నానో యూరియా వాడకం ప్రయోజనం
ఖర్చు తక్కువ దిగుబడి ఎక్కువ
శాయంపేట నేటిధాత్రి:
అన్ని రకాల పంటలకు నానో యూరియా వాడవచ్చు ఎందు కంటే ఇది నేరుగా ఆకులపై పిచికారి చేయడం వల్ల పోషకా లను అందిస్తుంది నీరు నేల కాలుష్యాన్ని తగ్గిస్తుంది మరి యు సాధారణ యూరియా కంటే తక్కువ మోతాదులో ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది.నానో యూరియా అనేది పర్యా వరణహితమైంది రవాణాకు సులభం మరియు పంట ఆరోగ్యం దిగుబడిని మెరుగుపరచడంలో సహా యపడుతుంది కాబట్టి నానో యూరియా వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
నానో యూరియా ప్రయోజనాలు
నానో యూరియా నేరుగా ఇవ్వడం ద్వారా ఆకులపై పిచికారి చేస్తే మొక్కలు దానిని గ్రహించి నేరుగా పోషకాలను పొందుతాయి. తక్కువ మోతా దులో ఎక్కువ ప్రభావం కాబట్టి సాంప్రదాయ యూరియాతో పోలిస్తే నానో యూరియా చాలా తక్కువ మోతాదులో నత్రజని పంటకు అవసరం అవుతుంది. ఖర్చు ఆదా పంటలు ఆరోగ్యం ఇది పంటల నాణ్యత ఆకుల ఆరోగ్యాన్ని మరియు కాయ పక్వాన్ని మరియు పెరుగుదలను పెంచుతుంది
చీడపీడలు తెగుళ్ల నుండి కాపాడుతుంది
పత్ర హరితం మెరుగుపడి కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ సామర్థ్యం పెరిగి పంట నాణ్యత ఆకుల ఆరోగ్యం, కాయపెరగడంతో సహకరి స్తుంది నేల,నీరు,గాలి కాలు ష్యాన్ని తగ్గించడం పర్యావరణ హిత వ్యవసాయానికి నానో యూరియా ఎంతగానో తోడ్పడుతుంది. చీడ పీడలు తెగుళ్ల వేగాన్ని తగ్గిస్తుంది. నిల్వ రవాణా సౌకర్యంలో రైతులకు సౌకర్యవంతంగా ఉంటుంది
నానో యూరియా అన్ని పంటలకు వాడండి
మండల వ్యవసాయ అధికారి గంగా జమున
ఒక ఎకరాకు 500 మిల్లీ లీటర్ల నానో యూరియా వాడడం ద్వారా పంటలకు కావాల్సిన నత్రజని సమర్థవంతంగా అందిస్తుందని వివరించారు. మొక్కల ఆకు ద్వారా కణాలు సులభంగా రవాణా అయి శీస్రమైన శోషనాలు కారణ మవుతాయని తెలిపారు. సాంప్రదాయ యూరియాతో పోలిస్తే లోతుగా నిల్వ కావడం వల్ల వాయు రూపంలో నత్రజని ఆవిరి తక్కువ ఉంటుందన్నారు. దానివలన పంట దిగుబడులు 10 నుంచి 20% దిగుబడులు పెరుగు తాయని తెలిపారు. రైతులు తప్పనిసరిగా పంటల వృద్ధిని మెరుగుపరచడం కోసం నానో యూరియా, నానో డిఏపి, ఎరువులను వాడాలి