రాంపురం ప్రాథమిక పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు…

రాంపురం ప్రాథమిక పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

మరిపెడ నేటిధాత్రి.

 

 

పాఠశాలలోని విద్యార్థులు ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించడం జరిగింది .ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు హీరాలాల్ మాట్లాడుతూ విద్యార్థులతో కలిసి ఆటపాటలతో పాలుపంచుకొని బతకమ్మ పండుగ నేపథ్యాన్ని వివరించారు.తెలంగాణలో బతుకమ్మ పండుగ వెయ్యి ఏండ్ల నాటిదని బతుకమ్మ పండుగ తెలంగాణ యొక్క సంస్కృతి ,సాంప్రదాయాలకు ప్రతీక అని,ప్రకృతిని, పుడమితల్లని స్థానికంగా దొరికే గుమ్మడి, తంగేడు, గునుగు, బంతి, చామంతి పూలతో అలంకరించి గౌరీ దేవికి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ జరుపుకునే స్త్రీల పండుగ…ఈ పండుగ భాద్రపద మాసంలో పితృ అమావాస్య నుండి తొమ్మిది రోజులపాటు తీరొక్కపూలతో బతకమ్మను అలంకరించి ఆటపాటలతో ఆడుకుంటారని తెలిపారు.చివరి రోజు సద్దుల బతుకమ్మ నాడు పూల బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారని చెప్పారు. నేడు బతుకమ్మ కేవలం పండుగ మాత్రమే కాకుండా తెలంగాణ అస్తిత్వానికి,సంస్కృతికి ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. స్త్రీల ఐక్యతను సామాజిక కలయికను ప్రోత్సహిస్తుందని పంటలు బాగా పండాలని ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ తెలుగువారు మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా ప్రవాసభారతీయులు అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటారని ప్రకృతితో మమేకమైన ఈ పండుగ అందరూ ఉత్సాహంగా నిర్వహించుకోవాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం గుర్రం వెంకన్న గౌడ్, గణేష్,రాజేశ్వరి,క్రాంతి,శ్రీధర్, సిఅర్పి దోమల సత్య శ్రీనివాస్ గౌడ్ విద్యార్థుల తల్లిదండ్రులు బందు పరశురాములు, మంజుల తదితరులు పాల్గొన్నారు.

కొలువుదీరిన బొజ్జ గణపతులు..

కొలువుదీరిన బొజ్జ గణపతులు..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

తొమ్మిది రోజులపాటు ఘనంగా పూజలు అందుకోనున్న గణనాథుడు రామకృష్ణాపూర్ పట్టణంలో వివిధ మండపాలలో కొలువ తీరాడు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అమ్మ గార్డెన్, తిమ్మాపూర్ , కుర్మపల్లి,క్యాతనపల్లి, శేషు పల్లి, అమరవాది, రామకృష్ణాపూర్ ఏరియాలలో భాజా భజంత్రీలు, మంగళహారతుల మధ్య చిన్న పెద్ద తేడా లేకుండా వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు. కొలువుదీరిన గణనాథులకు వేద పండితులు, నవగ్రహ పూజలతో ప్రజలు , పుర ప్రముఖులు పూజలు నిర్వహించారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు పట్టణంలో ప్రముఖ వినాయక మండపాల్లో మట్టి వినాయకులను ప్రతిష్టించారు.వినాయక విగ్రహాల ఏర్పాటుతో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడి, చిన్నా పెద్దా అంతా భక్తితో పూజలు నిర్వహించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version