అంతర్జాతీయ జపాన్ బ్లాక్ బెల్ట్ డిప్లోమా సాధించిన కరాటే మాస్టర్ నవీన్ ను ప్రశంసించిన హీరో సుమన్
మెట్ పల్లి అక్టోబర్ 15 నేటి ధాత్రి
జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ప్రధాన శిక్షకులు రాపోలు సుదర్శన్ ఆధ్వర్యంలో నాగబాబు స్టూడియో అజిజ్ నగర్ హైదరాబాద్ లో తేది.14.10.2025 మంగళవారం రోజున నిర్వహించిన అంతర్జాతీయ, జాతీయ బ్లాక్ బెల్ట్ ప్రశంసా పత్రాల ప్రధానోస్తవ కార్యక్రమంలో జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ లెజెండ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత నటుడు సుమన్ చేతుల మీదుగా బండాలింగాపుర్ గ్రామానికి చెందిన కరాటే మాస్టర్ నవీన్ కు శిక్షకులు ప్రవీణ్ కుమార్ మాస్టర్, రాపోలు సుదర్శన్ మాస్టర్ సమక్షంలో అంతర్జాతీయ బ్లాక్ బెల్ట్ డిప్లోమా ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ ఈ రోజుల్లో విద్యార్థులు శారీరిక మానసిక వ్యక్తిత్వ వికాసానికి విద్యార్థుల ఎదుగుదలకు ఇలాంటి కరాటే ఆత్మరక్షణ విద్యలు ఎంతగానో దోహదపడతాయని అందరూ ఈ విధ్యను కటోరా సాధనతో నేర్చుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ స్టేట్ జపాన్ కరాటే అసోసియేషన్ ఛైర్మన్ సినీ నటుడు సుమన్, జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ప్రధాన శిక్షకులు రాపోలు సుదర్శన్, జిల్లా ప్రధాన కరాటే శిక్షకులు ప్రవీణ్ కుమార్, కరాటే మాస్టర్లు ఆంజనేయులు, బాగ్యరాజ్, పవన్ కళ్యాణ్, నవీన్, విశ్వ తేజ, కరాటే విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.