రామాయంపేటలో వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన
ప్రజల సమస్యలు తెలుసుకున్న మెదక్ ఎంపీ మాధవిని రఘునందన్ రావు..
రామాయంపేట ఆగస్ట్ 28 నేటి ధాత్రి (మెదక్)
ఈ రోజు మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవిని రఘునందన్ రావు రామాయంపేట పట్టణంలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. అకస్మాత్తుగా కురిసిన వర్షాల కారణంగా పలు కాలనీలు జలమయం కావడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అధికారులను కూడా వివరాలు అడిగి తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ అకాల వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం తరఫున సహాయం అందించడానికి తాను కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. పట్టణంలో నీటి పారుదల సమస్యలు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకునే దిశగా కృషి చేస్తానని తెలిపారు.
ఈ సందర్శన కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు శిలం అవినాష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు బాలరాజ్ మల్లేష్ గౌడ్, మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, రాగి రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నమైన శ్రీనివాస్, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్, జిల్లా నాయకులు వెలుముల సీద్దరాములు, శంకర్ గౌడ్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రం ప్రశాంత్ గౌడ్, పట్టణ ఉపాధ్యక్షులు జొన్నల భరత్, భాసం అనిల్, కడెం సిద్ధార్థ, లావణ్య, కటిక కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.