రామాయంపేటలో వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన…

రామాయంపేటలో వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన
ప్రజల సమస్యలు తెలుసుకున్న మెదక్ ఎంపీ మాధవిని రఘునందన్ రావు..

రామాయంపేట ఆగస్ట్ 28 నేటి ధాత్రి (మెదక్)

ఈ రోజు మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మాధవిని రఘునందన్ రావు రామాయంపేట పట్టణంలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. అకస్మాత్తుగా కురిసిన వర్షాల కారణంగా పలు కాలనీలు జలమయం కావడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అధికారులను కూడా వివరాలు అడిగి తక్షణం సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ అకాల వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం తరఫున సహాయం అందించడానికి తాను కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. పట్టణంలో నీటి పారుదల సమస్యలు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకునే దిశగా కృషి చేస్తానని తెలిపారు.
ఈ సందర్శన కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు శిలం అవినాష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు బాలరాజ్ మల్లేష్ గౌడ్, మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, రాగి రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నమైన శ్రీనివాస్, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్, జిల్లా నాయకులు వెలుముల సీద్దరాములు, శంకర్ గౌడ్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రం ప్రశాంత్ గౌడ్, పట్టణ ఉపాధ్యక్షులు జొన్నల భరత్, భాసం అనిల్, కడెం సిద్ధార్థ, లావణ్య, కటిక కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

సిరిసిల్లలోని గంగమ్మకు గంగపుత్రులు ప్రత్యేక పూజలు…

సిరిసిల్లలోని గంగమ్మకు గంగపుత్రులు ప్రత్యేక పూజలు

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని మానేరు వాగు లోని గంగమ్మ దేవాలయం వరకు ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటి ప్రవాహానికి సిరిసిల్ల
గంగ పుత్రులు ప్రత్యేకంగా గంగమ్మకు శాంతి చేకూరాలని బోనాలతో మరియు అమ్మవారి విగ్రహ పల్లకి సేవతో ఊరేగింపుగా బయలుదేరి మానేరు గంగమ్మ నీటిలో ప్రత్యేక కుంకుమ పూజలు కార్యక్రమం ఏర్పాటు చేయడానికి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణకు సంబంధించిన గంగపుత్రులు మరియు పరిసర గ్రామాల గంగపుత్రులు అంగరంగ వైభవంగా వెళ్లి మానేరు గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది.

నేడు ఆషాఢం పోచమ్మ బోనాలు..

నేడు ఆషాఢం పోచమ్మ బోనాలు

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలోని 23వ వార్డులో ఆదివారం రోజున ఘనంగా అంగరంగ వైభవంగా పోచమ్మ బోనాల పండగ నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవంతంగా ఈ వేడుకలు జరపడం తృతీయ సంవత్సరం అని,ప్రతి సంవత్సరం అమ్మవారిని అలంకరించి బోనాలతో అమ్మవారికి మొక్కులు చెల్లిస్తామని అన్నారు.అలాగే నస్పూర్ లోని తెలంగాణ తల్లి విగ్రహం నుండి పోచమ్మ దేవాలయం వరకు ఆడపడుచులు ఎత్తుకున్న బోనాలతో,డప్పు చప్పులతో, ఆటపాటలతో,పోతరాజుల వేషధారణలో భక్తులు చేరుకొని అమ్మవారికి మొక్కుబడులు చెల్లించడం జరుగుతుందని అన్నారు.మహిళలు,భక్తులు ఆషాడ బోనాల ఉత్సవ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్రహంకు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ కోరారు.

హమాలీ కాలనీ పెద్దమ్మ మందిరం ఆధ్వర్యంలో బోనాలు.

హమాలీ కాలనీ పెద్దమ్మ మందిరం ఆధ్వర్యంలో బోనాలు….

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని హమాలీ కాలనీ లో శనివారం బోనాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పెద్దమ్మ ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 1 గంటలకు బోనాలు నిర్వహించడం జరుగుతుందని మహిళ లు సమయానికి బోనాల తీసుకొని రాగలరని ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తులు అందరు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదలు పొందగలరని, అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

వైభవంగా పెద్దమ్మ తల్లి బోనాలు.

వైభవంగా పెద్దమ్మ తల్లి బోనాలు

హన్మకొండ నేటిధాత్రి:

హనుమకొండ జిల్లా లక్ష్మీపురం గ్రామంలో ఆదివారం ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి బోనాలను ముదిరాజ్ కులస్తులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం మహిళలు బోనాలు ఎత్తుకొని డప్పు చప్పుల్లు శివసత్తుల పూనకాల మధ్య ఆలయానికి చేరుకొని అమ్మవారికి మొక్కులు సమర్పించారు. ముదిరాజ్ సంఘం గ్రామ అధ్యక్షులు పల్లెబోయిన శ్రీనివాస్ కార్యదర్శి ఆలేటి రవీందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఈ కార్యక్రమంలో పల్లెబోయిన నర్సయ్య, గంగబోయిన రవీందర్, పుట్ట తిరుపతి, శ్రీముర్తి, పుట్ట రమేష్, పల్లెబోయిన నరేష్, పల్లెబోయిన కృష్ణ, పల్లెబోయిన కుమార్, పల్లెబోయిన రమేష్, పల్లెబోయిన శివమణి, పల్లెబోయిన సంపత్,పల్లెబోయిన రాజు, తిరుపతి,పల్లెబోయిన రమేష్, సురేష్, పుట్ట రాజు, పుట్ట భద్రి, పుట్ట కుమార్, పుట్ట రమేష్, పుట్ట నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

బీరప్ప స్వామి వారికి ఘనంగా బోనాలు.

శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి వారికి ఘనంగా బోనాలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం మండలం లోని కొల్లూర్ గ్రామస్తులు, గొల్ల కుర్మ కులస్తులు మహిళలు బుధవారం శ్రీ బీరప్ప స్వామి వారి జాతర ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామి వారికి అభిషేకము, కుంకుమార్చన, అలంకరణ, సాయంత్రం గ్రామానికి చెందిన మహిళలు గ్రామస్తులు బోనాలతో ఊరేగింపుగా వచ్చి బోనాల నైవేద్యం సమర్పించారు. ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాల మధ్య భక్తిశ్రద్ధలతో బోనాల ఊరేగింపు శోభాయ మానంగా జరిగింది. ఉత్సవాలు తిలకించేందుకు వివిధ గ్రామాల ప్రజలు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శ్రీ బీరప్ప దేవాలయ కమిటీ కుర్మా సంఘం గ్రామ పెద్దలు పూర్తిస్థాయి ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version