వీరమల్లుకు క్రిష్‌ విషెస్…

వీరమల్లుకు క్రిష్‌ విషెస్…

చిత్రసీమలో నాన్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ గా క్రిష్ కు పేరుంది. గతంలో ఆయన కంగనా రనౌత్ నిర్మించిన ‘మణికర్ణిక’ చిత్రం నుండి మధ్యలోనే తప్పుకున్నారు. అలానే పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ మూవీ నుండి కూడా ఆయన అర్థంతరంగా వైదొలగారు. అయినా… ఈ సినిమా విడుదల వేళ చిత్రబృందానికి క్రిష్ విషెస్ తెలిపారు.

‘హరి హర వీరమల్లు’ (Harihara Veeramallu) అనేది ప్రముఖ దర్శకుడు క్రిష్‌ (Krish) బ్రెయిన్ చైల్డ్. సీనియర్ నిర్మాత ఎ.ఎం. రత్నం (A.M. Ratnam) కు సినిమా చేస్తానని మాట ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రకరకాల కథలు విన్నారు. కొన్ని రీమేక్స్ మీద దృష్టి పెట్టారు. చివరకు క్రిష్ చెప్పిన హరిహర వీరమల్లు కు కథకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అప్పటి నుండి సినిమా సెట్స్ పైకి వెళ్ళే వరకూ క్రిష్‌ ఎంతో హోమ్ వర్క్ చేశారు. ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి (Thota Tarani) తో పాటు సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ తో పాటు చర్చోపచర్చలు జరిపారు. ఈ కథ 17వ శతాబ్దానికి చెందిన ఓ యోధుడిది కావడంతో ఆ సమయానికి సంబంధించిన యుద్ధ విద్యలలో పవన్ కళ్యాణ్‌ సైతం శిక్షణ తీసుకున్నారు. భారీ అంచనాలతో మొదలైన ‘హరిహర వీరమల్లు’ నిర్మాణం ఊహించని విధంగా ఆలస్యమైంది. మధ్యలో కరోనా మహమ్మారి సైతం రెండు సార్లు వచ్చి వెళ్ళిపోయింది.

వేరే ప్రాజెక్ట్ లతో పాటు వ్యక్తిగత కారణంగా ఈ ప్రాజెక్ట్ నుండి క్రిష్‌ తప్పుకోవడంతో దీనిని పూర్తి చేసే బాధ్యతను ఎ. ఎం. రత్నం తనయుడు జ్యోతికృష్ణ (Jyothi Krishna) భుజానికి ఎత్తుకున్నాడు. ఈ సినిమాను క్రిష్ అంగీకారంతోనే జ్యోతికృష్ణకు అప్పగించామని అప్పట్లోనే రత్నం ప్రకటించారు. కానీ క్రిష్ మాత్రం దీని గురించి ఇప్పటి వరకూ పెదవి విప్పలేదు. ఆయన తనంతగా తాను బయటకు వెళ్ళారా? లేక వెళ్ళాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయా? అనే విషయంలో క్లారిటీ లేదు. ఇంతవరకూ జరిగిన ఫిల్మ్ పబ్లిసిటీలో జ్యోతికృష్ణ పేరుతో పాటు క్రిష్ పేరునూ దర్శకుడిగా ఉదహరిస్తూనే ఉన్నారు. సోమవారం ఉదయం జరిగిన ‘హరిహర వీరమల్లు’ ప్రెస్ మీట్ లోనూ, అదే రోజు సాయంత్రం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను నిర్మాత రత్నంతో పాటు పవన్ కళ్యాణ్‌ సైతం క్రిష్‌ సేవలను పొగిడారు. ఈ సినిమా రూపకల్పనలో క్రిష్‌ కృషి ఎంతో ఉందని చెప్పారు.

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన శుభాకాంక్షలు.!

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

కాంగ్రెస్ ద్వారానే దేశంలో విద్యా, ఉపాధి అవకాశాలు పెరుగుతాయాని జహీరాబాద్ సీనియర్ నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి పేర్కొన్నారు.గురువారము రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ…2004,2009 రెండు పర్యాయాలు ప్రధాని పదవిని త్యాగం చేసిన ఘనత రాహుల్ గాంధీకి దక్కుతుందన్నారు.దేశంలో ఏ నాయకుడు చేయని విధంగా దేశ వ్యాప్తంగా ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు “భారత్ జోడో యాత్ర” పేరుతో పాదయాత్ర చేసిన ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ మాత్రమే నన్నారు.భారత దేశ ప్రజలను ఏకం చేయడం వారి సమస్యలను వినడం లక్ష్యంగా పెట్టుకొని యాత్రను విజయవంతం చేసుకుని,కోట్ల మంది గుండెల్లో ధైర్యం అనే జెండాను నాటి అండగా నిలుస్తున్న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు,యువ కిశోరుడు,రాహుల్ గాంధీ మాత్రమే అని అన్నారు.ఈ దేశంలోని చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగం,రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలిపారు.

ఎమ్మెల్యే కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన.

మానకొండూరు ఎమ్మెల్యే కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మండల .

పార్టీ నాయకులు….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

 

 

 

తంగళ్ళపల్లి మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బయలుదేరి మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కవ్వం పల్లి.

సత్యనారాయణ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు .

పుట్టినరోజు సందర్భంగా తంగళ్ళపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు బుక్స్ అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.

ఇట్టి కార్యక్రమంలో సిరిసిల్ల ఏఎంసీ డైరెక్టర్ ఆరెపల్లి బాలు.

కాంగ్రెస్ పార్టీ మానవ హక్కుల యువజన విభాగం అధ్యక్షులు గుగ్గిల భరత్ గౌడ్.

కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు అందరు కలిసి ఇల్లంతకుంటమండలంలోని కాంగ్రెస్ పార్టీ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వం పల్లి సత్యనారాయణ.

పుట్టినరోజు వేడుకలను మండలంలో పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ కార్యక్రమంలో. జిల్లా మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

సలీం జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే.

బిఆర్ఎస్ యువ నాయకులు సలీం జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

బిఆర్ఎస్ యువ నాయకులు సలీం గారి జన్మదిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి శాలువా పూలమాలలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా,యువ నాయకులు మిథున్ రాజ్, బొల్లారం రత్నం , మాజి సర్పంచ్ సంజీవ్,కళాకారుడు సునీల్,నాయకులు జూబీర్,అమీర్,జగన్ తదితరులు .

వేణుగోపాల్ రావుకు జర్నలిస్టుల శుభాకాంక్షలు.

వేణుగోపాల్ రావుకు జర్నలిస్టుల శుభాకాంక్షలు

షాద్ నగర్ /నేటి ధాత్రి.

 

 

షాద్ నగర్ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా ఇటీవలే ఎన్నికైన వేణుగోపాలరావును షాద్ నగర్ స్థానిక జర్నలిస్టులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక దేవి గ్రాండ్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో వేణుగోపాల్ రావును కలుసుకున్న జర్నలిస్టులు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు ఖాదర్ పాషా, కస్తూరి రంగనాథ్, రాఘవేందర్ గౌడ్, శేఖర్ రెడ్డి, నరేష్, నరసింహారెడ్డి, ఎ.అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇష్టరాజ్యంగా ఇంటి ఇంటి నెంబర్లు.!

*ఇష్టరాజ్యంగా ఇంటి ఇంటి నెంబర్లు. 
చందానగర్ సర్కిల్ రెవెన్యూ అధికారుల నిర్వాకం బాగోతం*. 

శేర్లింగంపల్లి, నేటి ధాత్రి:

 

శేరిలింగంపల్లి జోనల్ పరిధిలోని చందానగర్ సర్కిల్(21) లో జిహెచ్ఎంసి అధికారుల లీలలు.

సరైన పత్రాలు లేని ఖాళీ స్థలానికి ఇంటి నెంబర్లు కేటాయించిన అధికారులు.

విషయం పై అధికారులకు చేరడంతో విచారణకు ఆదేశించిన శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి.

విచారణలో అధికారులు అవినీతికి పాల్పడినట్లు నిర్ధారణ.

చందానగర్ డిప్యూటీ కమిషనర్ తో పాటు ఏఎంసీ,టాక్స్ ఇన్స్పెక్టర్ మరియు బిల్ కలెక్టర్ లకు మెమోలు జారీ చేసిన శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్.

మోహన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే..

మోహన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే..

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు , ఎస్సీ సెల్ నియోజవర్గ అధ్యక్షులు బండి మోహన్ జన్మదిన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేక్ కటింగ్ నిర్వహించి జన్మదిన శుభాకంక్షలు తెలిపిన శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు,మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప, మాజి ఆత్మ చైర్మన్ లు విజయ్ కుమార్, పెంట రెడ్డి ,న్యాల్కల్ మాజి జెడ్పీటీసీ స్వప్న భాస్కర్ ,పాక్స్ చైర్మన్ మచ్చెందర్ , మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ ,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు , మాజి మున్సిపల్ చైర్మన్ తంజిమ్,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మొహిద్దీన్,మాజి న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింహ రెడ్డి,యువ నాయకులు మిథున్ రాజ్,సీనియర్ నాయకులు మేతరి ఆనంద్ ,తులసి దాస్ గుప్తా,మాజి సర్పంచ్ రాజ్ శేఖర్ ,బి ఆర్ ఎస్వీ ఇన్చార్జి రాకేష్,దీపక్ ,నర్సింహ రెడ్డి,చంద్రయ్య,నరేష్ రెడ్డి,అలి ,సందీప్,నగేష్ ,శ్రీకాంత్,సురేష్,మనోజ్ ,శివ తదితరులు

టెన్త్ విద్యార్థులకు కేటీఅర్ విషెష్.!

టెన్త్ విద్యార్థులకు కేటీఅర్ విషెష్..!
– పరీక్షలు రాయడానికి ప్యాడ్, పెన్నుల పంపిణీ
– సిరిసిల్ల నియోజక వర్గంలో నేటి నుంచి పంపిణీ
– గిఫ్ట్ ఏ స్మైల్ పేరిట అందజేత
సిరిసిల్ల(నేటి ధాత్రి):
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ టెన్త్ విద్యార్థులకు చిరుకానుక అందజేస్తున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలు రాయడానికి ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేయనున్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ పేరిట గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా విద్యార్థులకు అందజేస్తున్నారు. మంగళవారం సిరిసిల్ల నియోజక వర్గంలో నీ సిరిసిల్ల పట్టణం, తంగళ్లపల్లి , ఎల్లారెడ్డి పేట, వీర్ణప ల్లి, గంభిరావుపేట, మూస్తాబాద్ లోని ప్రభుత్వ జడ్పీ హెచ్ ఏస్ పాఠశాల లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు అందివ్వనున్నారు.ఇందుకు పార్టీ నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులు పంపిణీ కి తగిన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులు, ఉపాద్యాయులు హర్షం వ్యక్తమవుతోంది. పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలనీ ఎమ్మెల్యే కేటీఆర్ ఆకాంక్షించారు. పరీక్ష రాయబోతున్న పదో తరగతి విద్యార్థులకు కే టీ అర్ శుభా కాంక్షలు  తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version