ధృవీకరించాల్సి ఉంటుందని అన్నారు.
ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ప్రోఫార్మా ప్రకారం ఎస్.ఐ.ఆర్ సన్నద్దత రిపోర్టు తయారు చేయాలని, ఎస్.ఐ.ఆర్ సంబంధించి డెస్క్ వరకు సెప్టెంబర్ 23 నాటికి పూర్తి చేయాలని అన్నారు.
పోలింగ్ కేంద్రాల వారిగా ప్రస్తుత ఓటర్ జాబితా, 2002 ఎస్.ఐ.ఆర్ లో ఉన్న ఓటర్ల కామన్ డెటాతో కెటగిరి ఏ, 2002 ఎస్.ఐ.ఆర్ లో నమోదు కాకుండా 1987 కంటే ముందు జన్మించిన ఓటర్లతో కేటగిరి బి, పుట్టిన సంవత్సరం 1987 నుంచి 2004 మధ్యలో ఉంటే కేటగిరి సి,2004 తర్వాత ఉంటే కేటగిరి డీ కింద పరిగణించి బూత్ స్థాయి అధికారులు రిపోర్టును సెప్టెంబర్ 23 లోపు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో సిరిసిల్ల వేములవాడ రెవిన్యూ డివిజనల్ అధికారులు వెంకటేశ్వర్లు రాధాబాయి అన్ని మండలాల తాసిల్దారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version