ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు…
– మరో మూడు రోజులు ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి…..
– జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్…
కొల్చారం,( మెదక్)నేటి ధాత్రి:-
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల పట్ల. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ కోరారు. పాత ఇళ్లలో ఉన్నవారు కూలిపోయే దశలో ఉన్న ఇళ్ల నుండి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అన్నారు. నదులు,చెరువులు,వాగులు లోతట్టు ప్రాంతాలు,కల్వర్టులు వంటి ప్రాంతాలకు వెళ్ళకూడదు అని సూచించారు.
అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుండి బయటికి రాకూడదు, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరారు. ఇంకా మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది. కావున రైతులు పొలాలో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు వహించాలి. విద్యుత్ స్తంభాలను గాని, వైర్లను కానీ తడిచిన చేతులతో తాకకకూడదు. నీరు నిలువ ఉన్న విద్యుత్ స్తంభాల దగ్గర నుండి వెళ్లారాదు అని భాగ్యరాజ్ తెలిపారు.