భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా
ఉండాలి సబ్ -ఇన్స్పెక్టర్ ఝరాసంగం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల్ సబ్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ పటేల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలలో నివాసం ఉండే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, శితిలావస్తాలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండరాదని అన్నారు. నీళ్ళలో ఉన్న కరెంట్ పోల్స్ దగ్గర నుండి వెళ్లారాదని పొంగిపోర్లే వాగులు, వంకలను చూడటానికి వెళ్లకూడదని, జలాశయాలు నిండు కుండలా మారి ప్రమాదాలు జరగటానికి అవకాశం ఉంటుందని పొంగిపోర్లే వాగులను దాటడానికి ప్రయత్నించకూడదని అన్నారు. అత్యవసర సమయాలలో డైల్ 100 లేదా సమీప పోలీసు స్టేషన్ కు సమాచారం అందించాలని ఝరాసంగం మండలం పరిసర ప్రజలకు సబ్ ఇన్స్పెక్టర్ తెలిపారు.