ఎరువుల డీలర్ పై కేసు నమోదు.

ఎరువుల డీలర్ పై కేసు నమోదు.

#6 ఏ కేసు నమోదు చేసి యూరియా నిలువల అమ్మకాలు నిలిపివేశారు.

#యూరియా కొరతను డీలర్లు సృష్టిస్తే పీడీ యాక్ట్ తప్పదు.

#ఏడిఏ దామోదర్ రెడ్డి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

యూరియాను కృతిమ కొరత సృష్టిస్తే సంబంధిత డీలర్ పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి డీలర్ లైసెన్సులను రద్దు చేయడం జరుగుతుందని నర్సంపేట ఏ డి ఏ దామోదర్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేపట్టారు. ఆదివారం రాత్రి యూరియా కోసం మండలంలోని బిల్లా నాయక్ తండా చెందిన రైతులు యూరియా కోసం మండల కేంద్రంలోని కర్ర మల్లారెడ్డి ఫర్టిలైజర్ షాపు వెళ్ళగా యూరియా నిలువలు ఉండంగా లేదని దురుసుగా రైతులపై మాట్లాడడంతో సదరు డీలర్ గోదాం దగ్గరికి వెళ్లి పెట్రోల్ బాటిల్ తీసుకొని ఆత్మహత్య ప్రయత్నానికి ప్రయత్నించగా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని రైతులను శాంత పరిచి సమాధానం చెప్పడంతో రైతులు శాంతించగా.

Fertilizer Dealer.

ఈ సంఘటన రాష్ట్ర, జిల్లా వ్యాప్తంగా సంచలనం కాగా అధికారులు స్పందించి కర్ర కృష్ణారెడ్డి డీలర్ల వద్ద ఉన్న ఎరువుల నిలువలపై స్టాక్ రిజిస్టర్ను పరిశీలించి 1000 బస్తాలు ఉండడంతో అట్టి యూరియా నిలువలను అధికారులకు సమాచారం ఇవ్వకుండా అమ్మరాదని సదర్ డీలర్ కర్ర కృష్ణారెడ్డిని హెచ్చరించారు. అనంతరం ఆయనపై 6 ఏ కేసు నమోదు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అలాగే మండలంలోని ఏ డీలర్ కూడా యూరియాకు లింకు పెట్టి అమ్మితే చట్ట రిత్యా చర్య తీసుకొని సంబంధిత డీలర్ లైసెన్సును రద్దు చేయబడుతుందని ఆయన పలువురు డీలర్లకు సూచించారు. ఆయన వెంట ఏవో బన్న రజిత, ఏ ఈ ఓ శ్రీకాంత్ రెడ్డి, రైతులు తదితరులు ఉన్నారు.

ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి.

ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:*

Dr. Satya Sarada.

ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ త్వరగా పరిష్కరించాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు.జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి , జడ్పీ సీఈవో రామ్ రెడ్డి, డిఆర్డిఓ కౌసల్యాదేవి,ఆర్డీవోలు వరంగల్ సత్యపాల్ రెడ్డి, నర్సంపేట ఉమారాణి ,హౌసింగ్ పీడీ గణపతి పాల్గొని ప్రజలనుండి దరఖాస్తులు స్వీకరించారు.ఈ ప్రజావాణిలో మొత్తం 150 దరఖాస్తులు రాగా ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించినవి 58, పిడి హౌసింగ్ 25, జి డబ్ల్యూ ఎం సి 13 దరఖాస్తులు రాగా, మిగతా శాఖలకు సంబందించిన దరఖాస్తులు 54 స్వీకరించామని కలెక్టర్ తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో స్వీకరీంచిన దరఖాస్తులను ప్రాధాన్యతా క్రమంలో పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ,డిసిఓ నీరజ, డిబిసిడివో పుష్పలత, కలెక్టరేట్ పరిపాలన అధికారి విశ్వప్రసాద్ వరంగల్, ఖిలా వరంగల్ తహసిల్దార్లు ఇక్బాల్,నాగేశ్వర్ రావు, సంబంధిత శాఖల అధికారులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాదాసి రవి.

పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాదాసి రవి

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాదాసి రవి ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా మాదాసి రవి మాట్లాడుతూ పట్టణంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.రాబోయే మున్సిపల్ ఎన్నికలలో పూర్తి స్థాయిలో సీట్లు గెలిపించేందుకు భాధ్యత వహిస్తానని పేర్కొన్నారు. నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నాకు అవకాశం కల్పించిన నర్సంపేట శాసన సభ్యులు దొంతి మాధవరెడ్డి, టిపీసీసీ సభ్యులు, పట్టణ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

గంజాయి డ్రగ్స్ కు బానిస అవ్వద్దు..

గంజాయి డ్రగ్స్ కు బానిస అవ్వద్దు..
• ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి..
• గ్రామాల్లో కళాజాత అవగాహన

నిజాంపేట: నేటి ధాత్రి

యువత గంజాయి ,డ్రగ్స్ కు బానిసై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సాంస్కృతిక కళాసారథి బృందం గ్రామాల్లో అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో మంగళవారం గ్రామస్తులకు పాటలు రూపంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్, పౌర సంబంధాల శాఖ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ప్రభుత్వ పథకాలతో పాటు, యువత చెడు మార్గం పెంచుకోవద్దని దానిపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ బడులలో ఒక పిల్లలను పంపించాలన్నారు. ప్రభుత్వ బడుల ఆవశ్యకతను ప్రజలకు పాటల రూపంలో వివరించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో టీం కోఆర్డినేటర్ శివోల్లా కృష్ణ, రామారావు, ఎల్లయ్య నరసయ్య, సిద్ధులు ఎల్లయ్య, శేఖర్, విజయలక్ష్మి, మాధవి లు ఉన్నారు.

వరండాలు, చెట్ల కింద పై చదువులు.

వరండాలు, చెట్ల కింద పై చదువులు
• ఆరు బయట వంట
• సరిపడ గదులు లేక ఇబ్బందులు..

నిజాంపేట: నేటి ధాత్రి

Principal Padma Reddy’s

ఆరు బయట చెట్ల కింద, వరండాలలో విద్యార్థుల చదువులు కొనసాగుతున్నాయి. ఈ మేరకు నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అదనపు గదులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాకాలం నేపథ్యంలో ఆరు బయట చదువులు కొనసాగించలేమని విద్యార్థులు వాపోతున్నారు. సరైన గదులు లేక ఆరుబయటే వంట కూడా కొనసాగించడం జరుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఆరు బయట వంటశాలకు విష సర్పాలు వస్తున్నాయని దీనిపై అధికారులు ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టి పాఠశాలకు అదనపు గదులతో పాటు కాంపౌండ్ వాల్ నిర్మించాలని వేడుకుంటున్నారు.

ప్రధానోపాధ్యాయులు పద్మా రెడ్డి వివరణ

పాఠశాలలో అదనపు గదులు లేక ఆరుబయటే చదువులు కొనసాగించడం వాస్తవమేనన్నారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి కూడా తీసుకోబోయినట్లు పేర్కొన్నారు.

పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి.

పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి
• జాగ్రత్తలు పాటించాలి
• కార్యదర్శి చంద్రహాస్..

నిజాంపేట: నేటి ధాత్రి

పారిశుద్ధంపై ప్రత్యేక దృష్టి వహించాలని గ్రామ కార్యదర్శి చంద్రహాస్ అన్నారు. ఈ మేరకు మండలంలోని రాంపూర్ గ్రామంలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమం లో భాగంగా గ్రామాల్లో పారిశుధ్యం పై తనిఖీలు నిర్వహించారు. ఇంటి ఆరు బయట నిల్వ ఉన్న నీటిని తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల దృశ్య ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంటి ఆరు బయట కలుపు మొక్కలు లేకుండా చూడాలన్నారు. గ్రామంలో వైద్య చికిత్స నిమిత్తం ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.

కోహీర్ మున్సిపాలిటీలో మార్పేది.!

కోహీర్ మున్సిపాలిటీలో మార్పేది?

◆: కొత్త మున్సిపాలిటీకి కమిషనర్ కరువు

◆: నెల నుంచి ఆగిన ఆన్లైన్ సేవలు

◆: అయోమయంలో పట్టణ ప్రజలు

◆: పట్టించుకొని అధికారులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

కోహీర్,గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా ప్రకటించడంతో తమ సమస్యలు తీరుతాయని సంతోషపడిన పట్టణ ప్రజలకు నిరాశే మిగిలింది. కోహీర్ గ్రామ పంచాయతీలో 21వేలకు పైగా జనాభా ఉండడంతో ఈ సంవత్సరం జనవరి 27న మున్సిపాలిటీగా ప్రకటిం చారు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్, ఇతర అధి కారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని దీంతో తమ సమస్యలు తీరుతాయని అనుకున్న ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు. జనవరి 28న ఉమామ హేశ్వర్రావు కోహీర్ పట్టణ తొలి మున్సి పల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరిం చారు. కానీ ఆయన ఫిబ్రవరి 16 వరకు మాత్రమే ఇక్కడ విధులు నిర్వహించా రు. పట్టణ ప్రజల సమస్యల పరిష్కారా నికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయ కపోవడంతో మున్సిపల్ అధికారులు సహితం ఇబ్బందులు పడుతున్నారు. కొత్త మున్సిపాలిటీ అయిన ఐదు నెలల్లో నలుగురు కమిషనర్లు ఇక్కడకు వచ్చి చేసే దేమీలేక తిరిగి వెళ్లారు. ఉమామహేశ్వర్ రావు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 16 వరకు కోహీర్ కమిషనర్గా విధులు నిర్వహించారు. తర్వాత వెంకట్రెడ్డి మార్చి 18వ తేదీ వరకు కార్యాలయ విధులకు హాజరయ్యారు. ఆయన బదిలీ కావడంతో మున్సిపల్ కమిషనర్ రమేశ్ కుమార్ బాధ్యతలను చేప ట్టారు. కానీ అతడు కూడా మార్చి 4వ తేదీ వరకు మా త్రమే ఇక్కడ పని చేశారు. తాండూర్ వెళ్లిపోవడంతో కొత్త కమిషనర్ గా ప్రకాశ్ విధుల్లో చేరారు. అతడిని కూడా సీడీ ఎంఏ హైదరాబాద్ హెడ్ ఆఫీస్కు బదిలీ చేస్తున్నట్లు ఉత్త ర్వులు జారీ చేశారు. కొత్త కమిషనర్ వచ్చే వరకు లోనే విధులు నిర్వహించాలని మౌకికంగా సూచించారు. కానీ ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో ఆయన మాత్రం జూన్ 4న దీర్ఘకాలిక సెలవు పెట్టి వెళ్లిపోయారు. దీంతో నెల గడిచినా కొత్త కమిషనరు నియమించలేదు. దీంతో పట్ట ణంలో ఎక్కడ చూసినా సమస్యలు దర్శనమిస్తున్నాయి. సీసీ రోడ్లపై మురుగు, రోడ్ల పక్కన చెత్త కనిపిస్తున్నది.

నిలిచిన ఆన్లైన్ సేవలు

కోహీర్ పట్టణ మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వ హించిన ప్రకాశ్ జూన్ 4వ తేదీన హైదరాబాద్ కార్యాల యానికి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఒక్క ఆన్లైన్ పని చేయలేని పరిస్థితి ఏర్పడింది. కొత్త కమిషనర్ వస్తేనే అతడి కీ ద్వారానే కంప్యూటరీకరణ ప్రారంభమవుతుంది. కానీ పట్టణ ప్రజలు పత్రాల కోసం నిత్యం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ ఉన్న సిబ్బంది కూడా నిస్సా హయ స్థితిలో ఉన్నారు. వారు కేవలం పారిశుధ్యం, ఇంది

స్నేహితుల కుటుంబాలకు చేయూత అందించిన..

స్నేహితుల కుటుంబాలకు చేయూత అందించిన తోటి మిత్ర బృందం.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగ గ్రామానికి చెందిన మామిండ్ల రమేష్ తండి మరియు సంగ శ్రీనివాస్ తల్లి మృతి చెందిన విషయం తెలుసుకునీ1998-99 బ్యాచ్ కుచెందిన తమ స్నేహితుల కుటుంబాలకు అండగా నిలిచి ఆర్థిక సహాయం అందచేశారు
ఈ కార్యక్రమం లో మిత్రబృందం పాల్గొన్నారు.

ఘనంగా పోచమ్మ తల్లి బోనాల జాతర.

ఘనంగా పోచమ్మ తల్లి బోనాల జాతర

నస్పూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలోని 23వ వార్డులో ఆదివారం ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు అమ్మవారికి సమర్పించినట్లు ఆలయ కమిటీ వారు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వేడుకలు జరపడం తృతీయ సంవత్సరమని ప్రతి సంవత్సరం అమ్మవారిని అలంకరించి బోనాలతో అమ్మవారికి మొక్కలు చెల్లిస్తామని అన్నారు.అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారి వద్ద పెద్ద ఎత్తున బోనాల సందడి నెల కోవడం జరిగింది.నస్పూర్ లోని తెలంగాణ తల్లి విగ్రహం నుండి పోచమ్మ దేవాలయం వరకు మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో అక్కడికి చేరుకొని, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి మొక్కులు సమర్పించుకున్నారు.డప్పు చప్పుళ్ళు తీన్మార్ దరువులతో ఆ ప్రాంతమంతా మారు మోగింది.శివ సత్తుల ఆటలతో జాతర శోభ సంతరించుకుంది.ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించడం చాలా సంతోషంగా ఉందని,అమ్మవారి ఆశీస్సులు ప్రజల అందరిపై ఉండి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా చూడాలని అమ్మవారికి ఆలయ కమిటీ వారు ప్రత్యేక పూజలు సమర్పించారు.

వర్షాలు సకాలంలో కురవాలని సంకల్ప పూజ చేసిన.

వర్షాలు సకాలంలో కురవాలని సంకల్ప పూజ చేసిన బిజెపి నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

సకాలంలో వర్షాలు పడి రాష్ట్రము దేశములోని ప్రజలు పశుపక్షాధులు సమస్త జీవకోటి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని దొంగల రాజేందర్ అన్నారు ఈ సందర్భంగా భూపాలపల్లి సుభాష్ కాలనీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో వర్షాలు సకాలంలో కురవాలని బిజెపి పార్టీ నాయకులు ఆధ్వర్యంలో సంకల్ప పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ పూజా కార్యక్రమంలో వరుణ దేవుని యొక్క ఆశీర్వాదం కోసం వర్షాలు కురవాలని సీతారాములకు వాసు అయ్యగారుచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి సంకల్పం నెరవేరాలని సీతారాములను ప్రార్థించడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలందరూ కూడా వర్షాల కోసం భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించాలని అన్నారు సమృద్ధిగా వర్షాలు పడితే రైతులు మనకోసం పండించే పంట చేతికి వస్తుందని రైతుల ఆనందంగా ఉంటేనే సమస్త జీవకోటి ఆనందంగా ఉంటుందని కావున కనీసం మనం ప్రత్యక్షంగా రైతుల కోసం ఏమి చేయలేము కనీసం వర్షాలు పడాలని భగవంతుని ప్రార్థిస్తే రైతులకు అండగా ఉన్న వాళ్ళం అవుతామని అన్నారు ప్రకృతి సస్య శ్యామలంగా ఉండడంకోసం ప్రతి ఒక్కరూ ప్రకృతికి అనకూలంగా జీవించాలని అన్నారు ప్రకృతి ఆగ్రహిస్తే ప్రజలు సంతోషంగా జీవించలేరని అన్నారు వర్షాల కోసం ప్రతి ఒక్కరు భగవంతుని ప్రార్థించి భాగస్వాములు కావాలని ప్రజలను రాజేందర్ కోరారు ఈ కార్యక్రమంలో బట్టు రవి కంబాల రాజయ్య సామల మధుసూదన్ రెడ్డి తుమ్మేటి రామ్ రెడ్డి అజ్మీర రాజు నాయక్ కరివేద మనోహర్ రెడ్డి ఊరటి మునేందర్ కoచెం నరసింహమూర్తి గుండె శీను పొన్నాల కొమురయ్య తాండ్ర హరీష్ చెక్క శంకర్ శ్రీధర్ దొంగల కుమార్ తదితరులు పాల్గొన్నారు

ఎన్.హెచ్.ఆర్.సి మంచిర్యాల జిల్లా చైర్మన్.

ఎన్.హెచ్.ఆర్.సి మంచిర్యాల జిల్లా చైర్మన్ గా శ్రీపతి రాములు గౌడ్ నియామకం

శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:

నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ మంచిర్యాల జిల్లా చైర్మన్ గా నస్పూర్ పట్టణానికి చెందిన శ్రీపతి రాములు గౌడ్ ను నియమించినట్లు స్టేట్ చైర్మన్ బద్దిపడగ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.ఈ మేరకు ఆదివారం నియామక పత్రం అందజేశారు.ఈ సందర్భంగా శ్రీపతి రాములు గౌడ్ మాట్లాడుతూ,సంస్థ నియమ,నిబంధనలు పాటిస్తూ,సంస్థ లక్ష్యాల కోసం పని చేస్తానని,ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్తానని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూస్తానని,ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తానని,పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని తెలిపారు.

ఝరాసంగం తాజా మాజీ సర్పంచ్ జగదీశ్వర్ ను పరామర్శించిన.

ఝరాసంగం తాజా మాజీ సర్పంచ్ జగదీశ్వర్ ను పరామర్శించిన తెలంగాణ ఇండస్ట్రియల్ మాజీ చైర్మన్ తన్వీర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల కేంద్రం లోని ఝరాసంగం తాజా మాజీ సర్పంచ్ జగదీశ్వర్ ను పరామర్శించిన తెలంగాణ ఇండస్ట్రియల్ మాజీ చైర్మన్ తన్వీర్ సర్పంచ్ అనారోగ్యం తో అస్పత్రి లో చేరి ఇటీవల తన సొంత గ్రామమైన ఝరాసంగం కి వచ్చిన సందర్భంగా ఆయనను పరామర్శించిన మహమ్మద్ తన్వీర్ ఆయనతోపాటు కక్కర్వాడ మాజీ సర్పంచ్ జగన్ ఝరాసంగం టిఆర్ఎస్ యువ నాయకులు సద్దాం తదితరులు ఉన్నారు.

ఫోటోగ్రాఫర్ కిరణ్ కు 5000 ఆర్థిక సహాయం.

ఫోటోగ్రాఫర్ కిరణ్ కు 5000 ఆర్థిక సహాయం

జిల్లా అధ్యక్షుడు రఘోత్తం రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

నూతన జిల్లా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టగానే ఫోటో గ్రాఫర్ల సంక్షేమం కోసం పని చేస్తూ అందరి మన్ననలను పొందుతున్నాడు ఫోటోగ్రాఫర్ల సంఘం జిల్లా అధ్యక్షులు రఘోత్తం రెడ్డి మంగళవారం
రేగొండ మండలం కొడవటంచ గ్రామ ఫోటోగ్రాఫర్ సింగరి కిరణ్ ఇటీవల బైక్ పై నుండి కిందపడి కాలు ప్యాక్చర్ కావడం జరిగింది. విషయం తెలుసుకున్న నూతన జిల్లా అధ్యక్షులు బండ రగోతంరెడ్డి ఫోటోగ్రాఫర్కు ఆపుద వస్తే నేనున్నానని భరోసానిస్తూ 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్ మండల అధ్యక్షులు జంబుల రఘు, ఫోటోగ్రాఫర్స్ జిల్లా కోశాధికారి ఎల్దండి రాకేష్, టేకుమట్ల మండల ఫోటోగ్రాఫర్స్ అధ్యక్షులు దాసారపు సదానందం, ప్రధాన కార్యదర్శి గుగులోతు రాజేందర్ నాయక్, కోశాధికారి బండి కమలాకర్,రేగొండ ఫోటోగ్రాఫర్స్ మోరే మొగిలి, మల్లె బోయిన స్వామి, సింగరి సతీష్, సామల సురేందర్ రెడ్డి, కోల రాజు,చుక్క ప్రశాంత్, పబ్బ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

క్రాంతి కుమార్ కు జాతీయ మహానంది పురస్కారం.

జర్నలిస్టు క్రాంతి కుమార్ కు జాతీయ మహానంది పురస్కారం

మందమర్రి నేటి ధాత్రి

తెలుగు సంస్కృతి సాహితి సేవా ట్రస్ట్, తెలంగాణ సంస్కృతి సాహితీ బుక్ ఆఫ్ రికార్డ్స్ నేతృత్వంలో….

పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అవార్డుల ప్రదానోత్సవం

Journalist Kranti Kumar

అంతర్జాతీయ సేవా సంస్థ తెలుగు సంస్కృతి సాహితి సేవా ట్రస్ట్, తెలంగాణ సంస్కృతి సాహితీ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్ లోని రామయ్య ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఆద్యంతం వీక్షకులను విశేషంగా అలరించాయి. ఈ వేకడుకల్లో మంచిర్యాల జిల్లాకు చెందిన జర్నలిస్ట్ జాడ క్రాంతి కుమార్ (టైమ్స్ ఆఫ్ వార్త) దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై, వివిధ రంగాలకు చెందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వివిధ రాష్ట్రాలకు చెందిన వారిని వివిధ పురస్కారాలతో ఘనంగా సత్కరించి, ఘనంగా సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను విశేషంగా ఆకర్షించాయి. అనంతరం ఈ వేడుకల్లో ఉత్తమ జర్నలిస్టుల విభాగంలో జిల్లాలోని మందమర్రి పట్టణానికి చెందిన జాడ క్రాంతి కుమార్ (టైమ్స్ అఫ్ వార్త) కు జాతీయ మహానంది అవార్డు – 2025ను అందజేసి, ఘనంగా సన్మానించారు. క్రాంతి కుమార్ జాతీయ అవార్డు అందుకున్న సందర్భంగా పలువురు జర్నలిస్టులు, స్నేహితులు, స్థానిక ప్రజలు ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా అవార్డు పొందిన జాడ క్రాంతి కుమార్ మాట్లాడుతూ, ఈ గౌరవం తనకు మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులు అవగతం అయ్యేలా, నిజాలను వెలికి తీసేందుకు, న్యాయంగా సమాచారం ప్రజలకు, అదేవిధంగా ప్రభుత్వానికి అందించేందుకు కృషి చేస్తానన్నారు.ఈ అవార్డుతో జిల్లా జర్నలిస్టులకు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించినట్లు పలువురు వ్యాఖ్యానించారు. ఈకార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ మాచవరం గౌరీశంకర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి బట్టు శ్రీనివాస్ రావు లు పాల్గొన్నారు.

వాయు కాలుష్యం జల కాలుష్యం చేస్తున్న.

వాయు కాలుష్యం జల కాలుష్యం చేస్తున్న పరిశ్రమలపై తగు చర్య తీసుకోవాలి

★పి. రాములు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలో ఉన్న పరిశ్రమలు తమ పరిశ్రమల నుండి వచ్చే చెత్తను స్థానికంగా ఉన్న చెత్త వ్యాపారం చేసే వాళ్లకు ఇస్తున్నారు ఈ వ్యాపారులు చెత్తలో నుండి పునరుత్పత్తి అయ్యే వస్తువులను సేకరించి దేనికి పనికిరాని వస్తువులను అనగా ఫైబర్ రెగ్జిన్ ధర్మాకోల్ లాంటి వస్తువులు బహిరంగ ప్రదేశాలలో వేసి కాల్చి వేస్తున్నారు ఇలా కాల్చివేయడంతో భయంకరమైన వాయు కాలుష్యం ఏర్పడుతుంది అదేవిధంగా చెత్తను కాల్చివేసిన తర్వాత మిగిలిపోయిన బూడిద వర్షపు నీళ్లతో కలిసిపోయి చిన్నచిన్న కాలువల ద్వారా వాగులలోకి చెరిపోతుంది ఇలా చేరిపోయిన నీటిని తాగిన మూగజీవాలు అనేక సందర్భాలలో చనిపోతున్నాయి మరియు చెత్తను కాల్చి వేస్తుండగా ఎవరైనా ప్రశ్నిస్తే కొద్ది రోజులు మానుకొని చెత్తనంతా తీసుకెళ్లి వ్యవసాయ భూముల దగ్గర ఉన్న వ్యవసాయ బావులలో నింపి వేస్తున్నారు. వ్యవసాయ బావులలో నింపివేసిన చెత్తతో అనేక సందర్భాలలో భూగర్భ జలాలు కూడా కాలుష్యం అవుతున్నాయి ఈ విషయాలన్నింటిని కూడా కాలుష్య నియంత్రణ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఎలాంటి పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదు ప్రతిరోజు పరిశ్రమల నుండి పనికిరాని టన్నులకొద్ది చెత్త చెత్తలో అనేక రసాయనాలు తో కూడుకున్న వస్తువులను కూడా కాల్చి వేస్తున్నారు వ్యవసాయ భూములలో ఉన్న బావులలో నింపి వేస్తున్నారు. కావున భవిష్యత్తులో జహీరాబాద్ ప్రాంత ప్రజల మూగజీవాల ఆయురారోగ్యాలు కాపాడే విషయంలో తమ ఆదేశాలతో జిల్లా కాలుష్య నియంత్రణ అధికారులతోని కాలుష్యాన్ని పూర్తిగా అరికట్టేలా తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అంతడుపుల నాగరాజు కు అపూర్వ స్వాగతం.

అంతడుపుల నాగరాజు కు అపూర్వ స్వాగతం

మందమర్రి నేటి ధాత్రి

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ సలహా సభ్యుడు గా నియమితులైన సందర్బంగా తొలిసారి మందమర్రి కి విచ్చేసిన అంతడుపుల నాగరాజు గారికి కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా శాలువాతో సత్కారించి పూల బొకే అందజేశారు. అనంతరం అంతడుపుల నాగరాజు మాట్లాడుతూ నేను నా పురిటి గడ్డ అయినా మందమర్రి అంటే నాకు ఎంతో ప్రీతి నేను ఈ మందమర్రి లో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఈ తెలంగాణ అంటే నాకు అమితమైన ప్రేమ నేను ఎన్ని మంచి అవార్డుసు అందుకున్నా మందమర్రిని మర్చిపోవడం అంటూ ఉండదు నేను చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. నా చిన్ననాటి నుంచి నేను ఒక కళాకారుడిగా ఒక మంచి ప్రావీణ్యాన్ని సంపాదించుకొని ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నందుకు నేను ఈ ఈ మందమర్రి కి రుణపడి ఉంటాను అని వ్యాఖ్యానించారు

బిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు.

బిఆర్ఎస్ పార్టీ పోరాట ఫలితమే వ్యవసాయ రైతులకు సాగునీరు విడుదల

బిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు

నేటిధాత్రి చర్ల

బిఆర్ఎస్ పార్టీ ఉద్యమం వలన ఈరోజు రైతులకు తాలిపేరు కాలవల నుండి నీరు విడుదల చేసారు అని బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు కో కన్వీనర్ ఐనవోలు పవన్ ఒక ప్రకటనలో తెలిపారు జూలై 6 తేదీన డివిజన్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ మానెం రామకృష్ణ చర్ల మండల బిఆర్ యస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు ప్రాజెక్ట్ నిండా నీరు ఉన్న నీరు విడుదల చేయడం లేదని రైతులు ఆందోళన చెందారు వెంటనే నీరు రైతులకు విడుదల చేయాలని డివిజన్ నాయకులు డిమాండ్ చేశారు దాని పలితమే ఈ రోజు రైతులకు నీరు విడుదల చేసారు చాలా సంతోషం అదే విధంగా కాలువలకు పడిన గండ్లను కూడ పూడ్చే కార్యక్రమాన్ని కూడ చేపడితే కింది ప్రాంత రైతుల కూడా న్యాయం జరుగుతుంది దుమ్ముగూడెం మండలంలో తూరుబాక వద్ద కల్వర్టు కృంగి పోయి ఉంటే బిఆర్ఎస్ పార్టీ డివిజన్ నాయకులు మండల నాయకులు ఉద్యమాన్ని చేపడితే వెంటనే బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించారు బిఆర్ఎస్ పార్టీ ఏప్పుడు కూడా తెలంగాణ ప్రజల కోసం రైతుల కోసం నిరంతరం పోరాటం చేస్తుందని తెలియజేసారు

మొహరం పండుగలో పాల్గొన్న జహీరాబాద్ ఎమ్మెల్యే.

 

మొహరం పండుగలో పాల్గొన్న జహీరాబాద్ ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలం బొప్పనపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామస్థుల ఆహ్వానం మెరకు మత సామరస్యాలకు అతీతంగా జరిగిన మొహ‌రం ఉత్సవాల్లో జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు పాల్గొని దర్గాకు పూలమాలలు చాదర్ సమర్పించి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజీ ఎంపీపీ సంగమేశ్వర్, మాజీ కేతాకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ నర్సింహా గౌడ్, పట్టణ అధ్యక్షులు ఏజాస్ బాబా,మాజీ సర్పంచ్ లు శ్రీనివాస్ రెడ్డి , సంగారెడ్డి, నాయకులు వెంకట్ రెడ్డి,సంతు పటేల్,నాగేందర్ పటేల్,విజయ్ పటేల్, సోహైల్,ఉల్లాస్,బొప్పానపల్లి సీఎహేచ్ నాగన్న, కి. శశివర్ధన్ రెడ్డి,సయ్యద్,గఫార్,నర్సింలు,లేయాకత్, విష్ణువర్ధన్ రెడ్డి,జి సిద్ధప్ప,దిగంబర రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి,రవి,సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.

గురుదేవ్ విద్యాలయం నందు ఐఎల్ఎమ్ బెంగళూరు టీచర్స్.

గురుదేవ్ విద్యాలయం నందు ఐఎల్ఎమ్ బెంగళూరు టీచర్స్ చే స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు ప్రారంభం

నేటిదాత్రి చర్ల

చర్ల మండల కేంద్రంలోని ప్రముఖ ప్రైవేటు విద్యాసంస్థ అయిన గురుదేవ్ విద్యాలయంలో ఈ విద్యా సంవత్సరం నుండి విద్యార్థులలో ఆంగ్లభాష యందు చక్కని అవగాన కల్పించాలన్న సత్సంకల్పంతో ఆంగ్ల భాషలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించాలనే సదుద్దేశ్యంతో ఎంతో వ్యయంతో కూడుకున్నదే అయినా కూడా ఐఎల్ఎమ్ బెంగుళూరు వారితో ఒప్పందం కుదుర్చుకుని ఐఎల్ఎమ్ బెంగుళూరు వారి ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు ప్రారంభించడమైనదని పత్రికా ప్రకటన ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిపారు ఈ విద్యా సంవత్సరం విద్యార్థినీ విద్యార్థుల కు చక్కని శిక్షణ ఇచ్చుటకు బెంగుళూరు నుండి కుమారి సౌజన్య శిక్షకులుగా నియమించబడ్డారు ఈ రోజు ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు హెచ్ జివి ప్రసాద్ అకడమిక్ కోఆర్డినేటర్స్ ఎంవి సుబ్రహ్మణ్యం జి శ్రీనివాస్ మరియు ఐఎల్ఎమ్ బెంగుళూరు నుండి విచ్చేసిన సందీప్ చేతుల మీదుగా ఉపాధ్యాయినీ ఉపాధ్యాయుల సమక్షం లో లాంఛనంగా ప్రారంభించబడినది ప్రధానోపాధ్యాయులు హెచ్ జివి ప్రసాద్ మాట్లాడుతూ కమ్యూనికేషన్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చుటకు ఎంతో సుదూరాల నుండి వచ్చేసిన కుమారి సౌజన్య సందీప్ కు మరియు మన పాఠశాలకు తమ సహకారాన్ని అందిస్తున్న ఐఎల్ఎమ్ బెంగుళూరు సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు పత్రికా ముఖంగా తెలిపారు

తెలంగాణ పిఆర్ టియు సంఘంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం.

తెలంగాణ పిఆర్ టియు సంఘంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం

నేటిదాత్రి చర్ల

Telangana PRTU Association.

 

పిఆర్ టియు రాష్ట్ర జిల్లా శాఖల పిలుపు మేరకు చర్ల మండలం లోని వివిధ పాఠశాలలు తిరిగి పిఆర్ టియు టిఎస్ సభ్యత్వాల నమోదు కార్యక్రమం జరిగినది దీనిలో చర్ల మండల సభ్యులు అందరూ సభ్యత్వం తీసుకోవటం జరిగింది ఈ కార్యక్రమం లో పిఆర్ టియు టిఎస్ చర్ల మండల అధ్యక్షులు ఎస్ఎస్ఎస్ రవికుమార్ ప్రధాన కార్యదర్శి తుర్రం వీరభద్రం పునేం వేణు శ్రీనివాస్ దారయ్య గురుమూర్తి వీరమోహన్ పోడియం నాగేశ్వరరావు కాంతారావు తదితరులు పాల్గొన్నారు మంచి స్పందన సభ్యులలో కనిపించింది సంఘం ఉపాధ్యాయులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని అని మీకు త్వరలో మంచి పి ఆర్ సి ట్రాన్స్ఫర్ తో కూడిన ప్రమోషన్స్ పెండింగ్ బకాయిలు జనగణన చేసిన డబ్బులు ఇప్పించాలని సభ్యులు తెలుపగా సమస్యలు వెంటనే తీర్చే విధంగా చర్యలు తీసుకొనేలా రాష్ట్ర శాఖకు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి కి తెలిపి వీలైనంతవరగా సమస్యలను పరిష్కరిస్తామని పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version