సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని మానేరు వాగు లోని గంగమ్మ దేవాలయం వరకు ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటి ప్రవాహానికి సిరిసిల్ల గంగ పుత్రులు ప్రత్యేకంగా గంగమ్మకు శాంతి చేకూరాలని బోనాలతో మరియు అమ్మవారి విగ్రహ పల్లకి సేవతో ఊరేగింపుగా బయలుదేరి మానేరు గంగమ్మ నీటిలో ప్రత్యేక కుంకుమ పూజలు కార్యక్రమం ఏర్పాటు చేయడానికి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణకు సంబంధించిన గంగపుత్రులు మరియు పరిసర గ్రామాల గంగపుత్రులు అంగరంగ వైభవంగా వెళ్లి మానేరు గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది.
సుబ్బక్కపల్లె సోమనపల్లి మధ్యలో అంకుశాపూర్ టేకుమట్ల మధ్యలో రోడ్డుపై వరద
మారేపల్లి మల్లేష్ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి
భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల మండలంలోని సుబ్బక్క పల్లె సోమనపల్లి అంకుశ పూర్ టేకుమట్ల మధ్యలో ఉన్న కల్వర్టుల ద్వారా ప్రజలు ప్రతి వానకాల సీజన్లో టేకుమట్లకు రావాలంటే కల్వర్టుల ద్వారా ప్రవహిస్తున్న వరద నీటిని దాటుకుంటూ రావాల్సిందే టూ వీలర్ వెహికల్స్ గాని ఫోర్ వీలర్స్ వెహికల్స్ గాని దాటాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ప్రజలు ప్రతి సంవత్సరం ఎంతో ఇబ్బంది పడుతున్నారు స్కూలుకు వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు తక్షణమే స్థానిక తాసిల్దార్ ఎంపీడీవో కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి హై లెవెల్ బ్రిడ్జి నిర్మించే విధంగా చర్యలు చేపట్టాలని ఈ ప్రజలకు వర్షాకాల ఇబ్బందుల నుండి కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం అనేక సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్న దీని మీద ఎవరు దృష్టి పెట్టడం లేదు ఇప్పటికైనా స్పందించి దృష్టి పెట్టి సకాలంలో పనులు మొదలుపెట్టే విధంగా చూడాలని లేకుంటే ప్రజలను సమీకరించి ఆందోళనకు సిద్ధం చేస్తామని తెలియజేస్తున్నాను
వినాయకుడి పూజలో మాజి మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి నేటిదాత్రి .
15 వార్డు హనుమాన్ టేకిడి లో బాల హనుమావ్ భక్త బృందం ఆధ్వర్యంలో మట్టి వినాయకుడిని ప్రతిష్టించారు వినాయకుడి పూజలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ రమేష్ గౌడ్ బి ఆర్ ఎస్ జిల్లా గట్టు యాదవ్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ బండారు కృష్ణ మీడియా సెల్ ఇంచార్జి నందిమల్ల అశోక్ హనుమాన్ టేకిడి భక్తులు యూత్ సభ్యులు పెద్ద గిరి అభిషేక్ డాక్టర్ కిషోర్ వినయ్ కుమార్ వంశీ శ్రీకర్ గౌడ్ చిన్నగిరి సూర్య కుమార్ కార్తీక్ శ్రీకాంత్ శశికాంత్ సాయి కుమార్ దిలీప్ మదన్ మున్నూరు సురేందర్ ముంతా మన్యం మహేష్ బండారు భరత్ కుమార్ రాము మణికంఠ సంతోష్ యూత్ సభ్యులు పాల్గొన్నారు
భారీ వర్షాల నేపథ్యంలో కంట్రోల్ రూం సేవలు వినియోగించుకోవాలి
24/7అందుబాటులో వివిధ శాఖల అధికారులు ఉండాలి
ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు
కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1800 233 1495
వరద, వర్షం ప్రభావిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
కంట్రోల్ రూమ్ వాట్సాప్ సెల్ నెంబర్ 9398684240
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గతంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ సేవలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో సంబంధిత అన్ని శాఖలను అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలలో లో లెవెల్ కాజ్ వేల వద్ద అప్రమత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.రెవెన్యూ, పోలీస్, విద్యుత్, వ్యవసాయ, హెల్త్, పి.ఆర్, మిషన్ భగీరథ ఇతర శాఖల అధికారులు కంట్రోల్ రూంలో సేవలు అందిస్తున్నారని తెలిపారు.వివిధ అధికారులు అందుబాటులో ఉండి, వర్షాలు, వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు తగిన సమాచారం అందిస్తారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని, వరద ప్రభావిత ప్రజలకు సహాయం చేసేలా సేవలు అందిస్తారు. 24 గంటలు ఆయా శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశామని, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే కంట్రోల్ రూమ్ నెంబర్లు టోల్ ఫ్రీ నెంబర్ 1800 233 1495, వాట్సాప్ సెల్ నెంబర్ 9398684240 లను వర్షం, వరద ప్రభావిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రజలకు సూచించారు.జిల్లా, మండల స్థాయి అధికారులు తమ, తమ హెడ్ క్వార్టర్స్ , క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. వర్షాల కారణంగా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్లయితే అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.
జహీరాబాద్ నియోజకవర్గంలోని మున్సిపల్ కార్మికులక ఉద్యోగులకు టిఫిన్ వాటర్ బాటిల్ పంపిణీ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తమ విధులను నిర్వహిస్తున్న పోలీసు శాఖతోపాటు మున్సిపల్ కార్మికులకు టిఫిన్ వాటర్, బాటిల్ పంపిణీ చేశారు. గురువారం పట్టణంలో యువజన కాంగ్రెస్ విభాగం జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో అందించారు.
తొమ్మిది రోజులపాటు ఘనంగా పూజలు అందుకోనున్న గణనాథుడు రామకృష్ణాపూర్ పట్టణంలో వివిధ మండపాలలో కొలువ తీరాడు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అమ్మ గార్డెన్, తిమ్మాపూర్ , కుర్మపల్లి,క్యాతనపల్లి, శేషు పల్లి, అమరవాది, రామకృష్ణాపూర్ ఏరియాలలో భాజా భజంత్రీలు, మంగళహారతుల మధ్య చిన్న పెద్ద తేడా లేకుండా వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు. కొలువుదీరిన గణనాథులకు వేద పండితులు, నవగ్రహ పూజలతో ప్రజలు , పుర ప్రముఖులు పూజలు నిర్వహించారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు పట్టణంలో ప్రముఖ వినాయక మండపాల్లో మట్టి వినాయకులను ప్రతిష్టించారు.వినాయక విగ్రహాల ఏర్పాటుతో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడి, చిన్నా పెద్దా అంతా భక్తితో పూజలు నిర్వహించారు.
#రెండేళ్లలో కనీవినీ ఎరగని రీతిలో అభివృద్ధి పనులు..
#58 డివిజన్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే..
#57 వ డివిజన్ గోకుల నగర్ ప్రాంతంలో కమిషనర్ తో కలిసి పరిశీలన …
హన్మకొండ, నేటిధాత్రి:
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ ఈ రోజు 58 వ డివిజన్ పరిధిలోని స్నేహ నగర్ లో అంతర్గత రోడ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేసారు.గడిచిన కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నగరంలో అత్యవసర ప్రాంతాలకు గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలు,నివారణ చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే నాయిని పేర్కొన్నారు. ఏబీసీ లుగా పనులను గుర్తించి ఒక్కటిగా చేస్తున్నామని తెలిపారు.వర్షాలలో సైతం నగరంలో ఒకటి రెండు ప్రాంతాలలో తప్ప ఎటువంటి ఇబ్బందులు లేవని ప్రతి కార్యక్రమంలో ప్రజల సహకారం వలనే సాధ్యమైందని అన్నారు. నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఆదేశించారు.ఈ మేరకు 57 వ డివిజన్ గోకుల్ నగర్ ప్రాంతంలో నగర కమిషనర్ శ్రీమతి చాహత్ బాజ్ పాయ్ తో కలసి ప్రాంతాలను పరిశీలించారు.వరద ప్రవాహానికి అడ్డుగా ఉండే ప్రాంతాలకు గుర్తించి పరిష్కార మార్గాలను చూడాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు,అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా వి ఎచ్ పి యస్ ఆవిర్భవ దినోత్సవం సెప్టెంబర్ 9 లోపే వికలాంగుల సమస్యలు పరిష్కరించాలి వికలాంగులకు 6000 వితంతువులు ఒంటరి మహిళలకు 4000 మహాదేవపూర్ఆగష్టు28 నేటి ధాత్రి
ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ మహాదేవపూర్ మండల కేంద్రంలో ఘనంగా వి ఎచ్ పి యస్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ సంఘమైన వి హెచ్ పి ఎస్ ఆవిర్భవించి 18 సంవత్సరాలు పురస్కరించుకొని వి ఎచ్ పి యస్ మండల అధ్యక్షులు వీరగంటి సమ్మయ్య జెండా అప్పుడే ఆవిష్కరణ చేశారు. వీరగంటి సమయం మాట్లాడుతూ వికలాంగుల హక్కుల కోసం వారికి సమాజంలో జరుగుతున్న అసమానతల కోసం ఎమ్మార్పీఎస్ వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేసి వికలాంగులకు గుర్తింపు తీసుకురావడం అంటే ఎంతో గొప్ప విశేషమని దీనికి కారణమైన .మందకృష్ణ మాదిగ వికలాంగుల కోసం నిరంతరం పోరాటం చేయడం ద్వారానే వారికి సమాజంలో విలువైన జీవనం తగ్గిందన్నారు మండల అధ్యక్షుడు బెల్లంపల్లి సురేష్ మాటే మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ చొరవతోనే ఎన్నో విజయాలు సాధించిమని వికలాంగుల సమాజం మాన్యశ్రీ గౌరవ మందకృష్ణ మాదిగా కే రుణపడి ఉంటుందని ఈ గౌరవం దక్కుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ వికలాంగుల మండల అధ్యక్షులు వీరగంటి సమ్మయ్య టౌన్ ప్రెసిడెంట్ ముస్తాక్ మండల ప్రధాన కార్యదర్శి కన్నబోయిన కొమురక్క కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అక్బర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ పీఏసీఏస్ చైర్మన్ వామన్ రావు బిజెపి మండల నాయకులు కన్నెబోయిన ఐలయ్య ఎమ్మార్పీఎస్ టౌన్ అధ్యక్షులు చింతకుంట సదానందం తదితరులు పాల్గొన్నారు
అన్ని రకాల పంటలకు నానో యూరియా వాడవచ్చు ఎందు కంటే ఇది నేరుగా ఆకులపై పిచికారి చేయడం వల్ల పోషకా లను అందిస్తుంది నీరు నేల కాలుష్యాన్ని తగ్గిస్తుంది మరి యు సాధారణ యూరియా కంటే తక్కువ మోతాదులో ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది.నానో యూరియా అనేది పర్యా వరణహితమైంది రవాణాకు సులభం మరియు పంట ఆరోగ్యం దిగుబడిని మెరుగుపరచడంలో సహా యపడుతుంది కాబట్టి నానో యూరియా వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
నానో యూరియా ప్రయోజనాలు
నానో యూరియా నేరుగా ఇవ్వడం ద్వారా ఆకులపై పిచికారి చేస్తే మొక్కలు దానిని గ్రహించి నేరుగా పోషకాలను పొందుతాయి. తక్కువ మోతా దులో ఎక్కువ ప్రభావం కాబట్టి సాంప్రదాయ యూరియాతో పోలిస్తే నానో యూరియా చాలా తక్కువ మోతాదులో నత్రజని పంటకు అవసరం అవుతుంది. ఖర్చు ఆదా పంటలు ఆరోగ్యం ఇది పంటల నాణ్యత ఆకుల ఆరోగ్యాన్ని మరియు కాయ పక్వాన్ని మరియు పెరుగుదలను పెంచుతుంది
చీడపీడలు తెగుళ్ల నుండి కాపాడుతుంది
పత్ర హరితం మెరుగుపడి కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ సామర్థ్యం పెరిగి పంట నాణ్యత ఆకుల ఆరోగ్యం, కాయపెరగడంతో సహకరి స్తుంది నేల,నీరు,గాలి కాలు ష్యాన్ని తగ్గించడం పర్యావరణ హిత వ్యవసాయానికి నానో యూరియా ఎంతగానో తోడ్పడుతుంది. చీడ పీడలు తెగుళ్ల వేగాన్ని తగ్గిస్తుంది. నిల్వ రవాణా సౌకర్యంలో రైతులకు సౌకర్యవంతంగా ఉంటుంది
నానో యూరియా అన్ని పంటలకు వాడండి
మండల వ్యవసాయ అధికారి గంగా జమున
ఒక ఎకరాకు 500 మిల్లీ లీటర్ల నానో యూరియా వాడడం ద్వారా పంటలకు కావాల్సిన నత్రజని సమర్థవంతంగా అందిస్తుందని వివరించారు. మొక్కల ఆకు ద్వారా కణాలు సులభంగా రవాణా అయి శీస్రమైన శోషనాలు కారణ మవుతాయని తెలిపారు. సాంప్రదాయ యూరియాతో పోలిస్తే లోతుగా నిల్వ కావడం వల్ల వాయు రూపంలో నత్రజని ఆవిరి తక్కువ ఉంటుందన్నారు. దానివలన పంట దిగుబడులు 10 నుంచి 20% దిగుబడులు పెరుగు తాయని తెలిపారు. రైతులు తప్పనిసరిగా పంటల వృద్ధిని మెరుగుపరచడం కోసం నానో యూరియా, నానో డిఏపి, ఎరువులను వాడాలి
– మరో మూడు రోజులు ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి…..
– జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్…
కొల్చారం,( మెదక్)నేటి ధాత్రి:-
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ కోరారు. పాత ఇళ్లలో ఉన్నవారు కూలిపోయే దశలో ఉన్న ఇళ్ల నుండి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అన్నారు. నదులు,చెరువులు,వాగులు లోతట్టు ప్రాంతాలు,కల్వర్టులు వంటి ప్రాంతాలకు వెళ్ళకూడదు అని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుండి బయటికి రాకూడదు, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరారు. ఇంకా మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది. కావున రైతులు పొలాలో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు వహించాలి. విద్యుత్ స్తంభాలను గాని, వైర్లను కానీ తడిచిన చేతులతో తాకకకూడదు. నీరు నిలువ ఉన్న విద్యుత్ స్తంభాల దగ్గర నుండి వెళ్లారాదు అని భాగ్యరాజ్ తెలిపారు.
వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకోవాలని మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి ప్రజలకు సూచించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, డిఐజి (ఐపీఎస్), మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్ ఐపీఎస్, బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ ల ఆదేశాల మేరకు మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) శశిధర్ రెడ్డి గణేష్ మండప నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు పండుగను ఆనందంగా జరుపుకునే క్రమంలో భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.గణేష్ మండపాల ఏర్పాట్లు గురించి పోలీస్ వారికి సమాచారం అందించాలని, విగ్రహం సైజు, బరువు, ఉత్సవాల తేదీలు, నిమజ్జనం వివరాలు, కమిటీ సభ్యుల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుని, అనుభవజ్ఞులైన వారి ద్వారా మాత్రమే విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేయించుకోవాలి. గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ, విద్యుత్ శాఖల నుండి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. వివాదాస్పద స్థలాల్లో మండపాలు ఏర్పాటు చేయకూడదు.
జాగ్రత్తలు పాటించాలి మండపాల వద్ద అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిర్వాహకులు పూర్తి బాధ్యత వహించాలి. రాత్రిపూట కనీసం ఇద్దరు కమిటీ సభ్యులు కాపలాగా ఉండి, చిన్న పిల్లలు, వృద్ధులను మండపాల వద్ద పడుకోనివ్వరాదు. మండపంలో మండే స్వభావం ఉన్న పదార్థాలు లేదా పటాకులు ఉంచకూడదు. అగ్నిప్రమాదాలు జరిగితే వాటిని అదుపు చేయడానికి ఇసుక, నీటిని సిద్ధంగా ఉంచుకోవాలి. ఉదయం 8 నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లు వినియోగించాలి. ఇతర మతాలు, కులాలను కించపరిచే పాటలు లేదా అసభ్యకరమైన పాటలు పెట్టరాదు. గణేష్ మండపం వద్ద లేదా ఊరేగింపులో డీజేలను వాడటం పూర్తిగా నిషేధం. ఊరేగింపు సమయంలో ముస్లిం ప్రార్థనల వేళ మసీదుల వద్ద మైకులు ఆపి, ప్రశాంతంగా వెళ్ళాలి. మండపాలు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకుండా ఏర్పాటు చేయాలి. నిమజ్జనం మరియు పర్యావరణ పరిరక్షణ నిమజ్జనం రోజున పోలీసులు సూచించిన మార్గాల్లో మాత్రమే ఊరేగింపు నిర్వహించాలి. ఊరేగింపు నిర్ణీత సమయంలోగా పూర్తయ్యేలా చూసుకోవాలి. ఊరేగింపు సమయంలో వాలంటీర్లను నియమించుకుని, కమిటీ సభ్యులు విగ్రహంతో పాటు ఉండాలి. మద్యం తాగి నిమజ్జనంలో పాల్గొనరాదు. సమావేశం సందర్భంగా పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి గణపతులను పూజించాలని సీఐ శశిధర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మట్టి గణపతులను నిర్వాహకులకు పంపిణీ చేశారు. ఈ సమావేశంలో ఎస్ఐ రాజశేఖర్, ఎలక్ట్రిసిటీ ఏఈ, గణేష్ మండపాల నిర్వాహకులు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఝరాసంగం మండల కేంద్రంలో ఉన్న శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా అమృతగుండం నిండుకుండలా మారింది. ఆలయ సిబ్బంది భక్తులను ఆలయంలోకి అనుమతించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల్ సబ్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ పటేల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలలో నివాసం ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, శితిలావస్తాలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండరాదని అన్నారు. నీళ్ళలో ఉన్న కరెంట్ పోల్స్ దగ్గర నుండి వెళ్లారాదని పొంగిపోర్లే వాగులు, వంకలను చూడటానికి వెళ్లకూడదని, జలాశయాలు నిండు కుండలా మారి ప్రమాదాలు జరగటానికి అవకాశం ఉంటుందని పొంగిపోర్లే వాగులను దాటడానికి ప్రయత్నించకూడదని అన్నారు. అత్యవసర సమయాలలో డైల్ 100 లేదా సమీప పోలీసు స్టేషన్ కు సమాచారం అందించాలని ఝరాసంగం మండలం పరిసర ప్రజలకు సబ్ ఇన్స్పెక్టర్ తెలిపారు.
భారీ వర్షాలు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – బిఆర్ఎస్ నాయకుడు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం బిఆర్ఎస్ పార్టీ మెదపల్లి మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పటేల్,ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు.
వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నందున ఇళ్ల నుండి బయటకు వెళ్లవద్దని, రైతులు వ్యవసాయ బోర్ల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరెంటు స్తంభాలను తాకరాదని, ముఖ్యంగా చిన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, గణేష్ మంటపాల వద్ద కూడా తగు జాగ్రత్తలు పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అకాల వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని బిఆర్ఎస్ యువ నాయకులు షేక్ సోహెల్ అన్నారు
జహీరాబాద్ నేటి ధాత్రి:
అకాల వర్షాలకు జాగ్రత్త: ప్రజలు అప్రమత్తంగా ఉండండి – షేక్ సోహెల్ బిఆర్ఎస్, తుమ్మనపల్లి గ్రామ యువ నాయకులు మాట్లాడుతూ ఇటీవలగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని, నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.ప్రజలు తక్కువ ప్రాంతాల నుంచి పర్యవేక్షణలో ఉండి, అలాంటి విపత్తులు ఎదురైతే అధికారులు లేదా స్థానిక నాయకులకు వెంటనే సమాచారం ఇవ్వాలని.”ప్రజల రక్షణకే ప్రాధాన్యం… ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు,”
నీట మునిగిన కాలనీ, స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే మాణిక్ రావు..
జహీరాబాద్ నేటి ధాత్రి:
కుండ పోత వర్షానికి పట్టణ పరిధిలోని డ్రీమ్ ఇండియా కాలనీ, ఇతర ప్రాంతాలు నీట మునిగాయి ,ఇళ్లల్లోకి నీరు చేరింది. విషయం తెలుసుకున్న జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు కాలనీలలో స్వయంగా వరద నీటిలోనికి దిగి నీట మునిగిన ఇళ్లను, ప్రవాహాన్ని స్వయంగా తమ ఫోన్ లో ఫోటోలు తీసి ఉన్నత అధికారులకు పంపించారు. అధికారులతో స్వయంగా చరవాణి ద్వారా మాట్లాడారు. కాలనీ వాసులతో మాట్లాడి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. నీట మునిగిన ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ఆధైర్య పడకండి అండగా ఉంటానని వారికి ధైర్యాన్ని ఇచ్చారు. వర్షపు నీటిని బయటకు పంపించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని అక్కడికి వచ్చిన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వర్షం కురుస్తున్నందున అధికారులు పర్యవేక్షిస్తూనే ఉండాలని తెలిపారు.ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు తెలియజేయాలని ప్రజలకు తెలియజేశారు. ఎమ్మెల్యే గారితో పాటు గా మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు .
ఝరాసంగం:ఇక్కడ పారిశుధ్య లోపంతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు.నిధుల కొరత పేరుతో గ్రామాల్లో ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు.
ముఖ్యంగా ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఇక్కడి కార్యదర్శులు ఆడిందే ఆట పాడిందే పాట సాగుతుంది.
అందుకు నిదర్శనంగా ఝరాసంగం మండలంలోని బిడకన్నె,కంబాలపల్లి,కృష్ణాపూర్ గ్రామాల దుస్థితి గురించి చెప్పవచ్చు.ఈ గ్రామాలలో కనీసం పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా సక్రమంగా చేపట్టకపోవడంతో నిత్యం అవస్థలు పడుతున్నట్లు ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.ఈ గ్రామాల్లో విధిగా మురికి కాలువలు శుభ్రం చేయకపోవడంతో చెత్తాచెదారం నుండి దుర్గంధం వెదజల్లుతుంది.
దీంతో ఈగలు,దోమలు,బ్యాక్టీరియా వెదజల్లి రోగాల బారిన పడుతున్నట్లు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం వర్షాకాలంలోనైనా బ్లీచింగ్ పౌడర్ నైనా సరిగా చల్లడం లేదని వారు వివరించారు.నిధుల కొరత పేరుతో ప్రజల కనీస అవసరాలు తీర్చ తీర్చకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అదేవిధంగా తాగునీటి బోర్లు,మంచినీటి కుళాయిలు ఇతర నీటి పథకాల వద్ద మురుగునీరు నిలుచుని పిచ్చిగడ్డి మొలవడంతో పారిశుద్ధ్యం కొరవడి ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు.కనీసం గ్రామాలలో వీధి బల్బులు కూడా సక్రమంగా బిగించకపోవడంతో రాత్రిపూట అంధకారం నెలకొని ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.ఈ ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నత అధికారుల పర్యవేక్షణ కొరవడిందని, కనీసం మండల స్థాయి అధికారులైన గ్రామాలను సందర్శించకుండా నిర్లక్ష్యం చేయడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని పలువురు ఆరోపించారు.
Suffer Due to Poor Sanitation
కాగా తమ గ్రామ సమస్యలను కార్యదర్శి ఏమాత్రం పట్టించుకోవడంలేదని మంగళవారం బిడకన్నె గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.సీపీఎం కార్యదర్శి చంద్రన్న ఆధ్వర్యంలో ఆ గ్రామస్తులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు.చెత్త చెదారం నిండి దుర్గంధం వెదజల్లుతున్న మురికి కాలువలను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లారని వారు కోరారు.మంచినీటి పథకాలు పనిచేయకపోవడంతో పాటు మిషన్ భగీరథ నీళ్లు సరఫరా కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు వారు తెలిపారు.వీధి బలుపులు లేక రాత్రి వేళలో ఇబ్బందులు పడుతున్నట్లు వారు తెలియజేశారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నత అధికారులు తగిన చర్యలు తీసుకుని తమ గ్రామాల సమస్యలను పరిష్కరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఉప్పు సర్పంచ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల నర్సాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ మండల ప్రజలందరికీ యువ నాయకులు మాజీ ఉప్పు సర్పంచ్ గోపాల్ మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా మీ కందరికీ సకల శుభాలు కలగాలని జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని గణనాథుని వేడుకుంటూ విగ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో అభివృద్ధిలో ముందడుగు వేయాలని నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తిశ్రద్ధలతో వినాయకుడిని ప్రార్థించి దేవదేవుని అనుగ్రహం పొందాలన్నారు,
ఝరాసంగం: పెంపుడు జంతువులు, మనుషుల మధ్య మంచి సంబంధాలు ఉంటాయి. ఇందులో కుక్కలు ముందు వరుసలో ఉంటాయి. అయితే ఈ తరుణంలోనే ఓ పిల్లి… తన విశ్వాసాన్ని ప్రదర్శించింది. నాగుపాము బారి నుంచి ఇద్దరి ప్రాణాలను కాపాడిన ఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామంలో జరిగింది.మంగళవారం అర్థరాత్రి గొల్ల నర్సమ్మ-సిద్దన్న దంపతులు ఇంట్లో నిద్రలో ఉండగా, నాగుపాము ఇంట్లోకి ప్రవేశించింది. ఈ దృశ్యాన్ని గమనించిన వారి పెంపుడు పిల్లి… ఆ పాముపై దాడి చేసి అడ్డుకుంది. వేటాడి దానిని చంపేసింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఉదయం లేచిన దంపతులు… ఇంట్లో చనిపోయి ఉన్న పామును చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తర్వాత అది పిల్లి ధైర్యంతో ఊపిరిపీల్చుకున్నారు. చంపిందని గ్రహించి ఊపిరి పీల్చుకున్నారు
బాబు క్యాంప్ సంఘమిత్ర ఆధ్వర్యంలో.కొలువుదీరిన బొజ్జ గణపయ్య.
బెల్లంపల్లి నేటిధాత్రి :
బెల్లంపల్లి పట్టణంలోని బాబు క్యాంప్ సంఘమిత్ర యూత్ క్లబ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో వినాయకచవితి వేడుకలు జరిగాయి గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు.
పూజారి గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రసాదాలు తీసుకొచ్చి భక్తిశ్రద్ధలతో పూలు పండ్లతో పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సంఘమిత్ర యూత్ క్లబ్ కమిటీ సభ్యులు బస్తీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.