మొహరం పండుగలో పాల్గొన్న జహీరాబాద్ ఎమ్మెల్యే
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండలం బొప్పనపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామస్థుల ఆహ్వానం మెరకు మత సామరస్యాలకు అతీతంగా జరిగిన మొహరం ఉత్సవాల్లో జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు పాల్గొని దర్గాకు పూలమాలలు చాదర్ సమర్పించి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజీ ఎంపీపీ సంగమేశ్వర్, మాజీ కేతాకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ నర్సింహా గౌడ్, పట్టణ అధ్యక్షులు ఏజాస్ బాబా,మాజీ సర్పంచ్ లు శ్రీనివాస్ రెడ్డి , సంగారెడ్డి, నాయకులు వెంకట్ రెడ్డి,సంతు పటేల్,నాగేందర్ పటేల్,విజయ్ పటేల్, సోహైల్,ఉల్లాస్,బొప్పానపల్లి సీఎహేచ్ నాగన్న, కి. శశివర్ధన్ రెడ్డి,సయ్యద్,గఫార్,నర్సింలు,లేయాకత్, విష్ణువర్ధన్ రెడ్డి,జి సిద్ధప్ప,దిగంబర రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి,రవి,సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.